కైలాస్‌నగర్: జాతీయ 11వ ఆయుర్వేద దినోత్సవా న్ని బుధవారం జిల్లా కేంద్రంలోని రెవెన్యూ గార్డెన్స్‌లో ఘనంగా నిర్వహించారు. మున్సిపల్, మార్కెట్ కమిటీ చైర్మన్లు బండారి అనూష, బోరంచు శ్రీకాంత్‌రెడ్డి ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. భగవాన్ ధన్వంతరి చిత్రపటానికి పూలమాలలు వేసి, జ్యోతి ప్రజ్వలనతో చేశారు. ఆయుర్వేద మెడికల్ ఆ ఫీసర్ డాక్టర్ శ్రీకాంత్ ఆయుర్వేద దినోత్సవం, ఆ యుర్వేద చికిత్స ప్రాముఖ్యతపై అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. కరో నా సమయంలో ఆయుర్వేదానికి మంచి ఆదరణ ల భించిందని, నాటి నుంచి జనాల్లో వినియోగం పెరి గిందని తెలిపారు. పూర్వకాలంలో ప్రతీ ఇంట్లో చి న్నచిన్న చిట్కాల ద్వారా జబ్బులను నయం చేస్తూ ఉండేవారని, మళ్లీ ఆయుర్వేదానికి అదే ఆదరణ లభిస్తోందని పేర్కొన్నారు. ఆయుర్వేద మూలికలతో పాటు పోషణమాసంలో భాగంగా అంగన్‌వాడీ టీచర్లు పోషకాలతో కూడిన ఆహార పదార్థాలతో ఏర్పాటు చేసిన స్టాళ్లను పరిశీలించారు. డీడబ్ల్యూవో మిల్కా, మెప్మా పీడీ సీవీఎన్ రాజు, ఆయుష్ డిస్ట్రిక్ట్ నోడల్ ఆఫీసర్ డాక్టర్ కస్తాల చంద్రశేఖర్, సంతోష్, అవినాష్ రాథోడ్ తదితరులు పాల్గొన్నారు.


