హైవేపై టిప్పర్ దగ్ధం
యలమంచిలి రూరల్ : షార్ట్ సర్క్యూట్‌తో టిప్పర్ దగ్ధమైన ఘటన యలమంచిలి మండలం పులపర్తి వద్ద గురువారం తెల్లవారుజామున చోటుచేసుకుంది. ఏపీ39యూవై0459 నంబరు గల టిప్పర్ అన్నవరంలో బొగ్గు అన్‌లోడ్ చెసి తిరిగి విశాఖపట్నం వెళ్తుండగా పులపర్తి వద్దకు చేరుకున్న సమయంలో ఇంజన్ నుంచి పొగలు, మంటలు వస్తున్నట్టు గమనించిన డ్రైవర్ వాహనాన్ని ఆపి కిందకు దిగిపోయాడు. కొద్దిసేపటికే వాహనమంతా మంటలు వ్యాపించాయి. అగ్నికీలలు ఎగసిపడుతుండడంతో సమాచారం అందుకున్న యలమంచిలి విపత్తుల నిర్వహణ శాఖ సిబ్బంది అగ్నిమాపక శకటంతో ఘటనా స్థలానికి వెళ్లి మంటలు ఆర్పే ప్రయత్నం చేశారు. హైవేపై రాకపోకలు సాగించే వాహనాలకు మంటలు వ్యాపించకుండా చేశారు. ఇంజిన్‌లో షార్ట్ సర్క్యూట్ కారణంగానే ప్రమాదం జరిగినట్టు అగ్నిమాపక కేంద్రం అధికారి రాంబాబు తెలిపారు.


