పాడేరు డీఎస్పీగా అభిషేక్
● బాధ్యతల స్వీకరణ
పాడేరు : పాడేరు డీఎస్పీగా అభిషేక్ శనివారం బాధ్యతలు స్వీకరించారు. ఇక్కడ డీఎస్పీగా పని చేసిన షేక్ సహబాజ్ ఆహ్మద్ కాశీబుగ్గ డీఎస్పీగా బదిలీ అయ్యారు. గ్రేహౌండ్స్‌లో శిక్షణ పూర్తి చేసుకున్న అభిషేక్ ఆయన స్థానంలో నియమితులయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పాడేరు పోలీస్ సబ్ డివిజన్ పరిధిలో శాంతిభద్రతల పరిరక్షణ, చిన్నారులు, మహిళలపై నేరాలు, అఘాయిత్యల జరగకుండా ప్రత్యేక చర్యలు తీసుకుంటామన్నారు. గంజాయి సాగు, రవాణాకు అడ్డుకట్ట వేసేలా ప్రణాళికపరంగా చర్యలు తీసుకుంటామన్నారు. పాడేరు పట్టణంలో ట్రాఫిక్ సమస్యపై ప్రత్యేకంగా దృష్టి పెడతామన్నారు. ఆయనను సీఐలు, ఎస్‌ఐలు మర్యాదపూర్వకంగా కలిసి అభినందనలు తెలిపారు.


