‘కార్మిక హక్కులను కాలరాస్తున్న కేంద్ర సర్కారు’ | - | Sakshi
Sakshi News home page

‘కార్మిక హక్కులను కాలరాస్తున్న కేంద్ర సర్కారు’

Aug 10 2026 11:42 PM | Updated on Aug 10 2026 11:42 PM

కై లాస్‌నగర్‌: కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం దేశాన్ని కార్పొరేట్‌ శక్తులకు అప్పగిస్తూ, కార్మికులు, రైతులు, సామాన్య ప్రజల హక్కులను కాలరాస్తుందని ఏఐటీయుసీ రాష్ట్ర కార్యదర్శి ఎస్‌.విలాస్‌ ఆరోపించారు. కేంద్ర ప్రభుత్వ విధానాలను నిరసిస్తూ కలెక్టరేట్‌ ఎదుట ఏఐటీయూసీ, బీఆర్‌టీయూ, ఏఐకేఎస్‌ ఆధ్వర్యంలో సోమవారం ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, పెరుగుతున్న నిత్యావసర వస్తువుల ధరలకు అనుగుణంగా కార్మికుల వేతనాలు పెంచాలని డిమాండ్‌ చేశారు. వందేళ్లకు పైగా పోరాడి సాధించుకున్న 44 కార్మిక చట్టాలను కుదించి కార్పొరేట్‌ శక్తులకు అనుకూలంగా కేంద్రం లేబర్‌ కోడ్‌లను నాలుగుగా మార్చిందని మండిపడ్డారు. కార్యక్రమంలో ఆయా సంఘాల నాయకులు కడ్తరపు అశోక్‌, దేవిదాస్‌, దేవేందర్‌, గోవర్ధన్‌, రాజు తదితరులు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement