breaking news
Konda surekha
-
కొండా ఫ్యామిలీ ఎపిసోడ్.. కాంగ్రెస్, రేవంత్‌కు నష్టమేనా?
గజం మిథ్య, పలాయనం మిథ్య అని నానుడి. తెలంగాణ కాంగ్రెస్ పార్టీలో కొన్ని ఘటనలు ఇలానే ఉంటాయి. మంత్రి కొండా సురేఖ వివాదమే ఇందుకు ప్రత్యక్ష ఉదాహరణ. ఏదో జరిగిపోతుందన్న భావన ముందు కలుగుతుంది. ఆ తర్వాత పరిస్థితి.. అసలేమీ జరగలేదేమో అనేలా మారుతుంది. టాస్క్ ఫోర్స్ పోలీసులు అర్ధరాత్రి వేళ కొండా సురేఖ నివాసానికి వెళ్లడం, ఓఎస్డీ సుమంత్‌ను అదుపులోకి తీసుకునే ప్రయత్నం చేయడం ఆ తరువాత మంత్రి స్వయంగా అతడిని కారులో ఎక్కించుకుని రక్షించడం, అదే టైమ్‌లో సురేఖ కుమార్తె సుస్మిత ముఖ్యమంత్రి, మరికొందరు మంత్రులపై తీవ్ర వ్యాఖ్యలు చేయడం మనందరం చూశాము.ఆ తరువాత మంత్రివర్గ సమావేశానికి గైర్హాజరయ్యారు సురేఖ. పార్టీ అధిష్టానం ప్రతినిధి మీనాక్షి నటరాజన్, పీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్, ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క ప్రభృతులు జోక్యం చేసుకుని రేవంత్, కొండా దంపతుల మధ్య రాజీ కుదిర్చి పరిస్థితిని అదుపు చేశారు. కాంగ్రెస్ నేతలంతా గప్ చుప్ అయిపోయారు. అయితే విపక్షం ఊరుకోదు కదా! తెలంగాణలో గన్ కల్చర్ పెరిగిపోయిందని, ముఖ్యమంత్రిపై సురేఖ కూతురు సుస్మిత చేసిన ఆరోపణల మాటేమిటి? అంటూ బీఆర్ఎస్, బీజేపీలు ధ్వజమెత్తాయి. మంత్రి కొండ సురేఖ విషయం ఎందుకంత సీరియస్ అయింది? ఆ తర్వాత ఎలా సద్దుమణిగింది అన్నది ఆసక్తికరమైన అంశమే. ప్రాంతీయ పార్టీల్లో ఎవరైనా సీఎంపై తీవ్ర విమర్శలు చేస్తే ఆ వ్యక్తి పదవి పోయినట్లే. కాంగ్రెస్‌లో అలా ఉండదు. ఢిల్లీలోని హైకమాండ్ పెద్దలను ఏమీ అనకుండా, రాష్ట్ర స్థాయిలో ఎవరు, ఎవరిని విమర్శించుకున్నా పెద్దగా పట్టించుకోరు. కాకపోతే పిలిచి మాట్లాడి రాజీలు చేస్తుంటారు. దేశంలో కాంగ్రెస్ పరిస్థితి ఇందుకు కారణం కావచ్చు. అయితే సురేఖ వ్యవహారంలో కాంగ్రెస్ పార్టీ, రేవంత్ రెడ్డిలు అప్రతిష్ట పాలయ్యారు. మంత్రి సురేఖ తొలుత ఆత్మరక్షణలో పడినప్పటికీ, ఆ తర్వాత వ్యూహాత్మకంగా రాజీ కుదుర్చుకోవడం ద్వారా పదవిని నిలబెట్టుకున్నారని భావించాలి. జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక జరుగుతున్న సమయం కావడం, బీసీలకు కాంగ్రెస్ ప్రాధాన్యం ఇస్తోందన్న భావన కలిగించే యత్నం చేస్తున్న తరుణంలో ఒక బీసీ మంత్రిని పదవి నుంచి తప్పిస్తే రాంగ్ సంకేతాలు వెళతాయన్న అభిప్రాయం కూడా ఇందులో ఉండవచ్చు.సీనియర్ నేత, మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి నియోజకవర్గంలో ఒక సిమెంట్ కంపెనీ యాజమాన్యం నుంచి డబ్బులు వసూలు చేయడానికి సురేఖ ఓఎస్డీ సుమంత్ తుపాకితో బెదిరించారన్న ఫిర్యాదు వచ్చింది. అతనితోపాటు మరో కాంగ్రెస్ నేత రోహిత్ రెడ్డి కూడా అక్కడే ఉన్నారని చెబుతున్నారు. ఈ సమాచారం ఆధారంగా సీఎం ఆఫీస్ వెంటనే సుమంత్‌ను ఉద్యోగం నుంచి తొలగిస్తూ ఆదేశాలు ఇచ్చింది. తనకు చెప్పకుండా ఎలా చేస్తారన్నది సురేఖ ప్రశ్న. గతంలో పలుమార్లు హెచ్చరించినా మంత్రి పట్టించుకోలేదన్నది రేవంత్ కార్యాలయ వర్గాల వాదన. ఆ తర్వాత పోలీసులు సుమంత్ అరెస్టుకు ప్రయత్నించారు. మంత్రి ఇంటిలోనే రక్షణ పొందుతున్నారని తెలుసుకుని అక్కడకు వెళ్లారు. అది తీవ్ర కలకలం రేపింది. కానీ, సురేఖ పోలీసులకు అవకాశం ఇవ్వకుండా ఓఎస్డీని అక్కడ నుంచి తీసుకువెళ్లిపోయారు. సహ మంత్రుల వద్దకు వెళ్లి ఆమె దీనిపై తన వాదన వినిపించారని వార్తలు వచ్చాయి. కాంగ్రెస్‌లో కీలక పాత్ర పోషిస్తున్న కొందరిని కలిసినట్లు వార్తలు వచ్చాయి.హోంశాఖ బాధ్యతలు కూడా నిర్వహిస్తున్న రేవంత్ రెడ్డి కావాలనే ఇలా చేశారన్నది సురేఖ వర్గం ఆరోపణగా ఉంది. సురేఖ కుమార్తె ఈ విషయాన్ని నేరుగా ప్రస్తావించి పలు ఆరోపణలు గుప్పించడం రేవంత్‌కు ఇరకాటంగా మారింది. రేవంత్ రెడ్డి, మరో మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి, సలహాదారు వేం నరేంద్ర రెడ్డి, తదితరులపై ఆమె తీవ్ర విమర్శలు చేశారు. రేవంత్ రెడ్డి సోదరుల పేర్లు చెప్పి మరో ఆరోపణ సంధించారు. తన తల్లి సురేఖను అరెస్టు చేయాలని చూస్తున్నారని ఆమె అన్నారు. ఏకంగా రెడ్లు తమపై కుట్ర చేస్తున్నారని ధ్వజమెత్తారు. మేడారం వద్ద అభివృద్ది పనుల కాంట్రాక్టులు, దేవాదాయ శాఖకు సంబంధించిన భూముల వివాదం మొదలైన విషయాలలో ఏర్పడిన అభిప్రాయ బేధాలు ఈ వర్గ పోరుకు కారణం అయ్యాయని చెబుతున్నారు.వరంగల్ కాంగ్రెస్ వర్గ రాజకీయాలలో కూడా ఇదే తరహా గొడవలు నడుస్తుండటం, వారి మద్య రాజీ చేయడానికి పీసీసీ కృషి చేయడం, అవేవి ఒక కొలిక్కి రాకముందే ఈ పరిణామం సంభవించడం కాంగ్రెస్‌కు చికాకు అయింది. తదుపరి మీనాక్షి సమక్షంలో సురేఖ తన వాదన వినిపించి వచ్చారు. కాగా, తమ కుమార్తె సుస్మిత ముఖ్యమంత్రి రేవంత్‌పై చేసిన ఆరోపణలను పట్టించుకోవద్దని, ఆవేశంలో అన్న మాటలు అని మంత్రి భర్త, ఎమ్మెల్సీ మురళీ సర్దిచెప్పే యత్నం చేశారు. సురేఖ మంత్రి పదవి వదలుకోవాల్సి వస్తుందేమో అన్న ప్రచారం జరిగింది. కానీ, ఆమె వ్యూహాత్మకంగా వ్యవహరించి ప్రస్తుతానికి ఆ ఇబ్బంది నుంచి బయటపడ్డారని అనిపిస్తుంది. కొండా దంపతులు స్వయంగా రేవంత్‌ను కలిసి శాలువా కప్పారు. ఆయన ముఖ్యమంత్రి కావాలని తాము కోరుకున్న విషయాన్ని గుర్తు చేశారట. ఓఎస్డీని దూరం పెట్టండని రేవంత్ సూచించారట. తమ కుమార్తె చేసిన విమర్శలు ఆవేశంలో చేసినవని వీరు విచారం వ్యక్తం చేశారట. పీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్, ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క ఈ ప్రాసెస్‌లో కీలక భూమిక పోషించినట్లుగా ఉంది. కానీ, ఒకసారి విభేదాలు పొడసూపాక అవి అంత తేలికగా పోవు. కాంగ్రెస్‌లో సద్దుమణిగినప్పటికీ, పలు ప్రశ్నలు అటు రాజకీయ వర్గాలలోను, ఇటు ప్రజలలోను మిగిలే ఉంటాయి!.ఇంతకీ సుమంత్ గన్ తో బెదిరించారా లేదా? దానిపై వచ్చిన ఫిర్యాదును హ్యాండిల్ చేయడంలో రేవంత్ కార్యాలయం విఫలమైందా? అర్దరాత్రి వేళ మంత్రి ఇంటికి పోలీసులను పంపించడం తప్పు అన్న అభిప్రాయం కాంగ్రెస్ ముఖ్యనేతలలో, అధిష్టానంలో కలిగిందా? మంత్రి సురేఖ ఒక కేసులో నిందితుడికి ఆశ్రయం కల్పించడం తప్పా? కాదా? మొదలైన ప్రశ్నలన్ని అలాగే ఉండిపోయాయి. కొండా సురేఖ దంపతుల రాజకీయ ప్రస్థానం అంతా ఎప్పుడూ వివాదాలు, గ్రూపుల గొడవలు, ప్రత్యర్ధి రాజకీయ పార్టీలతో ఘర్షణలతోనే సాగిందని చెప్పాలి. సురేఖ, మురళీలు తొలుత కాంగ్రెస్ లోనే ఉండేవారు. అప్పట్లో టీడీపీలో ఉన్న ఎర్రబెల్లి దయాకరరావుతో తీవ్రంగా ఘర్షణ పడేవారు. కాంగ్రెస్ వర్గ రాజకీయాలలో దివంగత నేత వైఎస్ రాజశేఖరరెడ్డికి మద్దతుగా ఉండేవారు. వైఎస్ ఆకస్మిక మరణం తర్వాత ముఖ్యమంత్రి రోశయ్యతో సరిపడలేదు. అంతలో వైఎస్ జగన్ సొంత పార్టీ పెట్టుకోవడంతో ఆమె ఈ పార్టీలోకి వచ్చారు.ఎమ్మెల్యే పదవిని కూడా వదలుకున్నారు. తదుపరి వచ్చిన ఉప ఎన్నికలో పోటీ చేసి స్వల్ప తేడాతో టీఆర్ఎస్ చేతిలో ఓడిపోయారు. కొంతకాలం టీఆర్ఎస్కు వ్యతిరేకంగా పోరాటాలు సాగించేవారు. మళ్లీ పరిణామాలు మారడంతో ఆమె వైఎస్సార్సీపీకి దూరమయ్యారు. రాష్ట్ర విభజన జరగడంతో ఆమె టీఆర్ఎస్కు దగ్గరవడం, వరంగల్ తూర్పు నియోజకవర్గం నుంచి పోటీచేసి గెలుపొందారు. అయినా కొండా వర్గం ఆశించినట్లుగా సురేఖ మంత్రి కాలేకపోయారు. తదుపరి టీఆర్ఎస్పైన, ఆనాటి ముఖ్యమంత్రి కేసీఆర్‌పైన విమర్శలు చేసి మళ్లీ కాంగ్రెస్ వైపు పయనించారు. కాంగ్రెస్‌కు కూడా జిల్లాలో గట్టిగా నిలబడే నాయకత్వం అవసరమైంది. అది కొండా దంపతులకు కలిసి వచ్చింది. 2023లో కాంగ్రెస్ నుంచి పోటీచేసి గెలిచారు. తదుపరి రేవంత్ మంత్రివర్గంలో మంత్రి అయ్యారు.ఈ ప్రస్థానంలో మంత్రి సురేఖ ప్రజలకు కనిపించే ఫేస్ అయితే, వెనుక ఆమె భర్త మురళీ చేసే రాజకీయమే కీలకం అని చెబుతారు. అనేక ఒడిదుడుకులు ఎదుర్కుని మూడు దశాబ్దాలుగా వరంగల్ జిల్లా రాజకీయాలలో తమదైన శైలిలో ఒక ప్రముఖ పాత్రను పోషించడం కొండ దంపతుల విశిష్టత. ఏతావాతా ఈ మొత్తం ఎపిసోడ్లో అటు రేవంత్‌కు, ఇటు సురేఖకు నష్టం జరిగాయని చెప్పక తప్పదు. కాంగ్రెస్ పార్టీ ప్రజలలో కొంత పలచన అవడానికి కూడా ఇది దోహద పడిందని అంగీకరించాలి.- కొమ్మినేని శ్రీనివాసరావు, సీనియర్ జర్నలిస్ట్, రాజకీయ వ్యవహారాల వ్యాఖ్యాత. -
సీఎం రేవంత్‌రెడ్డితో కొండా సురేఖ దంపతుల భేటీ
సాక్షి, హైదరాబాద్: సీఎం రేవంత్‌రెడ్డిపై కొండా సురేఖ దంపతులు భేటీ అయ్యారు. సమావేశంలో డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, పీసీసీ చీఫ్ మహేష్‌గౌడ్ పాల్గొన్నారు. ఇటీవల సురేఖ కూతురు సుస్మిత చేసిన వ్యాఖ్యలు కలకలంగా రేపిన సంగతి తెలిసిందే. ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి, సలహాదారు వేం నరేందర్‌రెడ్డి తదితరులు తన తల్లిదండ్రులపై కుట్ర చేస్తున్నారంటూ సుస్మిత ఘాటైన విమర్శలు చేశారు.కొండా సురేఖ, మురళికి ఏం జరిగినా పరిణామాలు తీవ్రంగా ఉంటాయని కూడా ఆమె హెచ్చరించారు. దీంతో ఇటు కాంగ్రెస్ పార్టీలో.. అటు అధికారవర్గాల్లో ఆమె వ్యాఖ్యలు దుమారం రేపాయి. -
కాంగ్రెస్ సర్కారుకు తిప్పలు తెచ్చి పెట్టిన కొండా సురేఖ ఓఎన్డీ వ్యవహారం
-
‘కొండా’ వివాదం సమసినట్లేనా?
సాక్షిప్రతినిధి, వరంగల్ : సంచలనంగా మారిన మంత్రి కొండా సురేఖ దంపతులు, ఆమె కూతురు సుస్మిత వ్యాఖ్యల వివాదం సమసినట్లేనా.. ఈ వివాదంపై కాంగ్రెస్ పార్టీ అధిష్టానం ఏం నిర్ణయం తీసుకోబోతుంది.. హైదరాబాద్ జూబ్లీహిల్స్‌లోని కొండా సురేఖ ఇంటికి టాస్క్‌ఫోర్స్ పోలీసులు ఎందుకు వెళ్లారు.. ఈ సందర్భంగా సుస్మిత చేసిన వ్యాఖ్యల పర్యవసానం ఏమిటి.. ఇంతకీ వివాదానికి కారణమైన మాజీ ఓఎస్డీ సుమంత్ ఎక్కడ.. కాంగ్రెస్ రాష్ట్ర వ్యవహారాల ఇన్చార్జ్ మీనాక్షి నటరాజన్, డిప్యూటీ సీఎం భట్టిని కలిసిన సురేఖ.. కీలకమై కేబినెట్ మీటింగ్‌కు ఎందుకు వెళ్లలేదు?.. ఇవన్నీ ఇప్పుడు పొలిటికల్ సర్కిల్లో హాట్‌టాపిక్‌గా మారాయి. 48 గంటలుగా తాజా రాజకీయ పరిణామాలు వరంగల్‌ను హీటెక్కించాయి.సుమంత్ కోసం పోలీసులు..కలకలం రేపిన సుస్మిత వ్యాఖ్యలు..మంత్రులు కొండా సురేఖ, పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి మధ్య విభేదాలు పక్కన పెడితే... మాజీ ఓఎస్డీ సుమంత్ కోసం టాస్క్‌ఫోర్స్ పోలీసులు వెళ్లడం.. అక్కడ సురేఖ కూతురు సుస్మిత చేసిన వ్యాఖ్యలు కలకలంగా మారాయి. ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి, సలహాదారు వేం నరేందర్‌రెడ్డి తదితరులు తన తల్లిదండ్రులపై కుట్ర చేస్తున్నారంటూ సుస్మిత ఘాటైన విమర్శలు చేశారు. కొండా సురేఖ, మురళికి ఏం జరిగినా పరిణామాలు తీవ్రంగా ఉంటాయని కూడా ఆమె హెచ్చరించారు. దీంతో ఇటు కాంగ్రెస్ పార్టీలో.. అటు అధికారవర్గాల్లో ఆమె వ్యాఖ్యలు దుమారం రేపాయి. ఇదే సమయంలో వరంగల్‌లో మీడియాతో మాట్లాడిన కొండా మురళీధర్ సీఎం రేవంత్‌రెడ్డితో తమకు విభేదాలు లేవని, తనకు ఎమ్మెల్సీ కూడా ఇస్తామని చెప్పారన్నారు. సుస్మిత ఎక్కడ.. ఎప్పుడు.. ఏం మాట్లాడింది తనకు తెలియదని కొట్టిపారేశారు. మాజీ ఓఎస్డీ సుమంత్ కోసం టాస్క్‌ఫోర్స్ పోలీసులు ఎందుకు వెళ్లారు? ఇంతకీ అతను ఎక్కడ ఉన్నాడు? ప్రభుత్వం తదుపరి ఏం చేయబోతుంది? అనే అంశాలపై ఇంకా సస్పెన్స్ కొనసాగుతోంది.కేబినెట్‌కు ఎందుకు వెళ్లలేదు..అసలేం జరుగుతోంది..?రెండు రోజులుగా జరుగుతున్న వివాదాల నేపథ్యంలో గురువారం జరిగిన కీలకమైన మంత్రివర్గ సమావేశానికి మంత్రి కొండా సురేఖ హాజరుకాకపోవడం హాట్‌టాపిక్‌గా మారింది. పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇన్చార్జ్ మీనాక్షి నటరాజన్‌ను కలిసిన కొండా సురేఖ, ఆమె కూతురు సుస్మిత.. టీపీసీసీ చీఫ్ బొమ్మ మహేశ్‌కుమార్ గౌడ్‌తో కూడా భేటీ అయ్యారు. ఆ తర్వాత డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్కను కూడ కలిసినట్లు మీడియాలో వార్తలు వచ్చాయి. మీనాక్షి నటరాజన్, మహేశ్‌కుమార్‌లను కలిసిన కొండా సురేఖ.. 48 గంటల్లో జరిగిన పరిణామాలను వివరించినట్లు తెలిసింది. పార్టీపరంగా, కొందరు ప్రజాప్రతినిధుల వల్ల తమకెదురవుతున్న ఇబ్బందులను వారి దృష్టికి తీసుకెళ్లినట్లు కూడా మీడియాతో మాట్లాడిన సురేఖ స్పష్టం చేశారు. ఇదిలా ఉంటే.. మీనాక్షి నటరాజన్, మహేశ్‌కుమార్‌తో భేటీ అయిన సురేఖ, ఆ తర్వాత జరిగిన కేబినెట్ మీటింగ్‌కు హాజరుకాకపోవడం కొత్త వివాదానికి తెర తీసింది. అసలు కాంగ్రెస్ పార్టీ పెద్దలతో మాట్లాడిన సురేఖకు వారు ఏమి భరోసా ఇచ్చారు? అక్కడినుంచి కేబినెట్ మీటింగ్‌కు వెళ్లాల్సిన ఆమె ఎందుకు వెళ్లలేదు? కావాలనే వెళ్లలేదా? లేక ఎవరైనా వద్దని చెప్పారా? ఈ నేపథ్యంలో కొండా దంపతులకు ఏమైన ప్రత్యేక వ్యూహం ఉందా? అసలు కాంగ్రెస్ పార్టీలో ఏం జరుగుతోంది..? అన్న అంశాలు అన్ని వర్గాల్లో చర్చనీయాంశమయ్యాయి. -
ఏదైతే అది.. మీనాక్షి మేడంతో మొత్తం చెప్పేశా !
-
పెద్దల వద్దకు ‘కొండా’ పంచాయితీ
సాక్షి, హైదరాబాద్: కాంగ్రెస్ పార్టీలో మంత్రి కొండా సురేఖ కేంద్రంగా చోటు చేసుకున్న పరిణా మాలు కలకలం రేపాయి. కొంతకాలంగా నెల కొన్న వివాదం గురువారం రాత్రి వరకు కొన సాగింది. పరిస్థితి మరీ దిగజారి రచ్చకెక్కకుండా పార్టీ పెద్దలు అతికష్టం మీద నియంత్రించగలి గారు. తనను లక్ష్యగా చేసుకొని పార్టీలో, మంత్రివర్గంలో కుట్రలు జరుగుతున్నాయని భావిస్తున్న మంత్రి సురేఖ గురు వారం పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇన్చార్జి మీనాక్షి నటరాజన్‌తో, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్కతో సమావేశ మై తన వాదన వినిపించారు.అనంతరం పీసీసీ అధ్యక్షుడు మహేష్‌కుమార్ గౌడ్‌తో కూడా చర్చించారు. తనకు మాట మాత్రంగా కూడా చెప్పకుండా తన దగ్గర పనిచేస్తున్న ఓఎస్డీని ప్రభుత్వం తొలగించడాన్ని అవమానకరంగా భావించినట్లు ఆమె వారికి తెలిపినట్లు సమాచారం. పార్టీలో తనపై జరుగుతున్న దాడి గురించి మీనాక్షికి వివరించినట్లు సమాచారం. ఈ క్రమంలో ఆమె మంత్రివర్గ సమావేశానికి కూడా హాజరు కాలేదు. పార్టీ పెద్దల నిర్ణయమే శిరోధార్యం: కొండా మీనాక్షి నటరాజన్‌తో సమావేశం అనంతరం మంత్రి కొండా సురేఖ మీడియాతో మాట్లాడారు. ‘తాజా పరిణామాలపై పార్టీ ఇన్చార్జి, పీసీసీ అధ్యక్షుడు మహేష్మార్ గౌడ్‌తో సుదీర్ఘంగా చర్చలు జరిపినం. ఈ విషయంలో పరిష్కారం కోసం ప్రయత్నం చేస్తామని వారు హామీ ఇచ్చారు. సమస్యను పార్టీ పెద్దలు సెటిల్ చేస్తా మని చెప్పారు. ఇక ఈ విషయం వారే చూసుకుంటారని భరోసా ఉంది’అని పేర్కొన్నారు. నివురుగప్పిన నిప్పులా పరిస్థితి..వరంగల్‌లో మంత్రి పొంగులేటి దేవాదాయ శాఖకు సంబంధించిన కాంట్రాక్టు వ్యవహారాల్లో తలదూరుస్తున్నారనే ఆరోపణలతో మొదలైన వివాదం చిలికి చిలికి గాలివానగా మారింది. మేడారం జాతర అభివృద్ధి పనుల విషయంలో దేవాదాయ శాఖ మంత్రి సురేఖ లేకుండానే సమావేశం జరగడం, ఆ తరువాత సురేఖ ఓఎస్డీ సుమంత్‌ను తొలగించడంతో వివాదం ముదిరింది. మేడారం అభివృద్ధి పనులను దేవా దాయ శాఖ నుంచి రోడ్లు, భవనాల శాఖకు బదలాయించడంతో మంత్రి సురేఖ ప్రమేయం లేకుండానే పనులు జరుగుతున్నాయి. పోలీసులతో వాగ్వాదానికి దిగిన మంత్రి కుమార్తె సుష్మిత.. సీఎం పలువురు మంత్రులపై నేరుగా విమర్శలు చేశారు. బీసీ నాయకురాలైన తన తల్లి పట్ల ఓ వర్గం కక్షపూరితంగా వ్యవహరిస్తోందని చేసిన వ్యాఖ్యలు పార్టీలో దుమారం సృష్టించాయి. -
కొండా సురేఖ, కుమార్తె సుస్మితా పటేల్ విక్రమార్కను కలిసేందుకు ప్రజాభవన్ వెళ్లారు
-
Mahesh Kumar: క్యాబినెట్ భేటీ తర్వాత కొండా సురేఖతో సీఎం రేవంత్‌రెడ్డి మాట్లాడతారు
-
కొండా సురేఖ ఎపిసోడ్.. పీసీసీ చీఫ్ కీలక వ్యాఖ్యలు
సాక్షి, హైదరాబాద్: మంత్రి కొండా సురేఖ అంశంపై పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ కీలక వ్యాఖ్యలు చేశారు. రాష్ట్ర ఇన్ఛార్జ్ దృష్టికి తీసుకెళ్లామన్నారు. ఎక్కడో కమ్యూనికేషన్ లోపంగా కనిపిస్తుందన్నారు. సాయంత్రం లోగా ఈ విషయంపై క్లారిటీ వస్తుందని మహేష్ గౌడ్ అన్నారు.కాగా, సుప్రీం కోర్టు తీర్పుపై మహేష్ గౌడ్ స్పందిస్తూ.. హైకోర్టులో కేసుకి సమయం ఉందని.. వేచి చూస్తామన్నారు. హైకోర్టులోనే తేల్చుకుంటామన్నారు. బీసీ రేజర్వేషన్ అంశం మీద కాంగ్రెస్ పార్టీ కమిట్మెంట్తో ఉందని.. వెనక్కి తగ్గేది లేదంటూ ఆయన స్పష్టం చేశారు. 42 శాతం రిజర్వేషన్ ఇచ్చే ఎన్నికలకు పోవాలనే తపన ఉందని.. హై కోర్టులో పోరాడతామని మహేష్ గౌడ్ చెప్పుకొచ్చారు.కాంగ్రెస్ నేతల ఆస్తుల వివరాలు బయట పెట్టాలి: బీజేపీ చీఫ్మంత్రి కొండా సురేఖ ఎపిసోడ్‌పై బీజేపీ చీఫ్ రామచందర్‌రావు మాట్లాడుతూ.. సిమెంట్ ఫ్యాక్టరీని బెదిరించడంలో పెద్దవారి హస్తముందని కొండ సురేఖ కుటుంబ సభ్యులు చెబుతున్నారని.. దీని వెనుక ఎవరెవరు ఉన్నారో బయట పెట్టాలన్నారు. ‘‘కాంగ్రెస్ అంటేనే కరప్షన్. కాంగ్రెస్ నేతల ఆస్తుల వివరాలు బయట పెట్టాలి. బలవంతంగా కాంగ్రెస్ వసూలు చేస్తుంది. సీఎంపై ఆరోపణలు చేసింది కేబినెట్ మినిస్టర్ కుటుంబ సభ్యులే...దోచుకున్న సొమ్మును పంచుకోలేక దంచుకొని తన్నుకుంటున్నారు. కొండ సురేఖ కుమార్తె మాట్లాడిన విషయంపై విచారణ జరపాలి. దోచుకునే లీడర్లు ఎక్కువ రోజులు ఉండొద్దు. కాంగ్రెస్ నాయకులు తుపాకులు పెట్టి బెదిరిస్తున్నారు. అందుకే కాంగ్రెస్ పార్టీకి జూబ్లీహిల్స్ ప్రజలు ఓటు వేయొద్దు’’ అంటూ రామచంద్రరావు వ్యాఖ్యానించారు. -
కొండా సుస్మిత సంచలన వ్యాఖ్యలు
తన తల్లిదండ్రులకు ఏమైనా హానీ జరిగితే సీఎం రేవంత్‌రెడ్డిదే బాధ్యత అంటున్నారు తెలంగాణ దేవాదాయ, అటవీ శాఖల మంత్రి కొండా సురేఖ (Konda Surekha) కుమార్తె సుస్మిత. మాజీ ఓఎస్డీ సుమంత్‌ను అడ్డం పెట్టుకుని తమను వేధిస్తున్నారని ఆరోపించారు. సుమంత్‌ను అరెస్ట్ చేసేందుకు హైదరాబాద్‌లోని తన ఇంటికి వచ్చిన పోలీసులను ఆమె అడ్డుకున్నారు.బుధవారం రాత్రి ఆమె తన ఇంటి వద్ద మీడియాతో మాట్లాడుతూ.. ''బీసీ లీడర్లను, మమ్మల్ని తొక్కడానికి ట్రై చేస్తున్నారు. ఎక్స్‌టార్సన్ కేసు అంటున్నారు. ఆర్మ్స్ యాక్ట్ కింద మా నాన్నను తీసుకొద్దామని ట్రై చేస్తున్నారని నా డౌట్. ఆ డౌట్లో మాత్రం మానాన్నకు కానీ, మా అమ్మకు కానీ ఎటువంటి హాని జరిగినా పూర్తి బాధ్యత రేవంత్‌రెడ్డి, వేం నరేందర్‌రెడ్డి, కడియం శ్రీహరి, పొంగులేటి శ్రీనివాసరెడ్డి, రోహిన్ రెడ్డిలదే. వీళ్లందరు మాత్రం బాధ్యత వహించాలి. నేను ముందే చెబుతున్నా.ఇది కాంగ్రెసా, తెలుగుదేశమా తెలుస్తలేదండీ. రెడ్ల రాజ్యం నడుస్తోంది. బీసీ నినాదమేమో రాహుల్ గాంధీ (Rahul Gandhi) ఎత్తుకుంటే.. ఇక్కడ బీసీ మంత్రి ఇంటికి టాస్క్‌ఫోర్స్ సీఐ వస్తడా? అసలు ఎక్కడైనా ఉందా? ఎంత సిగ్గుమాలిన చర్య? ఒక ముఖ్యమంత్రి సిగ్గుపడాలి దానికి. ఒక బీసీ లేడీ లీడర్ ఇంటికి రాత్రి తొమ్మిదింటికి ఒక టాస్క్‌ఫోర్స్ సీఐ వచ్చిండంటే ముఖ్యమంత్రి సిగ్గుపడాలి. అయామ్ టెల్లింగ్ ఆన్ మీడియా'' అంటూ సుస్మిత ఫైర్ అయ్యారు. కాగా, నిన్నరాత్రి తాను చేసిన వ్యాఖ్యలను కట్టుబడి ఉన్నానని గురువారం మీడియా ప్రతినిధులకు స్పష్టం చేశారు కొండా సుస్మిత. చదవండి: కొండా సురేఖ వివాదం.. అసలేం జరిగింది? -
‘నా మాటలకు కట్టుబడి ఉన్నా.. ఫోన్ వచ్చింది ఇప్పుడేం మాట్లాడలేను’
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ రాజకీయాల్లో మంత్రి కొండా సురేఖ(konda Surekha) ఎపిసోడ్ తీవ్ర కలకలం సృష్టించింది. ఇక, తాజాగా మరోసారి కొండా సురేఖ కూతురు కొండా సుస్మిత పటేల్ కీలక వ్యాఖ్యలు చేశారు. నిన్న రాత్రి తాను మాట్లాడిన మాటలకు కట్టుబడి ఉంటానని సుస్మిత చెప్పుకొచ్చారు. దీంతో, అధికార కాంగ్రెస్ పార్టీలో మరో ట్విస్ట్ చోటుచేసుకుంది.కొండా సుస్మిత(konda Sushmita) తాజాగా మీడియాతో మాట్లాడుతూ..‘రాత్రి నేను మాట్లాడిన మాటలకు నేను కట్టుబడి ఉన్నాను. అధిష్టానం మాతో మాట్లాడింది. మీడియాలో ఎలాంటి అంశాలపై మాట్లాడవద్దని అదేశాలు ఉన్నాయి. ఇప్పుడు అన్ని విషయాలపై మాట్లాడలేను. ఏం జరిగిందో అందరికీ తెలుసు’ అని కామెంట్స్ చేశారు.మరోవైపు.. మంత్రి కొండా సురేఖకు సైతం రాష్ట్ర కాంగ్రెస్ వ్యవహారాల ఇన్చార్జ్ మీనాక్షి నటరాజన్ నుంచి పిలుపు వెళ్లింది. ఎమ్మెల్యే క్వార్టర్స్‌కి రావాలని సురేఖకు తెలిపారు. మరికాసేపట్లో ఎమ్మెల్యే క్వాటర్స్‌కి మంత్రి కొండా సురేఖ వెళ్ళనున్నారు. కేబినెట్ భేటీకి కూడా కొండా సురేఖ హాజరకానున్నారు. ఇదిలా ఉండగా.. మినిస్టర్ క్వార్టర్స్‌లోని మంత్రి కొండా సురేఖ ఇంటికి ఆమె మాజీ osd సుమంత్ భార్య డాక్టర్ మనిషా చేరుకున్నట్టు తెలుస్తోంది.ఇది కూడా చదవండి: కొండా సురేఖకు బిగ్ షాక్.. -
మంత్రుల వివాదంపై మీనాక్షి నటరాజన్ సీరియస్
-
కొండా సురేఖ వివాదం.. అసలేం జరిగింది?
మంత్రి కొండా సురేఖ వ్యవహారం తెలంగాణలో అధికార కాంగ్రెస్ పార్టీలో తీవ్ర కలకలం రేపింది. తన మాజీ ఓఎస్డీ వ్యవహారంలో ప్రభుత్వం వ్యవహరించిన తీరు పట్ల మంత్రి సురేఖ కోపంగా ఉన్నట్టు కనబడుతోంది. మరోవైపు ప్రభుత్వాన్ని ఇరుకున పెట్టేలా వ్యవహరించిన సురేఖ ఓఎస్డీపై చట్టపరమైన చర్యలకు సర్కారు యత్నిస్తోంది. ఈ నేపథ్యంలో బుధవారం రాత్రి హైదరాబాద్‌లోని తన ఇంటికి వచ్చిన పోలీసులను సురేఖ కుమార్తె సుస్మిత (konda sushmitha) అడ్డుకోవడంతో ఈ వివాదం మరింత ముదిరింది. తమను టార్గెట్ చేశారని, రాష్ట్రంలో రెడ్ల రాజ్యం నడుస్తోందంటూ సుస్మిత మీడియా ముందు ఫైర్ అయ్యారు.మరోవైపు ఈ వ్యవహారం గురించి తనకేమీ తెలియదని మంత్రి సురేఖ భర్త కొండా మురళి హన్మకొండలో చెప్పారు. తమ పార్టీ వ్యవహారాల ఇంచార్జి మీనాక్షి నటరాజన్‌ను కలిసి వివాదం పరిష్కారానికి ప్రయత్నిస్తానని ఆయన చెప్పారు. అదే సమయంలో తన కూతురును ఆయన వెనకేసుకొచ్చారు. కాగా, ఈ వివాదంపై మీనాక్షి నటరాజన్ ఆగ్రహం వ్యక్తం చేసినట్టు మీడియాలో వార్తలు వస్తున్నాయి. అటు ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి (Revanth Reddy) కూడా సురేఖ వ్యవహరించిన తీరు పట్ల సీరియస్‌గా ఉన్నట్టు తెలుస్తోంది. దేవాదాయ శాఖను ఆమె నుంచి తీసేసుకోవాలన్న యోచనలో ఉన్నట్టు సమాచారం.అసలేం జరిగింది? తన నియోజకవర్గం హుజూర్‌నగర్‌లోని డెక్కన్ సిమెంట్స్‌లోని పనిచేస్తున్న ఓ వ్యక్తిని డబ్బుల కోసం కొండా సురేఖ మాజీ ఓఎస్డీ సుమంత్ బెదిరించినట్టు మంత్రి ఉత్తమ్‌కుమార్ రెడ్డి ఫిర్యాదు చేయడంతో అతడిని విధుల నుంచి ప్రభుత్వం తప్పించింది. సుమంత్‌ను అదుపులోకి తీసుకుని విచారించాలని పోలీసులు ప్రయత్నిస్తున్నారు. అతడు సురేఖ ఇంట్లో ఉన్నాడన్న సమాచారంతో బుధవారం రాత్రి అక్కడికి వెళ్లారు. జూబ్లీహిల్స్ గాయత్రిహిల్స్‌లోని తమ ఇంటికి మఫ్టీలో వచ్చిన పోలీసులను సురేఖ కూతురు సుస్మిత అడ్డుకున్నారు. మంత్రి ఇంటికి పోలీసులు ఎలా వస్తారంటూ ప్రశ్నించారు. ఈలోపు ఇంట్లో ఉన్న సురేఖ, సుమంత్ బయటికి వచ్చి కారులో అక్కడి నుంచి వెళ్లిపోయారు. మా ప్రమేయం లేదుఈ నేపథ్యంలో మేడారం జాతర పనులను రోడ్లు భవనాలకు అప్పగిస్తూ ప్రభుత్వ నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఆదేశాలు జారీ చేసినట్టు తెలుస్తోంది. మరోవైపు కొండా సురేఖ (Konda Surekha) వివాదంపై స్పందించేందుకు మంత్రి ఉత్తమ్ కుమార్‌రెడ్డి నిరాకరించారు. డెక్కన్ సిమెంట్ వివాదంలో తన ప్రమేయం లేదని క్లారిటీ ఇచ్చారు. ఇదే వ్యవహారంలో తనపై కొండా సుస్మిత చేసిన వ్యాఖ్యలను ఖైరతాబాద్ డీసీసీ ప్రెసిడెంట్ రోహిన్ రెడ్డి తోసిపుచ్చారు. డెక్కన్ సిమెంట్ వివాదంలో తన ప్రమేయం లేదని అన్నారు.తెలంగాణ కేబినెట్ భేటీసీఎం రేవంత్ రెడ్డి అధ్యక్షతన తెలంగాణ కేబినెట్ (Telangana Cabinet) సమావేశం మధ్యాహ్నం 3 గంటలకు జరగనుంది. బీసీ రిజర్వేషన్ల పెంపు, రైతు భరోసా, మైనింగ్ కొత్త పాలసీ, ట్రో ఫేజ్-2 టెండర్లపై మంత్రి మండలిలో కీలక నిర్ణయం తీసుకునే అవకాశం ఉందని సమాచారం. కొండా సురేఖ వివాదం నేపథ్యంలో కేబినెట్ భేటీపై సర్వత్రా ఆసక్తి నెలకొంది. కాగా, సురేఖకి మీనాక్షి నటరాజన్ ఫోన్ చేసి క్యాబినెట్ మీటింగ్‌కు హాజరు కావాలని కోరినట్టు తెలుస్తోంది. చదవండి: నన్ను తిట్టినవాళ్లే నాకోసం వస్తున్నారుపొంగులేటిపై ఫిర్యాదు!అంతకుముందు మేడారం పనుల టెండర్ల విషయంలో మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డిపై జాతీయ అధ్యక్షుడు మల్లిఖార్జున ఖర్గేతో పాటు సీఎం రేవంత్ రెడ్డికి కొండా సురేఖ ఫిర్యాదు చేసినట్టు వార్తలు వచ్చాయి. తన శాఖకు సంబంధించిన రూ. 71 కోట్ల విలువైన పనులను తనవాళ్లకు ఇప్పించుకునేందుకు పొంగులేటి ప్రయత్నిస్తున్నారని సురేఖ ఆరోపించినట్టు తెలుస్తోంది. అప్పటి నుంచి పొంగులేటితో ప్రభుత్వ కార్యక్రమాలకు ఆమె దూరంగా ఉంటున్నారు. మహేష్ గౌడ్ క్లారిటీమంత్రి కొండా సురేఖ వివాదంపై పీసీసీ ప్రెసిడెంట్ మహేష్ గౌడ్ స్పందించారు. ఈ వ్యవహారాన్ని తాను మీనాక్షి నటరాజన్, సీఎం రేవంత్ రెడ్డి దృష్టికి తీసుకెళ్లినట్టు చెప్పారు. ఎక్కడో కమ్యూనికేషన్ లోపం కనిపిస్తుందని, తొందరలో క్లారిటీ వస్తుందని మీడియా ప్రతినిధులతో చెప్పారు. -
కొండా సురేఖకు బిగ్ షాక్?
తెలంగాణ రాజకీయాల్లో మరో కీలక పరిణామం చోటుచేసుకుంది. కొండా సురేఖను దేవాదాయశాఖ నుంచి తప్పించేందుకు రేవంత్ రెడ్డి నిర్ణయం తీసుకున్నారు... -
నా బిడ్డ మాట్లాడిందే కరెక్ట్.. తప్పంతా వాళ్లదే..
-
కొండా సురేఖ ఎపిసోడ్ పై సీఎం రేవంత్..
-
కొండా సురేఖ ఎక్కడికి వెళ్ళింది
-
KSR Live Show: అరెస్ట్ కు స్కెచ్! చిక్కుల్లో కొండా సురేఖ..
-
కొండా సురేఖ, సుమంత్ ఎపిసోడ్ పై స్పందించిన కొండా మురళి
-
కొండా సుస్మిత ఎపిసోడ్.. స్పందించిన రోహిన్ రెడ్డి
సాక్షి, హైదరాబాద్: తెలంగాణలో జూబ్లీహిల్స్‌లో ఉన్న మంత్రి కొండా సురేఖ(konda Surekha) ఇంటి పోలీసులు వెళ్లడంపై బుధవారం రాత్రి హైడ్రామా నెలకొంది. ఈ సందర్బంగా పోలీసులు, డెక్కన్ సిమెంట్, రోహిన్ రెడ్డిపై(Congress DCC Rohin Reddy) కొండా సురేఖ కూతురు కొండా సుస్మిత(Konda Sushmitha) సంచలన వ్యాఖ్యలు చేశారు. ఈ ఎపిసోడ్‌పై తాజాగా ఖైరతాబాద్ డీసీసీ అధ్యక్షుడు రోహిన్ రెడ్డి స్పందించారు.కొండా సుస్మిత పటేల్ ఆరోపణలను రోహిన్ రెడ్డి ఖండించారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ..‘నాపై ఎలాంటి విచారణ అయినా చేసుకోవచ్చు. మంత్రి కొండా సురేఖ మాజీ ఓఎస్డీ సుమంత్ అప్పుడప్పుడు నా దగ్గరికి వచ్చేవాడు. డెక్కన్ సిమెంట్స్ అంశం చెప్తే నేను ఇలాంటి వాటిలో వేలు పెట్టను అని సుమంత్‌కి ముందే చెప్పి పంపేశాను. నేను ఎలాంటి అసాంఘిక పనుల్లో తల దూర్చను.. ఈ విషయంలో నా ప్రమేయం లేదు’ అని చెప్పుకొచ్చారు.సుస్మిత ఆరోపణలు..ఇక, అంతకుముందు.. కొండా సుస్మిత సంచలన వ్యాఖ్యలు చేశారు. సుస్మిత మాట్లాడుతూ.. సుమంత్‌పై మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి ఫిర్యాదు ఇచ్చారని తెలిసింది. డెక్కన్ సిమెంట్ వాళ్లను సుమంత్ గన్‌తో బెదిరించారని ఫిర్యాదు ఇచ్చారు. మంత్రి ఉత్తమ్ ఫిర్యాదుతో అరెస్టు చేసేందుకు వచ్చామని పోలీసులు తెలిపారు. ఆధారాలు ఉంటే చూపించాలని పోలీసులను అడిగాను. ఆధారాలు అడిగితే వరంగల్ నమోదైన మరో కేసులో అరెస్టు చేసేందుకు వచ్చామని అన్నారు. మమ్మల్ని పార్టీలోంచి బహిష్కరించేందుకు చూస్తున్నారు’ అని చెప్పుకొచ్చారు. ఇదే సమయంలో కాంగ్రెస్ నేత రోహిణ్ రెడ్డి కూడా ఈ ఎపిసోడ్లో ఉన్నారని ఆరోపించారు. ఆయన వెనుక ముఖ్యమంత్రి పాత్ర కూడా ఉందా? అంటూ ప్రశ్నించారు. సుమంత్‌ను అడ్డం పెట్టుకుని తన తల్లిని అరెస్టు చేసేందుకే మహిళా పోలీసులు కూడా వచ్చారంటూ కామెంట్స్ చేశారు.బీసీ లీడర్లయిన తమ తల్లిదండ్రుల్ని పార్టీ నుంచి బహిష్కరించేందుకు యత్నిస్తున్నారని ఇదంతా రెడ్డి నాయకులు చేస్తున్న కుట్రగా తెలుస్తోందని కొండా సుస్మిత ఆరోపించారు. ఈ మొత్తం వ్యవహారం వెనుక వేం నరేందర్ రెడ్డి, కడియం శ్రీహరి, రోహిణ్ రెడ్డి, ఉత్తమ్ కుమార్‌రెడ్డి, పొంగులేటి శ్రీనివాస రెడ్డి సహా ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి కూడా ఉన్నారంటూ తీవ్ర ఆరోపణలు చేశారు. మాజీ నక్సలైట్ అయిన తన తండ్రికి హాని ఉన్నప్పటికీ బందోబస్తును తొలగించారని అలాంటప్పుడు సీఎం సోదరులకు మాత్రం గన్మెన్లు ఎందుకని ఆమె ప్రశ్నించారు. -
రేవంతన్నతో గొడవల్లేవ్.. నా బిడ్డ అందుకే అలా మాట్లాడింది: కొండా మురళి
సాక్షి, వరంగల్: తెలంగాణ మంత్రి కొండా సురేఖ ఓఎస్డీ(మాజీ) సుమంత్ వ్యవహారం రాష్ట్రవ్యాప్తంగా తీవ్ర చర్చనీయాంశంగా మారింది. దీనికి తోడు గత అర్ధరాత్రి హైదరాబాద్‌లోని ఆమె నివాసం వద్దకు పోలీసులు రావడం, సురేఖ కూతురు సుస్మిత వాళ్లతో వాగ్వాదానికి దిగడం, ఈ క్రమంలో సంచలన ఆరోపణల చేయడం తెలిసిందే. అయితే ఈ వ్యవహారంపై మాజీ ఎమ్మెల్సీ, సురేఖ భర్త కొండా మురళి స్పందించారు. సుమంత్ వ్యవహారం, కూతురు సుస్మిత వ్యాఖ్యలపై కొండా మురళి గురువారం ఉదయం ప్రెస్‌మీట్ నిర్వహించి స్పందించారు. ‘‘హైదరాబాద్‌లో ఏం జరుగుతుందో నాకు తెలియదు సుమంత్ వ్యవహారంలోనూ ఏం జరుగుతుందో తెలియదు. సెక్రటేరియట్లో కొండా సురేఖ మంత్రి కార్యాలయానికి నేను ఒక్కసారే వెళ్ళాను. అక్కడ ఏం జరుగుతుందో కూడా నాకు తెలియదు.నా బిడ్డకు(సుస్మితను ఉద్దేశించి..) మాట్లాడే స్వేచ్ఛ ఉంది. తాను ఇబ్బంది పడ్డాడని చెప్పింది. అందుకే అలా మాట్లాడి ఉంటుంది. రేవంతన్న సీఎం కావాలని నేను, సురేఖ కష్టపడ్డాం. నాకు ఎమ్మెల్సీ ఇస్తానని రేవంతన్న హామీ ఇచ్చారు. తప్పకుండా ఇస్తారు కూడా. మా మధ్య ఎలాంటి విభేదాలు లేవు. ఎవరైనా సృష్టిస్తే మాకు సంబంధం లేదు. అందరి మంత్రుల ఇండ్లకు వెళ్లి మాట్లాడే సాన్నిహిత్యం నాకు ఉంది. నేను మంత్రుల వద్దకు వెళ్తాను. పోలీసులు మంత్రి ఇంటికి ఎందుకు వచ్చారో తెలుసుకుని అడుగులు వేస్తా. పీసీసీ అధ్యక్షుడు, సీఎం రేవంత్ అన్నతో మాట్లాడి సమస్య సాల్వ్ అయ్యేలా చేస్తా. ఎవరి తప్పు ఉన్నా, సమస్యకు ఫుల్ స్టాప్ పడేలా చూస్తా. మీడియా ముందు మాట్లాడొద్దని మీనాక్షి నటరాజన్ చెప్పారు. మళ్ళీ మీనాక్షి గారిని కలిసి అన్ని విషయాలు మాట్లాడతా. మీనాక్షి అమ్మ చెప్పినట్లు వింటాను... నన్ను తిట్టిన వల్లే మళ్ళీ నా కోసం వస్తున్నారు. పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి కాంట్రాక్ట్ పనులు కోసం నా దగ్గరకు వచ్చిన వాడే. వేం నరేందర్ రెడ్డి(సీఎం సలహాదారు) నేను కామన్ గా కలుస్తుంటాం. నేను ఎవరికీ టార్గెట్ కాను, నాకు ఎవరూ టార్గెట్ లేరు. నన్ను టార్గెట్ చేస్తే వాళ్ళకే నష్టం అని మురళి అన్నారు.ఇదిలా ఉంటే.. తెలంగాణ కాంగ్రెస్‌లో కొండా ఫ్యామిలీ ప్రకంపనలు కొనసాగుతున్నాయి. మాజీ ఓస్డీని అర్ధరాత్రి తన కారులో మంత్రి కొండా సురేఖ తీసుకెళ్లారనే ప్రచారం జరుగుతోంది. దీనిపై కొండా మురళి పరోక్షంగా స్పందించారు. కొండా సురేఖ హైదరాబాద్‌లోనే ఉన్నారని.. ఈరోజు వరంగల్ తూర్పులో అబ్జర్వర్‌తో ప్రోగ్రామ్ ఉందని, దానికి ఆమె హాజరవుతారని అన్నారాయన. ఇదీ చదవండి: మా అమ్మ అరెస్టుకు కుట్ర జరుగుతోంది: కొండా సుస్మిత -
కొండా సురేఖ కుమార్తె సుస్మిత సంచలన ఆరోపణలు
-
నన్ను టార్గెట్ చేశారు: కొండా సురేఖ
-
మంత్రి కొండా సురేఖ ఇంటికి టాస్క్ ఫోర్స్ పోలీసులు
మంత్రి కొండా సురేఖ ఇంటికి టాస్క్ ఫోర్స్ పోలీసులు వెళ్లారు. దాంతో మా ఇంటికి ఎందుకొచ్చారు అంటూ పోలీసులతో గొడవకు దిగిన కొండా సురేఖ కూతురు కొండ సుస్మిత.కొండా సురేఖ ప్రైవేట్ ఓఎస్డీ సుమంత్ కోసం నిన్నటి నుండి టాస్క్ ఫోర్స్ పోలీసులు గాలిస్తున్నారు. అయితే సుమంత్ కొండ సురేఖ ఇంట్లో తలదాచుకున్నట్టు సమాచారం ఉండటంతోనే మంత్రి ఇంటికి పోలీసులు వెళ్లినట్టు తెలుస్తుంది.నిన్న సుమంత్‌ను తన బాధ్యతల నుండి తప్పిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. -
అక్కినేని నాగార్జునతో వివాదంపై.. కొండా సురేఖ కీలక వ్యాఖ్యలు
సాక్షి,హన్మకొండ: మంత్రి కొండా సురేఖ సంచలన వ్యాఖ్యలు చేశారు. తనని దెబ్బతీయాలని కొంతమంది రెడ్లు చూస్తున్నారని వ్యాఖ్యానించారు. మంగళవారం (అక్టోబర్14)ఆమె మీడియాతో చిట్‌చాట్ నిర్వహించారు.ఈ సందర్భంగా కొండా సురేఖ మాట్లాడుతూ..‘కొంతమంది రెడ్లు నన్ను దెబ్బతీయాలని చూస్తున్నారు. మంత్రిగా నేను ఏ పనిచేసినా వివాదం చేయాలనుకుంటున్నారు. నాగార్జున విషయంలో నేను మాట్లాడింది వేరు. కానీ దాన్ని వివాదంగా చిత్రీకరించారు. అందుకే మీడియాతో ఓపెన్‌గా ఉండటం లేదు. మౌనంగా నాశాఖ పనులు చేసుకుంటున్నాను’అని వ్యాఖ్యానించారు. -
ఓ మంత్రిపై సీఎం రేవంత్ రెడ్డికి కొండా సురేఖ ఫిర్యాదు
-
Konda Surekha: రేవంత్‌కు ఫిర్యాదు.. ఖర్గేకు లేఖ
సాక్షి, హైదరాబాద్: అడ్లూరి-పొన్నం వివాదం మరువక ముందే.. తెలంగాణలో మళ్లీ మంత్రుల మధ్య లొల్లి మొదలైంది(Telangana Ministers Clash). దేవాదాయ శాఖ మంత్రి కొండా సురేఖ ఓ మంత్రిపై సీఎం రేవంత్ రెడ్డికి, అలాగే పార్టీ అధిష్టానానికి ఫిర్యాదు చేసినట్లు సమాచారం. మేడారం టెండర్ల విషయంలో ఈ ఇద్దరు మంత్రులకు వార్ మొదలైందని తెలుస్తోంది. ఇటీవల మేడారంలో పర్యటించిన సీఎం రేవంత్.. పలు అభివృద్ధి పనులకు నిధులు కేటాయించారు. అయితే.. తన శాఖకు సంబంధించిన రూ.71 కోట్ల పనులను తన మనిషికి ఇప్పించుకునేందుకు ఓ మంత్రి తీవ్రంగా ప్రయత్నిస్తున్నారన్నది మంత్రి కొండా సురేఖ ఆరోపణ. ఈ క్రమంలో సీఎం రేవంత్ నివాసానికి వెళ్లిన ఆమె ఫిర్యాదు చేశారు. అంతేకాదు.. ఏఐసీసీ చీఫ్ మల్లికార్జున ఖర్గేకు పలుకీలక అంశాలతో లేఖ రూపేణా ఆమె ఫిర్యాదు చేశారు. అయితే.. ఆ మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి అని ప్రచారం బలంగా వినిపిస్తోంది(Konda Surekha Complaint Ponguleti). ఇదిలా ఉంటే.. మంత్రి పొన్నం ప్రభాకర్ తనపై అనుచిత వ్యాఖ్య చేశారంటూ అడ్లూరి లక్ష్మణ్ ఓ వీడియో రిలీజ్ చేయడం తెలంగాణ రాజకీయాల్లో కలకలం రేపింది. పొన్నం క్షమాపణలు చెప్పి తీరాల్సిందేనని పట్టుబట్టారాయన. ఈ క్రమంలో సీఎం సూచనతో.. టీపీపీసీ చీఫ్ మధ్యవర్తిత్వం వహించడంతో పొన్నం క్షమాపణలు చెప్పగా ఆ పంచాయితీ ముగిసింది.ఇదీ చదవండి: కోర్టు ఆదేశాలంటే లెక్కే లేదా? -
మంత్రి అయినంత మాత్రాన ఏదైనా చేయొచ్చా?
సాక్షిప్రతినిధి, వరంగల్: వరంగల్‌లో కాంగ్రెస్ పార్టీ రాజకీయాలు మళ్లీ రచ్చకెక్కుతున్నాయి. పార్టీ ప్రజాప్రతినిధుల మధ్య నెలకొన్న అంతర్గత విబేధాలు రోజురోజుకూ తీవ్రరూపం దాల్చుతున్నాయి. తాజాగా రాష్ట్ర దేవాదాయశాఖ మంత్రి (వరంగల్ తూర్పు ఎమ్మెల్యే) కొండా సురేఖ, వరంగల్ పశ్చిమ నియోజకవర్గ ఎమ్మెల్యే నాయిని రాజేందర్‌రెడ్డి మధ్య మాటల యుద్ధం తారస్థాయికి చేరింది. వరంగల్ నగరంలోని భద్రకాళి దేవస్థానం పాలకమండలి నియామకం సందర్భంగా ఏర్పడిన మనస్పర్థలు చినికి చినికి గాలి వానలా మారాయి. నాలుగైదు రోజులుగా ఒకరిపై ఒకరు తీవ్రస్థాయిలో ఆరోపణలు, ప్రత్యారోపణలు చేసుకుంటుండడం కాంగ్రెస్ పార్టీ కేడర్‌లో హాట్‌టాపిక్‌గా మారింది. అధికార పార్టీకి చెందిన మంత్రి, ఎమ్మెల్యేలు ఒకరిపై ఒకరు తీవ్రస్థాయిలో చేసుకుంటున్న వ్యాఖ్యలు మరోసారి జిల్లా కాంగ్రెస్ రాజకీయాల్లో చర్చనీయాంశంగా మారాయి.రచ్చకెక్కుతున్న కాంగ్రెస్ రాజకీయాలునాలుగు నెలల క్రితం మంత్రి కొండా సురేఖ దంపతులు, ఎమ్మెల్యేల మధ్య మొదలైన మాటల యుద్ధం ఘర్షణ వాతావరణానికి దారి తీసింది. ఈసందర్భంగా మంత్రి కొండా సురేఖ, ఆమె భర్త కొండా మురళీధర్‌రావు చేసిన వ్యాఖ్యలపై ఎమ్మెల్యేలు కొందరు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. తమ నియోజకవర్గాల్లో జోక్యం చేసుకుంటున్నారంటూ ఆరోపించారు. ఈమేరకు ఎమ్మెల్యేలు నాయిని రాజేందర్ రెడ్డి, రేవూరి ప్రకాశ్‌రెడ్డి, కడియం శ్రీహరి, కేఆర్ నాగరాజు, గండ్ర సత్యనారాయణ కొండా సురేఖ దంపతులపై సీఎం రేవంత్‌రెడ్డికి, టీపీసీసీకి ఫిర్యాదు చేశారు. ప్రాథమికంగా ఇరువర్గాలతో మాట్లాడిన టీపీసీసీ అధ్యక్షుడు బొమ్మ మహేశ్‌కుమార్‌గౌడ్.. పార్టీ క్రమశిక్షణ సంఘం అధ్యక్షుడు మల్లు రవికి అప్పగించారు. దీంతో ఆయన మంత్రి సురేఖ, కొండా మురళీధర్‌రావుతో పాటు ఎమ్మెల్యేలతో విడివిడిగా మాట్లాడారు. సుమారు మూడు పర్యాయాలు మంత్రి, ఎమ్మెల్యేల మధ్యన నెలకొన్న వివాదం పరిష్కారం కోసం టీపీసీసీ, క్రమశిక్షణ సంఘం వేర్వేరుగా ప్రయత్నించింది. అయినప్పటికీ ఆ గొడవ సద్దుమణగకపోగా... ఒక దశలో ‘‘వారా.. మేమా’’ తేల్చాలని ఎమ్మెల్యేలు పట్టుబట్టారు. దీంతో ఈ అంశంపై క్రమశిక్షణ సంఘం కూడా ఎటూ తేల్చలేకపోగా, సీఎం రేవంత్‌రెడ్డి, టీపీసీసీ చీఫ్ మహేశ్‌కుమార్ జోక్యం చేసుకుని మంత్రి, ఎమ్మెల్యేలతో మాట్లాడారు. ఆ తర్వాత కొంత స్తబ్ధత నెలకొన్నా పరిస్థితి నివురుగప్పిన నిప్పులానే ఉంది. అతిథుల మార్పు వెనుక?సెప్టెంబర్ 17న ప్రజాపాలన దినోత్సవానికి హాజరయ్యే మంత్రులు/ప్రముఖుల పేర్లను ప్రభుత్వం సోమవారం ప్రకటించింది. అయితే ఉమ్మడి వరంగల్‌కు సంబంధించిన కొన్ని జిల్లాలకు ఈసారి స్వల్పంగా మార్పులు చేసింది. గతంలో వరంగల్ కలెక్టరేట్లో రెవెన్యూశాఖ మంత్రి, జిల్లా ఇన్చార్జ్ మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి, హనుమకొండలో అటవీశాఖమంత్రి కొండా సురేఖ జాతీయ పతాకాన్ని ఆవిష్కరించి వేడుకల్లో పాల్గొనేవారు. ప్రజాపాలన వేడుకల సందర్భంగా కొండా సురేఖను వరంగల్‌కు, పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డిని హనుమకొండ జిల్లాలకు మార్చారు. ఈ మార్పు వెనుక ఇటీవల ఎమ్మెల్యేలు వర్సెస్ మంత్రి సురేఖ మధ్య ఉన్న వివాదాలు కారణం కాకపోలేదన్న చర్చ జరుగుతోంది. కాగా ఈసారి ములుగులో పంచాయతీరాజ్‌శాఖ మంత్రి ధనసరి అనసూయ సీతక్క, మహబూబాబాద్‌లో ప్రభుత్వ విప్ జె.రామచంద్రునాయక్, జనగామలో ప్రభుత్వ విప్ బీర్ల వీ రయ్య, జయశంకర్ భూపాలపల్లిలో తెలంగాణ ఎస్టీ కో–ఆపరేటివ్ ఫైనాన్స్ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ బెల్లయ్య నాయక్ వేడుకల్లో ముఖ్య అతిథులుగా హాజరుకానున్నారు.వ్యాఖ్యల కలకలంసీఎం, టీపీసీసీల జోక్యం తర్వాత గొడవలు సద్దుమణిగినట్లుగానే కనిపించినా.. మంత్రి కొండా సురేఖ, ఎమ్మెల్యే నాయిని రాజేందర్‌రెడ్డి మధ్య వ్యాఖ్యలు కలకలంరేపాయి. భద్రకాళి ఆలయ పాలకమండలి కమిటీ సందర్భంగా ‘ఏది చేసినా నడుస్తోందని మంత్రి కొండా సురేఖ అనుకుంటున్నారని’ మంత్రిపై ఎమ్మెల్యే నాయిని రాజేందర్ రెడ్డి ధ్వజమెత్తారు. ‘స్థానిక ఎమ్మెల్యేకు సమాచారం ఇవ్వకుండా భద్రకాళి ఆలయ పాలక మండలి సభ్యులను ఎలా నియమిస్తారు? అని ప్రశ్నించారు. దేవాదాయశాఖకు మంత్రి అయినంత మాత్రాన ఏదైనా చేయొచ్చా? నా నియోజకవర్గంలో మంత్రి పెత్తనం ఏంటి?’ అని నిలదీశారు. అంతా మంత్రి చేస్తే స్థానికంగా తాను ఉన్నది దేనికని.. ఇదే పద్ధతి అవలంబిస్తే తాను చూస్తూ ఊరుకోనని కూడా హెచ్చరించారు. ఇదే సందర్భంలో ‘నాయిని రాజేందర్ రెడ్డి అదృష్టం కొద్ది ఎమ్మెల్యే అయ్యాడు. నాయిని వ్యాఖ్యలు ఆయన విజ్ఞతకే వదిలేస్తున్న. ఆయనపై నేను కామెంట్ చేయాలనుకోవడం లేదు. మంత్రి హోదాలో ఇద్దరు ధర్మకర్తలను కేటాయించుకునే స్వేచ్ఛ లేదా?’ అంటూ మంత్రి కొండా సురేఖ స్పందించారు. కేవలం తాము అధిష్ఠానం నుంచి వచ్చిన పేర్లను మాత్రమే భర్తీ చేశామని కూడా వివరించారు. ఈ వ్యాఖ్యలపై స్పందించిన రాజేందర్ రెడ్డి.. ‘పూటకో పార్టీ మార్చిన ఘనత మంత్రి సురేఖది. 40 ఏళ్లుగా కాంగ్రెస్ కోసం నా రక్తం ధారపోశాను. 12 ఏళ్లు ఉమ్మడి జిల్లాకు డీసీసీ అధ్యక్షుడిగా ఉన్నా.. ఎవరైనా అదృష్టం ఉంటేనే ఎమ్మెల్యే అవుతారు. దురదృష్టవంతులు ఓడిపోతారు. మంత్రి బాధ్యతారహితంగా మాట్లాడడం సరికాదు’’ అంటూ గట్టి కౌంటర్ ఇచ్చారు. ఇదిలా ఉంటే.. సొంత పార్టీ నాయకులపై బహిరంగ విమర్శలు చేసుకోవద్దని అధిష్టానం హెచ్చరిస్తుండగా.. ఇక్కడ మాత్రం పరిస్థితులు భిన్నంగా ఉన్నాయన్న చర్చ పార్టీ కేడర్‌లో జరుగుతోంది. -
నాంపల్లి కోర్టు ఆదేశాలపై మంత్రి కొండా సురేఖ స్పందన
సాక్షి, హైదరాబాద్: నాంపల్లి కోర్టు ఆదేశాలపై మంత్రి కొండా సురేఖ స్పందించారు. తన కేసుకు సంబంధించి కోర్టు కాగ్నిజెన్స్ తీసుకొని ముందుకు వెళ్ళాలని స్పష్టం చేసిందని.. ఈ దేశ న్యాయ వ్యవస్థపై అపారమైన గౌరవం ఉందని ఆమె పేర్కొన్నారు. ‘‘ఈ కేసులు, కొట్లాటలు కొత్త కాదు నాకు. నా జీవితమే ఒక పోరాటం’’ అంటూ చెప్పుకొచ్చిన కొండా సురేఖ.. ఏ కేసులోనైనా కోర్టు కాగ్నిజెన్స్ తీసుకోమని చెప్పడం సర్వసాధారణమన్నారు.మంత్రి కొండా సురేఖపై క్రిమినల్ కేసు నమోదు చేయాలని నాంపల్లి కోర్టు ఆదేశించింది. నటి సమంత విడాకుల వ్యవహారంలో కొండా సురేఖ అనుచిత వ్యాఖ్యలు చేసిన సంగతి తెలిసిందే. మాజీ మంత్రి, బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ వేసిన పరువు నష్టం దావా కేసులో కొండా సురేఖపై క్రిమినల్ కేసుకు కోర్టు ఆదేశాలు జారీ చేసింది. కేటీఆర్ వాదనలతో ఏకీభవించిన నాంపల్లి కోర్టు.. ఈ నెల 21 లోపు క్రిమినల్ కేసు నమోదు చేసి నోటీసులు ఇవ్వాలని ఆదేశించింది. ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో కూడా కేటీఆర్‌పై కొండా సురేఖ ఆరోపణలు చేసిన సంగతి తెలిసిందే. -
కేటీఆర్ పరువు నష్టం కేసు.. మంత్రి కొండా సురేఖకు నాంపల్లి కోర్టు షాక్
సాక్షి, హైదరాబాద్: మంత్రి కొండా సురేఖపై క్రిమినల్ కేసు నమోదు చేయాలని నాంపల్లి కోర్టు ఆదేశించింది. నటి సమంత విడాకుల వ్యవహారంలో కొండా సురేఖ అనుచిత వ్యాఖ్యలు చేసిన సంగతి తెలిసిందే. మాజీ మంత్రి, బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ వేసిన పరువు నష్టం దావా కేసులో కొండా సురేఖపై క్రిమినల్ కేసుకు కోర్టు ఆదేశాలు జారీ చేసింది. కేటీఆర్ వాదనలతో ఏకీభవించిన నాంపల్లి కోర్టు.. ఈ నెల 21 లోపు క్రిమినల్ కేసు నమోదు చేసి నోటీసులు ఇవ్వాలని ఆదేశించింది. ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో కూడా కేటీఆర్‌పై కొండా సురేఖ ఆరోపణలు చేసిన సంగతి తెలిసిందే.కేటీఆర్ పిటిషన్‌ను పరిగణలోకి తీసుకున్న నాంపల్లి మనోరంజన్ కోర్టు.. త్వరలో సీసీ నెంబర్ కేటాయించనుంది. కొండా సురేఖ చేసిన వ్యాఖ్యలను కోర్టు నేరంగా పరిగణించింది. ఫోన్ ట్యాపింగ్, డ్రగ్స్, సమంత విడాకుల వంటి అంశాలపై కేటీఆర్‌పై మంత్రి కొండా సురేఖ చేసిన ఆరోపణలు ప్రాథమికంగా నిరాధారమని కోర్టు భావించింది. కేటీఆర్ తరపున న్యాయవాది సిద్ధార్థ్ పోగుల వాదనలను వినిపించగా.. కోర్టు సమర్థించింది. సాక్ష్యుల వాంగ్మూలాలు, సమర్పించిన పత్రాలు, ఫిర్యాదును పరిశీలించిన కోర్టు.. సురేఖపై క్రిమినల్ కేసు నమోదు చేయడానికి తగిన ఆధారాలు ఉన్నట్లు తేల్చింది. కొండా సురేఖ తరపు న్యాయవాది వాదనలను తోసిపుచ్చిన కోర్టు.. ఆయన లేవనెత్తిన పలు అంశాలను తిరస్కరించింది. -
‘బీసీ బిల్లుపై అభ్యంతరం ఉంటే అసెంబ్లీలోనే ఎందుకు చెప్పలేదు?’
