గుర్తు తెలియని వాహనం ఢీకొని వ్యక్తి మృతి
చింతపల్లి: మండలంలో సప్తగిరి, రాజుపాకల కాఫీ తోటల వద్ద జాతీయ రహదారిపై గుర్తు తెలియని వాహనం ఢీకొనడంతో వ్యక్తి మృతి చెందాడు. లంబసింగి పంచాయతీ గాదెగొయ్యి గ్రామానికి చెందిన చంటిబాబు(28) శనివారం తెల్లవారుజామున జాతీయ రహదారిపై నడిచి వెళ్తుండగా వెనుక నుంచి గుర్తుతెలియని వాహనం ఢీకొంది. దీంతో అతను అక్కడక్కడే మృతి చెందాడు. భార్య చిలకమ్మ ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేశామని ఎస్‌ఐ వీరబాబు తెలిపారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం చింతపల్లి ఏరియా ఆస్పత్రికి తరలించామని తెలిపారు. మృతుడికి భార్య, ఐదుగురు పిల్లలు ఉన్నారు. కుటుంబానికి పెద్దదిక్కుగా ఉన్న చంటిబాబు అకాల మరణంతో ఆ కుటుంబ సభ్యులు కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు. దీంతో గ్రామంలో విషాదఛాయలు నెలకొన్నాయి.


