నోరు అదుపులో పెట్టుకో.. ఖబడ్దార్!
మిగతా 8వ పేజీలో
రంపచోడవరం: తన వ్యక్తిగత జీవితం గురించి రంపచోడవరం ఎమ్మెల్యే మిరియాల శిరీషదేవి ఇష్టం వచ్చినట్లు మాట్లాడితే సహించేది లేదని.. ఇక ముందు మాట్లాడేటప్పుడు నోరు అదుపులో పెట్టుకుని మాట్లాడాలని వైఎస్సార్ సీపీ కోఆర్డినేటర్, మాజీ ఎమ్మెల్యే నాగులపల్లి ధనలక్ష్మి ఘాటుగా హెచ్చరించారు. రంపచోడవరం నియోజకవర్గంలో ఇంత చేతకాని, దద్దమ్మ ఎమ్మెల్యే ఎవరూ లేరని విమర్శించారు. రంపచోడవరం సమీపంలోని ఐ.పోలవరంలోని ఎంపీపీ ఇంటి వద్ద గురువారం నినిర్వహించిన విలేకరుల సమావేశంలో మాజీ ఎమ్మెల్యే ధనలక్ష్మి, ఎమ్మెల్సీ అనంత ఉదయభాస్కర్ (అనంతబాబు) మాట్లాడారు. ఇటీవల వైఎస్సార్‌సీపీతో పాటు వారిపై ఎమ్మెల్యే పలు విమర్శలు చేసిన నేపథ్యంలో తీవ్రంగా స్పందించారు.
ప్రజలకు ఏం చేశావ్.. : రంపచోడవరం ఎమ్మెల్యే ఏడాది కాలంలోనే వాతావరణం పడటం లేదని రాజమహేంద్రవరం మకాం మార్చేసి, ప్రజలు గురించి పట్టించుకోని నీకు తమ గురించి మాట్లాడే అర్హత లేదన్నారు. అసెంబ్లీలో గళం విప్పడం వల్లే పోలవరం నిర్వాసితులకు డబ్బులు వచ్చాయని చెబుతున్న నీకు ఎంత అవగాహన ఉందో అర్థమవుతుందన్నారు. 2014–19 టీడీపీ అధికారంలో ఉన్నప్పుడు ఒక్కరికి పునరావాస ప్యాకేజీ ఇవ్వలేదన్నారు. వైఎస్సార్ సీపీ అధికారంలోకి వచ్చిన తరువాత 5,500 పీడీఎఫ్‌లకు ఆర్‌అండ్‌ఆర్ ప్యాకేజీ పునరావాసం కల్పించామన్నారు. కాంటూరు 41లో ఉన్న విలీన మండలాల్లో గ్రామసభలు నిర్వహించి అప్పటి సీఎం వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ద్వారా కేంద్రానికి నిధులు కోసం పంపడం జరిగిందన్నారు. ఎన్నికల సమీపించడం, కేంద్రం డబ్బులు విడుదల చేయకపోవడం జరిగిందన్నారు. ఎన్నికల తరువాత కేంద్రం డబ్బులు విడుదల చేసిందని మాజీ ఎమ్మెల్యే ధనలక్ష్మి, ఎమ్మెల్సీ అనంత ఉదయభాస్కర్ పేర్కొన్నారు.
వరదల్లో కిలో బియ్యమైనా ఇవ్వగలిగావా?
నీ పదవీ కాలంలో రెండుస్లారు వరదలు వస్తే ఒక్కరికై నా కేజీ బియ్యమైన ఇవ్వగలిగావా అంటూ నిలదీశారు. వైఎస్సార్‌సీపీ అధికారంలో ఉన్న ఐదేళ్ల కాలంలో అన్ని రకాలుగా ఆదుకుందని గుర్తు చేశారు. జీవో నెం. 3 కోసం సుప్రీం కోర్టులో రివ్యూ పిటిషన్ 2020లో వైఎస్సార్ సీపీ వేసిందని, కనీస అవగాహన లేని మాటలు శిరీష మాట్లాడుతుందన్నారు. గండి పోశమ్మ తల్లి ఆలయం మునిగిపోకుండా చుట్టూ నిర్మాణానికి ప్రతిపాదించడం, దీనిలో భాగంగా కర్ణాటకలోని సంగమేశ్వర ఆలయాన్ని సందర్శించడం జరిగిందన్నారు. నాటి వైఎస్సార్ సీపీ కృషి ఫలితమే నేడు నిధులు విడుదలకు కారణమన్నారు.
దిగుజారుడు వ్యాఖ్యలు మానుకో..
చింతూరు ఆసుపత్రికి జీవో రాకుండా వంద పడకల ఆసుపత్రి చేశామని చెప్పడం సిగ్గుచేటన్నారు. కూటమిలో నీ పరిస్థితి ఏమిటో తెలుసుకోవాలన్నారు. కనీసం ఒక మండల పార్టీ అధ్యక్షుడుని కూడా పెట్టుకోలేని పరిస్ధితిలో ఉన్నావని విమర్శించారు. వ్యక్తిగత విమర్శలు చేస్తూ నీ గ్రాఫ్ పెంచుకునేందుకు దిగజారుడు వ్యాఖ్యలు సరికాదన్నారు. 12 ఏళ్ల క్రితం స్టేజిలపై రికార్డింగ్ డ్యాన్సులు చేశావని, ఇప్పటి వరకు నీ వ్యక్తిగత గురించి మాట్లాడలేదన్నారు. అంబులెన్స్ సర్వీసుకు నెలకు రూ. 3 లక్షలు ఖర్చవుతుందని చెబుతున్న నీవు వీటిని ఎలా సమకూర్చావని ప్రశ్నించారు. గౌరవవేతనం కింద ఇప్పటివరకు రూ.33 లక్షలు పొందావని, మిగతా డబ్బులు నీ భర్త భాస్కర్ ఉద్యోగాల పేరుతో మోసాలు, గంజాయి వ్యాపారం చేసి సంపాదించినవా అని ధ్వజమెత్తారు.
ఒకే వర్క్‌ను ఇద్దరికి అమ్మిన ఘనులు
నియోజకవర్గంలో ఎమ్మెల్యే, ఆమె భర్త భాస్కర్ ఒక నామినేటెడ్ వర్క్‌ను ఇద్దరు కాంట్రాక్టర్‌లకు పర్సంటేజీలకు అమ్మిన ఘనులని ఎమ్మెల్సీ అనంతబాబు విమర్శించారు. నామినేటెడ్
ఇష్టం వచ్చినట్టు మాట్లాడితే
సహించేది లేదు
ఎమ్మెల్యే శిరీషదేవికి మాజీ ఎమ్మెల్యే
ధనలక్ష్మి, ఎమ్మెల్సీ అనంతబాబు
హెచ్చరిక
ఆమె విమర్శలపై ఘాటుగా సమాధానం


