● ఎస్పీ అఖిల్ మహాజన్
బజార్‌హత్నూర్: పటిష్టమైన సమాచార వ్యవస్థతో అసాంఘిక కార్యకలాపాలకు అడ్డుకట్ట వేయాలని ఎస్పీ అఖిల్ మహాజన్ అన్నారు. మండల కేంద్రంలోని పోలీస్ స్టేషన్‌ను సోమవారం తనిఖీ చేశారు. రికార్డులను పరిశీలించారు. గ్రామాల్లో వీపీవో విధానాన్ని పకడ్బందీగా అమలు చేయాలన్నారు. గుడుంబా, గంజాయి, మాదకద్రవ్యాలు, కలప అక్రమ రవాణా, పేకాట, మట్కా వంటి చట్ట వ్యతిరేక కార్యకలాపాలను అరికట్టేలా చర్యలు చేపట్టాలన్నారు. ఇందులో ఆదిలాబాద్ డీఎస్పీ జీవన్‌రెడ్డి, బోథ్ సీఐ గురుస్వామి, ఎస్సై రమేశ్, పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు.


