చిన్నారులకు మెరుగైన వైద్యం అందించాలి | - | Sakshi
Sakshi News home page

చిన్నారులకు మెరుగైన వైద్యం అందించాలి

Sep 24 2026 12:06 AM | Updated on Sep 24 2026 12:06 AM

ఆదిలాబాద్‌: రిమ్స్‌ ఘటనలో గాయపడిన చిన్నారులకు మెరుగైన వైద్యం అందించాలని ఎమ్మెల్యే పా యల్‌ శంకర్‌ కోరారు. జిల్లా కేంద్రంలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో బుధవారం విలేకరులతో మాట్లాడారు. హైదరాబాద్‌ నుంచి ప్రత్యేక వైద్యుల బృందాన్ని వెంటనే ఆదిలాబాద్‌కు పంపించాలని, అవసరమైతే స్థానిక ప్రైవేట్‌ వైద్యుల సేవలను వినియోగించుకుని మెరుగైన చికిత్స అందించాలని సూచించారు. రిమ్స్‌లో 150 పడకల అదనపు ఆస్పత్రి, మౌలిక వసతులు, వైద్య సదుపాయాల కోసం సుమారు రూ.150 కోట్లు అవసరమవుతాయని, ఈ వారంలోనే ప్రతిపాదనలు సిద్ధం చేసి నిధులు మంజూరు చేయాలని డిమాండ్‌ చేశారు. ఖాళీగా ఉన్న వైద్యుల పోస్టులు భర్తీ చేసి సూపర్‌ స్పెషాలిటీ సేవలు అందుబాటులోకి తేవాలన్నారు. ఆస్పత్రిలో ని రంతరం విద్యుత్‌ నిర్వహణ వ్యవస్థ ఏర్పాటు చేసి ప్రమాదాలు జరగకుండా చూడాలని, ఫైర్‌ సేఫ్టీ పరి కరాలు అందుబాటులో ఉంచాలని కోరారు. ఘటన పై సమగ్ర విచారణ జరిపి నిర్లక్ష్యానికి కారణాలు గుర్తించాలని డిమాండ్‌ చేశారు. నాయకులు హనుమాండ్లు, జీవన్‌, పోషన్న, కార్తిక్‌, నరేశ్‌, సాయి, స తీశ్‌యాదవ్‌, రాము, దత్తు, విలాస్‌ పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement