నాటేది ఆ మూడు శాఖలే! | - | Sakshi
Sakshi News home page

నాటేది ఆ మూడు శాఖలే!

Aug 10 2026 11:42 PM | Updated on Aug 10 2026 11:42 PM

అగ్రస్థానంలో అటవీ, లక్ష్యసాధన దిశగా డీఆర్డీఏ

మొక్కల పంపిణీకే పరిమితమైన మున్సిపాలిటీ

వనమహోత్సవాన్ని పట్టించుకోని 17 శాఖలు

జిల్లా లక్ష్యం చేరడం అనుమానమే

కై లాస్‌నగర్‌: ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న వనమహోత్సవ కార్యక్రమ నిర్వహణ జిల్లాలో ప్రశ్నార్థకంగా మారింది. కేటాయించిన లక్ష్యం మేరకు మొక్కలు నాటాల్సిన పలు ప్రభుత్వ శాఖలు పట్టించుకోవడం లేదు. కేవలం మూడు శాఖలు మాత్రమే నాటుతున్నాయి. ఇటీవల వరుసగా కురిసిన వర్షాలతో నాటేందుకు అనువైన పరిస్థితులు ఏర్పడినా పలు శాఖలు ఆ దిశగా ముందుకు రాలేదు. దీంతో వారికి కేటాయించిన లక్ష్య సాధన అనుమానంగానే కనిపిస్తోంది. ఆదిలాబాద్‌ మున్సిపల్‌ పరిధిలో కేవలం ఇళ్లలో నాటేందుకు మొక్కలను పంపిణీ చేసినట్లు వివరాలు కనిపిస్తున్నా.. క్షేత్రస్థాయిలో ఎక్కడా పంపిణీ చేసిన దాఖలాలు లేవనే విమర్శలున్నాయి. ఉన్నతాధికారుల పర్యవేక్షణ లోపమే కారణమనే అభిప్రాయం వ్యక్తమవుతుంది.

అటవీశాఖ భేష్‌..

పచ్చదనం పెంపొందించాలనే ఉద్దేశంతో రాష్ట్ర ప్రభుత్వం ఏటా వర్షాకాలంలో వన మహోత్సవ కా ర్యక్రమాన్ని నిర్వహిస్తోంది. ఇందులో భాగంగా ఈ ఏడాది జిల్లాకు 39లక్షల మొక్కలు నాటాలని లక్ష్యంగా కేటాయించింది. ఆయా శాఖలకు అందుబాటులో ఉండే స్థలాలు, పరిస్థితికి అనుగుణంగా లక్ష్యాన్ని నిర్దేశించారు. అయితే ఇప్పటి వరకు ము చ్చటగా మూడు శాఖలే కార్యక్రమంలో భాగస్వాములయ్యాయి. అధికారిక లెక్కల ప్రకారం అటవీ శాఖ మొక్కలు నాటడంలో అగ్రస్థానంలో నిలిచింది. ఆ శాఖకు 4.25లక్షలను లక్ష్యంగా కేటా యించగా 6.76లక్షల మొక్కలు నాటారు. ఇప్పటికే లక్ష్యాన్ని మించారు. గ్రామీణాభివృద్ధి శాఖకు 24.87లక్షలు లక్ష్యంగా కేటాయించగా ఇప్పటి వరకు 15.34లక్షల మొక్కలు నాటారు. 61.69 శాతం మేర పూర్తి చేసి లక్ష్యసాధన దిశగా సాగుతుంది. ఈ రెండు శాఖలు అవెన్యూ ప్లాంటేషన్‌కు ప్రాధాన్యతనిచ్చాయి. ఇక ఆదిలాబాద్‌ మున్సిపాలిటీకి 5.10లక్షల మొక్కలు నాటేలా టార్గెట్‌ కేటాయించగా ఇందులో 1.49లక్షల మొక్కలను నాటినట్లుగా చెబుతున్నారు. అయితే క్షేత్రస్థాయిలో మాత్రం కార్యక్రమ అమలు జరిగిన దాఖలాలు ఎక్కడా కన్పించకపోవడం విమవర్శలకు తావిస్తోంది. మున్సిపల్‌ అధికారులు ని, సిబ్బంది కాని భాగస్వాములై మొక్కలు పంపిణీ చేసిన, నాటిన పరిస్థితి లేదు.

17 శాఖలు పట్టించుకోలే..

జిల్లాలోని 20 శాఖలకు ఈ ఏడాది హరితలక్ష్యాన్ని నిర్దేశించగా ఇందులో 17 అంతగా దృష్టిసారించలేదు. అధికారిక లెక్కల ప్రకారంగానే ఇప్పటిదాకా ఒక్క మొక్క కూడా నాటలేదు. ప్రభుత్వ వనమహోత్సవ ప్రగతి నివేదిక ఈ విషయాన్ని స్పష్టం చేస్తోంది. ఇందులో పోలీసు శాఖకు 80వేలు, ఆర్‌అండ్‌బీకి 50వేలు, ఐటీడీఏకు 50వేలు, ఆర్టీసీకి వెయ్యి, ఇరిగేషన్‌కు 22వేలు, వ్యవసాయ శాఖకు 2లక్షల 25వేలు, ఉద్యానవన శాఖకు 20వేలు, రెవెన్యూకు వెయ్యి, ఎకై ్సజ్‌కు 6వేలు, దేవాదాయ శాఖకు 2వేలు, కళాశాల విద్యకు వెయ్యి, విద్య శాఖకు 5వేలు, పశుసంవర్ధక శాఖకు వెయ్యి, పరిశ్రమల శాఖకు 5వేలు, విద్యుత్‌ శాఖకు వెయ్యి, సోషల్‌ వేల్ఫేర్‌కు వెయ్యి, యువజన సర్వీసులు వెయ్యి, ఇతర శాఖల కు వెయ్యి చొప్పున మొక్కలు నాటాలని లక్ష్యంగా కేటాయించారు. అయితే తమకు సంబంధమే లేదన్నట్లుగా ఆయా శాఖల అధికారులు, సిబ్బంది వ్యవహరిస్తుండడం గమనార్హం. ఒక్క మొక్క కూడా నాటని ఆయా శాఖలు లక్ష్యాన్ని ఏ మేరకు సాధిస్తాయనేది ప్రశ్నార్థకంగా మారింది.

వనమహోత్సవ వివరాలు

జిల్లాకు కేటాయించిన మొక్కల లక్ష్యం

38,93,800

ఇప్పటివరకు నాటినవి : 23,59,900

ఇంకా నాటాల్సినవి : 15,33,900

ఇళ్లలో నాటేందుకు పంపిణీ చేసినవి

14,825

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement