మంత్రి లోకేష్ రాజీనామా చేయాలి
దేవరాపల్లి: డీఎస్సీలో అక్రమాలపై సీబీఐతో సమగ్ర విచారణ జరిపి నిగ్గు తేల్చాలని మాజీ డిప్యూటీ సీఎం, వైఎస్సార్‌సీపీ రీజినల్ కోఆర్డినేటర్ బూడి ముత్యాలనాయుడు డిమాండ్ చేశారు. మండలంలోని తారువలో నియోజకవర్గ స్థాయి టౌన్ హాల్ సమావేశాన్ని మంగళవారం నిర్వహించారు. ముందుగా మహానేత వై.ఎస్.రాజశేఖర్‌రెడ్డి విగ్రహానికి వైఎస్సార్‌సీపీ మహిళా విభాగం జోన్–1 వర్కింగ్ ప్రెసిడెంట్ ఈర్లె అనురాధ తదితర పార్టీ నాయకులతో కలిసి ఆయన పూలమాల వేసి నివాళులర్పించారు. అనంతరం ముత్యాలనాయుడు మాట్లాడుతూ డీఎస్సీలో జరిగిన భారీ కుంభకోణం వల్ల ఎందరో అర్హులకు అన్యాయం జరిగిందన్నారు. బాధితులంతా వైఎస్సార్‌సీపీ అధినేత వై.ఎస్. జగన్‌మోహన్‌రెడిన్డి కలిసి, వారికి జరిగిన అన్యాయాన్ని వివరించడంతో వారి తరఫున పోరాటానికి పిలుపునిచ్చారన్నారు. మెగా డీఎస్సీలో దగా పడ్డ నిరుద్యోగ యువతకు వైఎస్సార్‌సీపీ అండగా నిలిచి రాజీలేని పోరాటం సాగిస్తుందన్నారు. డీఎస్సీలో అవకతవకలకు నైతిక బాధ్యత వహిస్తూ విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ తక్షణమే రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. లేకుంటే ఉద్యమం ఉగ్రరూపం దాల్చి నిరుద్యోగ యువతీయువకుల ఆగ్రహానికి గురికావాల్సి వస్తుందని హెచ్చరించారు. కూటమి అవినీతి అక్రమాలు, ప్రజా సమస్యలపై గళమెత్తే వైఎస్సార్‌సీపీ నాయకులను అక్రమ అరెస్టులు చేయడాన్ని ఆయన తీవ్రంగా ఖండించారు. ఎన్నికలు ఎప్పుడు నిర్వహించినా కూటమి నాయకులకు తగిన గుణపాఠం చెప్పేందుకు ప్రజలు సిద్ధంగా ఉన్నారన్నారు.
6 నుంచి మాడుగులలో రిలే నిరాహార దీక్షలు
నియోజకవర్గ కేంద్రం మాడుగులలో ఈ నెల 6 నుంచి 9వ తేదీ వరకు నాలుగు రోజుల పాటు రిలే నిరాహార దీక్షలు నిర్వహించనున్నట్టు బూడి తెలిపారు. 6న మాడుగుల మండలం, 7న చీడికాడ మండలం, 8న కె.కోటపాడు మండలం, 9న దేవరాపల్లి మండలానికి చెందిన డీఎస్సీ బాధితలతో పాటు నిరుద్యోగ యువతీయువకులు, పార్టీ నాయకులు ఈ దీక్షల్లో పాల్గొంటారని చెప్పారు. ఈ కార్యక్రమంలో వైఎస్సార్‌సీపీ మహిళా విభాగం జోన్–1 వర్కింగ్ ప్రెసిడెంట్ ఈర్లె అనురాధ, దేవరాపల్లి జెడ్పీటీసీ కర్రి సత్యం, కె.కోటపాడు ఎంపీపీ రెడ్డి జగన్‌మోహన్, దేవరాపల్లి, చీడికాడ వైఎస్సార్‌సీపీ మండల అధ్యక్షులు బూరె బాబూరావు, గొల్లవిల్లి రాజుబాబు, సీడీసీ చైర్మన్ సుంకరి శ్రీనివాసరావు, వైస్ ఎంపీపీలు పంచాడ సింహాచలంనాయుడు, రొంగలి సూర్యనారాయణ, కొత్తపల్లి శ్రీనివాసరావు, మండల యువజన అధ్యక్షులు కర్రి సూరినాయుడు, గొర్రుపోటు వెంకటరావు, గొల్లవిల్లి స్వామినాయుడు, మాడుగుల పట్టణ అధ్యక్షుడు బొమ్మిశెట్టి శ్రీనివాసరావు, కురచా నారాయణమూర్తి, ఆదిరెడ్డి త్రినాథ స్వామి, వరదపురెడ్డి లలితానాయుడు, గూడెపు రాము, ఏటుకూరి రాజేష్, ఆకుల సాయి, రొంగలి వెంకటరావు, నాగిరెడ్డి శఠారినాయుడు, దాసరి సంతోష్‌కుమార్, రొంగలి నారాయణమ్మ, బండారు దేముడునాయుడు తదితరులు పాల్గొన్నారు.
అనకాపల్లి: డీఎస్సీ జరిగినలో అక్రమాలకు నైతిక బాధ్యత వహిస్తూ విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ తక్షణమే రాజీనామా చేయాలని వైఎస్సార్‌సీపీ నియోజకవర్గ సమన్వయకర్త మలసాల భరత్‌కుమార్ డిమాండ్ చేశారు. స్థానిక రింగ్‌రోడ్డు వైఎస్సార్‌సీపీ కార్యాలయంలో పార్టీ శ్రేణుల రౌండ్‌టేబుల్ సమావేశం మంగళవారం పార్టీ పట్టణ అధ్యక్షుడు మందపాటి జానకీరామరాజు ఆధ్వర్యంలో జరిగింది. ఈ సందర్భంగా భరత్‌కుమార్ మాట్లాడుతూ డీఎస్సీలో అర్హులైన నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశాలు కల్పించకపోవడం అన్యాయమన్నారు.
6 నుంచి రిలే నిరాహార దీక్షలు
డీఎస్సీలో జరిగిన అక్రమాలపై సీబీఐతో విచారణ జరపాలని, నిరుద్యోగ భృతి చెల్లించాలని, విద్యార్థులకు ఫీజు రీయింబర్స్ మెంట్ చెల్లించాలన్న డిమాండ్లతో ఈనెల 6 నుంచి 9వ తేదీ వరకు నియోజకవర్గంలోని పలు ప్రాంతాల్లో రిలే నిరాహార దీక్షలు నిర్వహించనున్నట్టు భరత్‌కుమార్ చెప్పారు. 10వ తేదీన పట్టణంలో నియోజకవర్గ స్థాయిలో ర్యాలీ నిర్వహించనున్నట్టు చెప్పారు. సుంకరమెట్ట జంక్షన్ నుంచి రింగ్‌రోడ్డు, పెరుగబజారు, వేల్పులవీధి జంక్షన్, నెహ్రూచౌక్ మీదుగా రామచంద్ర థియేటర్ వరకు ర్యాలీ నిర్వహించనున్నట్టు తెలిపారు. ఈనెల 6న కశింకోట తహసీల్దార్ కార్యాలయం వద్ద రిలే నిరాహార దీక్ష చేపట్టనున్నట్టు చెప్పారు. మాజీ ఎంపీ బి.వి.సత్యవతి మాట్లాడుతూ సూపర్ సిక్స్ హామీలతో అధికారం చేపట్టిన కూటమి ప్రభుత్వం తరువాత వాటిని విస్మరించిందని విమర్శించారు. డీఎస్సీలో అనేక అక్రమాలు జరిగాయన్నారు.అనకాపల్లి, పాయకరావుపేట నియోజకవర్గ పరిశీలకులు పి.సతీష్‌వర్మ, దంతులూరి దిలీప్‌కుమార్ మాట్లాడుతూ ప్రజలను మోసం చేయడం సీఎం చంద్రబాబుకు వెన్నతో పెట్టిన విద్యని, గతంలోను నిరుద్యోగు భృతి నెలకు రూ.వెయ్యి అందజేస్తామని, సార్వత్రిక ఎన్నికలకు మూడు నెలల ముందు అమలు చేశారని చెప్పారు. వైఎస్సార్‌సీపీ నిర్వహిస్తున్న రిలేనిరాహార దీక్షలకు నిరుద్యోగులు, విద్యార్థులు పెద్ద ఎత్తున హాజరు కావాలని కోరారు. పార్టీ నియోజకవర్గ యువజన విభాగం అధ్యక్షుడు జాజుల రమేష్ మాట్లాడుతూ రాష్ట్రంలో రాక్షసపాలన సాగుతోందన్నారు. వైఎస్సార్‌సీపీ నాయకులపై రాష్ట్రంలో కొంత మంది టీడీపీ నాయకులు అక్రమ కేసులు పెడుతున్నారని చెప్పారు. ఎంపీపీ గొర్లి సూరిబాబు, వైస్ ఎంపీపీ అయితా రాము, కశింకోట జెడ్పీటీసీ దంతులూరి శ్రీధర్‌రాజు, నియోజకవర్గ మహిళా విభాగం అధ్యక్షురాలు ఎ.వి.రత్నకుమారి, 80,84వార్డు ఇన్‌చార్జ్‌లు కె.ఎం.నాయుడు, కె.రాఘవ, పార్టీ రాష్ట్ర యువజన విభాగం కార్యదర్శి మలసాల కుమార్ రాజా, కశింకోట ఎంపీపీ కలగ లక్ష్మీ గున్నయ్యనాయుడు, వైఎస్సార్‌సీపీ అనకాపల్లి, కశింకోట మండల అధ్యక్షులు పెదిశెట్టి గోవింద్, మలసాల కిషోర్, మండల, పట్టణ అధ్యక్షులు కాండ్రేగులు హైమావతి, పద్మకుమారి, తగరంపూడి నూకరత్నం, వైద్యవిభాగం జిల్లా అధ్యక్షుడు దండా సిద్ధార్థ, జిల్లా నాయకులు మళ్ల బుల్లిబాబు, మర్రిపల్లి శోభ, నీటిపల్లి లక్ష్మీ, కుండల రామకృష్ణ తదితరులు పాల్గొన్నారు.
వైఎస్సార్ విగ్రహం ధ్వంసం


