పాడిపశువులు, మేకలు, గొర్రెలకు బీమా సౌకర్యం కల్పించాలని ప్రభుత్వం నిర్ణయించింది. జిల్లాలోని పశు పోషకులు, పెంపకందారులకు ఇది ఎంతో ఉపయోగపడుతుంది. జిల్లాలో పశుసంపద వృద్ధికి దోహదం చేస్తుంది. అయితే, దీని అమలుపై ప్రభుత్వం నుంచి మార్గదర్శకాలు రావాల్సి ఉంది. – రాథోడ్ రామారావు,
జిల్లా పశుసంవర్ధకశాఖ అధికారి
సర్కారు నిర్ణయం భరోసానిస్తోంది
ఇప్పటివరకు అనుకోకుండా గొర్రెలు చనిపోతే తీవ్రంగా నష్టపోయాం. పాడిపశువులు, మేకలు, గొర్రెలకు బీమా సౌకర్యం కల్పించాలనే ప్రభుత్వం నిర్ణయం మాలాంటి పెంపకందారులకు ఎంతో మేలు చేస్తుంది. 85శాతం ప్రీమియం కూడా ప్రభుత్వమే చెల్లించనుండటం ఆర్థికభరోసానిస్తోంది. – అస్తక్ సుభాష్,
గొర్రెల పెంపకందారు, పార్డి


