చోడవరం: మండలంలో శీమునాపల్లి గ్రామ సమీపంలో కోటపాడు రోడ్డులో మంగళవారం ఓ ఎలక్ట్రికల్ కారు దగ్ధమైంది. అంబేరుపురానికి చెందిన భక్తాంజనేయస్వీట్స్ యజమాని సత్యనారాయణ కుమారుడు కొండెంపూడి పూర్ణ సందీప్ తన స్నేహితుడు సతీష్‌తో కలిసి తన ఎలక్ట్రికల్ కారులో కె.కోటపాడు వెళుతుండగా శీమునాపల్లి సమీపంలోకి వచ్చేసరికి కారు వెనుక భాగం నుంచి పొగలు వచ్చాయి. దీంతో కారును రోడ్డు పక్కన నిలివేశారు. ఆ వెంటనే మంటలు వ్యాపించి, కారు దగ్ధమైంది. చోడవరం అగ్నిప్రమాక కేంద్రం సిబ్బంది వచ్చి మంటలను అదుపు చేశారు. వైఎస్సార్‌సీపీ రాష్ట్ర కార్యదర్శి ఏడువాక సత్యారావు బాధితులను సహకారం అందజేశారు.


