జగన్‌కు రుణపడి ఉంటాం
గత వైఎస్సార్‌సీపీ పాలనలో అభివృద్ధి బాగా జరిగింది. కిముడుపల్లి పంచాయతీ కేంద్రంతో పాటు మారుమూల గ్రామాలకు రోడ్లు పడ్డాయి.సెల్‌ఫోన్లు పనిచేస్తున్నాయి. వైద్య ఆరోగ్య సేవలు విస్తృతమయ్యాయి. గ్రామాలకు 108, ఇతర అంబులెన్సులు వస్తున్నాయి. పాఠశాలలు బాగుపడ్డాయి. అర్హులందరికి ఇంటింటికీ నెలలో మొదటి రోజు పింఛన్ సొమ్ము అందేది. వ్యవసాయరంగానికి అధిక ప్రాధాన్యం ఉండేది. గ్రామ సచివాలయాలు ఏర్పాటుతో మండల కేంద్రాల్లోని కార్యాలయాలకు కాళ్లరిగేలా తిరిగే పరిస్థితి తప్పింది. కిముడుపల్లి పంచాయతీ కేంద్రంలోనే అనేక శాఖల ఉద్యోగులు అందుబాటులో ఉండి ప్రజల సమస్యలు పరిష్కరిస్తున్నారు. తమ కిముడుపల్లి పంచాయతీ స్వరూపమే మారిపోయింది. గిరిజనుల అభివృద్ధికి ఇన్ని మంచి పనులు చేసిన అప్పటి సీఎం జగన్‌మోహన్‌రెడ్డికి తామంతా రుణపడి ఉంటాం.
– జీలుగుల కృష్ణమూర్తినాయుడు,
గ్రామపెద్ద, కిముడుపల్లి, పెదబయలు మండలం


