ఖేలో ఇండియా బాక్సింగ్ కోచ్‌గా కృష్ణవేణి
నర్సీపట్నం : నేషనల్ బాక్సింగ్ క్రీడాకారిణి కె.కృష్ణవేణి స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ ఖేలో ఇండియా బాక్సింగ్ కోచ్‌గా ఉద్యోగం సాధించింది. బాక్సర్‌గా 14కు ఫైగా జాతీయస్థాయి బాక్సింగ్ పోటీల్లో పాల్గొంది. అంతర్జాతీయ చెస్ బాక్సింగ్‌లో గోల్డ్ మెడల్ సాధించింది. అలాగే 15కు పైగా రాష్ట్ర స్థాయి పోటీల్లో 10కి పైగా గోల్డ్ మెడల్స్ సాధించింది. నర్సీపట్నం ప్రభుత్వ జెడ్పీ గరల్స్ హైస్కూల్‌లో చదువుకుని ఆమె బాక్సింగ్ నేర్చుకుంది. తండ్రి శ్రీను కరాటే క్రీడాకారుడు కావడంతో ఆమెను బాక్సింగ్ క్రీడాకారిణిగా రాణించేందుకు ప్రోత్సహించారు. విద్యార్థి దశ నుంచి నింజాస్ అకాడమీ కోచ్ అబ్బు వద్ద బాక్సింగ్‌లో తర్ఫీదు పొందింది. కోచ్‌గా ఉద్యోగం రావడం పట్ల తల్లిదండ్రులు, కుటుంబ సభ్యులు, అకాడమీ మెంబర్లు హర్షం వ్యక్తం చేశారు.


