ఆదిలాబాద్‌టౌన్: రిమ్స్ ఆస్పత్రిలోని ప్రత్యేక నవజాత శిశు సంరక్షణ విభాగంలో జరిగిన అ గ్నిప్రమాద ఘటనలో ప్రభావితమైన చిన్నారులకు మెరుగైన వైద్యం అందేలా చూస్తామని కలెక్టర్ రాజర్షిషా పేర్కొన్నారు. మంగళవారం రాత్రి పట్టణంలోని ప్రైవేట్ ఆస్పత్రులను సందర్శించి చికిత్స పొందుతున్న చిన్నారుల ఆరో గ్య పరిస్థితి, అందుతున్న వైద్య సేవలు, చికి త్స, మందులు, వైద్యుల పర్యవేక్షణ తది తర అంశాల గురించి తెలుసుకున్నారు. మెరుగైన చికిత్స కోసం ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలని అధి కారులను ఆదేశించారు. డీఎంహెచ్‌వో సాధన, వైద్యులు, వైద్యాధికారులు, సిబ్బంది ఉన్నారు.


