మన్యం మురిసె.. పర్యాటకం మెరిసే
జిల్లాలోని పర్యాటక కేంద్రాలకు సందర్శకులు భారీగా తరలివచ్చారు. శనివారం ఒక్కరోజే బొర్రా గుహలు, వంజంగి మేఘాల కొండలు, చాపరాయి వంటి ప్రాంతాల్లో వేల సంఖ్యలో సందడి చేశారు. దీంతో హోటళ్లు, రిసార్ట్‌లు అన్నీ పర్యాటకులతో నిండిపోయాయి. ప్రధాన రహదారులన్నీ వాహనాల రాకపోకలతో కిక్కిరిసి పోయాయి.
● కిక్కిరిసిన సందర్శిత ప్రాంతాలు
● నిండిపోయిన హోటళ్లు, రిసార్టులు
● అటవీ, పర్యాటక శాఖలకు భారీగా ఆదాయం
సాక్షి,పాడేరు: జిల్లాలోని పర్యాటక ప్రాంతాల్లో సందడి నెలకొంది. రెండురోజుల నుంచి భారీగా తరలివస్తుండటంతో మన్యం మురిసిపోతోంది. శనివారం అరకులోయ, బొర్రా గుహలు, కటికి జలపాతం, చాపరాయి, వంజంగి హిల్స్, కొత్తపల్లి జలపాతం, లంబసింగి, చెరువులవేనం, సీలేరు, మోతుగూడెం, మారేడుమిల్లి ప్రాంతాలు కిక్కిరిసిపోయాయి.
● బొర్రాగుహలను ఉదయం నుంచి సాయంత్రం వరకు 9 వేలమంది సందర్శించగా రూ.8 లక్షల ఆదాయం వచ్చిందని టూరిజం మేనేజర్ గౌరీశంకర్ తెలిపారు.
● పాడేరు మండలం వంజంగి హిల్స్‌లో పర్యాటకులు సందడి చేశారు. వంజంగి కొండలపై సూర్యోదయం, మేఘాల అందాలను వీక్షించారు. వీరి సందర్శన ద్వారా అటవీశాఖకు ఒక్కరోజే రూ.1,91,260 ఆదాయం వచ్చింది. పర్యాటకుల వాహనాలతో పాడేరు నుంచి అనంతగిరి, విశాఖపట్నం రోడ్డు, చింతపల్లి నుంచి నర్సీపట్నం రోడ్డు రద్దీగా మారాయి. అన్ని హోటళ్లు, రిసార్ట్‌లు, లాడ్జీలు పర్యాటకులతో నిండిపోయాయి.
డుంబ్రిగుడ: అరకు పైనరీ, చాపరాయి సందర్శనకు శనివారం సందర్శకులు భారీగా తరలివచ్చారు. కుటుంబ సభ్యులతో సందడి చేశారు. చాపరాయి జలపాతంలో స్నానాలు చేస్తూ సందడి చేశారు.
మన్యం మురిసె.. పర్యాటకం మెరిసే
మన్యం మురిసె.. పర్యాటకం మెరిసే
మన్యం మురిసె.. పర్యాటకం మెరిసే


