Telangana Crime News: ప్రియుడు పెళ్లికి నిరాకరించడంతో.. పోలీస్‌స్టేషన్‌ ఆవరణలో యువతి ఒక్కసారిగా..
Sakshi News home page

ప్రియుడు పెళ్లికి నిరాకరించడంతో.. పోలీస్‌స్టేషన్‌ ఆవరణలో యువతి ఒక్కసారిగా..

Sep 18 2023 8:52 AM | Updated on Sep 18 2023 10:11 AM

- - Sakshi

ఆదిలాబాద్‌: ప్రియుడు పెళ్లికి నిరాకరించాడని యువతి పురుగుల మందు తాగి ఆత్మహత్యాయత్నానికి పాల్పడిన ఘటన ఇచ్చోడ పోలీస్‌స్టేషన్‌ ఆవరణలో చోటుచేసుకుంది. వివరాలు ఇలా ఉన్నాయి.. నిర్మల్‌ జిల్లా కడెం మండలంలోని ముసాయిపేట్‌కు చెందిన సుజాత (28), ఇచ్చోడ మండల కేంద్రంలోని టీచర్స్‌కాలనీకి చెందిన చందల హరీశ్‌కుమార్‌ తొమ్మిదేళ్లుగా ప్రేమించుకున్నారు.

హైదరాబాద్‌లో చదువుతున్న సమయంలో వీరు ప్రేమలో ఉన్నారు. పెళ్లి చేసుకోకుండా తప్పించుకు తిరుగుతుండడంతో 2022 మార్చిలో ప్రియుడు ఇంటి వద్ద సుజాత భైఠాయించింది. ఈ క్రమంలో హరీశ్‌ తల్లిదండ్రులు నిర్మల్‌కు మకాం మార్చారు. దాదాపు 18 నెలల నుంచి సుజాత తన సమీప బంధువులతో కలిసి ప్రియుడు హరీశ్‌కుమార్‌ ఇంట్లో ఉంటోంది. ఆదివారం ఇరువర్గాల కుల పెద్దలతో పంచాయితీ నిర్వహించారు.

ఈ వివరాలను ఇచ్చోడ పోలీస్‌స్టేషన్‌లో వెల్లడించానికి వెళ్లారు. పెళ్లికి హరీశ్‌కుమార్‌ నిరాకరించడంతో యువతి వెంట తెచ్చుకున్న పురుగుల మందు తాగింది. వెంటనే స్థానిక ఎస్సై నరేశ్‌ పోలీసు వాహనంలో పీహెచ్‌సీకి తరలించారు. మెరుగైన వైద్యం కోసం ఆదిలాబాద్‌ రిమ్స్‌కు తరలించారు. ప్రసుతం పరిస్థితి విషమంగా ఉన్నట్లు సమాచారం. ఎస్సై వివరణ కోరగా ఇరువర్గాల కులపెద్దలు పోలీస్‌స్టేషన్‌ బయట మాట్లాడుకున్నారు. హరీశ్‌కుమార్‌ పెళ్లికి నిరాకరించడంతో పోలీస్‌స్టేషన్‌ గేటు బయట సుజాత పురుగుల మందు తాగినట్లు తెలిపారు.

Advertisement
 
Advertisement
Advertisement