ఢిల్లీ: తెలంగాణ స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు 42 శాతం రిజర్వేషన్ శాతం కల్పిస్తూ ప్రభుత్వం తెచ్చిన బిల్లుపై బీజేపీ వైఖరి సరికాదని మంత్రి పొన్నం ప్రభాకర్ స్పష్టం చేశారు. బీసీ బిల్లుపై బీజేపీకి అభ్యంతరం ఉంటే అసెంబ్లీలోనే ఎందుకు చెప్పలేదని మంత్రి పొన్నం ప్రశ్నించారు. ఫ్యూడల్ ధోరణితో అన్యాయం చేస్తే తిరుగుబాటు చేస్తామని పొన్నం హెచ్చరించారు. ముస్లింల పేరుతో బీసీల నోటి కాడి కూడు లాక్కోవొద్దన్నారు పొన్నం. రిజర్వేషన్లకు వ్యతిరేకంగా పోరాటం చేసిన రామచంద్రరావుకు బీజేపీ అధ్యక్ష పదవి ఇచ్చారని విమర్శించారు. కిషన్‌రెడ్డి, రామచంద్రరావులు బీసీ వ్యతిరేకులుగా పొన్నం పేర్కొన్నారు. తాము ఏ కుల సర్వే చేసినా....కేంద్రం చేసేది ప్రామాణికం అవుతుందన్నారు.ఆమోదిస్తారా?.. తిరస్కరిస్తారా?రాష్ట్రపతి వద్ద ఉన్న తెలంగాణ బీసీ బిల్లును ఆమోదిస్తారా?, తిరస్కరిస్తారా? అనేది ఏదో ఒకటి చెప్పాలని మరొక మంత్రి కొండా సురేఖ డిమాండ్ చేశారు. బీసీలను మోసం చేయవద్దని, ఈ బిల్లును ఆమోదించేందుకు కిషన్‌రెడ్డి సహకరించాలన్నారు. బీసీ బిల్లును వ్యతిరేకిస్తే బీజేపీకి తెలంగాణలో తగిన బుద్ధి చెప్తారని హెచ్చరించారు మంత్రి వాకిటి శ్రీహరి. సకల జనుల సమ్మె తరహాలో బీసీలు ఉద్యమిస్తారన్నారు. -
చైసామ్ విడాకులపై మంత్రి అనుచిత వ్యాఖ్యలు.. కేసు వాయిదా
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ రాష్ట్ర అటవీ, దేవాదాయశాఖ మంత్రి కొండా సురేఖపై హీరో నాగార్జున (Nagarjuna Akkineni) దాఖలు చేసిన పరువునష్టం కేసుపై గురువారం నాంపల్లిలోని ప్రజాప్రతినిధుల కోర్టు (స్పెషల్ జ్యుడీషియల్ ఫస్ట్‌క్లాస్ మెజిస్ట్రేట్)లో విచారణ జరిగింది. అగ్రనటుడు నాగార్జున కుమారుడైన హీరో నాగ చైతన్య–సమంత విడాకుల విషయమై మంత్రి కొండా సురేఖ అసంబద్ధమైన వ్యాఖ్యలు చేశారని, ఆమె వ్యాఖ్యలతో తన కుటుంబ పరువుపోయిందని నాగార్జున నాంపల్లి కోర్టులో పరువు నష్టం కేసు దాఖలు చేసిన విషయం తెలిసిందే. గైర్హాజరుఈ కేసు విచారణకు ప్రతివాది అయిన మంత్రి కొండా సురేఖ ఎగ్జామినేషన్‌కు హాజరు కావాల్సి ఉండగా గైర్హాజరయ్యారు. పిటిషనర్ నాగార్జున కూడా గైర్హాజరు కావడంతో వారి తరుపున న్యాయవాదులు పిటిషన్లు దాఖలు చేశారు. మంత్రి కొండా సురేఖ ఢిల్లీ వెళ్లారని వచ్చే విచారణకు హాజరు అవుతారని ఆమె తరఫు న్యాయవాది గుర్మిత్‌సింగ్ కోర్టుకు సూచించారు. దీంతో విచారణను ఈనెల 28కు వాయిదా వేసిన కోర్టు తప్పకుండా ఆ విచారణకు హాజరు కావాలని సూచించింది.ఏం జరిగింది?నాగచైతన్య–సమంత విడాకులపై మంత్రి కొండా సురేఖ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. వీరు విడిపోవడానికి కేటీఆర్ కారణమన్నారు. నాగార్జున, చైతన్య కలిసి.. సమంతపై ఒత్తిడి తీసుకొచ్చారని, అది నచ్చకే ఆమె విడాకులు తీసుకుందని ఆరోపణలు చేయడం పెను సంచలనమైంది. ఆమె మాట్లాడిన వ్యాఖ్యలు తీవ్ర వివాదాస్పదమయ్యాయి. ఆమె వ్యాఖ్యల్ని సినీ ప్రముఖులు ఖండించారు. దీంతో ఆమె క్షమాపణలు చెప్పడంతోపాటు తన వ్యాఖ్యలను వెనక్కు తీసుకున్నారు. అయితే తనకుగానీ, తన కుటుంబానికి కానీ క్షమాపణ చెప్పలేదంటూ.. నాగార్జున కొండా సురేఖపై పరువునష్టం దావా వేశారు.చదవండి: మళ్లీ ఇన్నేళ్లకు ఎన్టీఆర్ సిక్స్ ప్యాక్ -
ఎవరికీ భయపడేది లేదు : కొండా మురళి
-
కొండా లేఖ కలకలం
సాక్షి, హైదరాబాద్: వరంగల్ జిల్లా కాంగ్రెస్ నాయకుడు, మంత్రి కొండా సురేఖ భర్త కొండా మురళి పార్టీ క్రమశిక్షణ కమిటీకి ఇచ్చినట్టు ప్రచారం జరుగుతున్న లేఖ ఆ పార్టీలో కలకలం రేపుతోంది. మురళి శనివారం భారీ అనుచరగణంతో ర్యాలీగా గాంధీభవన్‌కు వచ్చి, నేరుగా పీసీసీ క్రమశిక్షణ కమిటీతో సమావేశమ య్యారు. కమిటీ చైర్మన్ మల్లురవి, సభ్యులు శ్యాంమోహన్, జి.వి.రామకృష్ణ, కమలాకర్‌రావులతో గంటన్నరకు పైగా ఈ సమావేశం జరిగింది. ఈ సందర్భంగా వరంగల్ జిల్లా కాంగ్రెస్ పార్టీలో జరుగుతున్న పరిణామాలపై ఆయన ఆరు పేజీల లేఖను క్రమశిక్షణ కమిటీకి అందించి, తమపై వచ్చిన ఆరోపణలపై వివరణ ఇచ్చినట్లు తెలిసింది. ఆ లేఖలో జిల్లా ఇన్చార్జి మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి.. సీఎం సన్నిహితుడు వేం నరేందర్‌రెడ్డి గురించి పేర్కొన్న అంశాలు ఇప్పుడు సంచలనంగా మారాయి. పొంగులేటి మాపై కక్షగట్టారు!: కొండా మురళి క్రమశిక్షణ కమిటీ భేటీకి వెళ్లడానికి ముందే ప్రచారంలోనికి వచ్చిన ఆ లేఖలో తొలుత మంత్రి పొంగులేటి గురించి ప్రస్తావించినట్లు సమాచారం. 2007లో జరిగిన నియోజకవర్గాల పునర్విభజన సమయంలో దళితులు, గిరిజనులకు ఎక్కువ సీట్లు వచ్చేలా తాను పనిచేశానని, అందుకే జిల్లాలోని రెండు పార్లమెంటు స్థానాలు రిజర్వుడ్ కేటగిరీకి వెళ్లాయని తెలిపారు. ఈ పరిణామంతో సీటు కోల్పోయిన కాంగ్రెస్ సీనియర్ నేత రామసహాయం సురేందర్‌రెడ్డి.. అందుకు తానే కారణమని చెబుతూ రాజకీయాలకు దూరమయ్యారని చెప్పారు. ఇప్పుడు ఆయన అల్లుడు పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి జిల్లాకు ఇన్చార్జి మంత్రిగా వచ్చి, ఆ కోపంతో తన సతీమణి, మంత్రి కొండా సురేఖపై కక్ష పూరితంగా వ్యవహరిస్తున్నారని ఆరోపించినట్లు తెలిసింది. మహబూబాబాద్ జిల్లాకు చెందిన వేం నరేందర్‌రెడ్డి గతంలో కొండా సురేఖపై పోటీ చేస్తే 2 వేల ఓట్లు మాత్రమే వచ్చాయని, డీలిమిటేషన్లో ఆయన సీటు ఎగిరిపోయేందుకు కూడా తానే కారణమని నరేందర్‌రెడ్డి కోపం పెంచుకున్నారని లేఖలో పేర్కొనట్లు సమాచారం.మా సాయం పొంది.. మాకే వ్యతిరేకంగా.. జిల్లాలోని కాంగ్రెస్ ఎమ్మెల్యేల గురించి కూడా కొండా మురళి తన లేఖలో వివరించినట్లు తెలిసింది. వర్ధన్నపేటలో తమ ప్రభావం బలంగా ఉంటుందని, స్థానిక ఎమ్మెల్యే కె.ఆర్. నాగరాజుతో సత్సంబంధాలున్నట్లు తెలిపారు. భూపాలపల్లి నుంచి గత ఎన్నికల్లో తననే పోటీ చేయాలని ప్రజలు కోరినా టీడీపీ నుంచి వచ్చిన గండ్ర సత్యనారాయణకు మద్దతిచ్చామని, ఇప్పుడు ఆయన తమకు వ్యతిరేకంగా ఇతర నేతలతో కలిశారని ఆగ్రహం వ్యక్తంచేసినట్లు సమాచారం. ములుగు నియోజకవర్గానికి చెందిన మంత్రి సీతక్కతో తమకు ఎలాంటి విభేదాలు లేవని మురళి తెలిపారు. మంత్రులు సురేఖ, సీతక్క మధ్య గ్యాప్ వచ్చిందని కడియం శ్రీహరి మీడియాలో పెయిడ్ ప్రచారం చేస్తున్నారని ఆరోపించారు. రేవూరి ప్రకాశ్‌రెడ్డి ప్రాతినిధ్యం వహిస్తున్న పరకాల పూర్తిగా తమ నియోజకవర్గమేనని, అందులోనే తమ స్వగ్రామం ఉందని గుర్తుచేసిన ఆయన.. ఎన్నికల సమయంలో రేవూరి అభ్యర్థన మేరకు మనస్ఫూర్తిగా సహకారం అందించినట్లు తెలిపారు. అయినా ప్రకాశ్‌రెడ్డి తమకు వ్యతిరేకంగా గూడుపుఠాణీ రాజకీయాలు చేస్తున్నారని మండిపడ్డట్లు తెలిసింది. నాయిని రాజేందర్‌రెడ్డి (వరంగల్æ వెస్ట్) కూడా ఎన్నికల సమయంలో తమ మద్దతు కోరారని, ఇప్పుడు తమ నియోజకవర్గంలోకి వచ్చి (వరంగల్ ఈస్ట్) ఎలక్ట్రిసిటీ అధికారులకు పోస్టింగులు ఇప్పించుకుంటున్నారని అభ్యంతరం తెలిపారు. తమ పరిధిలోనికి వచ్చే ఎంజీఎం ఆస్పత్రిలో ఆకస్మిక తనిఖీలు చేస్తున్నారని ఫిర్యాదు చేశారు. జనగామలో కొమ్మూరి ప్రతాప్‌రెడ్డి తమతో బాగానే ఉంటున్నారని వెల్లడించారు. స్టేషన్‌ఘన్‌పూర్‌కు చెందిన కడియం శ్రీహరి బీఆర్ఎస్ నుంచి వచ్చి స్థానిక కాంగ్రెస్ ఇన్చార్జి ఇందిరకు చుక్కలు చూపిస్తున్నారని, కేడర్‌ను టార్చర్ చేస్తున్నారని ఆరోపించారు. పాలకుర్తిలో యశస్వినిరెడ్డి, డోర్నకల్ రాంచంద్రునాయక్లతో కూడా తమకు ఇబ్బంది లేదని మురళి తెలిపినట్లు సమాచారం. డీసీసీ అధ్యక్షురాలు ఎర్రబెల్లి స్వర్ణ ఇప్పటివరకు ఒక్క ఎన్నిక కూడా గెలవలేదని తెలిపారు. మా పవర్ గురించి చెప్పాల్సిన పనిలేదుతాము బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్‌లోకి వచ్చేటప్పుడు 26 మంది కార్పొరేటర్లు తమతో వచ్చారని, వరంగల్‌లో కొండా దంపతుల పవరేంటో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదని కూడా ఆ లేఖలో మురళి పేర్కొన్నట్లు తెలిసింది. అయితే, ఆ లేఖ గురించి తనకు తెలియదని, బయట ఏం ప్రచారం జరుగుతుందో తన దృష్టికి రాలేదని క్రమశిక్షణ కమిటీ భేటీ అనంతరం విలేకరులతో మాట్లాడుతూ కొండా మురళి వ్యాఖ్యానించడం కొసమెరుపు. -
కాంగ్రెస్‌లో పొలిటికల్ వార్.. కొండా సురేఖపై చర్యలు తప్పవా?
సాక్షి, వరంగల్/హైదరాబాద్: వరంగల్ జిల్లాలో కాంగ్రెస్ నేతల మధ్య పొలిటికల్ వార్ పీక్ స్టేజ్‌కు చేరుకుంది. జిల్లా కాంగ్రెస్ ఎమ్మెల్యేలు, కీలక నేతలు.. మంత్రి కొండా సురేఖ మీద తిరుగుబాటు జెండా ఎగరేశారు. మంత్రిపై ఫిర్యాదు చేసేందుకు నేతలందరూ కూటమి కట్టారు. ఇక, తాజాగా హస్తం నేతల పంచాయతీ తాజాగా కాంగ్రెస్ ఇన్చార్జ్ మీనాక్షీ నటరాజన్ వద్దకు చేరుకుంది.వరంగల్ కాంగ్రెస్ ఎమ్మెల్యేలు ఎమ్మెల్యే క్వార్టర్స్‌లో మీనాక్షీ నటరాజన్ భేటీ అయ్యారు. కడియం శ్రీహరి, కార్పొరేషన్ చైర్మన్, ఎర్రబెల్లి స్వర్ణ తదితర నేతలు మీనాక్షి నటరాజన్‌తో సమావేశం అయ్యారు. ఈ నేపథ్యంలో చర్చలో ఏం చేస్తారు.. ఎలాంటి నిర్ణయం తీసుకుంటారనే దానిపై ఉత్కంఠ నెలకొంది. అయితే, ఇప్పటికే వరంగల్ పంచాయతీపై పీసీసీ చీఫ్‌కు సీనియర్ల నివేదిక అందింది. సీనియర్ల నివేదిక ఆధారంగా మీనాక్షి నటరాజన్ నిర్ణయం తీసుకోనున్నట్టు వార్తలు వినిపిస్తున్నాయి.కొండా మురళి వ్యాఖ్యల ఎఫెక్ట్.. అయితే, ఇన్ని రోజులు మంత్రి కొండా సురేఖ జిల్లాలో నేతలను కలుపుకుని పోవడం లేదన్న అసంతృప్తి ఉంది. ఇదే సమయంలో తాజాగా మంత్రి భర్త కొండా మురళి చేసిన తాజా వ్యాఖ్యలు అగ్గికి మరింత ఆజ్యం పోశాయి. మాజీ మంత్రి, ఎమ్మెల్యే కడియం శ్రీహరితో పాటు ఒకరిద్దరు నేతల్ని ఉద్దేశించి మురళి కామెంట్స్ చేశారు. పార్టీ మారినప్పుడు పదవులకు రాజీనామాలు చేసి రావాలంటూ.. మురళి అన్న ఆ మాటలే ఎమ్మెల్యేలందర్నీ ఏకం చేసినట్టు చెప్పుకుంటున్నారు. అప్పటిదాకా.. ఎవరి దారి వారిదే అన్నట్టున్నగా ఉన్న శాసనసభ్యులు.. కొండా మురళి వ్యాఖ్యలతో ఒక్క తాటి మీదికి వచ్చినట్టు సమాచారం.కొండా మురళి వ్యాఖ్యలతో.. కడియం శ్రీహరి, నాయిని రాజేందర్ రెడ్డి, రేవూరి ప్రకాష్ రెడ్డి అంతా ఇప్పుడు ఏకమైనట్టు తెలిసింది. కొండా ఫ్యామిలీకి రేవూరి ప్రకాష్‌రెడ్డితో కూడా కయ్యం మొదలైంది. ఇప్పుడు వరంగల్ సిటీలోని ఎమ్మెల్యేలతో పాటు.. కడియం శ్రీహరి లాంటి వాళ్ళంతా కలిసి కొండా దంపతులపై సీరియస్‌గా ఉన్నట్టు తెలుస్తోంది. త్వరలో వీరంతా.. ఢిల్లీ వెళ్ళి అధిష్టానం పెద్దలకు మంత్రి మీద ఫిర్యాదు చేయాలనుకుంటున్నట్టు సమాచారం. -
‘నా ముందు కూర్చోవడానికి ఆయనకు నామోషీ’
వరంగల్: కాంగ్రెస్ సీనియర్ నేతలపై కొండా మురళి వివాదాస్పద వ్యాఖ్యలు ఆ పార్టీలో ఒకవైపు ప్రకంపనలు సృష్టిస్తుంటే, మంత్రి కొండా సురేఖ సైతం అదే తరహాలో మాట్లాడారు. కడియం శ్రీహరి నల్లికుట్ల మనిషని, సీఎం రేవంత్ వద్దకు, పొంగులేటి వద్దకు వెళ్లా తన మీద ఉన్నది లేనిది చెబుతున్నారంటూ విమర్శలు చేశారు. మీడియాతో చిట్‌చాట్‌లో భాగంగా కొండా సురేఖ మాట్లాడుతూ.. ‘నేను మంత్రిగా ఉంటే నా ముందు కూర్చోవడానికి నామోషీగా ఫీల్ అవుతున్నారు కడియం శ్రీహరి. అందుకే నా మంత్రి పదవి పోతుందంటూ తప్పుడు ప్రచారం చేపిస్తున్నాడు. సీఎం దగ్గరకు, పొంగులేటి వద్దకు వెళ్లి నా మీద ఉన్నది లేనిది చెబుతున్నాడు. తెలుగుదేశంలో నడిపించుకున్నట్లు ఇక్కడ కూడా నడిపించాలని అనుకుంటున్నాడు. నా అదృష్టం ఉంది నేను మంత్రి అయ్యాను. ఆయనకు అదృష్టం ఉన్నప్పుడు ఆయన కూడా మంత్రి అయ్యాడు. నన్ను దిగిపోవాలని అనుకుంటే ఎలా?, నా కూతురికి అదృష్టం లేదు ఎమ్మెల్యే కాలేదు. కడియం కూతురికి అదృష్టం ఉంది ఎంపీ అయ్యింది. నేను ఆమె ఎంపీ పదవి తీయాలని అంటున్నానా?, అని కొండా సురేఖ ప్రశ్నించారు. భద్రకాళీ టెంపుల్ ఎవరి సొత్తు కాదు..వరంగల్ పశ్చిమ ఎమ్మెల్యే నాయని రాజేందర్‌రెడ్డికి సురేఖ కౌంటర్ ఇచ్చారు. కొందరు భద్రకాళీ టెంపుల్ తమ సొత్తు అనుకుంటున్నారని, అది ఎవరి సొత్తు కాదనే విషయం తెలుసుకోవాలన్నారు. రాజేందర్‌రెడ్డి ప్రెస్‌మీట్ పెట్టి మాట్లాడటం సరికాదు. ఆయన అభివృద్ధిని అడ్డుకుంటున్నారు. ఆగమశాస్త్ర ప్రకారం భద్రకాళి అమ్మవారికి బోనం సమర్పించాలని నిర్ణయించుకున్నాం. అక్కడ యాటలు కోస్తారని తప్పుడు ప్రచారం చేస్తున్నారు. అమ్మవారు శాఖాహారీ అని అందరికీ తెలుసు. అక్కడ ఏళ్లుగా పనిచేస్తున్న పూజార్ల అభిప్రాయం తీసుకున్నాం. బల్కంపేట దేవాలయం నుంచి బోనం తీసుకువెళ్లి భద్రకాళి అమ్మవారికి సమర్పిస్తాం’ అని కొండా సురేఖ తెలిపారు. కేంద్రానికి వివక్ష తగదుగోదావరి పుష్కరాల విషయంలో రెండు రాష్ట్రాలను కేంద్రం ఒకేలా సమానంగా చూడాలన్నారు కొండా సురేఖ. పుష్కరాలకు రూ. 200 కోట్లు ఇవ్వాలని కేంద్రానికి లేఖ రాశామని, గోదావరి పుష్కరాలు ఏపీ కంటే తెలంగాణలోనే ఎక్కువగా జరుగుతాయన్నారు. భద్రాచలం రాముని పాదాల నుంచే గోదావరి ప్రవహిస్తుందని, ఇక్కడే గోదావరి పుష్కరాలు ఘనంగా జరుగుతాయన్నారు. తెలంగాణ వివక్ష వద్దు. కిషన్‌రెడ్డి, బండి సంజయ్ చొరవ చూపాలి.తెలంగాణకు పుష్కరాల కోసం నిధులు ఇప్పించాలి. లేదంటే వారు చేతకాని మంత్రులుగా మిగిలిపోతారు’ అని ఆమె స్పష్టం చేశారు. -
సొంత పార్టీ నేతలకు కొండా సురేఖ భర్త మాస్ వార్నింగ్
సాక్షి, వరంగల్: వరంగల్ కాంగ్రెస్‌లో వార్ ముదురుతోంది. మంత్రి కొండా సురేఖ భర్త మురళి సంచలన వ్యాఖ్యలు చేశారు. స్వంత పార్టీ ఎమ్మెల్యేలు కడియం శ్రీహరి, రేవూరి ప్రకాష్‌రెడ్డిని ఉద్దేశించి పరోక్షంగా ఆయన వార్నింగ్ ఇచ్చారు. కనుబొమ్మలు లేని నాయకుడు నాడు టీడీపీని భ్రష్టు పట్టించాడు. మొన్న కేటీఆర్‌ను వెన్నుపోటు పొడిచిండు. ఎన్కౌంటర్ల స్పెషలిస్ట్.. ఇప్పుడు కాంగ్రెస్‌లో చేరాడు. మీకు ఇజ్జత్ ఉంటే బయటి పార్టీ నుంచి వచ్చిన నాయకులు మీ పదవికి రాజీనామా చేసి మళ్లీ గెలవాలి’’ అంటూ కొండా మురళి వ్యాఖ్యానించారు.వరంగల్ పోలీస్ కమిషనర్‌కు చెపుతున్నా.. మీ డిపార్ట్మెంట్లో కోవర్డులు ఉన్నారు. నాకు ఎస్కార్ట్ ఇచ్చిన వారిపై చర్యలు కాదు.. పోలీస్ డిపార్ట్మెంట్లో కోవర్డులపై చర్యలు తీసుకోండి. కొండా మురళి ఉన్నంత వరకు వరంగల్ తూర్పులో రెండో నాయకుడు ఎవరూ ఉండరు. పరకాలలో 75 ఏళ్ల వ్యక్తి ఎమ్మెల్యేగా గెలిచాడు. ఎన్నికలకు ముందు మా వద్దకు వచ్చి కాళ్లు పట్టుకున్నాడు’’ అంటూ కొండా మురళి ఘాటు వ్యాఖ్యలు చేశారు.‘‘పరకాల నియోజకవర్గంలో నా కూతురు కొండా సుస్మిత పటేల్ రంగప్రవేశం చేయనుంది. కొండా సురేఖ మంత్రి పదవి పోతుందని కొందరు ప్రచారం చేస్తున్నారు. ఆమె మంత్రి పదవి ఎక్కడికి పోదు’’ అని కొండా మురళి పేర్కొన్నారు. -
పది ఉమ్మడి జిల్లాలకు ఇన్చార్జి మంత్రులు
సాక్షి, హైదరాబాద్: కేబినెట్లోకి ముగ్గురు కొత్త మంత్రులను తీసుకోవడంతో జిల్లా ఇన్చార్జి మంత్రుల విషయంలో స్వల్ప మార్పులు చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఇప్పటి వరకు ఇన్చార్జి మంత్రులుగా ఉన్న ఉత్తమ్‌కుమార్‌రెడ్డి (కరీంనగర్), కోమటిరెడ్డి వెంకటరెడ్డి (ఖమ్మం), కొండా సురేఖ (మెదక్)లను ఆ బాధ్యతల నుంచి తప్పించింది.అలాగే ఆదిలాబాద్ ఇన్చార్జి మంత్రిగా ఉన్న సీతక్కను అక్కడ నుంచి మార్చి.. నిజామాబాద్ జిల్లా ఇన్చార్జిగా నియమించగా, అక్కడి ఇన్చార్జి మంత్రి జూపల్లి కృష్ణారావును ఆదిలాబాద్‌కు మార్చింది. కొత్తగా మంత్రివర్గంలో చేరిన ముగ్గురికి జిల్లా ఇన్చార్జిలుగా బాధ్యతలను అప్పగించింది. ఈ మేరకు మార్పులు జరిగిన జిల్లాలతోపాటు మొత్తం పది ఉమ్మడి జిల్లాలకు ఇన్చార్జి మంత్రులను నియమిస్తూ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రామకృష్ణారావు గురువారం ఉత్తర్వులు జారీ చేశారు. -
మంత్రి కొండా సురేఖకు అస్వస్థత
-
మంత్రి కొండా సురేఖకు అస్వస్థత
హైదరాబాద్: తెలంగాణ మంత్రి కొండా సురేఖ అస్వస్థత గురయ్యారు. తెలంగాణ కేబినెట్ సమావేశానికి ముందు కొండా సురేఖ స్వల్ప అస్వస్థతకు గురయ్యారు. సెక్రటరియేట్‌లోని కేబినెట్ హాలులో ఆమె కళ్లు తిరిగి కిందపడిపోయారు. వెంటనే అప్రమత్తమైన సెక్రటరియేట్ సిబ్బంది.. వెంటనే పరిశీలించి వైద్యం అందించారు. అయితే ఆమె లోబీపీ వల్ల పడిపోయినట్లు నిర్దారించిన వైద్యులు ఆమెకు చికిత్స అందించారు. ప్రస్తుతం ఆమె ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉన్నట్లు వైద్యులు స్పష్టం చేశారు. కాగా, ఈరోజు(గురువారం) మధ్యాహ్న ప్రాంతంలో సీఎం రేవంత్‌రెడ్డి అధ్యక్షతన తెలంగాణ కేబినెట్ సమావేశం ప్రారంభం కానుంది. రాజీవ్ యువ వికాసం, వానాకాలం పంటలపై చర్చతో పాటు, ఇందిరమ్మ ఇళ్లు, భూ భారతిపై సమీక్షించనున్నారు. కాళేశ్వరంపై విజిలెన్స్ రిపోర్ట్, ఎన్డీఏ నివేదికపై చర్చించనున్నారు. ప్రభుత్వ ఉద్యోగుల సమస్యలపై చర్చతో పాటు.. వేములవాడలో కోడెలు మృతిపై కూడా కేబినెట్లో చర్చించే అవకాశం ఉంది. -
‘కాళేశ్వరం సరస్వతీ పుష్కరాలు విజయవంతంగా ముగిశాయి’
హైదరాబాద్: కాళేశ్వరం సరస్వతీ పుష్కరాలు విజయవంతంగా ముగిశాయని మంత్రి కొండా సురేఖ స్పష్టం చేశారు. సరస్వతీ పుష్కరాలు విజయవంతం కావడం చాలా సంతోషంగా ఉందన్నారు కొండా సురేఖ. ఈ మేరకు మంగళవారం మాట్లాడిన కొండా సురేఖ.. ‘ తెలంగాణ రాష్ట్ర వచ్చిన తొలి పుష్కరాలు అద్భుతంగా జరిగాయి. 30 లక్షల మంది భక్తులు పుణ్యస్నానాలు ఆచరించి, కాళేశ్వర ముక్తీశ్వరుడి దర్శనం చేసుకున్నారు. ఇందుకు సహకరించిన అన్ని శాఖల అధికారులకు, స్థానిక ప్రజలకు, భక్తులకు ధన్యవాదాలు.రాబోయే రోజుల్లో వచ్చే గోదావరి పుష్కరాలను మరింతగా గొప్పగా జరుపుకుందామని తెలియజేస్తున్న. ఈ పుష్కరాలు విజయవంతం కావటంలో కృషి చేసిన స్థానిక ఎమ్మెల్యే, మంత్రి శ్రీధర్ బాబు , స్థానిక అధికారులు, ఎండోమెంట్ డిపార్టుమెంటు వారికి ప్రత్యేక ధన్యవాదాలు’ అని కొండా సురేఖ పేర్కొన్నారు.కాగా, మే 15వ తేదీన తెలంగాణలోని భూపాలపల్లి జిల్లా కాళేశ్వరంలో సరస్వతీ నది పుష్కరాలు ప్రారంభమైన సంగతి తెలిసిందే.మాధవానంద సరస్వతీ స్వామి పుష్కరాలను ప్రారంభించారు. ఈ సందర్భంగా సరస్వతీ నది వద్ద మంత్రి శ్రీధర్‌బాబు ప్రత్యేక పూజలు చేశారు. త్రివేణి సంగమం వద్ద పుష్కర్ స్థానం ఆచరించి కుటుంబ సమేతంగా ప్రత్యేక అర్చనలు చేసిన మంత్రి శ్రీధర్ బాబు దంపతులు.మే 15వ తేదీ నుంచి మే 26వ తేదీ వరకూ సరస్వతీ నదీ పుష్కరాలు జరిగాయి. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత ఇవే తొలిసారి సరస్వతీ పుష్కరాలు వచ్చాయి. రోజుకు లక్ష నుంచి లక్షన్నర వరకూ భక్తులు వస్తారని అంచనా వేసిన అంతకుమించి వచ్చినట్లు మంత్రి కొండా సురేఖ వ్యాఖ్యలను బట్టి తెలుస్తోంది. -
‘సురేఖ వ్యాఖ్యల ఎఫెక్ట్.. రేవంత్ కమీషన్ల సంగతేంటి?’
సాక్షి, హైదరాబాద్: తెలంగాణలో మంత్రి కొండా సురేఖ వ్యాఖ్యలు రాజకీయంగా తీవ్ర దుమారం రేపుతున్నాయి. మంత్రులు కమీషన్లు తీసుకోకుండా సంతకాలు చేయరు అని మాట్లాడటం ఆసక్తికరంగా మారింది. దీంతో, ఆమె వ్యాఖ్యలపై తాజాగా కేంద్రమంత్రి కిషన్ రెడ్డి స్పందిస్తూ.. ఏయే మంత్రి ఎంత కమీషన్లు తీసుకున్నారో దర్యాప్తు చేపట్టాలని రేవంత్ సర్కార్‌ను డిమాండ్ చేశారు.కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి తాజాగా మీడియాతో మాట్లాడుతూ.. కొండా సురేఖ మంత్రులు కమిషన్లు తీసుకోవడం కామన్ అనడం బాధాకరం. అంటే రాష్ట్రంలో మంత్రులు కమీషన్లు తీసుకుంటున్నారని ఒప్పుకున్నారు. సీఎం రేవంత్ రెడ్డిని ఇదే డిమాండ్ చేస్తున్నాం. ఏయే శాఖ మంత్రి ఎంత తీసుకున్నారో దర్యాప్తునకు ఆదేశించాలి. మంత్రులు తీసుకున్న కమీషన్లు బయట పెట్టాలి అని వ్యాఖ్యలు చేశారు.రాజకీయాలకు అతీతంగా తిరంగా యాత్ర..ఇదే సమయంలో తిరంగా యాత్రపై మాట్లాడుతూ.. పహల్గాం ఘటనలో 26 మందిని ఉగ్రమూకలు హతమార్చారు. మానవత్వం లేకుండా పిల్లల ముందు తండ్రిని, భార్య ముందు భర్తను పేర్లు అడిగి హతమార్చారు. మానవ సమాజానికే సవాల్ గా మారిన ఈ ఘటనను కేంద్ర ప్రభుత్వం సీరియస్ గా తీసుకుంది. పాకిస్తాన్లో 9 ఉగ్రవాద స్థావరాలను పేల్చివేశాం. ఆపరేషన్ సిందూర్‌ను విజయవంతం చేయడం జరిగింది. ఉగ్రవాద చర్యలతో మనదేశం బలవుతూనే ఉంది. జమ్ముకశ్మీర్‌లోనే 46 వేల మందిని ఉగ్రమూకలు బలితీసుకున్నాయి. మన సైనికులు నూతన చరిత్రను ప్రారంభించారు.గతంలో ఉగ్రమూకలు దాడి చేసినప్పుడు.. మరణించినవారి ఫోటో దగ్గర గులాబీ పువ్వు పెట్టడం వరకే పరిమితం అయ్యే వాళ్ళం. 2009లో 40 మందిని ఊచకోత కోశారు. భారత్‌పై దాడి చేస్తే ప్రతీకారం ఎలా ఉంటుందో చూపించాం. ఉగ్రవాదుల శిక్షణ కార్యక్రమాలు, ఉగ్రవాదుల నివాసాలను ధ్వంసం చేశాం. కరడుకట్టిన ఉగ్రవాదులను అంతం చేశాం. పాకిస్తాన్ పిల్ల చేష్టలతో దాడికి ఒడిగట్టింది.. భారత సైన్యం తిప్పికొట్టింది. ఆపరేషన్ సిందూర్ ఆగలేదు.. ఇంకా కొనసాగుతోంది. రక్షణ రంగంలో ప్రతి సైనికుడు రాణించారు. S-400, బ్రహ్మాస్త్రం పనితీరు దేశ ప్రజలు గమనించారు. భారత ఆర్మీకి అన్ని రకాలుగా సమకూర్చడం జరిగింది.ఆర్మీకి అవసరమైన వాటిలో 35 శాతం మనమే సమకూర్చుకున్నాం. మిథానీ, DRDAలో వసతులు మెరుగు పరుస్తున్నాం. ఆర్డినెన్సు ఫ్యాక్టరీలను మరింత సంసిద్ధం చేసుకున్నాం. పాకిస్తాన్‌ను ప్రపంచం ముందు దోషిగా నిలబెడతాం. భారత సైనికులు అనుసరించిన స్ట్రాటజీని ప్రపంచం మొత్తం చూసింది. రాజకీయాలకు అతీతంగా తిరంగా యాత్ర నిర్వహిస్తున్నాం. అన్ని రాజకీయ పార్టీలను, ఎమ్మెల్యేలను, ఎంపీలను ఆహ్వానిస్తున్నాం’ అని చెప్పుకొచ్చారు. -
మంత్రి కొండా సురేఖ వివాదాస్పద వ్యాఖ్యలు
-
వరంగల్ మెగా జాబ్ మేళాలో తొక్కిసలాట
సాక్షి, వరంగల్ జిల్లా: వరంగల్‌లో నిర్వహించిన మెగాజాబ్ మేళాకు నిరుద్యోగులు భారీగా హాజరయ్యారు. ఎంకే నాయుడు ఫంక్షన్ హాలఖలో నిర్వహించిన జాబ్ మేళాకు యువత భారీగా తరలి రావడంతో ప్రాంగణమంతా కిక్కిరిసిపోయింది. గేట్ తీయగానే నిరుద్యోగులు ఒక్కసారిగా దూసుకురావడంతో తొక్కిసలాట చోటు చేసుకుంది. ఫంక్షన్ హాల్ ప్రధాన ద్వారం అద్దాలు ధ్వంసమయ్యాయి. ముగ్గురు నిరుద్యోగ మహిళలకు గాయాలయ్యాయి. వెంటనే వారిని సమీపంలోని ఆస్పత్రికి తరలించారు. మంత్రి కొండా సురేఖ జాబ్ మేళాను ప్రారంభించి వెళ్లిన కాసేపటికే ఈ ఘటన జరిగింది.కాగా, 60 కంపెనీల ద్వారా 11 వేల మంది నిరుద్యోగ యువతకు జాబ్ మేళా ద్వారా ఉద్యోగం కల్పిస్తున్నామని రాష్ట్ర ఐటీ పర్యావరణ, దేవాదాయ శాఖ మంత్రి కొండా సురేఖ అన్నారు. వరంగల్ నగరంలోని ఎంకే నాయుడు కన్వెన్షన్ హాల్లో రాష్ట్ర ప్రభుత్వ సౌజన్యంతో కొండా దంపతులు నిర్వహిస్తున్న మెగా జాబ్ మేళాకు విశేష స్పందన లభించింది.ఎన్నికల ముందు చెప్పిన విధంగా నిరుద్యోగులకు ఉపాధి కల్పిస్తామని హామీ ఇచ్చిన విధంగా జాబ్ మేళా ఏర్పాటు చేశామని గత పది సంవత్సరాలలో ప్రభుత్వ నిర్లక్ష్యంతో ఉద్యోగాలు లేకుండా పోయాయని మంత్రి అన్నారు. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చాక సీఎం రేవంత్ రెడ్డి వరంగల్ అభివృద్ధిపై ప్రత్యేక దృష్టి పెట్టడంతో పాటు నిరుద్యోగ యువతకు ఉద్యోగాలు కల్పించడంలో నిమగ్నమయ్యారని, ప్రతిఒక్కరికి ప్రభుత్వ ఉద్యోగం రావాలంటే కష్టమని.. అందుకే జాబ్ మేళాను నిర్వహిస్తున్నామని కొండా సురేఖ చెప్పారు. -
కన్నీరు పెట్టుకున్న కొండా సురేఖ
-
పెంపుడు కుక్క హఠాన్మరణం.. మంత్రి కొండా సురేఖ కన్నీరుమున్నీరు
సాక్షి, వరంగల్: తెలంగాణ మంత్రి కొండా సురేఖ తీవ్ర విషాదంలో మునిగిపోయారు. తమ పెంపుడు కుక్క గుండెపోటుతో మృతి చెందడంతో భావోద్వేగానికి లోనైనా మంత్రి.. కన్నీరుమున్నీరయ్యారు. గుండెపోటుతో చనిపోయిన హ్యాపీకి మంత్రి కొండా కుటుంబం.. అంతిమ సంస్కారాలు నిర్వహించారు. హ్యాపీ హఠాన్మరణంతో సురేఖ కుటుంబీకులు, సిబ్బంది కన్నీటి పర్యంతమయ్యారు.గత కొన్నాళ్లుగా హ్యాపీతో మధుర అనుభూతులను మంత్రి సురేఖ, స్టాఫ్ పంచుకున్నారు. 2021లో కూడా కొండా సురేఖకు చెందిన ఓ పెంపుడు కుక్క మృతి చెందితే ఆ సమయంలోనూ ఆమె తీవ్ర భావోద్వేగానికి లోనయ్యారు. ఈ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. Minister Konda Surekha breaks down in tears over sudden death of pet dog ‘Happy’pic.twitter.com/f87jhedaPA— Naveena (@TheNaveena) March 6, 2025 -
కొండా సురేఖకు సోనియా గాంధీ లేఖ.. ఎందుకంటే
