● ఆగస్టుతో ముగిసిన కాలపరిమితి ● నోటిఫికేషన్‌ లేకుండానే పొడిగింపు ● ఓ అధికారి నిర్వాకమని ఆరోపణలు ● అక్రమాలు జరిగాయని విమర్శలు ● కొత్త ప్రొసీడింగ్‌ ఇవ్వాలని డిమాండ్‌ | - | Sakshi
Sakshi News home page

● ఆగస్టుతో ముగిసిన కాలపరిమితి ● నోటిఫికేషన్‌ లేకుండానే పొడిగింపు ● ఓ అధికారి నిర్వాకమని ఆరోపణలు ● అక్రమాలు జరిగాయని విమర్శలు ● కొత్త ప్రొసీడింగ్‌ ఇవ్వాలని డిమాండ్‌

Sep 25 2026 2:11 AM | Updated on Sep 25 2026 2:11 AM

● ఆగస్టుతో ముగిసిన కాలపరిమితి ● నోటిఫికేషన్‌ లేకుండానే పొడిగింపు ● ఓ అధికారి నిర్వాకమని ఆరోపణలు ● అక్రమాలు జరిగాయని విమర్శలు ● కొత్త ప్రొసీడింగ్‌ ఇవ్వాలని డిమాండ్‌

సాక్షి, ఆదిలాబాద్‌: జిల్లాలో ఔట్‌సోర్సింగ్‌ ఏజెన్సీల కొనసాగింపుపై ఆరోపణలు వ్యక్తమవుతున్నాయి. ఎంప్యానల్మెంట్‌లోని ఏజెన్సీల కాలపరిమితి ముగిసిన తర్వాత కొత్త నోటిఫికేషన్‌ ఇవ్వకుండానే పాత ఏజెన్సీలను రెన్యూవల్‌ చేస్తూ గడువు పొడిగించారనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఉపాధికల్పనాధికారి బాధ్యతల నుంచి తప్పుకొనే ముందు ఓ అధికారి ఈ ప్రక్రియ హుటాహుటిన చేసేశారనే విమర్శలున్నాయి. ఈ ప్రక్రియలో అక్రమాలు చోటుచేసుకున్నాయని ఇతర ఏజెన్సీల నిర్వాహకులు ఆరోపిస్తున్నారు. వారికి అనువైన ఏజెన్సీలకు ప్రయోజనం దక్కేలా అక్రమాలకు పాల్పడ్డట్లు చెబుతున్నారు.

ఆగస్టులోనే ముగిసిన కాలపరిమితి

జిల్లాలో వివిధ ప్రభుత్వ శాఖల్లో ఔట్‌సోర్సింగ్‌ ఉద్యోగులు బాధ్యతలు నిర్వహిస్తున్నారు. వీరిని ఏజెన్సీలు ఎంపిక చేస్తారు. వీరికి ప్రతినెలా వేతనాలు కూడా ఈ ఏజెన్సీల ద్వారానే చె ల్లింపులు జరుగుతాయి. జిల్లాలో సు మారు 2వేలకు పైగా ఔట్‌సోర్సింగ్‌ ఉద్యోగులున్నారు. ఎంప్యానల్మెంట్‌లోని ఔట్‌సోర్సింగ్‌ ఏజెన్సీల కాలపరిమితి గత ఆగస్టుతో ముగి సింది. కొత్త నోటిఫికేషన్‌ ఇచ్చి ఔట్‌సోర్సి ంగ్‌ ఏజెన్సీలను ని యమించాల్సి ఉండగా, పాత ఏజెన్సీల కాలపరిమితిని వచ్చే ఏడాది మార్చి వరకు దొడ్డిదారిన పొడిగించారని కొంతమంది ఏజెన్సీ నిర్వాహకులు ఆరోపిస్తున్నారు.

హెచ్‌వోడీల అనుమతి లేకుండానే..

ఔట్‌సోర్సింగ్‌ ఏజెన్సీల కాలపరిమితి ముగిసిన తర్వాత పొడిగించే అధికారం జిల్లా అధికారులకు లేదని కొందరు ఆరోపిస్తున్నారు. ఆయా ప్రభుత్వ శాఖల్లో ఔట్‌సోర్సింగ్‌ ఉద్యోగులను కొనసాగించే విషయంలో సంబంధిత శాఖ హెచ్‌వోడీల నుంచి అనుమతి తీసుకోవాలని జీవోలో ఉందని పలువు రు ఏజెన్సీ నిర్వాహకులు పేర్కొంటున్నారు. అలా కాకుండా నేరుగా ఏజెన్సీల కాలపరిమితి పొడిగింపు వ్యవహారంలో పెద్ద ఎత్తున డబ్బులు చేతులు మారాయని ఆరోపిస్తున్నారు.

జిల్లాలో ఇదీ పరిస్థితి

జిల్లాలో కొత్త ఎంప్యానల్మెంట్‌ ద్వారా ఔట్‌సోర్సింగ్‌ ఏజెన్సీలను గతేడాది ఎంపిక చేశారు. 2025 జూలై 29నుంచి 2026 జూలై 28వరకు వీటి గడువు ఉండగా, ఇటీవల ముగిసింది. కాగా, ఆ సమయంలో ఉపాధికల్పనాధికారి బాధ్యతల నుంచి తప్పుకొనే కొద్దిరోజుల ముందు పాత ఏజెన్సీల గడువు పొడిగించే విషయంలో అక్రమాలకు పాల్పడ్డారనే ఆరోపణలు వ్యక్తమవుతున్నాయి. 15ఏజెన్సీల సేవలను తిరిగి పొడిగిస్తూ ఇటీవల ఆదేశాలు జారీ అయ్యాయి.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement