TS Adilabad Assembly Constituency: TS Election 2023 పోలింగ్‌శాతం పెంపుపై ప్రత్యేక దృష్టి : కలెక్టర్‌ రాహుల్‌ రాజ్‌
Sakshi News home page

TS Election 2023 పోలింగ్‌శాతం పెంపుపై ప్రత్యేక దృష్టి : కలెక్టర్‌ రాహుల్‌ రాజ్‌

Aug 17 2023 12:38 AM | Updated on Aug 17 2023 7:14 AM

- - Sakshi

ఆదిలాబాద్‌: రానున్న ఎన్నికల్లో పోలింగ్‌ శాతం పెంచేందుకు ప్రత్యేక దృష్టి సారిస్తున్నట్లు కలెక్టర్‌ రాహుల్‌ రాజ్‌ అన్నారు. త్వరలో అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో హైదరాబాద్‌ నుంచి రాష్ట్ర సంయుక్త ప్రధాన ఎన్నికల అధికారి సర్పరాజ్‌ అహ్మద్‌ బుధవారం వీడియో కాన్పరెన్స్‌ నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్‌ మాట్లాడుతూ, గత ఎన్నికల్లో తక్కువగా పోలింగ్‌ శాతం నమోదైన ప్రాంతాలను గుర్తించామన్నారు.

అక్కడ పోలింగ్‌శాతం మెరుగుపరిచేందుకు ప్రత్యేక ప్రణాళికతో ముందుకు సాగుతున్నామన్నారు. ఓటరు లింగ నిష్పత్తి తక్కువ ఉన్న ప్రాంతాల్లో మహిళా ఓటర్ల నమోదుపై దృష్టి సారిస్తున్నామని తెలిపారు. జిల్లాలో ఎన్నికల కమిషన్‌ ఆదేశాల మేరకు స్వీప్‌ కార్యక్రమాలను ప్రణాళికాబద్ధంగా అమలు చేస్తున్నామని వివరించారు. కార్యక్రమంలో అదనపు కలెక్టర్‌ శ్యామలాదేవి, ఎన్నిక ల విభాగం పర్యవేక్షకురాలు నలందప్రియ, డీవైఎస్‌వో వెంకటేశ్వర్లు, తహసీల్దార్‌ శ్రీనివాస్‌ పాల్గొన్నారు.

Advertisement
 
Advertisement
Advertisement