సాక్షి, హైదరాబాద్: రాష్ట్ర దేవాదాయ శాఖ మంత్రి కొండా సురేఖకు ఏఐసీసీ అగ్రనేత సోనియా గాంధీ లేఖ రాశారు. కాళేశ్వర, ముక్తీశ్వర స్వామి మహా కుంబాభిషేకం ఘనంగా నిర్వహించినందుకు సోనియా ప్రశంసించారు. 42 సంవత్సరాల తర్వాత ప్రత్యేక చొరవ తీసుకొని మహా కుంబాభిషేకం నిర్వహించడం హర్షణీయం అన్న సోనియా గాంధీ.. త్రివేణి సంగమం జలాలకి ఎంతో ప్రత్యేకత ఉందని ప్రస్తావించారు.తనకు ప్రసాదాన్ని, త్రివేణి సంగమం పవిత్ర జలాలను పంపించిందుకు కొండా సురేఖకు సోనియా ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలిపారు. తనకి కాళేశ్వర, ముక్తీశ్వర స్వామి స్థల విశిష్టతను, ప్రశస్థను తెలియజేసినందుకు కొండా సురేఖను సోనియా గాంధీ అభినందించారు. -
మహిళా సాధికారతకు కట్టుబడి ఉన్నాం: మంత్రి కొండా సురేఖ
హైదరాబాద్: మహిళా సాధికారతకు కట్టుబడి ఉన్నామన్నారు మంత్రి కొండా సురేఖ. చారిత్రక నాయకురాలు రాణి రుద్రమదేవి నుంచి మొదలుకొని నేటి వ్యాపారవేత్తల వరకూ మహిళలు సమాజానికి వెన్నెముకగా ఉన్నారన్నారు. విమెన్స్ ఇంటర్నేషనల్ సమ్మిల్ ఆప్ ఎంట్రపెన్యూన్ అండ బీ2బీ ఎక్స్ పో 2025లో మంత్రి సురేఖ పాల్గొన్నారు. ‘మహిళా సాధికారత సామాజిక పురోగతి మాత్రమే కాదని, ఆర్థిక వృద్ధికి కీలకం. మహిళా సాధికారత కోసం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నేతృత్వంలో తెలంగాణ ప్రభుత్వం చర్యలు తీసుకుంటోంది. ఇందిరా మహిళా శక్తి కార్యక్రమం ద్వారా ఐదేళ్లలో లక్ష మంది మహిళా కోటీశ్వరులను తయారు చేయడానికి ప్రభుత్వ చేయూత. స్వయం సహాయక సంఘాలకు వడ్డీలేని రుణాలు & నైపుణ్యాభివృద్ధి. వీ-హబ్: దేశంలోనే మొదటిసారిగా రాష్ట్రం ఆధ్వర్యంలో మహిళా ఆంట్రప్రెన్యూర్ల కోసం తొలి ఇన్క్యూబేటర్. T-IDEA & మహిళల నేతృత్వంలోని వ్యాపారాలకు ప్రత్యేక ప్రోత్సాహాలు. పాడి, వస్త్రాలు, ఆహార ప్రాసెసింగ్ వంటి రంగాలకు మద్దతు. ఐటీ, సౌరశక్తి, లాజిస్టిక్స్ వంటి రంగాలలో మహిళలను ప్రోత్సహించడం. దేశ వ్యాప్తంగా మహిళా ఆంట్రప్రెన్యూర్లకు COWE మార్గదర్శకత్వం, మద్దతు అందిస్తుండడం అభినందనీయం. తెలంగాణ రాష్ట్ర ఆర్థిక వ్యవస్థలో మహిళల పాత్రను బలపరిచేందుకు, రాష్ట్ర ఆర్థిక పురోగతికి నాయకత్వం వహించేలా ప్రభుత్వం నిరంతరం కృషి చేస్తుంది’ అని కొండా సురేఖ వెల్లడించారు. -
నాంపల్లి స్పెషల్ కోర్టులో హాజరైన మంత్రికొండ సురేఖ
-
నాగార్జున పరువు నష్టం కేసు.. కోర్టుకు మంత్రి కొండా సురేఖ
హైదరాబాద్, సాక్షి: తెలంగాణ మంత్రి కొండా సురేఖ గురువారం నాంపల్లి ప్రత్యేక న్యాయస్థానం ఎదుట హాజరయ్యారు. గతంలో తన కుటుంబ వ్యవహారంపై ఆమె చేసిన వ్యాఖ్యలకుగానూ నటుడు అక్కినేని నాగార్జున వేసిన పరువు నష్టం పిటిషన్ వేసిన సంగతి తెలిసిందే. ఈ పిటిషన్‌పై విచారణలో భాగంగా ఇవాళ స్పెషల్ జడ్జి ముందు ఆమె హాజరై వివరణ ఇవ్వనున్నారు.ఈ పిటిషన్‌కు సంబంధించి ఇప్పటికే నాగార్జున కుటుంబ సభ్యుల నుంచి వాంగ్మూలం సేకరించింది కోర్టు. గత వాదనల్లో.. కొండా సురేఖ వ్యాఖ్యల వల్ల నాగార్జున కుటుంబం మానసికంగా ఎంతో కుంగిపోయిందని నాగార్జున తరఫు న్యాయవాది అశోక్ రెడ్డి వాదించారు.బాధ్యతాయుతమైన మంత్రి పదవిలో ఉండి ఇలాంటి వ్యాఖ్యలు చేయడం సరికాదని, కచ్చితంగా కొండా సురేఖ క్రిమినల్ చర్యలకు అర్హురాలని వాదించారు. అయితే తన వ్యాఖ్యలకు ఆమె క్షమాపణ చెప్పిన విషయాన్ని సురేఖతరఫు న్యాయవాది గురుప్రీత్ సింగ్ కోర్టు దృష్టికి తీసుకెళ్లారు. అయితే మీడియా ముఖంగా ఆమె చేసిన వ్యాఖ్యలకు, కోర్టుకు సమర్పించిన వివరాలకు పొంతన లేకుండా ఉందని అశోక్ రెడ్డి వాదించారు.ఈ క్రమంలో ఇరువైపులా వాదనల అనంతరం వ్యక్తిగతంగా హాజరు కావాలని కోర్టు పలుమార్లు మంత్రికి సమన్లు జారీ చేసింది. అయితే పలు ప్రభుత్వ కార్యక్రమాల కారణంగా విచారణకు హాజరుకాలేకపోతున్నట్లు ఆమె వివరణ ఇస్తూ వచ్చారు. ఎట్టకేలకు ఇవాళ ఆమె కోర్టు ఎదుట హాజరై వివరణ ఇచ్చుకున్నారు. -
బీఆర్ఎస్ వల్లే ‘ఆప్’ ఓటమి: కొండా సురేఖ
సాక్షి,హైదరాబాద్:బీఆర్ఎస్ పార్టీ భస్మాసుర హస్తమే ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో ఆమ్ఆద్మీపార్టీ (ఆప్) పరాజయానికి కారణమని మంతత్రి కొండా సురేఖ అన్నారు. శనివారం(ఫిబ్రవరి8) వెలువడ్డ ఢిల్లీ ఫలితాలపై కొండా సురేఖ స్పందించారు. ‘ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత,కేజ్రివాల్‌ల లిక్కర్ స్కాం ఆమ్ ఆద్మీ పార్టీని ఢిల్లీ ప్రజలకు దూరం చేసింది.ఢిల్లీ అసెంబ్లీ ఫలితాలనుద్దేశించి రాహుల్‌గాంధీపై కేటీఆర్ చేసిన వ్యాఖ్యలు అహంకారపూరితమైనవి. ఈ అహంకారాన్ని అణచివేసేందుకే అసెంబ్లీ,పార్లమెంట్ ఎన్నికల్లో ప్రజలు బీఆర్ఎస్కు బుద్ధి చెప్పారు. అధికార పక్షమైన,ప్రతిపక్షమైనా కాంగ్రెస్ పార్టీది ఎప్పుడూ పోరాట పంథానే.కాంగ్రెస్ పార్టీ పరమోన్నత లక్ష్యం ప్రజా సంక్షేమమే’అని కొండా సురేఖ అన్నారు. ‘ఎక్స్’లో కేటీఆర్ వ్యాఖ్యలకు మంత్రి కోమటిరెడ్డి కౌంటర్..తెలంగాణలో ఎలా పుంజుకున్నామో అలాగే దేశవ్యాప్తంగా గెలుస్తాం.పార్లమెంట్ ఎన్నికల్లో బీజేపీ కోసం మీరు సున్నా సీట్లు తెచ్చుకున్నారు.తెలంగాణలో బీజేపీ ఎదుగుదలకు బీఆర్ఎస్సే కారణం -
నేడు గిరిజన దర్బార్
సాక్షి, ఆదిలాబాద్: నాగోబా జాతర సందర్భంగా శుక్రవారం గిరిజన దర్బార్ నిర్వహించనున్నారు. ఇందుకోసం ఆదిలాబాద్ జిల్లా ఇంద్రవెల్లి మండలం కేస్లాపూర్లో అధికారులు ఏర్పాట్లు పూర్తి చేశారు. కాగా, ఎమ్మెల్సీ ఎన్నికల కోడ్ అమలులో ఉండటంతో ఇందులో ప్రజాప్రతినిధులు పాల్గొనడం లేదు. ముందుగా నిర్ణయించిన ప్రకారం.. జిల్లా ఇన్చార్జి మంత్రి సీతక్క, దేవాదాయ శాఖ మంత్రి కొండా సురేఖ దర్బార్‌కు వస్తారని అనుకున్నప్పటికీ కోడ్ నేపథ్యంలో వారు పాల్గొనే అవకాశాలు లేవని చెపుతున్నారు. నాగోబా పూజల్లో మాత్రం మంత్రి సీతక్క పాల్గొంటారని తెలుస్తోంది. ఇదిలా ఉండగా నాగోబా జాతరలో.. గిరిజన దర్బార్‌కు అత్యంత ప్రాముఖ్యం ఉంది. 1940 కాలంలో గిరిజన పోరాట యోధుడు కొమురంభీం వీర మరణం తర్వాత అప్పటి నైజాం సర్కార్.. గిరిజనుల్లో అసంతృప్తి, తిరుగుబాటుకు కారణం ఏమిటనే విషయంపై పరిశోధన కోసం మానవ పరిణామ శాస్త్రవేత్త, లండన్‌కు చెందిన హైమన్‌డార్ఫ్‌ను నియమించారు. ఆయన అప్పట్లో తన భార్య బెట్టి ఎలిజబెత్‌తో ఇక్కడికి వచ్చి జైనూర్ మండలం మార్లవాయిలో స్థిరపడ్డారు. ఆయన ఆదివాసీల జీవితాలపై పరిశోధించడమే కాకుండా వారి సమస్యలు తెలుసుకొని పరిష్కారంకోసం ప్రభుత్వానికి నివేదికలు పంపించారు. గిరిజనుల కోసం విద్య, ఇతర పథకాలను అమలు చేసేలా కృషి చేశారు. ఇదిలా ఉంటే గిరిజనులు అత్యధిక సంఖ్యలో కేస్లాపూర్లో కలుస్తారని, అక్కడ గిరిజన దర్బార్ ఏర్పాటు చేయాలని 1942 ప్రాంతంలో హైమన్‌డార్ఫ్ ప్రభుత్వానికి సూచించారు. ఈ దర్బార్‌లో గిరిజనులు అధికారుల వద్ద తమ సమస్యలను చెప్పుకొనేవారు. అధికారుల ద్వారా వారి వినతులు నైజాం సర్కార్ వరకు చేరేవి. ఆ తర్వాత కూడా ప్రభుత్వాలు ఇదే పద్ధతిని కొనసాగిస్తూ వచ్చాయి. నాగోబా జాతరను అధికారికంగా నిర్వహించడమే కాకుండా ఏటా గిరిజన దర్బార్‌ను ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తుంటారు. ఈ దర్బార్‌లో అనేక కౌంటర్లు ఏర్పాటు చేసి గిరిజనుల నుంచి సంక్షేమ పథకాలకు సంబంధించిన దరఖాస్తులు తీసుకుంటారు. ఏటా జరిగే ఈ కార్యక్రమానికి పెద్దఎత్తున గిరిజనులు తరలి వస్తారు. -
మెదక్ జిల్లా వడియారంలో మంత్రి పర్యటనలో ప్రోటోకాల్ వివాదం
-
మంత్రి కొండా సురేఖ పర్యటనలో ప్రోటోకాల్ వివాదం
సాక్షి, మెదక్ జిల్లా: మెదక్ జిల్లా చేగుంట మండలం వడియారంలో మంత్రి కొండా సురేఖ పర్యటనలో ప్రోటోకాల్ వివాదం నెలకొంది. చెక్కుల పంపిణీ వేదికపైకి కాంగ్రెస్ పార్టీ నియోజకవర్గ ఇన్ఛార్జ్ చెరుకు శ్రీనివాస్‌రెడ్డి రావడంతో దుబ్బాక ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్ రెడ్డి అభ్యంతరం వ్యక్తం చేశారు. చిల్లర రాజకీయాలు చేస్తే సహించేది లేదంటూ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. దీంతో వివాదం నెలకొంది. ఇరు పార్టీల మధ్య తోపులాట జరిగింది. పెద్ద ఎత్తున నినాదాలు చేసుకున్నారు. దీంతో ప్రభుత్వ కార్యక్రమంలో చిల్లర రాజకీయాలు చేయడానికి సిగ్గు ఉండాలి అంటూ మంత్రి కొండా సురేఖ వ్యాఖ్యానించారు.ఎమ్మెల్యే తీరు మార్చుకోవాలిమరోవైపు, ఇందిరమ్మ కమిటీ సభ్యులకు, కాంగ్రెస్ నాయకులకు సమాచారం ఇవ్వకుండా ప్రారంభోత్సవాలు నిర్వహించిన దుబ్బాక ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్‌రెడ్డి తన తీరు మార్చుకోవాలని నార్సింగి కాంగ్రెస్ మండల నాయకులు హెచ్చరించారు. శుక్రవారం నార్సింగి మండల కేంద్రంలో కాంగ్రెస్ జిల్లా నాయకులు బాల్‌రాజ్‌గౌడ్, యాదగిరియాదవ్, ఎస్సీ సెల్ కాంగ్రెస్ జిల్లా అధ్యక్షుడు గోవర్ధన్ మాట్లాడుతూ.. కాంగ్రెస్ ప్రభుత్వం మంజూరు చేసిన సీసీరోడ్ల పనులు ప్రారంభించడానికి వచ్చే ఎమ్మెల్యే ఎవరికి సమాచారం ఇవ్వకుండా రావడంపై మండిపడ్డారు.గత ఏడాది ప్రారంభించిన నర్సంపల్లి జీపీ భవనం తిరిగి ప్రారంభించడం ఎందుకని ప్రశ్నించారు. శిలాపలకపై ఇన్చార్జి మంత్రి పేరు పెట్టకపోవడం ఎంటని ప్రశ్నించారు. ప్రభుత్వం నియమించిన ఇందిరమ్మ కమిటీ సభ్యులకు కూడా సమాచారం ఇవ్వరా అని వాపోయారు. ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్‌రెడ్డి మాజీ ప్రతినిధులను వెంట బెట్టుకోని ప్రారం¿ోత్సవాల చేస్తే చూస్తూ ఉరుకునేదిలేదని తెలిపారు. -
నాగార్జున పరువునష్టం కేసు.. మంత్రి కొండా సురేఖ గైర్హాజరు!
తెలంగాణ మంత్రి కొండా సురేఖపై హీరో నాగార్జున పరువు నష్టం దావా వేశారు. తమ కుటుంబంపై మంత్రి చేసిన వ్యాఖ్యలు తీవ్ర మనోవేదనకు గురి చేశాయని పిటిషన్లో పేర్కొన్నారు. ఈ పిటిషన్‌పై విచారణ చేపట్టిన నాంపల్లి కోర్టు మంత్రికి నోటీసులు జారీ చేసింది. ఈనెల 12న వ్యక్తిగతంగా హాజరవ్వాలని నోటీసుల్లో పేర్కొంది.అయితే ఇవాళ విచారణకు మంత్రి కొండా సురేఖ హాజరు కాలేదు. పలు కార్యక్రమాల కారణంగా విచారణకు హాజరు కాలేకపోతున్నట్లు ఆమె తరఫున న్యాయవాది కోర్టుకు తెలిపారు. ఈ నేపథ్యంలో మరింత గడువు కావాలని న్యాయమూర్తిని కోరారు. దీంతో న్యాయస్థానం ఈ నెల 19కి విచారణను వాయిదా వేసింది. అసలేంటి వివాదం..గతంలో మంత్రి కొండా సురేఖ నాగార్జున ఫ్యామిలీని ఉద్దేశించి తీవ్ర వ్యాఖ్యలు చేసింది. మాజీ మంత్రి కేటీఆర్‌ను విమర్శించే క్రమంలో నాగార్జున ఫ్యామిలీపై కామెంట్స్ చేసింది. దీంతో తమ పరువుకు భంగం కలిగేలా మంత్రి మాట్లాడారని నాగార్జున కోర్టును ఆశ్రయించారు. ఆయన పరువు నష్టం కేసు దాఖలు చేయగా.. న్యాయస్థానం విచారణకు అనుమతించింది. -
వేములవాడలో బీజేపీ, వీహెచ్‌పీ ఆధ్వర్యంలో ధర్నా
-
మరో వివాదంలో మంత్రి కొండా సురేఖ
సాక్షి,రాజన్నసిరిసిల్లజిల్లా: మంత్రి కొండా సురేఖ మరో వివాదంలో చిక్కుకున్నారు. వేములవాడ రాజన్న కోడెల వివాదంలో మంత్రి పేరు వినిపిస్తోంది. కోడెల పంపిణీలో ఆలయ ఈవో వినోద్ రెడ్డి ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నాడని ఆరోపణలు వచ్చాయి. కోడెలు పక్కదారి పడుతున్నాయంటూ విశ్వహిందూ పరిషత్, బజరంగ్ దళ్ నాయకుల ఆందోళన చేపట్టారు.మంత్రి సిఫారసుతో ఆగస్టు 12న 49 కోడెలను రాంబాబు అనే వ్యక్తికి ఆలయ అధికారులు అప్పగించారన్న ఆరోపణలున్నాయి. మంత్రి మెప్పుకోసం నిబంధనలకు విరుద్ధంగా కోడెలను అప్పగించారన్న ప్రచారం జరుగుతోంది. రైతులకు కేవలం రెండు, మూడు కోడెలు అప్పగించి, మంత్రి సిఫారసుతో రాంబాబు అనే వ్యక్తికి ఏకంగా 49 కోడెలు ఇవ్వడం వివాదాస్పదమైంది.తాను టెండర్ ద్వారా పొందిన 49 కోడెలను ఇప్పటికే రాంబాబు పోలీసులకు వెల్లడించారు. ఈ విషయమై మంత్రి అనుచరుడు రాంబాబుపై వరంగల్ జిల్లా గీసుకొండ పోలీస్ స్టేషన్లో కేసు నమోదైంది.పశువుల వ్యాపారిగా ఉన్న మంత్రి అనుచరుడికి రాజన్న కోడెలు అప్పగించడంపై భక్తులు మండిపడుతున్నారు.నిబంధనలకు విరుద్ధంగా ఒకే వ్యక్తికి కోడెల కేటాయింపుపై విచారణ జరపాలని విశ్వహిందూ పరిషత్, భజరంగ్ దళ్ నాయకులు డిమాండ్ చేస్తున్నారు.ఇదీ చదవండి: అది నినాదం కాదు.. కేసీఆర్ ప్రభుత్వ విధానం -
కౌశిక్ రెడ్డిపై కొండా సురేఖ తీవ్ర వ్యాఖ్యలు
సాక్షి, హైదరాబాద్: తెలంగాణలో మరోసారి రాజకీయం వేడెక్కింది. బీఆర్ఎస్ నేతల అరెస్ట్‌తో రాజకీయం రసవత్తరంగా మారింది. ఇదే సమయంలో బీఆర్ఎస్ నేతలపై మంత్రి కొండా తీవ్ర వ్యాఖ్యలు చేశారు. కేసీఆర్ ఫామ్‌హౌస్ నుంచి బయటకు వచ్చి మాట్లాడాలని కామెంట్స్ చేశారు. బీఆర్ఎస్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి అరెస్ట్‌పై మంత్రి కొండా సురేఖ స్పందించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ..‘హుజురాబాద్ ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డి మతిభ్రమించి మాట్లాడుతున్నారు. పిచ్చోడిలా ప్రవర్తిస్తున్నారు. అసెంబ్లీ సమావేశాల సందర్భంగా కూడా ఆయన గొడవ పడే విధంగా వ్యవహారించాడు. బీఆర్ఎస్ పార్టీకి అధికారం లేకపోయే సరికి కేటీఆర్ తట్టుకోలేకపోతున్నారు. ఇన్ని రోజులు పట్టించుకోని వారిని కూడా ఇప్పుడు బయటకు తీసుకువస్తున్నారు.కేసీఆర్‌ను కేటీఆర్ ఫామ్‌హౌస్‌కే పరిమితం చేశారు. కేసీఆర్ ఫామ్‌హౌస్ నుంచి బయటకు వచ్చి మాట్లాడాలి. కోమటిరెడ్డి బ్రదర్స్ గురించి మాట్లాడే అర్హత బీఆర్ఎస్ నేతలకు లేదు. తెలంగాణ కోసం కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి నిజంగా రాజీనామా చేశారు. మంత్రి వెంకట్‌రెడ్డి గురించి గంధపు చెక్కల వ్యాపారి ఒకరు అగౌరవంగా మాట్లాడారు. ఇలాంటి వ్యాఖ్యలు చేసిన వారికి కచ్చితంగా శిక్ష పడుతుంది. ఇష్టం వచ్చినట్టు ఎవరినా మాట్లాడినా బీఆర్ఎస్, బీజేపీ నాయకులు ఎవరైనా సరే.. చూస్తూ ఊరుకునేది లేదు. బీఆర్ఎస్ అధికారాన్ని ఉపయోగించుకోలేదు.. మేము ప్రజలకు మంచి చేస్తున్నాం కాబట్టే ఉత్సవాలు చేసుకుంటున్నాం.ప్రతిపక్ష పార్టీల ఎమ్మెల్యేలకు చెబుతున్నా.. సలహాలు, సూచనలు చేయండి అంతే కానీ అర్ధం పర్థం లేని విమర్శలు ఎందుకు. మా నాయకుల మీద చిలువలు పలువలుగా మాట్లాడితే ఊరుకోము. మీ లాగా మేము అక్రమ అరెస్ట్ చేయదలుచుకుంటే ఒక్కరూ కూడా మిగలరు. ఫోన్ ట్యాపింగ్‌లో మీ హస్తం లేకపోతే అధికారులను దేశాలు ఎందుకు దాటిస్తున్నారు. మీరు చేసేది మంచి అయితే విదేశాల నుండి యూ ట్యూబ్‌లు ఎందుకు నడిపిస్తున్నారు.గతంలో ఉన్నట్లు ఇప్పుడు రాజకీయ సంస్కృతి లేదు. ప్రభుత్వం ఏదైనా తప్పు చేస్తే తప్పని చెప్పండి అంతే కానీ లేని పోనీ విమర్శలు చేయకండి. ప్రతిపక్షాలు అంటే జనాలు ఆహ్వానించాలి కానీ జనాలు కేటీఆర్‌ను దగ్గరికి రానివ్వడం లేదు. మేము మళ్ళీ అధికారం లోకి వస్తాము. సంవత్సర కాలం ఓర్చుకున్నాము ఇక ఓర్చుకోము. ఏది పడితే అది మాట్లాడితే క్షమించము. మా పాలన చూసి వాళ్ళు ఓర్చుకోలేక పోతున్నారు. అధికారులు అధికార పార్టీకి తగ్గట్టుగా పని చేస్తారు. ఇప్పటి వరకు యూ ట్యూబ్‌ల విషయంలో చేసిన తప్పులు ఇక చేయము. గతంలో తెలంగాణ తల్లి బొమ్మని దొరసాని లాగా సృష్టించారు. గతంలో కవిత ఫేస్ లాగా తెలంగాణ తల్లి విగ్రహాన్ని రూపొందించారు. మేము మన తెలంగాణ ప్రజల ఆత్మని ఆవిష్కరిస్తున్నాము’ అని కామెంట్స్ చేశారు. -
నా గురించి మాట్లాడే అర్హత మంత్రికి లేదు: ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్
సాక్షి, హైదరాబాద్: గురుకులాల్లో ఫుడ్ పాయిజన్ ఘటనల వెనుక బీఆర్ఎస్ నేత ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ హస్తం ఉందంటూ మంత్రి కొండా సురేఖ సంచలన వ్యాఖ్యలు చేసిన విషయం తెలిసిందే. కొండా సురేఖ వ్యాఖ్యలపై తాజాగా ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ ఘాటుగా స్పందించారు. ఈ మేరకు ఎక్స్‌లో పోస్టు చేశారు.సభ్యత, సంస్కారం, మానవత్వం అంటే ఎంటో కాంగ్రెస్‌కు తెలియదని ధ్వజమెత్తారు. బీర్లు, బిర్యానీలు, రేవ్ పార్టీలు మాత్రమే వారికి తెలుసని మండిపడ్డారు. ఓరుగల్లు నగరంలో ఎంతో మంది విద్యార్థుల జీవితాలను నాశనం చేశారని సురేఖపై విమర్శలు గుప్పించారు. తన గురించి కానీ, పేద గురుకుల విద్యార్థుల గురించి కానీ మాట్లాడే అర్హత మంత్రికి ఏ మాత్రం లేదని హెచ్చరించారు. కేటీఆర్ గురుకుల బాట అనగానే వెన్నులో చలి పుడుతోందా..? రేవంత్ రెడ్డి అని ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ ప్రశ్నించారు. దమ్ముంటే మీరు గురుకులాల మీద బహిరంగ చర్చకు రండి. అంతే కానీ మత్తులో ఉన్న ఈ మతి స్థిమితం లేని మంత్రులను, భజంత్రీలను పంపించి నవ్వులపాలు కాకండి అని సీఎం రేవంత్ రెడ్డికి ప్రవీణ్ కుమార్ సూచించారు.సభ్యత-సంస్కారం- మానవత్వం అంటే ఎంటో తెలియని మీకు, బీర్లు, బిర్యానీలు, రేవ్ పార్టీలు మాత్రమే తెలిసిన మీకు,ఓరుగల్లు నగరంలో ఎంతో మంది విద్యార్థుల జీవితాలను నాశనం చేసిన మీకు,నా గురించి కానీ, పేద గురుకుల విద్యార్థుల గురించి కానీ మాట్లాడే అర్హత ఏ మాత్రం లేదు, మంత్రి గారు. రేవంత్… pic.twitter.com/fZd4wh9G5s— Dr.RS Praveen Kumar (@RSPraveenSwaero) November 29, 2024 -
ఆర్ఎస్ ప్రవీణ్ పై మంత్రి కొండా సురేఖ సంచలన ఆరోపణలు
-
‘ఫుడ్ పాయిజన్ ఘటనల వెనుక ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ హస్తం’
సాక్షి, హైదరాబాద్: గురుకుల పాఠశాల్లో కుట్రల వెనుక బీఆర్ఎస్ నేత ఆర్.ఎస్ ప్రవీణ్ కుమార్ హస్తం ఉందని ఆరోపించారు మంత్రి కొండా సురేఖ. ఫుడ్ పాయిజన్ ఘటనలు ఆయన ఆధ్వర్యంలోనే జరుగుతున్నాయని అన్నారు. గతంలో ఆయన గురుకులాల కార్యదర్శిగా పనిచేశారని, తన అనుచరులనే సిబ్బందిగా నియమించుకున్నారని ఆరోపించారు. అన్ని హాస్టల్స్‌లో ప్రవీణ్ కుమార్ అనుచరులు ఉన్నారని, త్వరలోనే అన్ని విషషయాలు బయటకు వస్తాయని చెప్పారు.బాలిక మృతి బాధాకరం..ఈ మేరకు సచివాలయం మీడియా పాయింట్ వద్ద మంత్రి కొండా సురేఖ మాట్లాడుతూ.. సంక్షేమ హాస్టళ్లను గత ప్రభుత్వం పట్టించుకోలేదని విమర్శలు గుప్పించారు. హాస్టళ్లలోని విద్యార్థులను ఉత్తమ విద్యార్థులుగా తీర్చిదిద్దే బాధ్యత ప్రభుత్వానిదేనని స్పష్టం చేశారు. తమ ప్రభుత్వం వచ్చాక ఒక విద్యార్థిని చనిపోయిందని, అది కూడా బాధకరమని అన్నారు. బాధిత విద్యార్థినికి ప్రత్యేక వైద్య సదుపాయం కల్పించినప్పటికీ దురదృష్టవశాత్తు చనిపోయిందని తెలిపారు. బాలిక మృతి విషయాన్ని బీఆర్ఎస్ తమ రాజకీయ లబ్ది కోసం వాడుకోవాలని ప్రయత్నిస్తోందని.. ఆమె మృతిపై రాజకీయాలు చేయడం తగదని సూచించారు.‘ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ తన కమ్యూనిటీని అడ్డం పెట్టుకొని ఒకప్పుడు మాఫియా నడిపారు. సైకో రావు అండ్ బీఆర్ఎస్ గ్రూప్ ప్రభుత్వంపై బట్టకాల్చి వేయాలని చూస్తున్నారు. ప్రభుత్వానికి చెడ్డపేరు తెచ్చేందుకు ప్రయత్నిస్తున్నారు. అభివృద్ధిని అడ్డుకుంటున్నారు. హాస్టల్స్‌లో ఉండే విద్యార్థులను సొంత పిల్లల లెక్క ప్రభుత్వం చూడాలి. కానీ గత పదేళ్ళలో ఏనాడు అలా జరగలేదు.అమ్మాయి చనిపోతే బీఆర్ఎస్ పార్టీ ఏమైనా ఆదుకున్నారా? గత ప్రభుత్వం హయంలో కస్తూర్బా ఘటన, గురుకులల్లో ఘటనలు, రెండెకెల సంఖ్యలో ఉన్నాయి. గత ప్రభుత్వంలో ఇలాంటి ఘటనలు జరిగితే ఎవ్వరూ పట్టించుకోలేదు. ఫుడ్ పాయిజన్, మూసీ, లగచర్ల ఘటనలో బీఆర్ఎస్ ప్రమేయం ఉన్నట్లు అనుమానంగా ఉంది. మల్లన్న సాగర్ ముంపు ప్రజలకు గత ప్రభుత్వం డబ్బులు ఇవ్వలేదు. బాధితులు ఇప్పటికీ ఇబ్బంది పడుతున్నారు.అందుకే కేటీఆర్ జైలుకు వెళ్తా అంటున్నారుమహబూబాబాద్లో పసిపిల్లలు ఉన్న వాళ్లను సైతం గత ప్రభుత్వంలో జైల్లో పెట్టారు. పక్కా ప్రణాళికతో ప్రభుత్వానికి చెడ్డపేరు వచ్చేలాగ చేస్తున్నారు. ప్రభుత్వం ఇంటలిజెన్స్ వర్గాల ద్వారా నిఘా పెడుతుంది. అన్ని బయటకు వస్తాయి. కేటీఆర్ తప్పులు చేశారు అని ఆయనకు తెలుసు అందుకే జైలుకు వెళ్తా అని ముందే చెప్తున్నారు. కేటీఆర్ ఏనాడు ప్రజలను కలువలేదు..ఇప్పుడేమో స్వాతంత్ర సమర యోధుడు లెక్క మాట్లాడుతున్నారు.’ అని కొండా సురేఖ మండిపడ్డారు.కవితకు ప్రాధాన్యత ఇస్తున్న కేసీఆర్..కవిత జైల్లో ఉన్నప్పుడు బాగానే ఉన్నాడు. ఆమె బయటకు రాగానే మానసికంగా ఇబ్బంది పడుతున్నాడు. కేసీఆర్ కవితకు ప్రాధాన్యత ఇస్తున్నారట. కేటీఆర్‌ను పట్టించుకోవడం లేదట. కేసీఆర్ కుటుంబంలో కవిత - హరీష్ రావు ఒక్కటి అయ్యారని చర్చ జరుగుతుంది. బాల్క సుమన్, గాధరి కిషర్ అప్పట్లో ఆర్ ప్రవీణ్ కుమార్‌పై ఆరోపణలు చేశారు. ఆయన అవినీతి పాల్పడినట్లు అప్పటి బీఆర్ఎస్ నాయకులు ఆరోపించారు.కేటీఆరే కాదు కేసీఆర్ కూడా జైలుకే..జైలుకు పోవాలని కేటీఆర్‌కు ఉబలాటంగా ఉన్నట్లు ఉంది. సరైన ఆధారాలు దొరికినప్పుడు జైలుకు పంపుతాం. సమయం వచ్చినప్పుడు జైలుకు కచ్చితంగా పోతావు కేటీఆర్. ఆధారాలు రాగానే కవిత జైలుకు వెళ్ళింది. కేటీఆర్ కూడా వెళ్తాడు. కేటీఆర్ మాత్రమే కాదు కవిత - కేసీఆర్ కూడా జైలుకు వెళ్తారు. -
నాగ్ పిటిషన్.. కొండా సురేఖకు బిగ్ షాక్
హైదరాబాద్, సాక్షి: తెలంగాణ మంతత్రి కొండా సురేఖకు బిగ్ షాక్ తగిలింది. సినీ నటుడు అక్కినేని నాగార్జున వేసిన పిటిషన్‌ను నాంపల్లి కోర్టు కాగ్నిజెన్స్‌లోకి తీసుకుంది. దీని ఆధారంగా.. మంత్రి కొండా సురేఖకు సమన్లు జారీ చేస్తూ తమ ఎదుట హాజరు కావాలని ఆదేశించింది. తన కుటుంబంపై మంత్రి కొండా సురేఖ చేసిన అనుచిత వ్యాఖ్యలపై నాగార్జున దావా వేసిన విషయం తెలిసిందే.చేసిన ఆరోపణలకుగానూ కొండా సురేఖపై క్రిమినల్ చర్యలు తీసుకోవాలని నాగార్జున వేసిన పిటిషన్‌పై నాంపల్లి కోర్టులో వాదనలు జరిగాయి. నాగార్జున తరఫు న్యాయవాది అశోక్ రెడ్డి వాదనలు వినిపించారు. వాదనల సందర్భంగా నాగార్జున తరఫు న్యాయవాది అశోక్ రెడ్డి మాట్లాడుతూ.. నాగార్జునపై కొండా సురేఖ అభ్యంతరకర వ్యాఖ్యలు చేశారన్నారు. ఆ తర్వాత ‘ఎక్స్’లో క్షమాపణ కోరుతూ పోస్ట్ పెట్టారన్నారు.ఎక్స్‌లో మంత్రి కొండా సురేఖ పెట్టిన పోస్టును ఆయన కోర్టు ముందు చదివి వినిపించారు. బాధ్యతాయుతమైన మంత్రి పదవిలో ఉండి ఇలాంటి వ్యాఖ్యలు చేయడం సరైంది కాదని అశోక్‌రెడ్డి అన్నారు. కచ్చితంగా కొండా సురేఖ క్రిమినల్ చర్యలకు అర్హురాలు అని పేర్కొన్నారు. అంతకు ముందు.. కొండా సురేఖ తరఫు న్యాయవాది గురుప్రీత్ సింగ్.. ఆమె క్షమాపణలు చెప్పినట్లుగా కౌంటర్ దాఖలు చేశారు.అయితే ఈ వ్యాఖ్యల వల్ల నాగార్జున కుటుంబం మానసికంగా ఎంతో కుంగిపోయిందని న్యాయవాది అశోక్ రెడ్డి వాదించారు. అంతకు ముందు.. నాగార్జున, ఆయన కుటుంబ సభ్యుల వాంగ్మూలాన్ని కోర్టు నమోదు చేసింది. ఈ పిటిషన్‌ను పరిగణనలోకి తీసుకుంటూ.. డిసెంబర్ 12న సురేఖను కోర్టుకు వ్యక్తిగతంగా హాజరు కావాలని కోర్టు ఆదేశాలు జారీ చేసింది.ఇదీ చదవండి: కొండా సురేఖకు ఇదొక గుణపాఠం కావాలి! -
జంతు దాడుల పరిహారం రూ. 20 లక్షలకు పెంపుపై కసరత్తు
సాక్షి, హైదరాబాద్: వన్యప్రాణుల దాడుల ఘటనల్లో మరణించిన వారికి ఇచ్చే నష్టపరిహారాన్ని రూ. 10 లక్షల నుంచి రూ. 20 లక్షలకు పెంచే విషయాన్ని పరిశీలిస్తున్నట్లు అటవీ, పర్యావరణ శాఖ మంత్రి కొండా సురేఖ తెలిపారు. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక పరిహారాన్ని రూ. 5 లక్షల నుంచి 10 లక్షలకు పెంచిన విషయాన్ని ఆమె గుర్తుచేశారు. శుక్రవారం కొండా సురేఖ అధ్యక్షతన అమ్రాబాద్, కవ్వాల్ టైగర్ రిజర్వ్ గవరి్నంగ్ బాడీస్ సమావేశం జరిగింది.ఈ భేటీలో సురేఖ మాట్లాడుతూ ఆమ్రాబాద్, కవ్వాల్ టైగర్ రిజర్వ్‌ల పరిధిలోని గ్రామాల తరలింపు ప్రక్రియ ప్రజల భావోద్వేగాలతో ముడిపడి ఉన్నందున వారిలో విశ్వాసాన్ని కల్పిస్తూ పునరావాస ప్రక్రియను చేపట్టాలని అధికారులకు సూచించారు. పునరావాసం కోసం తరలించిన కుటుంబాలకు శాశ్వత పట్టాలు అందించాలని, రాకపోకల నిమిత్తం గ్రీన్ పాసులు అందించాలని, స్కూల్ ఏర్పాటు చేయాలని ఖానాపూర్ ఎమ్మెల్యే వెడ్మా బొజ్జు మంత్రిని కోరారు. సాధారణ అటవీ ఉత్పత్తులను సేకరించే స్థానికులపై మానవత్వం చూపాలని మంత్రి అధికారులకు సూచించారు. అక్కమహాదేవి గుహలు, సలేశ్వరం జాతరకు సౌకర్యాలు దోమలపెంట–శ్రీశైలం ఎకో టూరిజం సర్క్యూట్లో భాగంగా అక్కమహాదేవి గుహలను సందర్శించే భక్తులకు యాత్రా సౌకర్యాల కల్పనకు ఉన్న అవకాశాలను పరిశీలించాలని అధికారులను మంత్రి సురేఖ ఆదేశించారు. తెలంగాణ అమర్నాథ్ యాత్రగా ప్రసిద్ధిగాంచిన సలేశ్వరం జాతరను భవిష్యత్తులో చేపట్టనున్న సర్క్యూట్లలో చేర్చి ప్రభుత్వపరంగా యాత్రా సౌకర్యాలను కలి్పంచే దిశగా కార్యాచరణ చేపట్టాలన్నారు. ఈ భేటీలో అచ్చంపేట ఎమ్మెల్యే వంశీ కృష్ణ, నిజామాబాద్ రూరల్ ఎమ్మెల్యే ఆర్. భూపతిరెడ్డి, అటవీశాఖ ముఖ్య కార్యదర్శి అహ్మద్ నదీమ్, పీసీసీఎఫ్ డోబ్రియాల్, పిసిసిఎఫ్ (వైల్డ్ లైఫ్) ఏలూసింగ్, డీసీసీఎఫ్ ఆంజనేయులు(హెడ్ ఆఫీస్), ఓఎస్డీ శంకరన్ పాల్గొన్నారు. -
నాగార్జున పరువు నష్ట దావా కేసులో కోర్టులో ముగిసిన వాదనలు
-
పరువు నష్టం కేసు.. మంత్రిపై క్రిమినల్ చర్యలకు డిమాండ్!
తెలంగాణ మంత్రి కొండా సురేఖ టాలీవుడ్ హీరో నాగార్జునపై అభ్యంతరకర వ్యాఖ్యలు చేసిన సంగతి తెలిసిందే. ఆ తర్వాత అక్కినేని నాగార్జున మంత్రిపై పరువునష్టం దావా వేశారు. తాజాగా ఈ కేసులో నాంపల్లి కోర్టులో వాదనలు జరిగాయి. ఈ సందర్భంగా కొండా సురేఖ ట్విట్టర్లో పెట్టిన పోస్ట్‌ను నాగార్జున తరఫున న్యాయవాది అశోక్ రెడ్డి కోర్టు ముందు చదువు వినిపించారు. బాధ్యతాయుతమైన మంత్రి పదవిలో ఉండి ఇలాంటి కామెంట్స్ చేయడం సరైంది కాదని.. కచ్చితంగా కొండా సురేఖ క్రిమినల్ చర్యలకు అర్హురాలని ఆయన వాదించారు. ఇలాంటి కామెంట్స్ వల్ల నాగార్జున కుటుంబ సభ్యులు మానసికంగా ఎంతో కుంగిపోయారని న్యాయమూర్తికి విన్నవించారు.కొండాసురేఖ లాయర్ వేసిన కౌంటర్‌పై నాగార్జున తరఫు న్యాయవాది వాదనలు వినిపించారు. కొండ సురేఖ మాట్లాడిన మాటలు చాలా అభ్యంతరకరంగా ఉన్నాయని.. నాగార్జున ఫ్యామిలీని కించ పరిచేలా ఆమె వ్యాఖ్యలు చేశారని అన్నారు. కొండ సురేఖపై క్రిమినల్ చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. కాగా.. ఇప్పటికే ఈ కేసులో నాగార్జున, ఆయన కుటుంబ సభ్యుల వాంగ్మూలాన్ని కోర్టు నమోదు చేసింది.ట్విటర్లో క్షమాపణలు..అయితే తన కామెంట్స్‌పై మంత్రి కొండా సురేఖ ట్విట్టర్ ద్వారా క్షమాపణలు కోరిన సంగతి తెలిసిందే. ఆ పోస్ట్‌ను కూడా కోర్టు ముందు నాగార్జున తరుపు న్యాయవాది అశోక్ రెడ్డి చదివి వినిపించారు. నాగార్జున కుటుంబంపై మంత్రి చేసిన కామెంట్స్ తీవ్రమైన వ్యతిరేకత వచ్చింది. దీంతో వెంటనే మంత్రి సోషల్ మీడియా ద్వారా క్షమాపణలు కోరింది. 'నా వ్యాఖ్యల పట్ల మీరు కానీ.. మీ అభిమానులు కానీ మనస్తాపానికి గురైనట్లైతే బేషరతుగా నా వ్యాఖ్యలను పూర్తిగా ఉపసంహరించుకుంటున్నా.. అన్యద భావించవద్దు' అంటూ కొండా సురేఖ ట్విట్ చేసింది. -
రెండో రాజధానిగా వరంగల్: మంత్రి కొండా సురేఖ
సాక్షి, వరంగల్: దుష్టపాలన అంతమొందించి ఏడాది పాలన సందర్భంగా విజయోత్సవ సభ నిర్వహిస్తున్నామని మంత్రి కొండా సురేఖ అన్నారు. హన్మకొండ ఆర్ట్స్ కళాశాల మైదానంలో సభ ఏర్పాట్లను పరిశీలించిన అనంతరం మంత్రులు కొండా సురేఖ, సీతక్క మీడియాతో మాట్లాడారు.ఇందిరాగాంధీ జయంతి సందర్భంగా లక్ష మంది మహిళలతో విజయోత్సవ సభ నిర్వహిస్తున్నామని కొండా సురేఖ తెలిపారు. వరంగల్‌ను తెలంగాణకు రెండో రాజధాని కోసం అడుగులు పడుతున్నాయని ఆమె తెలిపారు. సీఎం రేవంత్ రెడ్డి వరంగల్ అభివృద్ధిపై దృష్టి సారించారు. గత ప్రభుత్వం రాష్ట్రాన్ని అప్పులపాలు చేసింది. గతంలో ఇక్కడ నిర్వహించిన రాహుల్ గాంధీ సభ విజయవంతమైంది. ఈ సభ కూడా విజయవంతం చేయాలి’’ అని కొండా సురేఖ పిలుపునిచ్చారు.బీఆర్ఎస్ పార్టీకే ఆ చరిత్ర ఉంది: మంత్రి సీతక్కబీఆర్ఎస్, బీజేపీకి రాజకీయ లబ్ధి తప్ప వేరే ఆలోచన లేదని.. అందుకే అధికారులపై దాడులు చేస్తున్నారని మంత్రి సీతక్క మండిపడ్డారు. మేము మంచి పనులు చేస్తే బీఆర్ఎస్ అడ్డుకుంటోంది. హైడ్రాకు అడ్డుపడుతున్నారు. మీరు చేసిన సకల జనుల సర్వే ఏమైంది?. లిమ్కా బుక్ రికార్డు కోసమే బీఆర్ఎస్ సకల జనుల సర్వే చేసింది. కానీ మేము చేసే కులగణన ప్రభుత్వ పథకాలు సక్రమంగా అందించడానికే. బీఆర్ఎస్ పార్టీకే మూటలు ఇచ్చిన చరిత్ర ఉంది. దేశంలో అత్యధికంగా దోచుకున్న పార్టీ బీఆర్ఎస్. మాకు మూటలు మోసే అలవాటు లేదు. వాళ్లు అధికారంలో ఉన్నప్పుడు పోలీసులను మెచ్చుకున్నారు.. ఇప్పుడు తిడుతున్నారు..కొన్ని యూట్యూబ్ ఛానెల్స్ పెట్టి తప్పుడు ప్రచారం చేస్తున్నారు. ప్రజలకు వాస్తవాలు తెలియజేసేందుకే వరంగల్ సభ నిర్వహిస్తున్నాం. ఉక్కు మహిళ ఇందిరా గాంధీ జయంతి సందర్భంగా ప్రగతి సభ నిర్వహిస్తున్నాం. మహిళలకు సంబంధించిన ప్రగతి నివేదిక వివరిస్తాం. ఆర్టీసీ బస్సులు కూడా మహిళలే నిర్వహించేలా సీఎం చర్యలు చేపడుతున్నారు. మహిళలను కోటీశ్వరులు చేయడమే మా లక్ష్యం. ఆరు గ్యారంటీల్లో... ఉచిత బస్సు, 200 యూనిట్ల ఉచిత విద్యుత్, రైతు రుణమాఫీ, ఆరోగ్యశ్రీ పెంపు అమలు చేశాం’’ అని సీతక్క తెలిపారు. -
కోర్టులో కొండా కౌంటర్..
-
అధికారులు ఏం చేస్తున్నారు?
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో రోడ్డు నిర్మాణ ప్రాజెక్టులకు అటవీ అనుమతులివ్వడంలో నిర్లక్ష్యానికి తావు లేదని మంత్రులు కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి, కొండా సురేఖ స్పష్టం చేశారు. ఆయా ప్రాజెక్ట్‌లకు అటవీ అనుమతుల సాధనలో జాప్యంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. గత ప్రభుత్వ నిర్లక్ష్య ధోరణి రాష్ట్ర ప్రగతికి ప్రతిబంధకంగా మారిందని అన్నారు. శనివారం సచివాలయంలో రోడ్లు, భవనాలు, అటవీ శాఖల అధికారులతో ఇద్దరు మంత్రులు నిర్వహించిన సమీక్షలో పలు రహదారుల పరిస్థితిపై చర్చించారు. రాష్ట్రంలో ఐదేళ్లుగా 7 రోడ్డు ప్రాజెక్టుల పనులు, నాలుగేళ్లుగా ఒక ప్రాజెక్టు, మూడేళ్లుగా 20 ప్రాజెక్టులు, ఏడాది కాలంగా 31 ప్రాజెక్టులు అటవీ అనుమతులు లేక ఆగిపోయాయని కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి తెలిపారు. గత ఐదేళ్లుగా ఇన్ని అనుమతులు పెండింగ్ లో ఉంటే రెండు శాఖల అధికారులు ఏం చేస్తున్నారని మంత్రి ప్రశ్నించారు. కేంద్రం నుంచి అనేక రహదారులకు అనుమతులు సాధించినా ఒక్కడ అనుమతులు లేక కొత్త రోడ్ల మంజూరీ గురించి కేంద్రాన్ని అడగడం ఇబ్బందిగా మారిందన్నారు. అటవీ అనుమతుల కోసం ఉమ్మడి జిల్లాల వారీగా పర్యవేక్షణాధికారులను నియమించాలని ఈ సందర్భంగా అటవీశాఖ ముఖ్యకార్యదర్శి అహ్మద్ నదీమ్, పీసీసీఎఫ్ డోబ్రియల్లను మంత్రి కొండా సురేఖ ఆదేశించారు.డీఎఫ్ఓల స్థాయిలో 11 అటవీ అనుమతుల ఫైళ్ల ఆలస్యంపై అధికారులను ఆమె ప్రశ్నించారు. అటవీ ప్రాంతాల్లో రోడ్ల నిర్మాణానికి ఫైళ్ల పరిష్కారంలో అనవసర జాప్యం లేకుండా ఫాస్ట్ ట్రాక్ పద్ధతిలో పూర్తి చేసేలా చర్యలు తీసుకుంటామని మంత్రి కోమటిరెడ్డికి హామీనిచ్చారు. కాగా, అటవీ అనుమతుల సాధన పర్యవేక్షణకు ఆర్అండ్బీ శాఖ పరిధిలో ఎస్ఈ స్థాయి అధికారిని ప్రత్యేకంగా నియమిస్తామని మంత్రి కోమటిరెడ్డి తెలిపారు. రీజనల్ ఆఫీసర్ తీరు సరికాదు..రాష్ట్ర రోడ్డు ప్రాజెక్టుల అటవీ అనుమతులను పర్యవేక్షించే కేంద్ర పర్యావరణ, అటవీ శాఖ రీజనల్ ఆఫీసర్ త్రినాథరావు చిన్న చిన్న అంశాలపై వివరణలతో కాలయాపన చేయడంపై ఇద్దరు మంత్రులు ఆవేదన వ్యక్తం చేశారు. కొత్త రాష్ట్రంలో రహదారుల అభివృద్ధికి అండగా నిలబడాల్సిందిపోయి.. సాంకేతిక కారణాలతో ఫైళ్లను జాప్యం చేయడం తగదన్నారు. -
కేంద్ర మంత్రి బండి సంజయ్ కి కేటీఆర్ నోటీసులు
-
ఎలాంటి ఆధారాలూ లేకుండా దిగజారి మాట్లాడారు: కేటీఆర్
సిటీ కోర్టులు (హైదరాబాద్): మంత్రి కొండా సురేఖ చేసిన వ్యాఖ్యలు తనతో పాటు, తమ పార్టీకి కూడా తీవ్ర నష్టం చేకూర్చే విధంగా ఉన్నాయని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీమంత్రి కేటీ రామారావు చెప్పారు. ఆమె వ్యాఖ్యలు అత్యంత నీచంగా ఉన్నాయని, వాటిని విని తాను షాక్‌కు గురయ్యానని పేర్కొన్నారు. తనపై సురేఖ చేసిన కామెంట్లను చూసి పలువురు సాక్షులు తనకు ఫోన్ చేశారని తెలిపారు. కొండా సురేఖ తనపై అసత్య ఆరోపణలు చేసి తన పరువుకు భంగం కలిగించారని పేర్కొంటూ కేటీఆర్ దాఖలు చేసిన పరువు నష్టం కేసు విచారణ బుధవారం నాంపల్లిలోని స్పెషల్ జ్యుడీషియల్ ఫస్ట్‌క్లాస్ మేజిస్ట్రేట్, ఎక్సైజ్ కోర్టులో జరిగింది. ఈ సందర్భంగా కేటీఆర్ తన వాంగ్మూలం ఇచ్చారు. వాస్తవానికి గత వారం విచారణలోనే కేటీఆర్ తన వాంగ్మూలాన్ని ఇవ్వాల్సి ఉండగా..ఆయన కోర్టుకు రాలేకపోవడంతో న్యాయవాదులు వాయిదా కోరారు. జడ్జి ఎస్.శ్రీదేవి విచారణను బుధవారానికి వాయిదా వేయగా కేటీఆర్ హాజరై వాంగ్మూలం ఇచ్చారు. కేటీఆర్‌తో పాటు సాక్షులు మాజీ మంత్రి సత్యవతి రాథోడ్, దాసోజు శ్రవణ్‌కుమార్, తుల ఉమా, బాల్క సుమన్ కూడా తమ వాంగ్మూలాన్ని ఇచ్చేందుకు కోర్టుకు హాజరయ్యారు. అయితే సమయం లేకపోవడంతో శ్రవణ్‌కుమార్ వాంగ్మూలం మాత్రమే కోర్టు రికార్డు చేసింది. మిగతావారి వాంగ్మూలం తీసుకునేందుకు వీలుగా విచారణను ఈనెల 30కి వాయిదా వేసింది. బుధవారం నాటి విచారణకు కేటీఆర్ తరఫు న్యాయవాదులు సురేందర్, అరవింద్, సిద్ధార్థ, బీఆర్ఎస్ లీగల్ సెల్ న్యాయవాది జక్కుల లక్ష్మణ్ హాజరయ్యారు. తదుపరి విచారణకు సాక్షులు అందరూ హాజరుకావాలని ఆరోజు వారి వాంగ్మూలం తీసుకుంటామని జడ్జి శ్రీదేవి తెలిపారు. కేటీఆర్ వాంగ్మూలం ఇలా.. ‘డబుల్ పీజీ చేసిన నేను తొలుత అమెరికాలో ఉద్యోగం చేశా. 2006లో తెలంగాణ ఉద్యమం నేపథ్యంలో హైదరాబాద్‌కు వచ్చి కేసీఆర్ సారథ్యంలో ఉద్యమంలో పాల్గొన్నా. తెలంగాణ ఏర్పడ్డాక మొదటిసారిగా టీఆర్ఎస్ పార్టీ తరఫున సిరిసిల్ల నియోజకవర్గం నుంచి పోటీ చేశా. ఇప్పటివరకు ఐదుసార్లు ఎమ్మెల్యేగా గెలుపొందా. ఐటీ మంత్రిగా బాధ్యతలు నిర్వర్తించా. వివిధ దేశాల నుంచి కంపెనీలు తీసుకువచ్చి రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టేలా కృషి చేశా. కేవలం తెలంగాణలోనే కాకుండా ప్రపంచ వ్యాప్తంగా మంచి గుర్తింపు తెచ్చుకున్నా. అలాంటి నాపై కొండా సురేఖ చేసిన వ్యాఖ్యలు ఆశ్చర్యం కలిగించాయి. దాదాపు 18 ఏళ్లుగా రాజకీయ జీవితంలో అనేక కార్యక్రమాల ద్వారా ప్రజలకు సేవచేస్తున్న నాపై ఎలాంటి ఆధారాలు లేకుండా ఆరోపణలు చేయడంతో, నా గురించి తెలిసిన చాలామంది బాధపడ్డారు. సురేఖ బాధ్యత గల మంత్రి పదవిలో ఉండి అత్యంత దిగజారుడు వ్యాఖ్యలు చేశారు. ఆమె మాట్లాడిన మాటలు కొన్ని చెప్పలేని విధంగా, తీవ్ర ఆవేదన కలిగించేలా ఉన్నాయి. నేను డ్రగ్ అడిక్ట్నని, రేవ్ పార్టీలు నిర్వహిస్తానని, ఇతరులకు డ్రగ్స్ అలవాటు చేస్తానని, సినీ, రాజకీయ నేతలు చాలామంది విడాకులకు నేనే కారణమని.. ఎలాంటి ఆధారాలూ లేకుండా కేవలం పబ్లిసిటీ కోసం అలాంటి వ్యాఖ్యలు చేశారు. నేను అన్నీ చెప్పలేకపోతున్నా. ఫిర్యాదులో ఉన్న అంశాలను పరిగణనలోకి తీసుకోండి. సురేఖ చేసిన కామెంట్ల వీడియోలను కూడా కోర్టుకు సమర్పించా. నాపై అసత్య ఆరోపణలు చేసిన సురేఖపై క్రిమినల్ చర్యలు తీసుకోండి..’ అని కేటీఆర్ కోర్టును కోరారు. సురేఖ అనుచిత వ్యాఖ్యలతో బాధపడ్డా.. ‘కేటీఆర్ నాకు 2007 నుంచి తెలుసు. ఆయనతో పాటు తెలంగాణ ఉద్యమంలో కలిసి పనిచేశా. 2024 అక్టోబర్ 2న గాంధీ జయంతి సందర్భంగా మంత్రి కొండా సురేఖ మాట్లాడుతూ కేటీఆర్‌పై చేసిన అనుచిత వ్యాఖ్యలతో చాలా బాధపడ్డా. మా నాయకుడిపై నిరాధారమైన ఆరోపణలు చేసినందుకు ఆమెపై క్రిమినల్ చర్యలు తీసుకోండి..’ అని శ్రవణ్‌కుమార్ తన వాంగ్మూలంలో కోరారు. మాజీ మంత్రులు జగదీశ్‌రెడ్డి, మహమూద్ అలీతో పాటు పలువురు బీఆర్ఎస్ నేతలు బుధవారం కోర్టుకు వచ్చారు. -
కొండా సురేఖ వ్యాఖ్యలతో మనస్తాపం చెందా.. కోర్టులో కేటీఆర్
సాక్షి,హైదరాబాద్ : బాధ్యతాయుతమైన మంత్రి పదవిలో ఉన్న కొండా సురేఖ చేసిన అసత్య ఆరోపణలతో తాను తీవ్ర మనస్తాపం చెందినట్లు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ నాంపల్లి ప్రత్యేక కోర్టులో స్టేట్మెంట్ ఇచ్చారు. మంత్రి కొండా సురేఖ చేసిన వివాదాస్పద వ్యాఖ్యలపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పరువు నష్టం దావా వేశారు. ఆ కేసు విచారణ నిమిత్తం.. ఈరోజు (బుధవారం) నాంపల్లి ప్రత్యేక కోర్టులో కేటీఆర్ హజరయ్యారు. ప్రస్తుతం కోర్టు కేటీఆర్ స్టేట్మెంట్ను రికార్డ్ చేస్తుంది. నాంపల్లి కోర్టుకు కేటీఆర్‌తో పాటు జగదీశ్వర్ రెడ్డి,బాల్క సుమన్, సత్యవతి రాథోడ్‌లు వెళ్లారు. కోర్టులో కేటీఆర్ స్టేట్మెంట్అమెరికాలో ఆరేళ్లు చదువుకున్నానుచదువు పూర్తి అయ్యాక ఇండియా కు తిరిగి వచ్చానుభారత్కు వచ్చాక తెలంగాణ ఉద్యమం జరుగుతుంది2006 ఆగస్ట్ కేసీఆర్ కరీంనగర్ పార్లమెంట్ స్థానానికి రాజీనామా చేశారుమళ్ళీ ఉప ఎన్నికలు వచ్చాయి2006 నుంచి 2009వరకు తెలంగాణ రాష్ట్ర సమితి జనరల్ సెక్రటరీగా పనిచేశానుతెలంగాణ ఉద్యమంలో అనేక పోరాటాలు చేశాను 2009లో సిరిసిల్ల నియోజకవర్గం నుండి అసెంబ్లీ ఎన్నికలో గెలిచానుఐదుసార్లు నేను ఎమ్మెల్యేగా గెలిచాప్రతి ఎన్నికల్లో భారీ మెజారిటీతో గెలుపొందాను2014లో నేను మంత్రి గా పనిచేశాను2023 వరకు నేను మంత్రిగా ఉన్నాను మంత్రిగా ఉన్న కొండాసురేఖ నాపై లేని పోనీ అసత్య ఆరోపణలు చేసిందినాపై ఇటీవల మంత్రి కొండా సురేఖ ఎలాంటి ఆధారాలు లేకుండా మాట్లాడిందిఆమె చేసిన వాఖ్యలు సమాజంలో తీవ్ర ప్రభావం చూపే అవకాశం ఉందిఆమె చేసిన వాఖ్యలు అనేక ప్రచార మధ్యమాల్లో ప్రచారం అయ్యాయినా పరువు ప్రతిష్టలు దెబ్బ తీసే విధంగా మాట్లాడారు ఫోన్ ట్యాపింగ్ చేసానని వాఖ్యలు చేశారుఆమె చేసిన వ్యాఖ్యలు పూర్తిగా అవాస్తవం బాధ్యత గల పదవిలో ఉన్న మహిళ మంత్రి నా పరువుకు భంగం కలిగించేలా వాఖ్యలు చేశారునేను డ్రగ్ అడిక్ట్ అని, రేవ్ పార్టీలు ఆరెంజ్ చేస్తా అని కొండా సురేఖ వాఖ్యానించారుసాక్షులు నాకు 18 సంవత్సరాలుగా తెలుసుసాక్షులు కొండా సురేఖ వాఖ్యలను టీవీలో చూసి వారు నాకు ఫోన్ చేశారుకొండ సురేఖ చేసిన వ్యాఖ్యల వల్ల సమాజంలో నా పరువు, ప్రతిష్ట దెబ్బతిన్నదికొండ సురేఖ పబ్లిసిటీ కోసమే ఇలాంటి వాఖ్యలు చేసి నాతో పాటు బీఆర్ఎస్ పార్టీని డ్యామేజ్ చేశారురాజకీయ కక్ష్య సాధింపు చర్యలో భాగంగానే ఇలాంటి వాఖ్యలు చేశారుతనపై సమాజంలో ఉన్న మంచి పేరు ప్రతిష్టాలను దిగజార్చాలానే అలాంటి వాఖ్యలు చేశారుఅన్ని ఆధారాలను కోర్టుకు సమర్పించానుయూట్యూబ్ లింక్స్, పేపర్ స్టేట్ మెంట్స్ అన్ని కోర్టుకు ఇచ్చానుచట్ట ప్రకారం మంత్రిపై చర్యలు తీసుకోవాలి అని కేటీఆర్ కోర్టుకు స్టేట్మెంట్ ఇచ్చారు. అనంతరం కేటీఆర్ గురించి కొండా సురేఖ ఏం మాట్లాడారు అని కోర్టు ప్రశ్నించింది. దీంతో ఫిర్యాదు కాపీలో వివరాలు ఉన్నాయని కేటీఆర్ తరుఫు న్యాయవాది కోర్టుకు తెలిపారు. ఆ కాపీలోని వివరాల్నే ప్రామాణికంగా తీసుకోవాలా ? స్టేట్మెంట్ ఇస్తారా ? మరోసారి కోర్టు వివరణ అడిగింది. అందుకు స్పందించిన కేటీఆర్.. కొండా సురేఖ అత్యంత జుగుప్సాకరంగా మాట్లాడారు. ఆ జుగుప్సాకరమైన వ్యాఖ్యల్ని వివరంగా చెప్పమంటే చెప్తాను అని అన్నారు. అందుకు కోర్టు అనుమతించగా.. కొండా సురేఖ చేసిన కొన్ని వ్యాఖ్యల్ని కేటీఆర్ చదివి వినిపించారు. నాగ చైతన్య విడాకులకు నేను కారణం అని ఆమె అన్నారుఎన్కన్వెన్షన్ విషయంలో సమంత, నా గురించి లేని పోని విధంగా మాట్లాడారునేను ఫోన్లు ట్యాప్ చేశానని వ్యాఖ్యానించారునేను ఒక డ్రగ్ బానిస అని, ఇతరులను డ్రగ్ తీసుకునేలా ప్రేరేపించనని ఆమే వ్యాఖ్యానించారునా వల్ల పెళ్లిల్లు బ్రేక్ అవుతున్నాయనీ ఆమె అన్నారు. అనంతరం కేసు విచారణ నిమిత్తం కేటీఆర్ ఇచ్చిన స్టేట్మెంట్ సరిపోతుందని కోర్టు తెలిపింది. తర్వాత కేటీఆర్ తరుఫు సాక్షుల స్టేట్మెంట్ను కోర్టు రికార్డ్ చేయడం ప్రారంభించిందికొండా సురేఖ వ్యాఖ్యలపై కేటీఆర్ మనస్తాపంఇటీవల నిర్వహించిన ఓ మీడియా సమావేశంలో కొండా సురేఖ సినీరంగంలోని పలువురిని ప్రస్తావిస్తూ కేటీఆర్‌పై ఆరోపణలు చేశారు. ఆ ఆరోపణల నేపథ్యంలో కొండా సురేఖపై కేటీఆర్ నాంపల్లి ప్రత్యేక కోర్టులో పరువు నష్టం దావా వేశారు.కొండా సురేఖ చేసిన వ్యాఖ్యలపై తాను తీవ్ర మనస్తాపం చెందానని,కొండా సురేఖపైన క్రిమినల్ చర్యలు తీసుకోవాలని కోరుతూ కేటీఆర్ పరువు నష్టం దావా వేశారు.కేటీఆర్ తరఫు న్యాయవాది ఉమామహేశ్వర్రావు ఇందుకు సంబంధించిన పిటిషన్ దాఖలు చేశారు. బీఆర్ఎస్ నేతలు బాల్క సుమన్, సత్యవతి రాథోడ్, తుల ఉమ, దాసోజు శ్రవణ్‌ను సాక్షులుగా పేర్కొన్నారు. గత విచారణ సందర్భంగా కేటీఆర్ స్టేట్మెంట్ రికార్డ్ చేసేందుకు సిద్ధమైంది. అయితే, అందుకు కేటీఆర్ కొంతసమయం అడిగారు. దీంతో విచారణను నాంపల్లి స్పెషల్ కోర్టు ఈరోజుకు వాయిదా వేసింది. కేటీఆర్ ఈ రోజు కోర్టుకు హాజరై స్టేట్మెంట్ ఇస్తున్నారు. -
ఇవాళ నాంపల్లి ప్రత్యేక కోర్టుకు కేటీఆర్, కొండా సురేఖ
-
కొండా సురేఖపై పరువు నష్టం కేసు.. ఇదొక గుణపాఠం కావాలి: కేటీఆర్
సాక్షి, హైదరాబాద్: ఆధారాలు లేని ఆరోపణలు చేస్తే వదిలిపెట్టేది లేదంటూ.. కొండా సురేఖపై పరువు నష్టం దావా అంశంలో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి కేటీఆర్ వ్యాఖ్యానించారు. పిరికిపందల మాదిరి తన వ్యక్తిత్వంపైన ఎలాంటి ఆధారాలు లేని ఆరోపణలు చేస్తున్న వారిని వదిలిపెట్టేది లేదన్న కేటీఆర్.. ఇలాంటి నీచమైన ప్రయత్నాలకు వ్యతిరేకంగా బలమైన స్టాండ్ తీసుకున్నట్లు ఆయన తెలిపారు.ఇప్పటిదాకా ఇలాంటి వ్యాఖ్యలను వదిలిపెట్టినా, ఇక పైన మీడియా, సోషల్ మీడియాలో చేసే ఇలాంటి నీచమైన ప్రచారాన్ని వదిలిపెట్టేది లేదని కేటీఆర్ స్పష్టం చేశారు. ఒక ప్రజా ప్రతినిధిగా సుదీర్ఘకాలంగా ప్రజా జీవితంలో ప్రజల తాలూకు అంశాలకే తాను ప్రాధాన్యత ఇచ్చాను. ఇతరులపై వ్యక్తిగత ఆరోపణలు, నీచమైన వ్యాఖ్యలు ఏనాడూ చేయలేదు. రాజకీయ కక్ష సాధింపు చర్యల్లో భాగంగా నీచమైన వ్యాఖ్యలు చేస్తామంటే ఊరుకునేది లేదు’’ అంటూ కేటీఆర్ హెచ్చరించారు.రాజకీయ విమర్శలపేరు చెప్పి, ఎలాంటి ఆధారాలు లేకుండా నీచమైన వ్యాఖ్యలు చేసే వారికి కొండా సురేఖపై వేసిన రూ. 100 కోట్ల రూపాయల పరువు నష్టం దావా ఒక గుణపాఠం కావాలి. న్యాయస్థానాల్లో సత్యం గెలుస్తుందన్న నమ్మకం నాకున్నది’’ అని కేటీఆర్ పేర్కొన్నారు.ఇదీ చదవండి: బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే జీవన్‌రెడ్డికి ఝలక్ -
ఆలయ భూముల్లోని పేదలకు ప్రత్యామ్నాయ స్థలాలు: మంత్రి కొండా సురేఖ
సాక్షి, హైదరాబాద్: కబ్జాల్లో ఉన్న దేవాలయ భూములను స్వా«దీనం చేసుకునే క్రమంలో ఆ భూ ముల ఆక్రమణలో ఉన్న పేదలకు ప్రత్యామ్నాయ స్థలాలు ఇచ్చే అంశాన్ని పరిశీలిస్తున్నామని దేవాదాయ శాఖ మంత్రి కొండా సురేఖ పేర్కొన్నారు. ఆలయాల భూములు స్వాధీనం చేసుకుని దేవుడి పేరుతో పాస్ పుస్తకాలు జారీ చేయనున్నట్టు వెల్లడించారు. శుక్రవారం సాయంత్రం ఆమె సచివాలయంలో మీడియాతో మాట్లాడుతూ, ఇప్పటికే 34,092 ఎకరాల ఆలయ భూముల జియోట్యాగింగ్ ప్రక్రియ పూర్తయిందని, రాష్ట్రవ్యాప్తంగా సర్వే చేసి ఆలయ భూముల హద్దులు నిర్ధారిస్తామని చెప్పారు. ప్రస్తుతం నాలుగు జిల్లాల్లో పైలట్ ప్రాజెక్టుగా సర్వే నిర్వహిస్తున్నట్టు వెల్లడించారు. ఎకో–టెంపుల్ టూరిజం.. రాష్ట్రంలో విస్తారంగా ఉన్న అటవీ భూముల్లో సుందర ప్రాంతాలను గుర్తించి పర్యాటకులను ఆకట్టుకునేలా ఎకో టూరిజం ప్రాజెక్టును చేపడుతున్నట్టు మంత్రి సురేఖ తెలిపారు. అలాగే దీనిని ఇప్పుడు ఆధ్యాత్మికతకు జోడించి ఆయా ప్రాంతాల్లోని ఆలయాలను అద్భుత పర్యాటక కేంద్రాలుగా మార్చేందుకు చర్యలు చేపడతామని చెప్పారు. దేవాలయాల్లో ఫిర్యాదుల పుస్తకం.. రాష్ట్రంలోని అన్ని దేవాలయాల్లో ఫిర్యాదులు నమోదు చేసేందుకు పుస్తకాలను ఏర్పాటు చేస్తామని, వాటిల్లో నమోదయ్యే ఫిర్యాదుల ఆధారంగా పరిష్కార చర్యలు తీసుకుంటామని మంత్రి కొండా సురేఖ తెలిపారు. వేములవాడ దేవాలయ గోపురానికి కూడా స్వర్ణ తాపడం చేయిస్తామని, ఇందుకు 65 కిలోల ఆలయ బంగారాన్ని వాడతామని ఆమె చెప్పారు. ఆలయంలోని వెండితో పల్లకీ చేయిస్తామన్నారు. అలాగే బాసర దేవాలయాన్ని రూ.110 కోట్లతో అభివృద్ధి చేయనున్నట్టు తెలిపారు. ఈ సమావేశంతో దేవాదాయ శాఖ ముఖ్య కార్యదర్శి శైలజా రామయ్యర్, కమిషనర్ హన్మంతరావు, అటవీ శాఖ ముఖ్యకార్యదర్శి అహ్మద్ నదీమ్, పీసీసీఎఫ్ డోబ్రియాల్లు పాల్గొన్నారు. -
యాదగిరిగుట్ట లడ్డూపై కొండా సురేఖ కీలక వ్యాఖ్యలు
సాక్షి,హైదరాబాద్:యాదగిరిగుట్ట శ్రీలక్ష్మీనరసింహస్వామికి ప్రభుత్వం 60 కిలోల బంగారు తాపడం పెట్టనుందని రాష్ట్ర దేవాదాయ శాఖ మంత్రి కొండా సురేఖ తెలిపారు. అక్టోబర్ 18(శుక్రవారం) ఆమె మీడియాతో మాట్లాడారు.‘రాష్ట్రవ్యాప్తంగా అన్ని గుడుల లడ్డూలను టెస్టింగ్‌కు పంపితే యాదగిరి గుట్ట లడ్డూ భేష్ అని రిపోర్ట్ వచ్చింది. వేములవాడ దేవస్థానం మాస్టర్‌ప్లాన్ త్వరలోనే విడుదల చేస్తాం. త్వరలోనే దేవాలయాల్లో 24 రకాల ఆన్లైన్ సేవలను అందించడానికి ప్రణాళికలు సిద్ధమవుతున్నాయి.వేములవాడ రాజన్నకు 65 కిలోల బంగారంతో తాపడం చేయిస్తాం. బాసర సరస్వతి టెంపుల్ పునర్నిర్మాణం కోసం మాస్టర్‌ప్లాన్ రెడీ అయింది. వేములవాడను రూ.110 కోట్లతో అభివృద్ధి చేస్తాం’అని మంత్రి సురేఖ తెలిపారు.ఇదీ చదవండి: కేటీఆర్,హరీశ్‌రావులకు సీతక్క కౌంటర్ -
కొండా సురేఖపై పరువు నష్టం కేసు.. నేడు నాంపల్లి కోర్టుకు కేటీఆర్
సాక్షి, హైదరాబాద్: కొండా సురేఖపై పరువు నష్టం కేసులో నేడు నాంపల్లి కోర్టుకు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి కేటీఆర్ వెళ్లనున్నారు. కొండా సురేఖపై పరువు నష్టం కేసులో కేటీఆర్ పిటిషన్‌పై నేడు విచారణ జరగనుంది. ఇప్పటికే 23 రకాల ఆధారాలను కేటీఆర్ తరుపు న్యాయవాది కోర్టుకు అందజేశారు.బీఎన్ఎస్ యాక్ట్ సెక్షన్ 356 కింద చర్యలు తీసుకోవాలంటూ కేటీఆర్ పిటిషన్లో కోరారు. కేటీఆర్‌తో పాటు నలుగురు సాక్షులు బాల్క సుమన్, సత్యవతి రాథోడ్, తుల ఉమా, దాసోజు శ్రావణ్ స్టేట్మెంట్లను న్యాయస్థానం రికార్డు చేయనుంది. హీరో నాగార్జున పిటిషన్‌పై మంత్రి కొండా సురేఖకు నోటీసులు ఇచ్చిన సంగతి తెలిసిందే.కొండా సురేఖ తనపై వివాదాస్పద వ్యాఖ్యలు చేసి తన ప్రతిష్టకు భంగం కలిగించారంటూ కేటీఆర్ ఈ నెల 3న నాంపల్లి క్రిమినల్ కోర్టులో పరువునష్టం కేసు వేశారు. ఈ పిటిషన్‌ను ఈ నెల 14న విచారించిన కోర్టు విచారణను 18వ తేదీకి వాయిదా వేసింది. కేటీఆర్ సహా సాక్షుల వాంగ్మూలాలను నేడు (శుక్రవారం) నమోదు చేస్తామని కోర్టు తెలిపింది. -
కొండా సురేఖ వ్యాఖ్యలపై మరోసారి స్పందించిన సమంత
-
నాకు వారి సపోర్ట్ లేకుండా ఉంటే.. మంత్రి వ్యాఖ్యలపై మరోసారి సమంత
సమంత- నాగ చైతన్యల విడాకులపై తెలంగాణ మంత్రి కొండా సురేఖ చేసిన వ్యాఖ్యలు దేశవ్యాప్తంగా సంచలనంగా మారిన విషయం తెలిసిందే. వారిద్దరూ విడిపోవడానికి కారణం మాజీ మంత్రి కేటీఆర్ ఆంటూ ఆమె వ్యాఖ్యలు చేశారు. తెలుగు చిత్ర పరిశ్రమలోని పలువురు మహిళా తారల జీవితాలను కేటీఆర్ నాశనం చేశారని కొండా సురేఖ ఆరోపించడంతో వివాదం మొదలైంది. ఈ క్రమంలో టాలీవుడ్ టాప్ హీరోలు అందరూ సమంత, అక్కినేని కుటుంబానికి అండగా నిలిచారు. మంత్రి చేసిన ఆరోపణలపై వారు భగ్గుమన్నారు. అయితే, ఈ విషయం గురించి మరోసారి సమంత ఓ ఇంటర్వ్యూలో స్పందించారు.కొండా సురేఖ వ్యాఖ్యలను తప్పు బడుతూ.. సౌత్ ఇండియాలోని సినీ నటీనటులు చాలామంది సమంతకు సపోర్ట్‌గా నిలిచారు. ఈ క్రమంలో నెటిజన్లు, ఆమె అభిమానులు కూడా మద్ధతిచ్చారు. అయితే, తనకు అండగా నిలిచిన వారి గురించి సమంత ఇలా చెప్పారు. 'నా గురించి ద్వేష పూరితమైన వ్యాఖ్యలు చేసినప్పుడు సౌత్ ఇండియన్ ఇండస్ట్రీ నా పక్షాన నిలబడింది. వారందరూ నాకు ధైర్యాన్ని ఇచ్చారు. ఈ రోజు నేను ఇక్కడ కూర్చున్నానంటే దానికి కారణం ఇండస్ట్రీతో పాటు ఈ ప్రజలు నన్ను వదులుకోకపోవడమే.. వారి ప్రేమ, నాపై ఉన్న విశ్వాసమే ఈ వివాదం నుంచి త్వరగా బయటకు వచ్చేలా చేసింది. పరిశ్రమ నాకు సాయం చేయకుండా ఉండుంటే.. దీని నుంచి కోలుకోవడానికి చాలా సమయం పట్టేది. ఇలాంటి సమయంలో వారే లేకుంటే నేను మరింతగా కుంగిపోయేదానిని. అందరి సపోర్ట్ వల్లే మళ్లీ నేను ఇక్కడ తిరిగి మీ ముందు కూర్చున్నాను.' అని సమంత తాజాగా జరిగిన ఓ ఇంటర్వ్యూలో పేర్కొంది.సమంతపై మంత్రి కొండా సురేఖ చేసిన వ్యాఖ్యలను తప్పుపడుతూ టాలీవుడ్ స్టార్స్ చిరంజీవి, ఎన్టీఆర్,మహేశ్ బాబు, అల్లు అర్జున్, మాజీ మంత్రి ఆర్కే రోజా తదితరులు భగ్గుమన్నారు. ఆమె చేసిన వ్యాఖ్యలపై అక్కినేని నాగార్జున న్యాయ పోరాటం చేస్తున్న విషయం తెలిసిందే. -
వరంగల్ కాంగ్రెస్‌లో పవర్ వార్..
సాక్షి, హైదరాబాద్: కాంగ్రెస్‌లో ముసలం మొదలైంది. అధికారంలోకి వచ్చి ఏడాదైనా గడవకుండానే వరంగల్ పార్లమెంటు నియోజకవర్గం వేదికగా పార్టీలో అంతర్గత లుకలుకలు ప్రారంభమయ్యాయి. జిల్లా నుంచి కేబినెట్లో ప్రాతినిధ్యం వహిస్తున్న మంత్రి కొండా సురేఖపై హను మకొండ పార్లమెంటు పరిధిలోని కాంగ్రెస్ ఎమ్మెల్యేలు బహిరంగంగానే పార్టీకి ఫిర్యాదులు చేయడం గమనార్హం. పరకాల నియోజకవర్గంలో ఇప్పటికే కొండా సురేఖ, ఎమ్మె ల్యే రేవూరి ప్రకాశ్‌రెడ్డిల మధ్య విభేదాలు బహిర్గతం కాగా, ఇప్పుడు పార్లమెంటు పరిధిలోని మిగిలిన ఎమ్మెల్యేలు కూడా జత కలిశారు.మంత్రి సురేఖ తమ నియోజ కవర్గ రాజకీయాల్లో జోక్యం చేసుకుంటున్నారని, తమకు నష్టం కలిగే విధంగా వ్యవహరిస్తున్నారంటూ వీరంతా పీసీసీ చీఫ్ మహేశ్‌కుమార్‌గౌడ్‌కు లిఖితపూర్వక ఫిర్యాదు చేశారు. బుధవారం ఉదయం హైదర్‌గూడ ఎమ్మెల్యే క్వార్టర్స్‌లో రాష్ట్ర అధ్యక్షుడిని కలిసి వినతిపత్రం అందజేశారని, తమ నియోజకవర్గాల్లో కలుగజేసుకోకుండా మంత్రి సురేఖను నియంత్రించాలని కోరారని తెలుస్తోంది. దీనికి ముందు మంగళవారం రాత్రి పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇన్చార్జి దీపాదాస్ మున్షీని కూడా కలిసి ఈ మేరకు ఫిర్యాదు చేయడం గమనార్హం. వివాదాస్పదమవుతున్న సురేఖ వ్యవహార శైలిరాష్ట్ర మంత్రి కొండా సురేఖ వ్యవహార శైలి ఇటీవలి కాలంలో వివాదాలకు దారితీస్తోంది. సినీ నటుడు నాగార్జున కుటుంబంపై ఆమె చేసిన వ్యాఖ్యలు దుమారం సృష్టించాయి. పరకాల ఎమ్మెల్యే రేవూరి ప్రకాశ్‌రెడ్డితో వివాదం పార్టీకి తలనొప్పిగా మారింది. వరంగల్ పార్లమెంటు పరిధిలోని ఇతర ఎమ్మెల్యేలతో సైతం సఖ్యత కొరవడటం తాజాగా చర్చనీయాంశమవుతోంది. దీంతో సురేఖ విషయంలో ఎప్పుడు ఏం జరుగుతుందోననే ఆసక్తి కాంగ్రెస్ పార్టీ వర్గాల్లో నెలకొంది. ఇటీవలి పరిణామాలు ఆమె భవితవ్యంపై ఎలాంటి ప్రభావం చూపుతాయనే చర్చ గాంధీభవన్ వర్గాల్లో జరుగుతోంది. -
కొండా సురేఖపై టీపీసీసీకు ఫిర్యాదు
-
కాంగ్రెస్‌లో ‘కొండా’ వర్గం కలకలం.. హస్తినకు హస్తం నేతలు
వరంగల్, సాక్షి: వరంగల్‌లో కాంగ్రెస్ రాజకీయాలు హీటెక్కాయి. రేపు (గురువారం) ఢిల్లీ వరంగల్ కాంగ్రెస్ ఎమ్మెల్యేలు పయనం కానున్నారు. ఇప్పటికే కాంగ్రెస్ సీనియర్ నేత కేసీ వేణుగోపాల్ అపాయింట్మెంట్ను ఎమ్మెల్యేలు కోరినట్ల సమాచారం. మంత్రి కొండా సురేఖపై అధిష్టానానికి ఫిర్యాదు చేయనున్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే రాష్ట్ర కాంగ్రెస్ వ్యవహారాల ఇంచార్జీ దీపాదాస్ మున్షీ, రాష్ట్ర పీసీసీ అధ్యక్షుడు మహేశ్‌కుమార్ వరంగల్ కాంగ్రెస్ ఎమ్మెల్యేలు ఫిర్యాదు చేసిన విషయం తెలిసిందే. మంత్రి కొండా సురేఖ వర్గం తమను ఇబ్బందులకు గురిచేస్తోందని ఎమ్మెల్యే ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. కోండా సురేఖపై ఏడుగురు ఎమ్మెల్యేలు ఫిర్యాదు చేశారు.చదవండి: TG: ఓటుకు నోటు కేసు విచారణ వాయిదా -
ఫ్లెక్సీ వార్.. గీసుకొండ పోలీస్ స్టేషన్ కు కొండా సురేఖ
-
ఫ్లెక్సీ వార్.. కొండా సురేఖ వర్సెస్ రేవూరి
సాక్షి, వరంగల్: గీసుకొండ పీఎస్ వద్ద ఉద్రిక్తత పరిస్థితి నెలకొంది. మండలంలోని ధర్మారంలో పరకాల ఎమ్మెల్యే రేవూరి ప్రకాశ్ రెడ్డి, మంత్రి కొండా సురేఖ వర్గీయుల మధ్య వివాదం చోటుచేసుకుంది. దసరా పండుగను పురస్కరించుకొని ధర్మారంలో కొండా వర్గీయులు ఏర్పాటుచేసిన ఫ్లెక్సీలో ఎమ్మెల్యే రేవూరి ఫొటో లేదని రేవూరి వర్గీయులు నిరసన తెలిపారు.ఈ క్రమంలో ఫ్లెక్సీని ధ్వంసం చేశారని రేవూరి వర్గీయులపై కొండా అనుచరులు దాడి జరిపారంటూ పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో గీసుకొండ పోలీసులు కొండా వర్గానికి చెందిన ముగ్గురిని అదుపులోకి తీసుకున్నారు. గీసుకొండ పీఎస్‌కు వచ్చిన మంత్రి కొండా సురేఖ.. సీఐ సీటులో కూర్చొని కార్యకర్తలను ఎందుకు అరెస్ట్ చేశారంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. పోలీస్‌స్టేషన్‌కు కొండా సురేఖ వర్గీయులు భారీగా చేరుకున్నారు. అరెస్ట్ చేసిన వారిని విడుదల చేయాలంటూ నినాదాలు చేశారు. దీంతో ఘర్షణ వాతావరణం చోటుచేసుకుంది.గీసుకొండ వివాదంపై స్పందించిన ఎమ్మెల్యే రేవూరి ప్రకాశ్‌రెడ్డి.. ఇక్కడి వ్యవహారం ఇప్పటికే అధిష్టానం దృష్టికి వెళ్లింది. పార్టీ వర్గాలతో మాట్లాడి తదుపరి కార్యాచరణ ఉంటుందన్నారు. పార్టీ అంతర్గత వ్యవహారం కాదు.. స్థానికతకు సంబంధించిన ఇష్యూ.. ఎవరు తొందరపడినా పార్టీకే నష్టం.. సమన్వయం పాటించడం మంచిందని రేవూరి అన్నారు.ఇదీ చదవండి: సునీల్ పోస్టులో తప్పేముంది?.. ఏపీ సర్కార్‌పై ఆర్ఎస్ ప్రవీణ్‌కుమార్ ట్వీట్ -
మంత్రి పదవి నుంచి ‘కొండా’ను తప్పిస్తారా? పీసీసీ చీఫ్ క్లారిటీ
హైదరాబాద్, సాక్షి: ఆల్ ఇండియా మజ్లిస్-ఇ-ఇత్తెహాదుల్ ముస్లిమీన్(ఎంఐఎం) పార్టీతో స్నేహం వేరు.. శాంతిభద్రతలు వేరని తెలంగాణ కాంగ్రెస్ పీసీసీ అధ్యక్షుడు మహేష్‌కుమార్ గౌడ్ అన్నారు. ఆయన కాంగ్రెస్ నేత ఫిరోజ్ ఖాన్‌పై దాడి విషయాన్ని సీఎం రేవంత్‌రెడ్డి దృష్టికి తీసుకెళ్లానని తెలిపారు. ఆయన శుక్రవారం మీడియా చిట్‌చాట్‌లో మాట్లాడారు. ‘‘దాడుల విషయంలో కఠినంగా ఉంటాం. పార్టీలో నేతల చేరికలు జరిగిన చోట కొంత ఇబ్బంది అవుతుంది. అందుకే చేరికలకు బ్రేక్ వేశాం. దసరాకు రెండో విడత కార్పోరేషన్ పదవులు అనుకున్నాం. కానీ కుదరలేదు. దీపావళి లోపు పూర్తి చేస్తాం. త్వరలోనే జిల్లా పర్యటనకు వెళ్తాను భావితరాల భవిష్యత్ కోసమే హైడ్రా, మూసీ అభివృద్ధి. మూసీ అభివృద్ధికి రు. లక్షా యాబై వేల కోట్లని ఎక్కడా మేం చెప్పలేదు.పదేళ్ల బీఆర్ఎస్ ప్రభుత్వంలో వందేళ్ల దోపిడీ జరిగింది. ఏఐసీసీ నేతలంత బిజీబిజీగా ఉండడం వల్లే మంత్రివర్గం, పీసీసీ కార్యావర్గం ఆలస్యం అయింది. త్వరలోనే రెండు భర్తీ చేస్తాం. మంత్రి కొండా సురేఖ ఇటీవల తన వాఖ్యలు వెనక్కి తీసుకున్నారు. ఆరోజే ఆ వ్యవహారం క్లోజ్ అయింది. మంత్రి వర్గం నుంచి కొండా సురేఖను తప్పిస్తారని ప్రత్యర్ధులు చేస్తున్నది ప్రచారం మాత్రమే. వాస్తవం కాదు. ఈ విషయంపై అధిష్టానం ఎటువంటి వివరణ అడగలేదు’’ అని అన్నారు. -
మంత్రి కొండా సురేఖకు నాంపల్లి కోర్టు నోటీసులు
సిటీ కోర్టులు: మంత్రి కొండా సురేఖకు నాంపల్లి కోర్టు నోటీసులు జారీ చేసింది. సినీ హీరో నాగార్జున దాఖలు చేసిన పరువు నష్టం కేసు విచారణ గురువారం నాంపల్లిలోని స్పెషల్ జ్యుడీషియల్ ఫస్ట్ క్లాస్ మేజి్రస్టేట్, ఎక్సైజ్ కోర్టులో జరిగింది. హీరో నాగచైతన్య, సమంత విడాకుల అంశంపై మంత్రి కొండా సురేఖ అసంబద్ధమైన మాటలు మాట్లాడారని, ఆమె తమ కుటుంబ పరువు తీసేలా మాట్లాడినందుకు ఆమెపై చట్టరీత్యా చర్యలు తీసుకోవాలని హీరో నాగార్జున మంత్రిపై పరువునష్టం కేసు దాఖలు చేసిన విషయం తెలిసిందే.అయితే గత విచారణలో ఫిర్యాదుదారు నాగార్జునతో పాటు మరో సాక్షి సుప్రియా వాంగ్మూలాన్ని కోర్టు నమోదు చేసుకుంది. దీనిపై విచారణ చేపట్టిన స్పెషల్ జ్యుడీíÙయల్ ఫస్ట్ క్లాస్ మేజిస్ట్రేట్, ఎక్సైజ్ కోర్టు జడ్జి ఎస్. శ్రీదేవి మంత్రి కొండా సురేఖకు నోటీసులు జారీ చేస్తూ విచారణను ఈనెల 23కి వాయిదా వేసింది. ఆరోజు కొండా సురేఖ కోర్టుకి హాజరైతే ఆమె వాంగ్మూ లాన్ని కోర్టు నమోదు చేసుకునే అవకాశం ఉంది. ఈ కేసు విచారణకు నాగార్జున తరఫున న్యాయ వాది అశోక్‌రెడ్డి, మంత్రి కొండా సురేఖ తరఫున న్యాయవాది, టీపీసీసీ లీగల్ సెల్ రాష్ట్ర వైస్ చైర్మన్ తిరుపతి వర్మ హాజరయ్యారు. మంత్రి కొండా సురేఖపై కేటీఆర్ పరువు నష్టం కేసు మంత్రి కొండా సురేఖపై మరో పరువు నష్టం కేసు దాఖలైంది. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ గురువారం నాంపల్లిలోని స్పెషల్ జ్యుడీషియల్ ఫస్ట్ క్లాస్ మేజి్రస్టేట్, ఎక్సైజ్ కోర్టులో సెక్షన్ 356 కింద పరువునష్టం కేసు దాఖలు చేశారు. మంత్రి పదవిలో ఉండి.. స్థాయిని మరచి దిగజారుడు వ్యాఖ్యలు చేశారని, తన ప్రతిష్ట దెబ్బతినేలా ఆమె మాట్లాడారని కేటీఆర్ ఆ పిటిషన్లో పేర్కొన్నారు. ఎలాంటి ఆధారాలు లేకుండా కేవలం దురుద్దేశపూర్వకంగా, అడ్డగోలు వ్యాఖ్యలు చేసిన కొండా సురేఖపైన చట్ట ప్రకారం చర్యలు తీసుకోవాలని ఆయన కోరారు. తనపై అసత్యపు ఆరోపణలు చేసిన మంత్రి కొండా సురేఖ ఆ వ్యాఖ్యలను వెనక్కి తీసుకొని వారం రోజుల్లోగా బహిరంగ క్షమాపణ చెప్పాలని, లేదంటే పరువునష్టం కేసు దాఖలు చేస్తామని లీగల్ నోటీసు కూడా జారీ చేశామని పేర్కొన్నారు.అయితే లీగల్ నోటీసు గడువు తీరినా ఆమె క్షమాపణ చెప్పలేదని, అందుకే ఆమెపై చట్టప్రకారం చర్యలు తీసుకోవాలని కేసు దాఖలు చేసినట్టు కేటీఆర్ పేర్కొన్నారు. కొండా సురేఖ గతంలో కూడా అసత్యపు ఆరోపణలు, అడ్డగోలు వ్యాఖ్యలు చేసినప్పుడు భారత ఎన్నికల సంఘం ఆమెకు చీవాట్లు పెట్టిందని, ఆమె తాజాగా చేసిన వ్యాఖ్యలు కేవలం రాజకీయపరమైన వ్యాఖ్యలు మాత్రమే కావని, తన పరువుకు భంగం కలిగించేలా ఉద్దేశపూర్వకంగా, ప్రణాళికా బద్ధంగా చేసిన కుట్రగా ఉన్నాయని ఆయన తెలిపారు. మంత్రి చేసిన వ్యాఖ్యలను, వాటి వెనుక ఉన్న నేరపూరిత దురుద్దేశాలను పరిగణనలోకి తీసుకొని ఆమెపై చర్యలు తీసుకోవాలని కేటీఆర్ తన పిటిషన్లో పేర్కొన్నారు. కాగా, ఈ పిటిషన్ సోమవారం జడ్జి ముందుకు వచ్చే అవకాశం ఉంది. -
మంత్రి కొండా సురేఖకు కోర్టు నోటీసులు
తెలంగాణ మంత్రి కొండా సురేఖకు కోర్టు నోటీసులు జారీ చేసింది. కొద్దిరోజుల క్రితం అక్కినేని నాగార్జున కుటుంబం మీద ఆమె చేసిన వ్యాఖ్యలు పెద్ద దుమారాన్నే రేపాయి. ఈ క్రమంలో మంత్రి తమ కుటుంబంపై అమర్యాద పూర్వక వ్యాఖ్యలు చేశారని నాగార్జున కోర్టును ఆశ్రయించి పరువు నష్టం దావా వేశారు.రాజకీయ లబ్ధి కోసమే మంత్రి కొండా సురేఖ తమ కుటుంబంపై తప్పుడు వ్యాఖ్యలు చేశారని సినీ నటుడు నాగార్జున నాంపల్లి కోర్టులో స్టేట్మెంట్ ఇచ్చారు. అయితే, తాజాగా స్పెషల్ మెజిస్ట్రేట్ కోర్టు మంత్రి కొండా సురేఖకు నోటీసులు జారీ చేసింది. తదుపరి విచారణ ఈ నెల 23న జరగనుంది.కొండా సురేఖ చేసిన వివాదాస్పద వ్యాఖ్యలపై తెలుగు చిత్ర పరిశ్రమ నుంచి కూడా తీవ్రమైన వ్యతిరేకత వచ్చింది. రాజకీయ పరంగా మాజీ మంత్రి కేటీఆర్‌ను దూషించే క్రమంలో సినీనటి సమంత విడాకులు, రకుల్ ప్రీత్‌సింగ్ పెళ్లి, అక్కినేని నాగార్జున కుటుంబం, డ్రగ్స్, ఫోన్ ట్యాపింగ్ వ్యవహారాలను లేవనెత్తుతూ కేటీఆర్‌పై మంత్రి కొండా సురేఖ చేసిన అనుచిత వ్యాఖ్యలే ఈ వివాదానికి కారణం అయ్యాయి. -
రాజకీయ లబ్ధికి మా పరువు తీశారు
సిటీ కోర్టులు: రాజకీయ లబ్ధి కోసమే మంత్రి కొండా సురేఖ తమ కుటుంబంపై తప్పుడు వ్యాఖ్యలు చేశారని సినీ నటుడు నాగార్జున నాంపల్లి కోర్టులో పేర్కొన్నారు. ఆమె చేసిన వ్యాఖ్యలన్నీ అవాస్తవాలేనని.. వాటిలో ఎలాంటి నిజం లేదన్నారు. మంత్రిపై వేసిన క్రమినల్ పరువునష్టం కేసు విచారణలో భాగంగా మంగళవారం నాగార్జున తన సతీమణి అమల, కుమారుడు నాగచైతన్యతో కలిసి నాంపల్లిలోని స్పెషల్ జ్యుడీషియల్ ఫస్ట్‌క్లాస్ మేజి్రస్టేట్ ఎక్సైజ్ కోర్టుకు హాజరయ్యారు. జడ్జి ఎస్.శ్రీదేవి ఎదుట ఈ మేరకు వాంగ్మూలం ఇచ్చారు. నాలుగు దశాబ్దాలుగా గౌరవప్రదంగా జీవిస్తున్నాఅక్కినేని వారసుడిగా తెలుగు చిత్ర పరిశ్రమలో నాలుగు దశాబ్దాల గౌరవప్రదమైన జీవితాన్ని కొనసాగిసున్నానని నాగార్జున కోర్టుకు తెలిపారు. నటుడిగా, నిర్మాతగా, టీవీ వ్యాఖ్యాతగా, స్టూడియో యజమానిగా తాను, తన కుటుంబం ప్రజల ఆద రాభిమానాలు పొందుతున్నామన్నారు. తన కుమారుడు నాగచైతన్య సైతం సినీ నట వారసత్వాన్ని కొనసాగిస్తూ ప్రేక్షకుల ప్రశంసలు పొందుతున్నాడ న్నారు. కానీ తన కుమారుడి వైవాహిక జీవితాన్ని ఉద్దేశించి కొండా సురేఖ మాట్లాడిన మాటలు ప్రజలను తప్పుదోవ పట్టించాయని పేర్కొన్నారు.ఇందుకు సంబంధించిన వీడియోలు, పేపర్ క్లిప్పింగ్‌ల వల్ల తమ కుటుంబం పరువు పోయిందని.. తాము ఎంతో కలత చెందామని చెప్పారు. అందుకే మంత్రిపై క్రిమినల్ చర్యలు తీసుకుని తమ కుటుంబ పరువు కాపాడాలని కోరారు. నాగార్జునతోపాటు ఆయన తరఫు సాక్షిగా సుప్రియ వాంగ్మూలాన్ని కూడా కోర్టు నమోదు చేసింది. అనంతరం నాగార్జున తరుఫు న్యాయవాది అశోక్‌రెడ్డి కొండా సురేఖ మాట్లాడిన వీడియోతో కూడిన పెన్‌డ్రైవ్, పేపర్ క్లిప్పింగ్‌లను మెమోతోపాటు కోర్టుకు సమరి్పంచారు. సాక్షుల స్టేట్మెంట్ సమయంలో కొండా çసురేఖ తరుఫు న్యాయవాది, టీపీసీసీ లీగల్ సెల్ వైస్ చైర్మన్ తిరుపతి వర్మ, సురేఖ కూడా హాజరయ్యారు. ఈ మేరకు విచారణ చేపట్టిన కోర్టు విచారణను ఈ నెల 10కి వాయిదా వేసింది. -
కోర్టులో స్టేట్మెంట్ ఇచ్చిన నాగార్జున.. విచారణ వాయిదా
కొన్నిరోజుల క్రితం అక్కినేని కుటుంబంపై తెలంగాణ మంత్రి కొండా సురేఖ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. ఇవి కాస్త పెద్ద రచ్చకు కారణమయ్యాయి. ఒకరిపై ఒకరు పిటిషన్లు వేసుకునేంత వరకు వెళ్లారు. ఈ క్రమంలోనే తాజాగా పిటిషన్ విషయమై నాంపల్లి కోర్టుకు మంగళవారం హాజరయ్యారు. ఈ క్రమంలోనే న్యాయస్థానానికి నేరుగా తన స్టేట్మెంట్ ఇచ్చారు. సాక్షులుగా యార్లగడ్డ సుప్రియ, అట్ల వెంకటేశ్వర్లు హాజరయ్యారు. నాగచైతన్య, అమల, సుశీల కూడా కోర్టుకు వచ్చారు.(ఇదీ చదవండి: త్రివిక్రమ్‌ను ప్రశ్నించే దమ్ముందా? నిర్మాతపై పూనమ్ కౌర్ ఫైర్)నాగ్ ఏం చెప్పారంటే?ఈ పిటిషన్ ఎందుకోసం ఫైల్ చేసారని కోర్ట్ ప్రశ్నించగా.. మంత్రి కొండా సురేఖ తన కుటుంబంపై అమర్యాద పూర్వక వాఖ్యలు చేశారని, తద్వారా మా కుటుంబ పరువు మర్యాదలకు భంగం వాటిల్లిందని చెప్పారు. సినిమా రంగం ద్వారా మా కుటుంబానికి మంచి పేరు ప్రతిష్టలు ఉన్నాయని, దేశవ్యాప్తంగా మా కుటుంబం పట్ల ప్రజల ఆధారాభిమానాలు ఉన్నాయని, జాతీయ స్థాయిలో అనేక అవార్డులు వచ్చాయని నాగార్జున అన్నారు.సినిమా రంగం తో పాటు సామజిక సేవా కార్యక్రమాలు సైతం చేస్తున్నామని చెప్పిన నాగార్జున.. మాజీ మంత్రి కేటీఆర్ వల్ల మా కొడుకు విడాకులు తీసుకున్నాడని మంత్రి అసభ్యంగా మాట్లాడారని, అలా మాట్లాడం వలన మా పరువు ప్రతిష్టలకు భంగం వాటిల్లిందని అన్నారు. బీఎన్ఎస్ యాక్ట్ 356 ప్రకారం మంత్రిపై క్రిమినల్ చర్యలు తీసుకోవాలని న్యాయస్థానాన్ని నాగార్జున కోరారు.విచారణ వాయిదాసాక్షిగా వచ్చిన సుప్రియ స్టేట్మెంట్ కూడా రికార్డ్ చేశారు. కొండా సురేఖ వ్యాఖ్యలతో మా కుటుంబం మొత్తం షాక్ గురయ్యము. ఇలా మా కుటుంబం గురించి ఎందుకు ఇలా మాట్లాడారో అర్ధం కాలేదు. దీంతో తీవ్ర మనోవేదనకు గురయ్యాం. మరో సాక్షి వెంకటేశ్వర్లు స్టేట్మెంట్ని 10వ తేదీన రికార్డ్ చేయనున్నారు. ఈ క్రమంలోనే పిటిషన్‌పై విచారణ వాయిదా పడింది.(ఇదీ చదవండి: నిర్మాతకు మూడేళ్ల జైలు శిక్ష.. న్యాయం గెలిచిందని హీరోయిన్) -
నేడు నాంపల్లి కోర్టుకు హీరో నాగార్జున
సాక్షి,హైదరాబాద్:మంత్రి కొండా సురేఖపై సినీ నటుడు అక్కినేని నాగార్జున దాఖలు చేసిన క్రిమినల్ పరువునష్టం పిటిషన్‌పై మంగళవారం(అక్టోబర్8) నాంపల్లికోర్టులో విచారణ జరగనుంది. నాగార్జున వాంగ్మూలాన్ని నమోదు చేయాలని కోర్టు ఆదేశించడంతో ఆయన కోర్టుకు హాజరుకానున్నారు.నాగార్జున వేసిన పిటిషన్‌పై సోమవారం నాంపల్లి ప్రత్యేక కోర్టులో విచారణ జరిగింది. తమ కుటుంబ గౌరవం, ప్రతిష్ఠ దెబ్బతీసేలా సురేఖ వ్యాఖ్యలు ఉన్నాయంటూ పిటిషన్లో నాగార్జున పేర్కొన్నారు. ఆయన తరఫున సీనియర్ న్యాయవాది అశోక్‌రెడ్డి వాదనలు వినిపించారు.కాగా, ఇటీవల బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్‌ను విమర్శించడంలో భాగంగా నాగార్జున కుటుంబంపై కొండా సురేఖ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. దీంతో నాగార్జున కుటుంబ సభ్యులతో పాటు పలువురు సినీ ప్రముఖులు కొండాసురేఖపై సోషల్‌మీడియాలో విమర్శలు గుప్పించారు. ఇదీ చదవండి: సమంతకు మంత్రి కొండా సురేఖ క్షమాపణలు -
నాగార్జునకు మద్దతిస్తే కేసులు వేస్తామంటూ కొండా సురేఖ లాయర్ హెచ్చరిక
టాలీవుడ్ ప్రముఖ నటుడు నాగార్జున నేడు నాంపల్లి కోర్టుకు హాజరుకానున్నారు. తన కుటుంబంపై తెలంగాణ మంత్రి కొండా సురేఖ చేసిన వివాదస్పద వ్యాఖ్యలపై ఆయన పరువునష్టం పిటిషన్ వేశారు. ఈమేరకు సోమవారం విచారణ జరిగింది. తమ కుటుంబ గౌరవాన్ని, ప్రతిష్టను దెబ్బతీసేలా సురేఖ వ్యాఖ్యలు ఉన్నాయని నాంపల్లి న్యాయస్థానాన్ని నాగార్జున ఆశ్రయించారు. అయితే, న్యాయస్థానంలో మరోసారి విచారణ వాయిదా పడింది.నేడు నాంపల్లి మనోరంజన్ కోర్టులో నాగార్జున్ పిటీషన్‌పై మరోసారి విచారణ జరగనుంది. నాగార్జున తరపున సీనియర్ కౌన్సిల్ అశోక్ రెడ్డి వాదనలు వినిపించారు. అక్టోబర్ 8న నాగార్జున వాగ్మూలం రికార్డ్ చేయాలని కోర్టు ఆదేశించింది. దీంతో మంగళవారం కోర్ట్‌కు నాగార్జున హాజరుకానున్నారు. ఇదే సమయంలో సాక్షుల స్టేట్మెంట్ను కూడా రికార్డ్ చేయాలని న్యాయవాది అశోక్ రెడ్డి కోరారు. ఇదీ చదవండి: ఆ ఫోటోలన్నీ ఫేక్.. దర్శన్ కేసులో కీలక మలుపుఅయితే, నాగార్జున మీదే కేసులు వేస్తామని మంత్రి కొండా సురేఖ తరుపున వాదనలు వినిపిస్తున్న లాయర్ హెచ్చరించారు. అయిపోయిన విషయానికి నాగార్జున ఎందుకింత రాద్దాంతం చేస్తున్నాడు..? అని ఆయన ప్రశ్నించారు. నాగార్జునతో పాటు ఆయనకు మద్దతు ఇచ్చే అందరిపై కేసులు వేస్తామని సెన్సేషనల్ కామెంట్స్ చేశారు. దీంతో నాగార్జున అభిమానులు కూడా మండిపడుతున్నారు. బాధితుడి మీదే కేసులు వేస్తామని ఎలా వార్నింగ్‌లు ఇస్తారంటూ వారు ప్రశ్నిస్తున్నారు. -
ఇవాళ కొండా సురేఖ కామెంట్స్ పై నాంపల్లి కోర్టులో విచారణ
-
'అల్బర్ట్ ఐన్‌స్టీన్‌కు కూడా కష్టమే'.. కొండా సురేఖ కామెంట్స్‌పై ఆర్జీవీ మరో ట్వీట్
టాలీవుడ్ డైరెక్టర్ రాంగోపాల్ వర్మ ఏం చేసినా సంచలనమే. అలా ఉంటుంది ఆయన మాట్లాడే తీరు. తాజాగా కొండా సురేఖ చేసిన కామెంట్స్‌పై సైతం తనదైన శైలిలో స్పందించారు. నాగార్జున ఫ్యామిలీకి మంత్రి క్షమాపణలు చెప్పకుండా.. సమంతను ఆమె కొనియాడారని ఆసక్తికర కామెంట్స్ చేశారు.తాజాగా ఈ వివాదంపై ఆర్జీవీ మరో ట్వీట్ చేశారు. 'గన్ను గురిపెట్టింది కేటీఆర్‌కు అయితే.. కాల్చింది నాగార్జున, నాగచైతన్యలను అని.. కానీ చివరికీ సమంతకు సారీ చెప్పారు' .. అయితే ఈ సమీకరణాన్ని ప్రముఖ శాస్త్రవేత్త అల్బర్ట్ ఐన్‌స్టీన్ కూడా అర్థం చేసుకోవడం కష్టమేనని వ్యంగ్యంగా పోస్ట్ చేశారు. ఈ విషయంలో నాగార్జున ఫ్యామిలీకి మంత్రి కొండా సురేఖ క్షమాపణలు చెప్పకపోవడంపై రాంగోపాల్ వర్మ మండిపడుతున్నారు.కాగా.. కేటీఆర్‌ను ఉద్దేశిస్తూ మంత్రి కొండా సురేఖ చేసిన కామెంట్స్ టాలీవుడ్లో తీవ్ర దుమారం రేపాయి. సమంత-నాగచైతన్య విడాకులపై ఆమె చేసిన వ్యాఖ్యలు సంచలనంగా మారాయి. దీంతో మంత్రి వ్యాఖ్యలపై టాలీవుడ్ సినీ ప్రముఖులు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. ఇలాంటి వాటిని సినీ పరిశ్రమ ఏకతాటిపై నిలబడి ఎదుర్కొంటామని హెచ్చరించారు. ఈ విషయంలో నాగార్జున ఇప్పటికే మంత్రిపై పరువునష్టం కేసు దాఖలు చేశారు.Her GUN was aimed at @KTRBRS and she SHOT @iamnagarjuna and @chay_akkineni and APOLOGIED to @Samanthaprabhu2 ..I DOUBT even ALBERT EINSTEIN can decipher this EQUATION 😳😳😳— Ram Gopal Varma (@RGVzoomin) October 4, 2024 -
కొండా సురేఖకి అండగా ఉన్నాం
సాక్షి, హైదరాబాద్: మంత్రి కొండా సురేఖ తాను అన్న మాటలను ఉపసంహరించుకున్న తరువాత కూడా చర్చ కొనసాగించడం అనవసరమని బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ అన్నా రు. శనివారం ఆయన గాంధీభవన్‌లో మీడి యాతో చిట్‌చాట్ చేస్తూ పలు అంశాలపై స్పందించారు. కొండా సురేఖ వ్యాఖ్యలను విత్ డ్రా చేసుకోవాలని నాగార్జున ఫ్యామిలీ కోరిన మేర కు మంత్రి వెంటనే స్పందించి తాను చేసిన వ్యాఖ్యలను ఉపసంహరించుకుంటున్నట్లు ప్ర కటించారని గుర్తు చేశారు. ఆ అంశం అంతటి తో ముగిసిపోయిందని, పీసీసీ అధ్యక్షుడు కూ డా సమస్య సద్దుమణిగిందని చెప్పిన తరు వాత కూడా మాట్లాడటం శోచనీయమని అ న్నారు. కొండా సురేఖ ఇబ్బంది పడ్డప్పుడు మాట్లాడనోళ్లు ఇప్పుడు మాట్లాడుతున్నారని ఆరోపించారు.సురేఖ ఒంటరి కాదని, బలహీ న వర్గాల మంత్రికి తామంతా అండగా ఉన్నా మని అన్నారు. కేంద్రం నుంచి పైసా తేలేని వారు ప్రభుత్వంపై విమర్శలు చేస్తున్నారని, బాధ్యత గల ప్రతిపక్ష పార్టీలు ప్రభుత్వానికి మంచి సలహాలు ఇవ్వాలన్నారు. ఈ సంవత్స రం మహిళా సంఘాల సభ్యులకు మాత్రమే బ తుకమ్మ చీరలు పంపిణీ చేయాలని ప్రభుత్వం నిర్ణయించిందని, ఇప్పటికే బతుకమ్మ చీరలకు రూ. 150 కోట్లు విడుదల చేసినట్లు తెలిపారు. విద్యార్థి సంఘం నాయకుడిగా రెసిడెన్షియల్ విద్యాసంస్థల సమస్యలపై సీఎం, డిప్యూటీ సీఎంతో చర్చించానని, వారు సానుకూలంగా స్పందించారని పొన్నం వెల్లడించారు. -
మతిపోయి, గతి తప్పి.. మంత్రిగారి గలీజు మాటలు..
