ఔట్‌సోర్సింగ్ ఏజెన్సీల కాలపరిమితి పొడిగింపు విషయంపై కొంతమంది మా దగ్గరికి వచ్చారు. హెచ్‌వోడీల అనుమతి లేకుండా పొడిగింపు చేయరాదని ప్రొసీడింగ్‌లో ఉందని వారు చెప్పారు. అలాగని రెన్యూవల్ చేయరాదని కూడా ఎక్కడా లేదని మేము వారితో పేర్కొన్నాం.
– జ్ఞానేశ్వర్, జిల్లా ఉపాధికల్పనాధికారి
కొత్త నోటిఫికేషన్ ఇవ్వాలి
ఔట్‌సోర్సింగ్ ఏజెన్సీల కాలపరిమితి ముగిసినప్పుడు వాటిని తిరిగి కొనసాగించే విషయంలో సంబంధిత శాఖ హెచ్‌వోడీలకు మాత్రమే అధికారముంది. ఏజెన్సీల పనితీరు పరిశీలించి ఈ నిర్ణయం తీసుకుంటారు. జీవోల్లో ఇలాగే ఉంది. కొత్త నోటిఫికేషన్ ఇచ్చి ఏజెన్సీలను పరిగణనలోకి తీసుకోవాలి.
– ఎస్.అశోక్, టీఎన్జీవో మాజీ అధ్యక్షుడు


