ఘనంగా పగల్‌పత్తు ఉత్సవాలు
వైభవంగా ధనుర్మాసం పూజలు
సింహాచలం: సింహగిరిపై శ్రీ వరాహ లక్ష్మీనృసింహస్వామి ఆలయంలో పగల్‌పత్తు ఉత్సవాలు గురువారం ఘనంగా జరిగాయి. స్వామివారి ఉత్సవమూర్తి గోవిందరాజస్వామిని విశేషంగా అలంకరించి బంగారుచాయ పల్లకిలో వేంజేపచేశారు. తెల్లవారుజామున ఆలయ బేడామండపంలో తిరువీధి నిర్వహించారు. షోడషోపచార పూజలు జరిపారు. ధనుర్మాస ఉత్సవాల్లో భాగంగా గోదాదేవికి ఆలయ బేడామండపంలో తిరువీధి వైభవంగా నిర్వహించారు. అమ్మవారి సన్నిధిలో 10వ పాశుర విన్నపం చేశారు. ఆలయ స్థానాచార్యులు టి.పి.రాజగోపాల్, ప్రధానార్చకుడు గొడవర్తి శ్రీనివాసాచార్యులు, అర్చకులు ఈ కార్యక్రమాలను నిర్వహించారు.


