ఇళ్ల పనుల్లో వేగం పెంచాలి | - | Sakshi
Sakshi News home page

ఇళ్ల పనుల్లో వేగం పెంచాలి

Sep 25 2026 2:11 AM | Updated on Sep 25 2026 2:11 AM

కై లాస్‌నగర్‌: ఆదిలాబాద్‌ పట్టణంలోని కేఆర్‌కే కాలనీలోగల డబుల్‌ బెడ్రూం ఇళ్లలో మౌలిక వసతుల కల్పన పనులు వేగవంతం చేయాలని కలెక్టర్‌ రాజర్షి షా ఆదేశించారు. డబుల్‌ బెడ్రూం ఇళ్ల పెండింగ్‌ పనులు, మౌలిక వసతులను గురువారం పరిశీలించారు. శానిటేషన్‌, విద్యుత్‌, తాగునీరు, డ్రైనేజీ తదితర మౌలిక వసతుల పరిస్థితిని పరిశీలించారు. పెండింగ్‌ పనులు గుర్తించి వేగంగా పూర్తి చేసి లబ్ధిదారులకు ఇబ్బందులు లేకుండా చూడాలని అధికా రులకు సూచించారు. మౌలిక వసతుల కల్పన పనుల పురోగతి వివరాలు తెలుసుకుని, పనులు నాణ్యతతో పూర్తి చేయాలని ఆదేశించారు. స్థానిక సంస్థల అదనపు కలెక్టర్‌ ఎస్‌.రాజేశ్వర్‌, మున్సిపల్‌ ఇంజినీర్‌ అరుణ్‌కుమార్‌, ఆర్‌అండ్‌బీ ఈఈ రమేశ్‌ తదితరులున్నారు.

గణపయ్యకు పూజలు

ఆదిలాబాద్‌రూరల్‌: మావల మండల కేంద్రంలో ప్రతిష్ఠించిన వినాయకుడిని కలెక్టర్‌ రాజర్షి షా దర్శించుకుని పూజలు చేశారు. ఏఎంసీ చై ర్మన్‌ శ్రీకాంత్‌రెడ్డి, సర్పంచ్‌ ధర్మపురి చంద్రశేఖ ర్‌, వినాయక ఉత్సవాల నిర్వాహకులున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement