● పేకాటపై ఫోకస్‌ పెంచిన ఎస్పీ ● జిల్లాలో ఇప్పటికే పలువురిపై కేసు ● మహారాష్ట్రకు తరలుతున్న జూదరులు ● అక్కడ కూడా చెక్‌ పెడుతున్న పోలీసులు | - | Sakshi
Sakshi News home page

● పేకాటపై ఫోకస్‌ పెంచిన ఎస్పీ ● జిల్లాలో ఇప్పటికే పలువురిపై కేసు ● మహారాష్ట్రకు తరలుతున్న జూదరులు ● అక్కడ కూడా చెక్‌ పెడుతున్న పోలీసులు

Aug 10 2026 11:42 PM | Updated on Aug 10 2026 11:42 PM

● పేకాటపై ఫోకస్‌ పెంచిన ఎస్పీ ● జిల్లాలో ఇప్పటికే పలువురిపై కేసు ● మహారాష్ట్రకు తరలుతున్న జూదరులు ● అక్కడ కూడా చెక్‌ పెడుతున్న పోలీసులు

ఇక్కడ.. అక్కడ.. కొరడా

సాక్షి,ఆదిలాబాద్‌: గతనెల 26న మహారాష్ట్రలోని పాండ్రకౌడ పోలీసులు తిప్పేశ్వర్‌ గేట్‌ మార్గంలోని ఓ రిసార్ట్‌లో రాత్రి 8 గంటల సమయంలో అక్రమ జూదం స్థావరంపై దాడి చేశారు. పేకాట ఆడుతున్న ఆదిలాబాద్‌ ప్రాంతానికి చెందిన తొమ్మిది మందిని అదుపులోకి తీసుకున్నారు. నగదుతో పాటు వారి మొబైల్‌ ఫోన్లు, మూడు కార్లను స్వాధీనం చేసుకున్నారు. మొత్తం వీటి విలువ రూ.37లక్షల 24వేల 901గా పేర్కొన్నారు. కొద్ది రోజుల క్రితం జరిగిన ఈ ఘటనపై మహారాష్ట్ర దినపత్రికల్లో ప్రచురితమైనప్పటికీ బయటకు రాలేదు. పోలీసులు సీజ్‌ చేసిన సొత్తును చట్టబద్దంగా కోర్టు ద్వారా విడుదల చేసుకునేందుకు వారు మహారాష్ట్రకు వెళ్లి వస్తుండడం చర్చకు రావడంతో తాజాగా బహిర్గతమైంది. జిల్లాలో పేకాటను పోలీసులు చట్టబద్దంగా నిరోధిస్తున్నారు. ఎస్పీ అఖిల్‌ మహాజన్‌ కఠినంగా వ్యవహరించడంతో కింది స్థాయి సిబ్బంది కూడా స్థావరాలపై ఫోకస్‌ పెంచారు. దీంతో జూదరులకు ఇక్క డ చెక్‌పడింది. అయితే ముందు నుంచి సరి హద్దు మహారాష్ట్ర ప్రాంతాలకు జిల్లావాసులు పలు వురు పేకాట,మట్కా వంటివి ఆడేందుకు వెళ్తుంటారు. అక్కడ అనుమతి తీసుకొని స్థావరాలు ఏర్పాటు చేసుకున్నారు.

అనుమతులు లేవని తేలడంతో..

పాండ్రకౌడ కేసులో పోలీసుల దాడి ఏకంగా అక్కడి ఎస్పీ కుమార్‌ చింతా, అదనపు ఎస్పీ అశోక్‌ థోరత్‌, ఏఎస్పీ రాబిన్‌ బన్సాల్‌ పర్యవేక్షణలో నిర్వహించ డం గమనార్హం.రిసార్ట్‌లో పేకాటాడుతుండగా దాడి చేసి రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుకున్నారు. పట్టుబడి న వారిని తనిఖీ చేయడంతో పాటు వారి వద్ద ఎ లాంటి చట్టబద్ధమైన అనుమతి లేదని నిర్ధారించుకు ని కేసు నమోదు చేశారు. దర్యాప్తు కొనసాగిస్తున్నారు.

కార్లలో వెళ్లి..

సరిహద్దు మహారాష్ట్రలోని పట్టణాలకు కార్లలో వెళ్లి అక్కడ వివిధ చోట్ల స్థావరాల్లో పేకాట ఆడుతున్నారు. ఇలా ఆదిలాబాద్‌ పట్టణం నుంచి పలు వురు నిత్యం అక్కడికి వెళ్తున్నారు. గత జూలైలో పాండ్రకౌడ పోలీసులు పట్టుకున్న తొమ్మిది మంది జేబులో ఉన్న డబ్బు సీజ్‌ చేసిన పక్షంలో అంతగా పట్టించుకునేవారు కాదు. వారికి సంబంధించి విలుౖ వెన మొబైల్‌ ఫోన్లు, ఖరీదైన మూడు కార్లను సీజ్‌ చేశారు. వాటి విలువ లక్షల్లో ఉండడంతో వారు లబోదిబోమనే పరిస్థితి నెలకొంది.

ఇవే అడ్డాలు..

జిల్లాకు సరిహద్దున గల మహారాష్ట్రలోని తిప్పేశ్వర్‌, కిన్వట్‌, పాఠన్‌బోరి, ఇతర ప్రాంతాల్లో రిసార్టులు, లాడ్జిలు, గెస్ట్‌హౌస్‌లను ఇక్కడి నుంచి వెళ్తున్నవారు అద్దెకు తీసుకొని అడ్డాలుగా చేసుకుంటున్నారు. ఇక్కడి వారు చాలా మంది కార్లలో వెళ్తూ వస్తున్నారు. దొరికినప్పుడే దొంగ అన్నట్టు.. తిప్పేశ్వర్‌ గేట్‌ వద్ద రిసార్ట్‌లో పోలీసుల దాడితో జిల్లాకు చెందిన పలువురు పట్టుబడడంతో రెగ్యులర్‌గా వెళ్లే మిగతా వారు అలెర్టయ్యారు. సొమ్ముతో పాటు సొత్తు కూడా సీజ్‌ చేస్తుండడంతో హైరానా చెందుతున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement