మంచుతో సతమతం
రాజవొమ్మంగి: దాదాపు వారం రోజులుగా మండల వ్యాప్తంగా కురుస్తున్న మంచు ప్రజలను ఇబ్బందులకు గురిచేస్తోంది. రాజవొమ్మంగిలో ఉదయం 10 గంటల వరకు దట్టంగా అలముకొంటున్న మంచు వాతావరణానికి శీతల గాలులు తోడు కావడంతో ప్రజానీకం వణికి పోతున్నారు. రాత్రిళ్లు గ్రామాల్లో, అటవీప్రాంతానికి దగ్గరగా ఉండే జనావాసాల్లో ఉష్ణోగ్రతలు అతి తక్కువగా నమోదవుతుండటంతో స్థానికులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. సాయంత్రం 4 గంటల నుంచి చలిగాలులు వీస్తున్నాయి. ఉదయం 10 గంటల వరకు మంచు దట్టంగా కురుస్తోంది. చిన్నారులు, వృద్ధులు పడుతున్న కష్టాలు వర్ణనాతీతం. విపరీతంగా మంచు కురుస్తుండడంతో ఎదురుగా వచ్చే వాహనాలు కనిపించ వాహనచోదకులు ఇబ్బందులు పడుతున్నారు. హెడ్‌లైట్‌ల వెలుతురులో రాకపోకలు సాగిస్తున్నారు. చలిమంటతో ఉపశమనం పొందుతున్నారు.


