ఆదిలాబాద్‌టౌన్: అన్ని శాఖల అధికారులు సమన్వయంతో గణపతి నిమజ్జనోత్సవాలు ప్రశాంతంగా జరిగేలా చూడాలని బాసర జోన్ డీఐజీ ఆర్.భాస్కరన్ ఆదేశించారు. బుధవారం జిల్లా పోలీస్ కార్యాలయంలో అధికారులతో సమీక్షించారు. ట్రాఫిక్ ని యంత్రణ, విద్యుత్ తీగలు, భక్తుల భద్రతపై ప్రత్యే క దృష్టి పెట్టాలని సూచించారు. జైనథ్ మండలం పెన్‌గంగా వద్ద ఏర్పాటు చేసిన నిమజ్జన ప్రాంతా న్ని పరిశీలించారు. ఆదిలాబాద్ కమాండ్ కంట్రోల్ సెంటర్‌ను సందర్శించి సీసీ కెమెరాల పనితీరు పరి శీలించారు. సీసీ కెమెరాలు, డ్రోన్లు వినియోగించి ని మజ్జన మార్గాలు, ప్రధాన రద్దీ ప్రాంతాలను నిరంతరం పర్యవేక్షించాలని సూచించారు. అనంతరం వ న్‌టౌన్ పోలీస్‌స్టేషన్‌ను సందర్శించి పెండింగ్ కేసులు, దర్యాప్తు పురోగతి, వాహనాల స్థితిగతులపై ఆ రా తీశారు. ఎస్పీ అఖిల్ మహాజన్, అదనపు ఎస్పీలు మౌనిక, సురేందర్‌రావు, ఉట్నూర్ ఏఎస్పీ రుత్వి క్ సాయి కొట్టే, డీఎస్పీ జీవన్‌రెడ్డి, స్పెషల్ బ్రాంచ్ డీఎస్పీ వెంకటనర్సయ్య, సీఐలు, ఎస్సైలున్నారు.
రిమ్స్ ఘటనపై ఆరా
రిమ్స్ ఆస్పత్రిని సందర్శించిన డీఐజీ ఏసీ పేలుడు ఘటన వివరాలు తెలుసుకున్నారు. మృతుల కుటుంబ సభ్యులకు సానుభూతి తెలిపారు. వెంటనే స్పందించి సహాయక చర్యలు చేపట్టిన పోలీసులు, ఆస్పత్రి సిబ్బందిని అభినందించారు.
నిమజ్జన ప్రాంతం పరిశీలన
సాత్నాల: భోరజ్ మండలం డోలారా సమీపాన తెలంగాణ–మహారాష్ట్ర సరిహద్దులోని పెన్‌గంగా న దిని డీఐజీ భాస్కరన్ సందర్శించారు. భక్తులు, వా హనాల రద్దీకి తగినట్లు భద్రత చర్యలు చేపట్టాలని, పోలీస్ సిబ్బంది అప్రమత్తంగా ఉండాలని సూచించారు. ఎస్పీ అఖిల్ మహాజన్, అదనపు ఎస్పీలు మౌనిక, సురేందర్‌రావు, ఎస్పీ రుత్విక్ సాయి కొట్టే, డీఎస్పీ జీవన్‌రెడ్డి, స్పెషల్ బ్రాంచ్ డీఎస్పీ వెంకటనర్సయ్య, సీఐలు, ఎస్సైలు, సిబ్బంది పాల్గొన్నారు.


