ఘనంగా జగన్ జన్మదిన వేడుకలు
పాడేరు : వైఎస్సార్‌సీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి జన్మదిన వేడుకలను జిల్లా కేంద్రమైన పాడేరులో ముందస్తుగా నిర్వహించారు. అరకు ఎంపీ డాక్టర్ గుమ్మా తనూజరాణి ఆధ్వర్యంలో పట్టణంలోని కనకదుర్గమ్మ ఆలయ ప్రాంగణంలో పుట్టినరోజు వేడుకలను ఘనంగా నిర్వహించారు. వైఎస్సార్‌సీపీ జిల్లా అద్యక్షుడు, పాడేరు ఎమ్మెల్యే మత్య్సరాస విశ్వేశ్వరరాజు, ఎమ్మెల్సీ కుంభా రవిబాబు, వైఎస్సార్‌సీపీ యువజన విభాగం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి చెట్టి వినయ్, వైఎస్సార్‌సీపీ నాయకులతో కలిసి కేక్ కట్ చేశారు. జై జగన్, జైజై జగనన్ , హ్యాపీ బర్త్‌డే జగనన్న అంటూ నినాదాలతో హోరెత్తించారు. ఈ కార్యక్రమంలో పాడేరు, అరకు నియోజకవర్గాలకు చెందిన పలువురు జెడ్పీటీసీలు, ఎంపీపీలు, సర్పంచ్‌లు, ఎంపీటీసీలు, అధిక సంఖ్యలో పార్టీ శ్రేణులు పాల్గొన్నారు.