-
మంత్రి కొండా సురేఖపై రూ. 100 కోట్లకు మరో దావా వేస్తా
సాక్షి, హైదరాబాద్: మంత్రి కొండా సురేఖ తమ కుటుంబాన్ని ఉద్దేశించి చేసిన అనుచిత వ్యాఖ్యల ఉదంతం గురించి సినీ హీరో నాగార్జున మరోసారి స్పందించారు. మంత్రిపై ఇప్పటికే క్రిమినల్ పరువునష్టం కేసు వేశామని.. ఆమెపై రూ. 100 కోట్లకు మరో పరువునష్టం దావా వేసేందుకు సిద్ధమవుతు న్నామని ఓ మీడియా సంస్థతో మాట్లాడుతూ చెప్పారు. మంత్రి కొండా సురేఖ కేవలం సమంతపై చేసిన వ్యాఖ్యలను ఉపసంహరించుకొని క్షమాపణ చెప్పారని.. కానీ తనకు, తన కుటుంబానికి మాత్రం ఒక్క ముక్క క్షమాపణ కూడా చెప్పలేదని నాగార్జున మండిపడ్డారు. ఒకవేళ ఇప్పుడు తనకు, తన కుటుంబానికి ఆమె క్షమాపణ చెప్పినా దావా విషయంలో వెనక్కి తగ్గబోనని తేల్చిచెప్పారు. సినీ పరిశ్రమలోని వ్యక్తులను సున్నిత లక్ష్యాలుగా చేసుకోవడాన్ని ఇకపై ఎంతమాత్రం ఉపేక్షించబోమని స్పష్టం చేశారు. ‘కొంతకాలంగా ఒక దాని తర్వాత ఒకటి సమస్యలు చుట్టుముడుతున్నాయి. ఎప్పటికప్పుడు ఇదే చివరిదని అనుకున్నా. కానీ దైవానికి ఇంకేవో ప్రణాళికలు ఉన్నట్లు అనిపిస్తోంది. అయినా పరవాలేదు. నేనెప్పుడూ బలమైన వ్యక్తిత్వంగల వాడినని నమ్ముతా. నా కుటుంబాన్ని కాపాడే విషయంలో నేను ఓ సింహాన్ని. అదృష్టవశాత్తూ మొత్తం తెలుగు సినీ పరిశ్రమంతా మాకు అండగా నిలిచింది. ఇదంతా మా నాన్న మంచితనం, ఆశీర్వాదమేనని భావిస్తున్నా’ అని నాగార్జున పేర్కొన్నారు. -
సహించేది లేదు... క్షమించేది లేదు: అఖిల్
నాగచైతన్య–సమంత విడాకులపై మంత్రి కొండా సురేఖ మాట్లాడిన వివాదాస్పద వ్యాఖ్యలు తీవ్ర దుమారం రేపిన సంగతి తెలిసిందే. ఆమె వ్యాఖ్యల్ని సినీ ప్రముఖులు ముక్తకంఠంతో ఖండించారు. దీంతో ఆమె క్షమాపణలు చెప్పడంతోపాటు తన వ్యాఖ్యలను వెనక్కు తీసుకున్నారు. కాగా కొండా సురేఖపై నాగార్జున పరువునష్టం దావా వేసిన సంగతి తెలిసిందే. ఇదిలా ఉంటే.. కొండా సురేఖ వ్యాఖ్యలపై అక్కినేని అఖిల్ మరోసారి స్పందించి, సోషల్ మీడియాలో ఘాటుగాపోస్టు పెట్టారు. దాని సారాంశం ఏంటంటే... ‘‘కొండా సురేఖ చేసిన నిరాధారమైన వ్యాఖ్యలు అసభ్యకరంగా, జుగు΄్సాకరంగా ఉన్నాయి. ప్రజా సేవకురాలిగా ప్రజలకు రక్షణ కల్పించాల్సిన ఆమె తన నైతికత, సామాజిక సంక్షేమాన్ని మరచిపోయి ప్రవర్తించిన తీరు సిగ్గు చేటు, క్షమించరానిది. ఆమె మాటలతో మా కుటుంబ సభ్యులతోపాటు ప్రజలు కూడా బాధపడ్డారు. స్వార్థపూరితంగా గెలవడానికి ప్రయత్నిస్తున్న రాజకీయ యుద్ధంలో.. తన కంటే చాలా ఉన్నత విలువలు, సామాజిక అవగాహన ఉన్న అమాయక వ్యక్తులపై సిగ్గు లేకుండా దాడి చేసి బలిపశువులను చేశారామె. కుటుంబ సభ్యుడిగా, చిత్ర పరిశ్రమ సభ్యుడిగా మౌనంగా చూస్తూ ఉండలేను. ఇలాంటి నీచమైన వ్యాఖ్యలు చేసిన వ్యక్తిని శిక్షించాలి. మన సమాజంలో ఆమెలాంటి వాళ్లకు చోటు, గౌరవం లేదు. ఆమెను సహించేది లేదు... క్షమించేది లేదు’’ అని పేర్కొన్నారు అఖిల్. -
నేను సింహాన్ని.. టాలీవుడ్ అంతా నాకు అండగా.: నాగార్జున
హీరో అక్కినేని నాగార్జున కుటుంబంతో పాటు సమంతపై తెలంగాణ అటవీ శాఖ మంత్రి కొండా సురేఖ చేసిన వివాదాస్పద వ్యాఖ్యలపై టాలీవుడ్ భగ్గుమంది. రాజకీయ దురుద్దేశాల కోసం సినీ సెలబ్రిటీలను వాడుకోవాలని చూస్తే ఊరుకునేది లేదని తెలుగు చలనచిత్ర పరిశ్రమ వార్నింగ్ ఇచ్చింది. టాలీవుడ్ మొత్తం తనకు అండగా నిలబడ్డందుకు నాగార్జున సంతోషం వ్యక్తం చేశాడు. సింహంలా పోరాడతా..'నేను బలమైన వ్యక్తినని ఎప్పుడూ అనుకుంటాను. నా కుటుంబాన్ని రక్షించే విషయంలో సింహంలా నిలబడతాను. అదృష్టవశాత్తూ తెలుగు చలనచిత్ర పరిశ్రమ అంతా కూడా ఈ విషయంలో మాకు అండగా నిలబడింది. ఇది మా నాన్నగారి ఆశీర్వాదాలుగా భావిస్తున్నాను' అంటూ ఓ నోట్ రిలీజ్ చేశాడు.అసలేమైందంటే?ఇకపోతే నాగచైతన్య, సమంత విడాకులకు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కారణమని మంత్రి కొండా సురేఖ నోరు పారేసుకున్నారు. ఇందులో నాగార్జున హస్తం కూడా ఉందంటూ ఆరోపించారు. ఈమె వ్యాఖ్యలపై ఆగ్రహం వ్యక్తం చేసిన నాగ్ నాంపల్లి కోర్టులో పరువు నష్టం దావా వేశాడు. తన కుటుంబసభ్యుల పరువుకు భంగం కలిగించిన తనపై చర్యలు తీసుకోవాలని కోరారు.చదవండి: ఫస్ట్ మీటింగ్‌లోనే చేదు అనుభవం.. నా వల్ల కాదని ఊరెళ్లిపోయా! -
ఆవేశంలో ఉన్నా ఆలోచించి మాట్లాడాలి.. సురేఖకు డీకే అరుణ చురకలు
సాక్షి, హైదరాబాద్: రాజకీయాల్లో ఉన్నప్పుడు నోరు జాగ్రత్తగా పెట్టుకుని మాట్లాడాలని కొండా సురేఖకు హితవు పలికారు బీజేపీ ఎంపీ డీకే అరుణ. ఆవేశం వచ్చినా రాజకీయ నాయకులు ఆలోచించి మాట్లాడాలన్నారు. ఒక మహిళను పట్టుకొని, సినిమా కుటుంబాన్ని కించపరిచే విధంగా మాట్లాడం కరెక్ట్ కాదంటూ ఘాటు విమర్శలు చేశారు.మాజీ మంత్రి, ఎంపీ డీకే అరుణ శుక్రవారం చార్మినార్ భాగ్యలక్ష్మీ ఆలయం వద్ద ప్రత్యేక పూజలు చేశారు. ఈ క్రమంలో కొండా సురేఖ వ్యాఖ్యలపై స్పందించారు. ఈ క్రమంలో డీకే అరుణ మాట్లాడుతూ.. కొండా సురేఖతో నాకు మంచి అనుబంధం ఉంది. గతంలో ఇద్దరం కలిసి మంత్రులుగా పనిచేశాం. కానీ, ఒక సినీ కుటుంబంపై ఆమె చేసిన ఆరోపణలు అభ్యంతరకరం. సినిమా పరిశ్రమలో ఆ కుటుంబానికి ప్రత్యేక పేరు ఉంది. ఎవరి వ్యక్తిగత విషయాలతో రాజకీయాలు ముడిపెట్టడం సరికాదు.రాజకీయాల్లో ఉన్నప్పుడు నోరు జాగ్రత్తగా పెట్టుకొని మాట్లాడాలి. ఒకసారి మాట్లాడి మళ్లీ వెనక్కు తీసుకోలేము. రాజకీయ నాయకులు ఆవేశం వచ్చినా ఆలోచించి మాట్లాడాలి. ఒకరి మీద కోపం ఇంకొకరి మీద తీయడం సరికాదు. ఒక మహిళను పట్టుకొని, సినిమా కుటుంబాన్ని కించపరిచే విధంగా మాట్లాడం కరెక్ట్ కాదు. భాగ్యలక్ష్మి అమ్మవారి ఆగ్రహానికి రేవంత్ ప్రభుత్వం గురికావద్దు. అమ్మవారి ఆలయం దగ్గర మహిళలు బతుకమ్మ ఆడటానికి కోర్ట్ పర్మిషన్ తీసుకోవాల్సి వచ్చింది. తెలంగాణలో మళ్లీ నియంతృత్వ పాలనా సాగుతుంది’ అంటూ కామెంట్స్ చేశారు. ఇది కూడా చదవండి: ఎన్నికల హామీలు విఫలమై హైడ్రా.. చివరకు సినీ తారలు: జగదీష్ రెడ్డి -
పవన్ ఎందుకీ మౌనం?
-
కొండా సురేఖ వివాదం.. నాగార్జున పిటీషన్‌పై విచారణ వాయిదా
టాలీవుడ్ ప్రముఖ నటుడు నాగార్జున కుటుంబంపై తెలంగాణ మంత్రి కొండా సురేఖ వివాదస్పద వ్యాఖ్యలు చేసిన విషయం తెలిసిందే. దీంతో తమ కుటుంబ గౌరవాన్ని, ప్రతిష్టను దెబ్బతీసేలా సురేఖ వ్యాఖ్యలు ఉన్నాయని నాంపల్లి న్యాయస్థానంలో పరువు నష్టం దావా కేసును నాగార్జున వేశారు. అయితే, నేడు జరగాల్సిన విచారణ వాయిదా పడింది. న్యాయమూర్తి సెలవులో ఉండటంతో సోమవారం విచారణ జరుగుతుందని కోర్టు తెలిపింది.ఇదీ చదవండి: మమ్మల్ని బలిపశువులను చేసింది: అఖిల్తెలంగాణ మాజీ మంత్రి కేటీఆర్‌ను విమర్శించే క్రమంలో కొండ సురేఖ ఈ వ్యాఖ్యలే చేశారు. అక్కినేని నాగార్జున కుటుంబం, డ్రగ్స్, ఫోన్ ట్యాపింగ్ వ్యవహారాలను లేవనెత్తుతూ.. సినీనటి సమంత విడాకులు, రకుల్ ప్రీత్‌సింగ్ పెళ్లి వంటి అంశాలపై ఆమె వివాదస్పద వ్యాఖ్యలు చేయడంతో పెద్ద దుమారమే రేగింది. అధారాలు లేకుండా ఇలాంటి వ్యాఖ్యలు చేస్తే చూస్లూ ఊరుకోమంటూ చిత్ర పరిశ్రమలోని ప్రముఖులు రియాక్ట్ అయ్యారు. -
మమ్మల్ని బలిపశువులను చేసింది: అక్కినేని అఖిల్
తెలంగాణ మంత్రి కొండా సురేఖ చేసిన వివాదాస్పద వ్యాఖ్యలపై ఇప్పటికే చాలామంది తెలుగు చిత్ర పరిశ్రమ నుంచి రియాక్ట్ అయ్యారు. ఈ క్రమంలో అఖిల్ అక్కినేని కూడా అమల చేసిన ట్వీట్‌నే షేర్ చేశాడు. అయితే, ఈ క్రమంలో తాజాగా ఆయన మరోసారి కొండ సురేఖపై ఘాటుగానే స్పందించారు.కొండా సురేఖ ప్రవర్తించిన తీరు సిగ్గుచేటు, క్షమించరానిది. కుటుంబ సభ్యుడిగా, సినీ ఇండస్ట్రీ సభ్యుడిగా నేను మౌనంగా ఉండలేను. ఇలాంటి నీచమైన వ్యాఖ్యలు చేసిన వ్యక్తిని శిక్షించాలి. ఆమె చేసిన నిరాధారమైన, హాస్యాస్పదమైన ప్రకటనలు అసభ్యకరంగా, జుగుప్సాకరంగా ఉన్నాయి. ప్రజా సేవకురాలిగా ప్రజలకు రక్షణ కల్పించాలని భావించిన ఆమె తన నైతికత, సామాజిక సంక్షేమాన్ని మరచిపోవాలని నిర్ణయించుకుంది. ఆమె వ్యాఖ్యల వల్ల మా కుటుంబ సభ్యులతో పాటు ప్రజలు కూడా బాధపడ్డారు. ఆమె స్వార్థపూరితంగా నడుచుకుంటుంది. రాజకీయ యుద్ధంలో ఆమె తన కంటే చాలా ఉన్నతమైన విలువలు, సామాజిక అవగాహన ఉన్న అమాయక వ్యక్తులపై సిగ్గు లేకుండా ఇలాంటి దాడి చేసి బలిపశువులను చేసింది. మన సమాజంలో ఆమెలాంటి వాళ్లకు చోటు, గౌరవం లేదు. ఎవరూ సహించలేని ఆమె తీరు ఎప్పటికీ క్షమించబడదు.' అని అఖిల్ అక్కినేని ఘాటుగా స్పందించారు.The baseless and ridiculous statements made by Konda Surekha are vulgar and disgusting. Being a public servant who is expected to protect the people she has decided to forget her morals and social welfare. The way she has acted is shameful and unforgivable. There are respected…— Akhil Akkineni (@AkhilAkkineni8) October 4, 2024 -
సమంత కే ఎందుకిలా
-
నాగార్జున పిటిషన్ పై నేడు విచారణ జరపనున్న నాంపల్లి కోర్టు
-
కొండా సురేఖపై నాగార్జున పిటిషన్ విచారణ వాయిదా
సాక్షి,హైదరాబాద్:మంత్రి కొండా సురేఖ వ్యాఖ్యలపై అక్కినేనినాగార్జున వేసిన పిటిషన్ విచారణను నాంపల్లి కోర్టు వాయిదా వేసింది. న్యాయమూర్తి సెలవులో ఉన్నందున పిటిషన్ విచారణను సోమవారానికి వాయిదా వేస్తున్నట్లు కోర్టు తెలిపింది.ఇటీవల కొండా సురేఖ తమ కుటుంబంపై చేసిన వ్యాఖ్యల మీద హీరో నాగార్జున నాంపల్లికోర్టులో క్రిమినల్ పరువు నష్టం పిటిషన్ వేశారు. తమ కుటుంబ గౌరవ ప్రతిష్టలను దెబ్బతీసేలా సురేఖ వ్యాఖ్యలు చేశారని పిటిషన్లో పేర్కొన్నారు.కొండా సురేఖపై చట్ట ప్రకారం క్రిమినల్ చర్యలు తీసుకోవాలని నాగార్జున పిటిషన్లో కోరారు.2017లో తన కుమారుడు నాగచైతన్య సమంత వివాహం చేసుకున్నారని,2021లో కొన్ని అనివార్య కారణాల వల్ల వారు విడిపోయారని తెలిపారు.ఇప్పుడు వారిద్దరు గౌరవప్రదంగా ఎవరి జీవితం వారు గడుపుతున్నారన్నారు.దశాబ్దాలుగా పేరు ప్రఖ్యాతలు కాపాడుకుంటూ వస్తున్న తమ కుటుంబంపై మంత్రి కొండా సురేఖ దురుద్దేశంతోనే నిరాధారఆరోపణలు చేశారని, ఈ వ్యాఖ్యలతో తమ కుటుంబంపై తప్పుడు సంకేతాలు వెళ్లాయని పిటిషన్లో నాగార్జున కోర్టు దృష్టికి తీసుకువచ్చారు. ఇదీ చదవండి: మూసీ మురికంతా వారి నోట్లోనే: కేటీఆర్ -
కొండా సురేఖపై అక్కినేని నాగార్జున కేసు.. క్రిమినల్ చర్యలకు డిమాండ్
-
ఇంకా సద్దుమణగలేదు!
సాక్షి, హైదరాబాద్: సినీ హీరో అక్కినేని నాగార్జున కుటుంబంతోపాటు సినీనటి సమంతపై తెలంగాణ అటవీ శాఖ మంత్రి కొండా సురేఖ చేసిన వివాదాస్పద వ్యాఖ్యల వివాదం ఇంకా సద్దుమణగలేదు. మంత్రి వ్యాఖ్యలను తప్పుపడుతూ చలనచిత్ర ప్రముఖులు గురువారం తీవ్రస్థాయిలో స్పందించారు. అక్కినేని కుటుంబంతోపాటు నటి సమంతకు బాసటగా నిలిచారు. ఈ మేరకు కొండా సురేఖపై సోషల్ మీడియా వేదికగా ధ్వజమెత్తారు. తెలుగు సినీ పరిశ్రమతోపాటు ఇతర భాష నటీనటులు కూడా స్పందించారు. మెగాస్టార్ చిరంజీవి, హీరోలు వెంకటేష్, మహేష్‌బాబు, ప్రభాస్, రాంచరణ్, జూనియర్ ఎన్టీఆర్, అల్లు అర్జున్, రవితేజ, నరేష్, నాని, విజయ్ దేవరకొండతో పాటు సీనియర్ నటి విజయశాంతి, హీరోయిన్ రకుల్‌ప్రీత్ సింగ్, దర్శకులు రాజమౌళి, హరీశ్ శంకర్, తమిళ నటి కుష్బూ తదితరులు కూడా మంత్రి సురేఖ వ్యాఖ్యలను తప్పుపడుతూ ‘ఎక్స్’, ఇన్‌స్ట్రాగామ్‌లలో పోస్టులు పెట్టారు. సీనియర్ ఐఏఎస్ అధికారి స్మితా సబర్వాల్ సైతం మంత్రి వ్యాఖ్యలను తప్పుబట్టారు. సినీ పరిశ్రమకు చెందిన సభ్యుల వ్యక్తిగత జీవితాలతో ముడిపడి ఉన్న సున్నిత అంశాలపై ఎవరు మాట్లాడినా తగిన చర్యలకు ఉపక్రమిస్తామని తెలుగు ఫిలిం చాంబర్ ఆఫ్ కామర్స్ స్పష్టం చేసింది. తెలుగు మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ (మా) అధ్యక్షుడు మంచు విష్ణు.. అసోసియేషన్ తరపున కొండా సురేఖ వ్యాఖ్యలను తప్పుపడుతూ అధికారికంగా సుదీర్ఘ లేఖ విడుదల చేశారు. మంత్రి కొండా సురేఖ చేసిన వివాదాస్పద వ్యాఖ్యలతో మరింత నష్టం జరగకుండా టీపీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్‌గౌడ్ నష్ట నివారణ చర్యలు చేపట్టారు. దీంతో సురేఖ తన వ్యాఖ్యలను వెనక్కు తీసుకుంటున్నట్లు ‘ఎక్స్’ లో పోస్టు చేశారు. నాగార్జున పరువునష్టం దావా..మంత్రి సురేఖపై సినీనటుడు నాగార్జున నాంపల్లి కోర్టులో పరువునష్టం దావా వేశారు. తన కుటుంబ సభ్యుల పరువుకు మంత్రి భంగం కలిగించారని, ఆమెపై క్రిమినల్ చర్యలు తీసుకోవాలని కోరారు. మరోవైపు కొండా సురేఖపై పలువురు బీఆర్ఎస్ మహిళా కార్పొరేటర్లు బంజారాహిల్స్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ స్పందిస్తూ.. ‘మూసీ మురికి అంతా వాళ్ల నోట్లోనే ఉంది. ఇంకా శుద్ధి ఎందుకు.. లక్షన్నర కోట్లు ఖర్చు ఎందుకు?’ అని ప్రశ్నించారు. మంత్రి సురేఖ వ్యాఖ్యల దుమారం రేగుతున్నా... సీఎం రేవంత్ ఎలాంటి వ్యాఖ్యలు చేయలేదు. -
పేదల ఇళ్లు కూలిస్తే.. ప్రభుత్వం కూలుతుంది
సాక్షి, హైదరాబాద్: పేదవాళ్ల ఇళ్లను బుల్డోజర్లతో కూల్చే ప్రయత్నం చేస్తే సహించే ప్రసక్తే లేదని, రాష్ట్ర ప్రభుత్వం కూలిపోక తప్పదని కేంద్రమంత్రి, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు జి.కిషన్‌రెడ్డి హెచ్చరించారు. మూసీ సుందరీకరణ పేరుతో పేద ప్రజలమీద ప్రతాపం చూపిస్తే ప్రభుత్వాన్ని స్తంభింపజేస్తామన్నారు. పేదవాళ్ల ఇళ్లపై బుల్డోజర్లు దింపే అధికారం ప్రభుత్వానికి లేదన్నారు. సమగ్రమైన ఆలోచన లేకుండా అక్రమ కట్టడాల పేరుతో పేదల ఇళ్లను కూల్చడాన్ని బీజేపీ తీవ్రంగా వ్యతిరేకిస్తోందన్నారు. రాష్ట్ర ప్రభుత్వం ఈ చర్యలను వెంటనే ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేశారు. ప్రజల ఆందోళనలు, మనోవేదనను పరిగణనలోకి తీసుకోకుండా సీఎం రేవంత్ రెడ్డి దుర్మార్గంగా వ్యవహరిస్తున్నారని అన్నారు. గురువారం పార్టీనేతలు ప్రేమ్‌సింగ్ రాథోడ్, కాసం వెంకటేశ్వర్లు, ఎస్.కుమార్, ఎస్.ప్రకాశ్‌రెడ్డిలతో కలసి ఆయన మీడియాతో మాట్లాడుతూ.. ఏ ప్రభుత్వమైనా పేదలకు మేలు చేసే ప్రయత్నంతోపాటు ప్రాజె క్టులు, సంక్షేమ కార్యక్రమాలను అమలు చేస్తుందన్నారు. కానీ కాంగ్రెస్ ప్రభుత్వం పేదల బస్తీలపై కన్నేసి, ఆ ఇళ్లను కూల్చే పనికి శ్రీకారం చుట్టిందని, ఇలా దేశంలో ఎక్కడా ఏ ప్రభుత్వం చేయలేదన్నారు. బీఆర్ఎస్ ప్రభుత్వం మూసీ సుందరీకరణ పేరిట కార్పొరేషన్‌ను ఏర్పాటుచేసి, పేదల ఇళ్లపై మార్కింగ్ చేయడంతో ప్రజల నుంచి తీవ్ర నిరసన వ్యక్తమైందని, దాంతో వెనకడుగు వేసిందని గుర్తుచేశారు. హైదరాబా ద్‌లోని 70 శాతం డ్రైనేజీ నీరంతా మూసీలో చేరుతోందని, ప్రతీగల్లీలో డ్రైనేజీ సమస్య నెలకొందని పేర్కొన్నారు. రాష్ట్ర ప్రభుత్వం ఈ సమస్యను పరిష్కరించకుండా రూ.లక్షా 50 వేల కోట్లతో మూసీ సుందరీకరణ పేరుతో అనాలోచిత చర్యలకు పాల్పడుతోందని కిషన్‌రెడ్డి ధ్వజమెత్తారు. ‘అనేక చెరువుల్లో బడాబాబులు, పెద్ద రియల్ ఎస్టేట్ కంపెనీలు, వ్యాపారవేత్తలు ఫామ్‌హౌస్‌లు, ఎస్టేట్ల పేరుతో నిర్మాణాలు చేసుకున్నారు. ముందు వారిపై హైడ్రా ప్రతాపం చూపాలి. దమ్ముంటే అక్రమంగా నిర్మించుకున్న ఒవైసీ ఫాతిమా కాలేజీని కూల్చండి’అని కిషన్‌రెడ్డి డిమాండ్ చేశారు. కొండా సురేఖ వ్యాఖ్యలపై..మంత్రి కొండా సురేఖ వ్యాఖ్యలపై విలేకరులు స్పందన కోరగా.. కిషన్‌రెడ్డి మాట్లాడుతూ కేవలం రాజకీయ ప్రయోజనాలు, ప్రత్య ర్థులపై విమర్శల కోసం ఇతరుల కుటుంబ వ్యవహారాలు, మహిళల వ్యక్తిగత విషయా లను వాడుకోవడాన్ని ఖండిస్తున్నామన్నారు. ‘అలాంటి నీచ సంస్కృతిని కేసీఆర్ మొదలు పెట్టారు. కేటీఆర్ ముందుకు తీసుకెళ్లారు. నేడు రేవంత్‌రెడ్డి, కాంగ్రెస్ పార్టీ నాయకులు కొనసా గిస్తు న్నారు’అని అన్నారు. కాంగ్రెస్, బీఆర్ఎస్ చేస్తు న్న తప్పులకు ఆ పార్టీలను బహిష్కరించాల్సిన సమయం వచ్చిందని పేర్కొన్నారు. ‘కేసీఆర్ సర్కార్ గతంలో ఫోన్ ట్యాపింగ్‌తో సినీ ప్రము ఖులు, వ్యాపారస్తుల వ్యక్తిగత విషయాలను తెలుసుకుని, వారిని బ్లాక్ మెయిల్ చేసి కోట్లాది రూపాయలు వసూలు చేసినట్లు పోలీసు అధికారులే చెప్పారు’అని వ్యాఖ్యానించారు. -
మంత్రిగారూ ఇదేం తీరు?
సాక్షి, హైదరాబాద్: సినీహీరో అక్కినేని నాగార్జున కుటుంబంతోపాటు సినీనటి సమంతపై అటవీశాఖ మంత్రి కొండా సురేఖ చేసిన వివాదాస్పద వ్యాఖ్యల వివాదం ఇంకా సద్దుమణగలేదు. మంత్రి వ్యాఖ్యలను తప్పుబడుతూ చలనచిత్ర ప్రముఖులు గురువారం తీవ్రస్థాయిలో స్పందించారు. అక్కినేని కుటుంబంతోపాటు నటి సమంతకు బాసటగా నిలిచారు. మంత్రి తన వ్యాఖ్యలను బేషరతుగా వెనక్కి తీసుకున్నారని, సినీ ప్రముఖులు దీనిని ఇంతటితో వదిలేయాలని టీపీసీసీ అధ్యక్షుడు మహేశ్‌కుమార్‌గౌడ్ విజ్ఞప్తి చేసినా సోషల్ మీడియా వేదికగా సినీ ప్రముఖుల విమర్శల వరద ఆగలేదు. తెలుగు సినీ పరిశ్రమతోపాటు ఇతర భాషల నటీనటులు కూడా స్పందించారు. మెగాస్టార్ చిరంజీవి, హీరోలు వెంకటేశ్, మహేశ్‌బాబు, రాంచరణ్, జూనియర్ ఎన్టీఆర్, అల్లు అర్జున్, రవితేజ, నరేశ్, నాని, విజయ్ దేవరకొండతోపాటు సీనియర్ నటి విజయశాంతి, హీరోయిన్ రకుల్‌ప్రీత్ సింగ్, దర్శకులు రాజమౌళి, హరీశ్ శంకర్, తమిళ నటి కుష్బూ తదితరులు కూడా మంత్రి సురేఖ వ్యాఖ్యలను తప్పుపడుతూ ‘ఎక్స్’, ఇన్స్టాలలో పోస్టులు పెట్టారు. సీనియర్ ఐఏఎస్ అధికారి స్మితా సబర్వాల్ సైతం మంత్రి వ్యాఖ్యలను తప్పుబట్టారు. సురేఖ వ్యాఖ్యల్ని తప్పుబడుతూ ‘మా’ లేఖ.. సినీ పరిశ్రమకు చెందిన సభ్యుల వ్యక్తిగత జీవితాలతో ముడిపడి ఉన్న సున్నితమైన అంశాలపై ఎవరు మాట్లాడినా తగిన చర్యలకు ఉపక్రమిస్తామని తెలుగు ఫిలిం చాంబర్ ఆఫ్ కామర్స్ స్పష్టం చేసింది. తెలుగు మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ (మా) అధ్యక్షుడు మంచు విష్ణు.. అసోసియేషన్ తరపున కొండా సురేఖ వ్యాఖ్యలను తప్పుపడుతూ అధికారికంగా సుదీర్ఘ లేఖ విడుదల చేశారు. మరోవైపు తన మాటలు సినీనటి సమంత మనోభావాలను దెబ్బతీశాయని తెలిసి ఆ వ్యాఖ్యలను వెనక్కు తీసుకుంటున్నట్లు మంత్రి కొండా సురేఖ పోస్ట్ చేయడాన్ని ప్రముఖ దర్శకుడు రామ్ గోపాల్ వర్మ తప్పుపట్టారు. ‘కొండా సురేఖ కేవలం సమంతకి క్షమాపణ చెప్పడం ఏంటి.. అక్కడ అత్యంత జుగుప్సాకరంగా అవమానించింది నాగార్జునని, నాగ చైతన్యని’ అని ‘ఎక్స్’లో తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. ఆ వ్యాఖ్యల్ని ఉపసంహరించుకోవాలని సురేఖకు టీపీసీసీ చీఫ్ సూచన! మంత్రి కొండా సురేఖ చేసిన వివాదాస్పద వ్యాఖ్యలతో మరింత నష్టం జరగకుండా టీపీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్‌గౌడ్ నష్ట నివారణ చర్యలు చేపట్టారు. కొండా సురేఖతో మాట్లాడి తన వ్యాఖ్యలను వెనక్కు తీసుకోవాలని ఆయన సూచించినట్లు సమాచారం. రాజకీయ విమర్శల్లో సినీ కుటుంబాన్ని, మహిళా నటిని కించపరిచేలా వ్యాఖ్యానించడం ప్రతికూల ప్రభావాన్ని చూపుతుందని.. అగ్ర నాయకత్వానికి సంజాయిషీ చెప్పుకోవాల్సి వస్తుందని ఆయన చెప్పినట్లు తెలిసింది. దీంతో సురేఖ తన వ్యాఖ్యలను వెనక్కు తీసుకుంటున్నట్లు ‘ఎక్స్’ లో పోస్టు చేశారు. ‘నా వ్యాఖ్యల ఉద్దేశం మహిళలపట్ల ఒక నాయకుడి చిన్నచూపు ధోరణిని ప్రశ్నించడమేగానీ గౌరవ నటి సమంత మనోభావాలను దెబ్బతీయడం కాదు. స్వయం శక్తితో మీరు ఎదిగిన తీరు నాకు కేవలం అభిమానం మాత్రమే కాదు, ఆదర్శం కూడా. నా వ్యాఖ్యలపట్ల మీరు కానీ, మీ అభిమానులు కానీ మనస్తాపానికి గురైనట్లయితే బేషరతుగా నా వ్యాఖ్యలను పూర్తిగా ఉపసంహరించుకుంటున్నాను.. అన్యదా భావించవద్దు’ అని పేర్కొన్నారు. నాగార్జున పరువునష్టం దావా.. మంత్రి కొండా సురేఖపై సినీనటుడు అక్కినేని నాగార్జున నాంపల్లి కోర్టులో పరువునష్టం దావా వేశారు. నటి సమంత, నాగచైతన్య విడాకులు తీసుకోవడంలో తన ప్రమేయం ఉందంటూ మంత్రి చేసిన వ్యాఖ్యలపై నాగార్జున కోర్టును ఆశ్రయించారు. తన కుటుంబ సభ్యుల పరువుకు మంత్రి భంగం కలిగించారని నాగార్జున పేర్కొన్నారు. ఆమెపై క్రిమినల్ చర్యలు తీసుకోవాలని కోరారు. మరోవైపు కొండా సురేఖపై పలువురు బీఆర్ఎస్ మహిళా కార్పొరేటర్లు బంజారాహిల్స్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. కేటీఆర్‌తోపాటు సినీ ప్రముఖులపై చేసిన ఆరోపణలకుగాను ఆమెపై కేసు పెట్టాలని కోరారు. కేటీఆర్‌పై ఆమె చేసిన వ్యాఖ్యలను వెనక్కి తీసుకొని, బహిరంగ క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. మూసీ మురికంతా వాళ్ల నోట్లోనే ఉందన్న కేటీఆర్ మంత్రి కొండా సురేఖ వ్యాఖ్యలపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తనదైన శైలిలో స్పందించారు. ‘మూసీ మురికి అంతా వాళ్ల నోట్లోనే ఉంది. ఇంకా శుద్ధి ఎందుకు.. లక్షన్నర కోట్లు ఖర్చు ఎందుకు?’ అని ప్రశ్నించారు. కాగా, కేటీఆర్ వ్యాఖ్యలను నిరసిస్తూ మహిళా కాంగ్రెస్ ఆధ్వర్యంలో నాంపల్లి వద్ద ధర్నా నిర్వహించారు. స్పందించని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి మంత్రి కొండా సురేఖ వ్యాఖ్యల దుమారం రేగుతున్నా... ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి ఎలాంటి వ్యాఖ్యలు చేయలేదు. నగరంలో జరిగిన డిజిటల్ కార్డులు సమావేశంలో మిగిలిన విషయాలు మాట్లాడినా ఈ వివాదంపై ఎలాంటి వ్యాఖ్యలు చేయకపోవడం గమనార్హం. నాగార్జున పరువునష్టం దావా మంత్రి కొండా సురేఖపై సినీనటుడు అక్కినేని నాగార్జున నాంపల్లి కోర్టులో పరువునష్టం దావా వేశారు. నటి సమంత, నాగచైతన్య విడాకులు తీసుకోవడంలో తన ప్రమేయం ఉందంటూ మంత్రి చేసిన వ్యాఖ్యలపై నాగార్జున కోర్టును ఆశ్రయించారు. తన కుటుంబ సభ్యుల పరువుకు మంత్రి భంగం కలిగించారని నాగార్జున పేర్కొన్నారు. ఆమెపై క్రిమినల్ చర్యలు తీసుకోవాలని కోరారు. మరో వైపు కొండా సురేఖపై పలువురు బీఆర్ఎస్ మహిళా కార్పొరేటర్లు బంజారాహిల్స్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. కేటీఆర్‌తోపాటు సినీ ప్రముఖులపై చేసిన ఆరోపణలకుగాను ఆమెపై కేసు పెట్టాలని కోరారు. కేటీఆర్‌పై ఆమె చేసిన వ్యాఖ్యలను వెనక్కి తీసుకొని, బహిరంగ క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. -
మంత్రి కొండా సురేఖపై పరువు నష్టం దావా వేసిన నాగార్జున
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ మంత్రి కొండా సురేఖపై ప్రముఖ సీనీ నటుడు నాగార్జున పరువు నష్టం దావా వేశాడు. తమ కుటుంబ గౌరవాన్ని, ప్రతిష్టను దెబ్బతీసేలా సురేఖ వ్యాఖ్యలు చేశారంటూ న్యాయస్థానాన్ని ఆశ్రయింంచారు. ఈ మేరకు నాంపల్లి కోర్టులో మంత్రి కొండా సురేఖపై క్రిమినల్ కేసుతో పాటు పరువు నష్టం దావా కేసు కూడా నమోదు చేశాడు. (చదవండి: కొండా సురేఖ చౌకబారు వ్యాఖ్యలను తీవ్రంగా ఖండిస్తున్నా: మహేశ్ బాబు)కాగా, నాగార్జున ఫ్యామిలీపై మంత్రి సురేఖ చేసిన వ్యాఖ్యలు రెండు రాష్ట్రాల్లో ప్రకంపనలు సృష్టించాయి. టాలీవుడ్ ప్రముఖులంతా మంత్రి వ్యాఖ్యలను తప్పుపడుతూ అక్కినేని ఫ్యామిలీకి మద్దతుగా నిలిచారు. బాధ్యత గల పదవిలో ఉండి ఒక మహిళ గురించి తప్పుగా ప్రస్తావించడం సరికాదంటూ సోషల్ మీడియా వేదికగా తమ ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. (చదవండి: మంత్రి కొండా సురేఖ Vs టాలీవుడ్.. ఎవరెవవరు ఏమన్నారంటే..?)pic.twitter.com/8VHcJYC7kn— chaitanya akkineni (@chay_akkineni) October 3, 2024 -
కేటీఆర్‌పై మరోసారి కొండా సురేఖ సంచలన ఆరోపణలు
