అచ్చుతాపురం మండలం దొప్పెర్లలో ఎల్పీ నంబరు 38/2004, 4/2005 అన్ని అనుమతులతో ఏర్పాటు చేసిన లేఅవుట్‌లో కొనుగోలు చేసిన ప్లాట్ స్థలాల్లో మట్టి తవ్వకాలతో అక్రమ మైనింగ్ చేపడుతూ తమను భయాందోళనలకు గురిచేస్తున్న వారిపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలంటూ ప్లాట్‌ల యాజమానులు కలెక్టరేట్ వద్ద నిరసన చేపట్టారు. అక్రమ తవ్వకాల నిలిపివేసి బాధ్యులపై చర్యలు కోరుతూ సాయిప్రియా కన్‌స్ట్రక్షన్స్ తరపున ఇప్పటికే తహసీల్దార్, పోలీలసుకు ఫిర్యాదులు చేశామన్నారు. అక్రమంగా తమ ప్లాట్లలోకి చొరబడి భారీగా మట్టి తవ్వకాలు జరుపుతూ క్రమంగా రవాణా చేస్తున్న ముఠాపై తక్షణ చర్యలు తీసుకోవాలంటూ డిమాండ్ చేశారు. కలెక్టర్ చొరవ తీసుకుని న్యాయం చేయాలని కోరారు.


