కై లాస్‌నగర్: గ్రామాల సమగ్రాభివృద్ధే లక్ష్యంగా వికసిత్ గ్రామపంచాయతీ ప్రణాళిక (వీజీపీపీ)లను సిద్ధం చేయాలని డీపీవో జి.రమేశ్ సూ చించారు. వికసిత భారత్ గ్యారంటీ ఫర్ రోజ్‌గార్ అండ్ అజీవికా మిషన్ గ్రామీణ్ కింద చేప ట్టే ప్రణాళికల రూపకల్పనపై ఽగురువారం పట్ట ణంలోని ఎస్టీయూ భవన్‌లో ఎంపీడీవోలు, స ర్పంచులు, పంచాయతీ కార్యదర్శులకు ఒక్కరోజు శిక్షణ ఇచ్చారు. ఈ సందర్భంగా డీపీవో మాట్లాడుతూ.. వచ్చే అక్టోబర్ 2నుంచి 2027 జూన్ వరకు చేపట్టాల్సిన పనులకు సంబంధించిన ప్రణాళికలను గ్రామాల వారీగా తయారు చేయాలని సూచించారు. ఇందుకోసం గ్రామ, వార్డుల వారీగా సభలు నిర్వహించాలని తెలి పారు. కూలీల సంఖ్య పెంచేలా ప్రత్యేక శ్రద్ధ చూపాలని పేర్కొన్నారు. కేంద్రం సరిపడా ని ధులు ఇచ్చేందుకు సిద్ధంగా ఉందని, ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. జెడ్పీ సీఈవో భుక్యా రవి, డీఆర్డీవో రా థోడ్ రవీందర్, అడిషనల్ డీఆర్డీవోలు రాంప్రసాద్, గజానన్‌రావు, ఏవో గంగాధర్ ఉన్నారు.


