ఆదిలాబాద్‌టౌన్: శారీరక, మానసిక సామర్థ్యాలను పెంచుకోవాలని క్యాంప్ కమాండెంట్ క ల్నల్ విక్రమ్ ప్రతాప్‌సింగ్ సూచించారు. జిల్లా పోలీస్ ట్రైనింగ్ సెంటర్‌లో మూడురోజులుగా నిర్వహిస్తున్న వార్షిక శిక్షణ శిబిరంలో భాగంగా బుధవారం కెడెట్లకు శారీరక దృఢత్వం, క్రమశి క్షణ, నైపుణ్యాలను పెంచే లక్ష్యంతో ఇంటర్ కంపెనీ క్రాస్ కంట్రీ పోటీలు నిర్వహించారు. అ నంతరం సుంకిడి ఫైర్ రేంజ్‌లో ఫైరింగ్ శిక్షణ ఇచ్చారు. ఆయుధాల వినియోగం, ఫైరింగ్ స మయంలో పాటించాల్సిన భద్రత నిబంధనలు, లక్ష్యసాధన తదితర అంశాలపై అవగాహ న కల్పించారు. క్రాస్ కంట్రీ పోటీల్లో విజయం సాధించిన కెడెట్లకు మెడల్స్ ప్రదానం చేసి అభినందించారు. డిప్యూటీ క్యాంప్ కమాండెంట్ లె ఫ్టినెంట్ కల్నల్ అరవింద్ కిచ్చర్, క్యాంప్ అడ్జుటెంట్ చంద్రకాంత్, ఏఎన్వోలు సాయినాథ్, ప్రశాంత్, పీఐ సిబ్బంది హెర్పాల్‌సింగ్, దేవేందర్‌సింగ్, బెటాలియన్ సిబ్బంది ఉన్నారు.