సాక్షి, సిద్దిపేట: తెలంగాణలో బీఆర్ఎస్ నేతలు వర్సెస్ మంత్రి కొండా సురేఖ అన్నట్టుగా మాటల యుద్ధం కొనసాగుతోంది. ఇప్పటికే కేటీఆర్‌పై సంచలన ఆరోపణలు చేసిన కొండా సురేఖ.. తాజాగా మరిన్ని కామెంట్స్ చేశారు. బీఆర్ఎస్ ఓడిపోవడానికి కేటీఆర్ ప్రధాన కారణమని కీలక వ్యాఖ్యలు చేశారు.మంత్రి కొండా సురేఖ గురువారం గజ్వేల్ నియోజకవర్గంలో పర్యటించారు. ఈ సందర్బంగా కొండా సురేఖ మాట్లాడుతూ..‘సోషల్ మీడియాను అడ్డం పెట్టుకొని నాపై కేటీఆర్ పిచ్చి రాతలు రాయిస్తున్నారు. తొమ్మిది హామీలు అమలు చేస్తే పదో హామీ ఎందుకు ఇవ్వలేదని కేటీఆర్ ప్రశ్నిస్తున్నారు. ఎన్నికల్లో బీఆర్ఎస్ ఓడిపోవడానికి ప్రధాన కారణం కేటీఆర్. పదవీ కాంక్షతో కేసీఆర్‌ని కేటీఆర్ ఏదో చేశాడన్న ప్రచారం జరుగుతోంది.కేటీఆర్ సీఎం అనుకుని పిచ్చి నిర్ణయాలు తీసుకున్నారు. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తర్వాత బడ్జెట్ సమావేశాల రోజు కేసీఆర్ కనిపించారు. అప్పటి నుంచి మళ్లీ కేసీఆర్ కనిపించలేదు. ఫామ్‌హౌస్‌లో కేసీఆర్ ఏం చేస్తున్నారో తెలియదు. గజ్వేల్‌లో కేసీఆర్ కనిపించడంలేదని పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేస్తాం. గజ్వేల్‌లో పోటీ చేసి నియోజకవర్గ ప్రజలకు అందుబాటులో ఉండటం లేదని ఓటర్లు చెప్పుకుంటున్నారు. అధికారం కోల్పోయే సరికి కేటీఆర్‌కు మతిభ్రమించింది. ఏదేదో మాట్లాడుతున్నాడు. హైడ్రా, మూసీ అంటూ ప్రజలను ప్రలోభాలకు గురిచేస్తున్నాడు. మూసీ ప్రక్షాళనకు తెరలేపింది బీఆర్ఎస్ పార్టీనే. ఇప్పటికైనా బీఆర్ఎస్ నేతలు ఒళ్లు దగ్గరపెట్టుకుని మాట్లాడాలని హెచ్చరిస్తున్నాను. ప్రభుత్వ చర్యలను వ్యతిరేకిస్తూ ప్రజల్లో ప్రలోభాలకు తెరలేపితే ఊపేక్షించేది లేదు. రేవంత్ నాయకత్వంలో ప్రజలందరికీ న్యాయం జరుగుతుంది. అలాగే, పార్లమెంట్ ఎన్నికల్లో సిద్దిపేట, గజ్వేల్ నియోజకవర్గాల్లో బీజేపీ, బీఆర్ఎస్ మధ్య చీకటి ఒప్పందం జరిగింది. కవిత బెయిల్ కోసం ప్రధానితో మాట్లాడి ఒప్పందం చేసుకుని.. బీజేపీతో కలిసి బీఆర్ఎస్ నేతలు పనిచేశారు’ అంటూ సంచలన ఆరోపణలు చేశారు.ఇది కూడా చదవండి: కొండా సురేఖ కామెంట్స్ దుమారం.. సినీ పెద్దలకు టీపీసీసీ చీఫ్ విజ్ఞప్తి -
కొండా సురేఖ చౌకబారు వ్యాఖ్యలను తీవ్రంగా ఖండిస్తున్నా: మహేశ్ బాబు
తెలంగాణ మంత్రి కొండా సురేఖ చేసిన వివాదాస్పద వ్యాఖ్యలపై తెలుగు చిత్ర పరిశ్రమ భగ్గుమంటుంది. సినీనటి సమంత విడాకులు, రకుల్ ప్రీత్‌సింగ్ పెళ్లి, అక్కినేని నాగార్జున కుటుంబం, డ్రగ్స్, ఫోన్ ట్యాపింగ్ వ్యవహారాలను లేవనెత్తుతూ కేటీఆర్‌పై మంత్రి కొండా సురేఖ చేసిన అనుచిత వ్యాఖ్యలు తీవ్ర దుమారం రేపాయి. దీంతో #FilmIndustryWillNotTolerate అనే హ్యాష్ ట్యాగ్‌తో కొండా సురేఖపై నటీనటులు భారీగానే విరుచుకుపడుతున్నారు.మహేశ్ బాబు'మంత్రి కొండా సురేఖ గారు మా సినీ ప్రముఖులపై చేసిన వ్యాఖ్యలు చాలా బాధ కలిగించాయి. ఒక కూతురి తండ్రిగా, భార్యకు భర్తగా, తల్లికి కొడుకుగా మీ వ్యాఖ్యలు నన్ను బాధించాయి. ఒక మహిళా మంత్రిగా మీరు మరో మహిళపై చేసిన ఆమోదయోగ్యంకాని వ్యాఖ్యలు, మీ భాష పట్ల తీవ్ర వేదనకు గురయ్యాను. ఎదుటివారి మనోభావాలను దెబ్బతీయనంత వరకు వాక్ స్వేచ్ఛను ఉపయోగించుకోవచ్చు. మీరు చేసిన చౌకబారు, నిరాధారమైన వ్యాఖ్యలను నేను తీవ్రంగా ఖండిస్తున్నాను. సినీ వర్గాన్ని సాఫ్ట్ టార్గెట్‌గా మార్చుకోవద్దని పబ్లిక్ డొమైన్లో ఉన్న అందరినీ అభ్యర్థిస్తున్నాను. మన దేశంలోని మహిళలను, మన సినీ సోదరులను గౌరవంగా చూడాలి.' అని మహేశ్ కోరారు.రాజకీయ యుద్ధం పేరుతో గౌరవప్రదమైన వారిపై నీచమైన ఆరోపణలు చేస్తూ ఓ మహిళా మంత్రి పైశాచిక వ్యూహాలను అవలంబించడం నన్ను భయాందోళనకు గురిచేస్తోంది. ఇది అవమానానికి మించినది. తమ రాజకీయ శత్రుత్వాల్లోకి అమాయక వ్యక్తులను, ముఖ్యంగా మహిళలను ఎవరూ లాగకూడదు. నాయకులు సమాజానికి ఉదాహరణగా నిలువాలి. అందరిలోనూ సామాజిక విలువలను పెంచాలి. వాటిని తగ్గించకూడదు.- రవితేజమంత్రి కొండా సురేఖ గారి నుంచి ఇలాంటి నిరాధారమైన వ్యాఖ్యలు వినడం చాలా బాధాకరం. అధికారంలో ఉన్న మహిళగా, మహిళలు విజయం సాధించడం ఎంత సవాలుతో కూడుకున్నదో మీకు తెలిసే ఉంటుంది. రాజకీయ లబ్ధి కోసం సినీ తారల వ్యక్తిగత జీవితాలపై స్త్రీ ద్వేషంతో తప్పుడు ఆరోపణలు చేయడం ఆమోదయోగ్యం కాదు. మీ మాటలను ఉపసంహరించుకుని క్షమాపణలు చెప్పవలసిందిగా నేను మిమ్మల్ని కోరుతున్నాను. రాహుల్ గాంధీని కూడా నేను అభ్యర్థిస్తున్నాను. మీ పార్టీలోని నాయకులు ఇలాంటి వ్యాఖ్యలు చేయకుండా చూసుకోవాలి. భవిష్యత్ తరాలకు మనం సరైన ఉదాహరణగా ఉండాలి. గౌరవనీయులైన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని కూడా అభ్యర్థిస్తున్నాను. ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా చూడాలని కోరుతున్నాను. ఈ వ్యక్తిగత దూషణలు చిత్ర పరిశ్రమ ఏకతాటిపైకి తెస్తోంది. అని భావిస్తున్నాను. - మంచు మనోజ్రాజకీయాల కోసం సినీ, టీవీ ప్రముఖుల వ్యక్తిగత జీవితాన్ని తప్పుడు ఆరోపణలు ప్రచారం చేయడం సరికాదు. చిత్ర పరిశ్రమలోని మేమందరమూ కూడా కుటుంబ సమేతంగా కలిసి నిరసన తెలియజేస్తున్నాం. వ్యూస్ కోసం తప్పుడు థంబ్నెయిల్లతో అవే వీడియోలను పోస్ట్ చేయవద్దని యూట్యూబర్స్ణు అభ్యర్థిస్తున్నాను. ఇతర వృత్తిలాగే మమ్మల్ని కూడా గౌరవించండి. - సుమ కనకాలసినీ ప్రముఖులపై రాజకీయ నాయకులు అనుచిత వ్యాఖ్యలు చేయడం బాధాకరం. ఇది వ్యక్తిగత జీవితాలను దోపిడీ చేయడం .దయచేసి మాట్లాడే ముందు ఆలోచించండి. ఈ రకమైన నీచమైన వ్యాఖ్యలు, మాటల దూషణలకు వ్యతిరేకంగా మేము ఐక్యంగా ఉన్నాము. - కిరణ్ అబ్బవరంశ్రీమతి కొండా సురేఖ.. మీ రాజకీయ ప్రయోజనాల కోసం ఇలా అసహ్యంగా మాట్లాడటం మమ్మల్ని చాలా బాధపెట్టింది.ఇలాంటి నిరాధారమైన పుకార్లు వ్యాప్తి చేయడం అంత మంచి నిర్ణయం కాదు. మీ రాజకీయం కోసం సినీ పరిశ్రమ సభ్యుల వ్యక్తిగత జీవితాలను లాగితేప సహించం. - రాజశేఖర్మీ వ్యాఖ్యలు ఆమోదయోగ్యం కానివి. చాలా అసహ్యంగా ఉంది. ఇలాంటివి ఎప్పుడూ జరగలేదు. ఎవరైనా ఇంత నీచంగా దిగజారి, మీడియా ముందు అవమానకరమైన వ్యాఖ్యలను ఎలా చేయగలరు..? సెలబ్రిటీల పేర్లను, వారి వ్యక్తిగత జీవితాన్ని లాగడం, వారిపై నిరాధార ఆరోపణలు చేయడం ఎంతవరకు సబబు. హద్దులు దాటి ఒక వ్యక్తి గుర్తింపును అగౌరవపరచడం సహించలేని చర్య. ఇలాంటి వాటిని సమాజం తిరస్కరిస్తుంది. ప్రతి ఒక్కరిని గౌరవించండి. రాజకీయ నాయకులు బాధ్యతాయుతంగా ప్రవర్తిస్తూ.. సమాజాన్ని జాగ్రత్తగా చూసుకోవాలని భావిస్తున్నాం. మహిళా మంత్రినే ఇలాంటి వ్యాఖ్యలు చేయడం చాలా దారుణం.' అని చెప్పుకొచ్చింది. - సంయుక్త మేనన్నేటి రాజకీయ నాయకుల ప్రవర్తనపై నా ఆలోచనలు, భావాలను మంచి భాషలో వ్యక్తీకరించడానికి ఇబ్బంది పడుతున్నా. ప్రజలకు మంచి జరగడానికి మేము ఓటు వేస్తామని చాలా మంది రాజకీయ నాయకులకు గుర్తు చేయాలనుకుంటున్నాము. ప్రజలుగా మేము దీన్ని అనుమతించలేము, అంగీకరించలేము. రాజకీయాలు ఏ మాత్రం దిగజారకూడదు. మీరుండేది ప్రజల బాగోగులూ చూసుకునేందకని గుర్తుపెట్టుకోండి. వారికి కావాల్సిన మౌలిక సదుపాయాలు, పెట్టుబడుల, విద్య గురించి మాట్లాడండి. ఉద్యోగాలు కల్పించి వారి శ్రేయస్సు కోసం కష్టపడండి. ఇలాంటి వ్యాఖ్యలతో రాజకీయాలను దిగజార్చకండి.' అంటూ కొండా సురేఖపై కామెంట్ చేశారు. - విజయ్ దేవరకొండ సమంత గారిపై, అక్కినేని కుటుంబంపై తెలంగాణ మంత్రి కొండా సురేఖ అక్క చేసిన వ్యాఖ్యలు బాధాకరం. గతంలో చైల్డ్ అబ్యూస్ కేసులో ముందుగా స్పందించిన మీరే.. ఇప్పుడు ఇలాంటి వ్యాఖ్యలు చేయడం బాధనిపిస్తుంది. మీ రాజకీయ విమర్శల కోసం ఏ మాత్రం సంబంధం లేని నటీనటుల పేర్లు తీసుకురావడం.. ఆపై వాళ్ల వ్యక్తిగత జీవితంపై దిగజారుడు ఆరోపణలు చేయడం మంచిది కాదు. గౌరవప్రదమైన స్థానంలో ఉన్న మీరే ఇలా మాట్లాడడం సమాజానికి శ్రేయస్కరం కాదు. మావి చాలా సున్నితమైన మనసులు. వాటిని గాయం చేసి మీ రాజకీయం కోసం వాడుకోవడం తగదు. గతంలో మా కుటుంబాన్ని కూడా ఎన్నిసార్లు లక్ష్యంగా చేసుకుని దారుణమైన వ్యాఖ్యలు చేసినా మేము స్పందించలేదు. మేమెప్పుడూ ఏమీ అనమని సాఫ్ట్ టార్గెట్ చేయవద్దు. దయచేసి ఇకపై నటులను మాత్రమే కాదు.. ఎవరి వ్యక్తిగత విషయాలపై ఇలాంటి దారుణమైన వ్యాఖ్యలు చేయకూడదని కోరుకుంటున్నాను. - సాయి ధరమ్‌తేజ్ -
కొండా సురేఖ వ్యాఖ్యలపై స్పందించిన టీపీసీసీ చీఫ్
-
మంత్రి కొండా సురేఖ Vs టాలీవుడ్.. ఎవరెవవరు ఏమన్నారంటే..? (ఫొటోలు)
-
KSR Live Show: చౌకబారు రాజకీయం..!
-
దయచేసి 'మా' వ్యక్తిగత జీవితాలతో ఆడుకోవద్దు: మంచు విష్ణు లేఖ
మంత్రి కొండా సురేఖ వ్యాఖ్యలపై మూవీ ఆర్టిస్ట్స్ అసోసియేషన్ అధ్యక్షుడు మంచు విష్ణు స్పందించారు. సినిమా వాళ్లపై ఇలాంటి కామెంట్స్ చేయడం దురదృష్టకరమన్నారు. సినీ పరిశ్రమ పరస్పర గౌరవం, నమ్మకంతో నడుస్తుందని తెలిపారు. రాజకీయ లాభాల కోసం వ్యక్తిగత జీవితాలను టార్గెట్ చేయడం నిరాశ కలిగించిందన్నారు. మేము నటులుగా ప్రజల దృష్టిలో ఎప్పుడూ ఉంటామని.. కానీ మా కుటుంబాలు వ్యక్తిగతమని మా తరఫున మంచు విష్ణు నోట్ విడుదల చేశారు.'సమాజంలో ఇటీవలి కాలంలో జరిగిన దురదృష్టకరమైన వ్యాఖ్యల నేపథ్యంలో.. వాటివల్ల కుటుంబాలకు కలిగిన బాధను ప్రస్తావించడం చాలా అవసరమని భావిస్తున్నా. మన పరిశ్రమ కూడా ఇతర రంగాల్లాగే పరస్పర గౌరవం, నమ్మకంతో నడుస్తుంది. నిజం కాని కథనాలను రాజకీయ లబ్ధి కోసం వాడటం చాలా నిరాశను కలిగించింది. మేము నటులుగా ప్రజల దృష్టిలో ఎప్పుడూ ఉంటాం.. కానీ మా కుటుంబాలు మాత్రం వ్యక్తిగతం. మిగిలిన అందరి కుటుంబాల్లాగే మాకు కూడా గౌరవం, రక్షణ అవసరం. ఎవరూ తమ కుటుంబ సభ్యులు టార్గెట్ అవ్వడం.. వారి వ్యక్తిగత జీవితాలపై అబద్ధపు ఆరోపణలు రావాలని ఇష్టపడరు. అదే విధంగా మేము కూడా మా కుటుంబాలకు గౌరవం ఇవ్వాలని కోరుకుంటున్నాం.'నోట్లో ప్రస్తావించారు.(ఇది చదవండి: నేను షాకయ్యా.. కొండా సురేఖ వ్యాఖ్యలపై ఆర్జీవీ రియాక్షన్)'రాజకీయ నాయకులు, ప్రభావవంతమైన వ్యక్తులకు నేను వినమ్రంగా విజ్ఞప్తి చేస్తున్నా. దయచేసి రాజకీయాల కోసం, ప్రజల దృష్టి ఆకర్షించడానికి మా సినిమాకు చెందిన వారి పేర్లు, కుటుంబాల పేర్లు వాడకండి. చిత్రపరిశ్రమలో పనిచేసేవారు వినోదం ఇవ్వడానికి ఎంతో కష్టపడుతున్నారు. మా వ్యక్తిగత జీవితాలను ప్రజాక్షేత్రంలోకి లాగొద్దని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. మనమందరం ఒకరినొకరు గౌరవించుకోవాలి. కేవలం వృత్తి పరంగానే కాకుండా.. మనుషులుగా కూడా మన కుటుంబాలపై వచ్చే అబద్ధపు కథనాల వల్ల కలిగే బాధ చాలా తీవ్రమైంది. ఇలాంటి సంఘటనల బాధని మాత్రమే కలిగిస్తాయని మనమందరం అంగీకరిద్దాం. సినీ ఇండస్ట్రీ తరపున మా కుటుంబాలకు అనవసరమైన, హానికరమైన పరిస్థితుల నుంచి దూరంగా ఉంచమని వినమ్రంగా విజ్ఞప్తి చేస్తున్నా. నా చిత్రపరిశ్రమను ఎవరు బాధపెట్టాలని చూస్తే నేను మౌనంగా ఉండను. మేము ఇలాంటి దాడులను తట్టుకోం. అవసరమైతే మేమంతా ఏకమై నిలబడతాం' అంటూ లేఖ విడుదల చేశారు. Official Statement from Movie Artists Association (MAA) pic.twitter.com/vc4SWsnCj6— Vishnu Manchu (@iVishnuManchu) October 3, 2024 -
కొండా సురేఖ వ్యాఖ్యలను ఖండించిన రాంగోపాల్ వర్మ
-
కొండా సురేఖ వ్యాఖ్యలపై స్పందించిన చిరంజీవి
-
నేను షాకయ్యా.. కొండా సురేఖ వ్యాఖ్యలపై ఆర్జీవీ రియాక్షన్
అక్కినేని ఫ్యామిలీపై తెలంగాణ మంత్రి కొండా సురేఖ చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు రెండు తెలుగు రాష్ట్రాల్లో హాట్ టాపిక్‌గా మారింది. మంత్రి హోదాలో ఉండి అలాంటి ఆరోపణలు చేయడంపై టాలీవుడ్ ప్రముఖులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికే నాగర్జున, అమల, నాగచైతన్య, సమంత, ప్రకాశ్ రాజ్, ఎన్టీఆర్, నాని, అల్లు అర్జున్‌తో పాటు పలువురు సినీ ప్రముఖులు సోషల్ మీడియా వేదికగా స్పందిస్తూ.. మంత్రి చేసిన వాఖ్యలను తప్పుపట్టారు. ఇక తాజాగా ప్రముఖ దర్శకుడు రామ్ గోపాల్ వర్మ కూడా కొండా సురేఖ వ్యాఖ్యల పై మండిపడుతూ వరుస ట్వీట్స్ చేశాడు.(చదవండి: మంత్రి మాటలు విని చాలా బాధపడ్డా: మెగాస్టార్ చిరంజీవి)నాగార్జున కుటుంబాన్ని అత్యంత హార్రిబుల్ గా అవమానపరిచిన కొండా సురేఖ కామెంట్లకి నేను షాక్ అయిపోయాను . తన రాజకీయ ప్రత్యర్థి మీద పగ తీర్చుకోవడానికీ మధ్యలో ది మోస్ట్ రెస్పెక్టెడ్ నాగార్జున ఫ్యామిలీని రోడ్ మీదకి లాగడం ఏ మాత్రం భరించకూడదు. కేటీఆర్‌ను దూషించే క్రమంలో అక్కినేని కుటుంబాన్ని అంత దారుణంగా అవమానించటంలో అర్ధమేంటో కనీసం ఆవిడకైనా అర్ధమయ్యుంటుందో లేదో నాకర్ధమవ్వటంలేదు ? తనని రఘునందన్ ఇష్యూ లో ఎవరో అవమానించారనీ అసలు ఆ ఇష్యూతో ఏ మాత్రం సంబంధం లేని నాగార్జున, నాగ చైతన్యలని అంతకన్నా దారుణంగా అవమానించటమేంటి? 4th గ్రేడ్ వెబ్సైట్లు కూడా ప్రచురించని జుగుప్సాకరమైన నిందలు తనేదో తన కన్నులతో చూసి తన చెవులతో విన్నట్లు కన్ఫర్మేషన్‌తో మీడియా ముందు అరచి చెప్పటం దారుణం.4th గ్రేడ్ వెబ్సైట్లు కూడా ప్రచురించని జుగుప్సాకరమైన నిందలు తనేదో తన కన్నులతో చూసి తన చెవులతో విన్నట్లు కన్ఫర్మేషన్‌తో మీడియా ముందు అరచి చెప్పటం దారుణంఒక మినిస్టర్ హోదాలో ఉండి నాగార్జున, నాగ చైతన్యలాంటి డిగ్నిఫైడ్ కుటుంబాన్ని, సమంత లాంటి ఇండస్ట్రీ గర్వించదగ్గ ఒక మహా నటి మీద… https://t.co/rMpA6UL798— Ram Gopal Varma (@RGVzoomin) October 3, 2024 (చదవండి: ఇలాంటి ప్రవర్తన మన తెలుగు సంస్కృతికి విరుద్ధం: అల్లు అర్జున్, వెంకటేశ్) ఒక మినిస్టర్ హోదాలో ఉండి నాగార్జున, నాగ చైతన్యలాంటి డిగ్నిఫైడ్ కుటుంబాన్ని, సమంత లాంటి ఇండస్ట్రీ గర్వించదగ్గ ఒక మహా నటి మీద అంత నీచమైన మాటలనంటాన్ని తీవ్రంగా ఖండించాలి. సీఎం రేవంత్ రెడ్డి గారు ఈ విషయంలో వెంటనే కలుగజేసుకొని ఇకపై ఇలాంటివి జరగకుండా ఒక స్ట్రాంగ్ వార్నింగ్ ఇవ్వాలని ఇండస్ట్రీ తరపునుంచి అడుగుతున్నాము’ అని ఆర్జీవీ తన ఎక్స్ ఖాతాలో రాసుకొచ్చారు. కాగా, కొండా సురేఖ ఫ్యామిలీతో ఆర్జీవీకి మంచి పరిచయాలు ఉన్నాయి. గతంలో కొండా సురేఖ దంపతులపై ‘కొండా’ అనే సినిమాను తెరకెక్కించాడు. -
ఇలాంటి నిరాధార ఆరోపణలను తీవ్రంగా ఖండిస్తున్నాం: అల్లు అర్జున్, వెంకటేశ్
తెలంగాణ మంత్రి కొండా సురేఖ వ్యాఖ్యలపై టాలీవుడ్ ప్రముఖులు తీవ్రంగా మండిపడుతున్నారు. ఇప్పటికే జూనియర్ ఎన్టీఆర్, నాని. చిరంజీవి, సుధీర్ బాబు ఆమె కామెంట్స్‌పై అభ్యంతరం వ్యక్తం చేశారు. తాజాగా ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ఈ విషయంపై స్పందించారు. సినీ ప్రముఖులు, సినీ కుటుంబాలపై నిరాధారమైన కించపరిచే వ్యాఖ్యలను తీవ్రంగా ఖండిస్తున్నట్లు ట్విటర్ వేదికగా నోట్ రిలీజ్ చేశారు.అల్లు అర్జున్ తన నోట్లో ప్రస్తావిస్తూ..' సినీ ప్రముఖులు, సినీ కుటుంబాలపై నిరాధారమైన, కించపరిచే వ్యాఖ్యలను తీవ్రంగా ఖండిస్తున్నాను. ఆమె ప్రవర్తన చాలా అగౌరవంగా ఉంది. ఇలా మాట్లాడడం మన తెలుగు సంస్కృతి విలువలకు విరుద్ధం. ఇలాంటి బాధ్యతారహితమైన చర్యలను ఎట్టి పరిస్థితుల్లోనూ అంగీకరించకూడదు. ప్రతి ఒక్కరూ బాధ్యతాయుతంగా ప్రవర్తించాలని, వ్యక్తిగత గోప్యతను గౌరవించాలని నేను కోరుతున్నా' అంటూ పోస్ట్ చేశారు. (ఇది చదవండి: రాజకీయాల కోసం ఇంతలా దిగజారకూడదు: కొండా సురేఖ కామెంట్స్‌పై మెగాస్టార్)చాలా బాధ కలిగించింది: వెంకటేశ్మంత్రి కొండా సురేఖ వ్యాఖ్యలపై హీరో వెంకటేశ్ స్పందించారు. వ్యక్తిగత విషయాలను రాజకీయాల కోసం వాడుకోవడం చాలా బాధ కలిగించిందని తెలిపారు. బాధ్యతాయుతమైన పదవిలో ఉన్న వ్యక్తి రాజకీయ లబ్ధి కోసం వ్యక్తులను టార్గెట్ చేయడం దురదృష్టకరమన్నారు. మా సినిమా కుటుంబం పరస్పర గౌరవం, కృషితో వ్యక్తిగత జీవితాల పట్ల అపారమైన అంకితభావంతో నిర్మించబడిందని ట్వీట్ చేశారు. బహిరంగ ప్రసంగంలో తమ గౌరవాన్ని కాపాడుకోవడాల్సిన నైతిక బాధ్యత ఉందన్నారు. వ్యక్తుల జీవితాలను రాజకీయ రంగంలోకి లాగడం వల్ల ఎవరికీ ఉపయోగముండదని.. అది వారికి బాధను మాత్రమే పెంచుతుందన్నారు. ప్రజలకు నాయకత్వం వహించే స్థానాల్లో ఉన్న వ్యక్తులు సంయమనం పాటించాలని నేను కోరుతున్నానని' వెంకటేశ్ పోస్ట్ చేశారు. It deeply saddens me to see a personal situation being used as political ammunition. It is unfortunate that someone in a position of responsibility has chosen to weaponize a private matter for political gain.Our cinema family is built on mutual respect, hard work, and immense…— Venkatesh Daggubati (@VenkyMama) October 3, 2024#FilmIndustryWillNotTolerate pic.twitter.com/sxTOyBZStB— Allu Arjun (@alluarjun) October 3, 2024 -
రాజకీయాల కోసం ఇంతలా దిగజారకూడదు: కొండా సురేఖ కామెంట్స్‌పై మెగాస్టార్
మంత్రి కొండా సురేఖ చేసిన వ్యాఖ్యలపై మెగాస్టార్ చిరంజీవి రియాక్ట్ అయ్యారు. మహిళా మంత్రిగా ఉండి ఆమె చేసిన కామెంట్స్ చూసి చాలా బాధపడ్డానని అన్నారు. వార్తల్లో నిలిచేందుకు సెలబ్రిటీల పేర్లు వాడుకోవడం సిగ్గుచేటని ఎక్స్ వేదికగా మండిపడ్డారు. సినీ ఇండస్ట్రీ సభ్యులపై ఇలాంటి దుర్మార్గపు మాటలను చిత్ర పరిశ్రమగా మేము ఏకతాటిపైన వ్యతిరేకిస్తామని చిరంజీవి స్పష్టం చేశారు.చిరు తన ట్వీట్లో ప్రస్తావిస్తూ..'గౌరవనీయులైన మహిళా మంత్రి చేసిన వ్యాఖ్యలు చూసి నేను చాలా బాధపడ్డా. సెలబ్రిటీలు, ముఖ్యంగా సినీ ఇండస్ట్రీ సభ్యులు టార్గెట్‌గా మారడం సిగ్గుచేటు. మా సభ్యులపై ఇలాంటి దుర్మార్గపు మాటల దాడులను మేము ఏకతాటిపైన వ్యతిరేకిస్తాం. రాజకీయాలకు ఏ మాత్రం సంబంధం లేని మహిళలను ఇందులోకి లాగడం సరైంది కాదు. తమ రాజకీయ మనుగడ కోసం అసహ్యకరమైన రీతిలో కల్పిత ఆరోపణలు చేయడం మంచిది కాదు. రాజకీయాల కోసం ఎవరూ ఈ స్థాయికి దిగజారకూడదు.' అంటూ పోస్ట్ చేశారు. (ఇది చదవండి: మీ మాటలు స్త్రీ తత్వానికే అవమానం: ఖుష్బూ సుందర్)సమాజాన్ని మంచిగా మార్చడానికి మేము నాయకులను ఎన్నుకుంటామని మెగాస్టార్ ట్వీట్లో ప్రస్తావించారు. మీ ప్రసంగాల ద్వారా దానిని కలుషితం చేయకూడదని హితవు పలికారు. రాజకీయ నాయకులు గౌరవప్రదమైన స్థానాల్లో ఉన్న వ్యక్తులు ప్రజలకు ఉదాహరణగా ఉండాలని సూచించారు. ఇలాంటి హానికరమైన వ్యాఖ్యలను వెంటనే ఉపసంహరించుకుంటారని నమ్ముతున్నానని చిరంజీవి పోస్ట్ చేశారు. I am extremely pained to see the disgraceful remarks made by an honourable woman minister. It is a shame that celebs and members of film fraternity become soft targets as they provide instant reach and attention. We as Film Industry stand united in opposing such vicious verbal…— Chiranjeevi Konidela (@KChiruTweets) October 3, 2024 -
కొండా సురేఖ వ్యాఖ్యలకు సీఎం రేవంత్ రెడ్డి స్పందించాలి
-
ఒళ్లు దగ్గర పెట్టుకుని మాట్లాడాలి.. ఎలా పడితే అలా మాట్లాడితే..
-
మీ మాటలు స్త్రీ తత్వానికే అవమానం: ఖుష్బూ సుందర్
తెలంగాణ మంత్రి కొండా సురేఖ చేసిన వ్యాఖ్యలపై సినీ నటి ఖుష్బూ సుందర్ స్పందించారు. కేవలం 2 నిమిషాల ఫేమ్ కోసం ఎల్లో జర్నలిజంలో మునిగిపోయేవారు మాత్రమే ఇలాంటి భాష మాట్లాడుతారని అన్నారు. మీ మాటలు స్త్రీ తత్వానికి పూర్తి అవమానంగా భావిస్తున్నట్లు ఖుష్బూ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ విషయంపై ట్విటర్ వేదికగా ఆమె మండిపడ్డారు.ఖుష్బూ తన ట్వీట్లో ప్రస్తావిస్తూ..'కొండా సురేఖ గారు.. బాధ్యతాయుతమైన పదవిలో ఉన్న వ్యక్తి చిత్ర పరిశ్రమ గురించి ఇలాంటి నిరాధారమైన ఆరోపణలు చేయకూడదు. కేవలం 2 నిమిషాలు ఫేమ్ కోసం ఆరాటపడేవారే ఇలాంటి భాష మాట్లాడతారని అనుకుంటున్నా. మీ మాటలు స్త్రీ తత్వానికే అవమానంగా భావిస్తున్నా. సినీ పరిశ్రమ ఇకపై ఇలాంటి వాటిని ఊపేక్షించదు. ఇలాంటి నిరాధారమైన, తప్పుడు ఆరోపణలకు ఒక మహిళగా మొత్తం సినీ పరిశ్రమకు మీరు క్షమాపణ చెప్పాలి. భారతదేశంలో ప్రజాస్వామ్యం అనేది వన్ వే ట్రాఫిక్ కాదు. కానీ మేము మీ స్థాయికి దిగజారలనుకోవడం లేదు' అంటూ పోస్ట్ చేశారు.(ఇది చదవండి: మాపై నిరాధార ఆరోపణలు చేస్తుంటే ఊరుకోం: కొండా సురేఖపై ఎన్టీఆర్ ఆగ్రహం)కాగా.. అంతకుముందు సమంత- నాగచైతన్య విడాకుల విషయంలో మంత్రి కొండా సురేఖ సంచలన ఆరోపణలు చేసిన సంగతి తెలిసిందే. దీంతో ఆమె వ్యాఖ్యలపై సినీ ప్రముఖులు తీవ్రస్థాయిలో మండిపడుతున్నారు. ఇప్పటికే నాని, ఎన్టీఆర్ ఆమె వ్యాఖ్యలను ఖండించారు. దీంతో కొండా సురేఖ తన కామెంట్స్‌ను ఉపసంహరించుకుంటున్నా అంటూ ట్వీట్ చేసింది. I thought it was only those who need 2 minute fame and indulge in yellow journalism speak this language. But here, I see an absolute disgrace to womanhood. Konda Surekha garu, I am sure some values were instilled in you. Where have they flown out of the window? A person in a…— KhushbuSundar (@khushsundar) October 2, 2024 -
ఇది చాలా దుర్మార్గం.. కేటీఆర్ ఎలాంటి మనిషంటే..
-
తన వ్యాఖ్యలను వెనక్కి తీసుకున్న మంత్రి కొండా సురేఖ
-
కొండా సురేఖ వ్యాఖ్యలను ఖండించిన జూనియర్ ఎన్టీఆర్
-
మాపై నిరాధార ఆరోపణలు చేస్తుంటే ఊరుకోం: కొండా సురేఖపై ఎన్టీఆర్ ఆగ్రహం
సమంత-నాగచైతన్య విడాకులను ఉద్దేశించి తెలంగాణ మంత్రి కొండా సురేఖ చేసిన కామెంట్స్‌పై జూనియర్ ఎన్టీఆర్ మండిపడ్డారు. క్తిగత జీవితాలను రాజకీయాల్లోకి లాగడం సరైంది కాదన్నారు. పబ్లిక్ ఫిగర్లు, ప్రత్యేకించి మీలాంటి బాధ్యతాయుతమైన స్థానాల్లో ఉన్నవారు తప్పనిసరిగా హుందాతనం, ఇతరుల గోప్యతను గౌరవించాలన్నారు. ముఖ్యంగా సినిమా వాళ్ల గురించి నిర్లక్ష్యంగా కామెంట్స్ చేయడం చూస్తుంటే నిజంగా బాధాకరమని ట్వీట్ చేశారు.ఎన్టీఆర్ తన ట్వీట్లో రాస్తూ..'కొండా సురేఖ గారూ.. వ్యక్తిగత జీవితాలను రాజకీయాల్లోకి మీ దిగజారుడు రాజకీయాలకు నిదర్శనం. ప్రత్యేకించి మీలాంటి బాధ్యతాయుతమైన స్థానాల్లో ఉన్నవారు తప్పనిసరిగా హుందాగా, గౌరవంగా గోప్యతను పాటించేలా ఉండాలి. సినిమా పరిశ్రమ గురించి నిర్లక్ష్యంగా నిరాధారమైన కామెంట్స్ చేయడం చూస్తుంటే బాధగా ఉంది. మాపై నిరాధార ఆరోపణలు చేస్తుంటే మేం చూస్తూ ఊరుకోం. ఒకరినొకరు గౌరవించుకావాలి.. పరిధులు దాటి ప్రవర్తించకుండా ఉండేందుకు ఈ అంశాన్ని కచ్చితంగా లేవనెత్తుతాం. ప్రజాస్వామ్య భారతదేశంలో ఇలాంటి నిర్లక్ష్యపు ప్రవర్తనను సమాజం ఏమాత్రం హర్షించదు' అంటూ పోస్ట్ చేశారు.(ఇది చదవండి: మీలాంటి వారిని చూస్తుంటే అసహ్యమేస్తోంది: కొండా సురేఖపై నాని ఫైర్)కాగా.. అంతకుముందు సమంత-నాగ చైతన్య విడాకులపై కొండా సురేఖ చేసిన వ్యాఖ్యలను సినీ ప్రముఖులు అంతా ఖండించారు. రాజకీయాల కోసం వ్యక్తిగత జీవితాలను లాగడం సరైన పద్ధతి కాదని హితవు పలికారు. Konda Surekha garu, dragging personal lives into politics is a new low. Public figures, especially those in responsible positions like you, must maintain dignity and respect for privacy. It’s disheartening to see baseless statements thrown around carelessly, especially about the…— Jr NTR (@tarak9999) October 2, 2024 -
హైడ్రా పేరిట వసూళ్లు నిరూపిస్తే మూసీలో దూకుతా: మహేశ్‌గౌడ్
సాక్షి, హైదరాబాద్: బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఏం చదువుకున్నారో అర్థం కావడం లేదని, రాహుల్ గాం«దీకి, మూసీకి, హైడ్రాకు ఏం సంబంధముందని ఆయన మాట్లాడుతున్నారని టీపీసీసీ చీఫ్ మహేశ్‌కుమార్‌గౌడ్ ప్రశ్నించారు. హైడ్రా పేరిట వసూళ్లు చేసినట్టు నిరూపిస్తే తాను పురానాపూల్ బ్రిడ్జి మీద నుంచి మూసీలో దూకుతానని, లేదంటే కేటీఆర్ దూకాలని ఆయన సవాల్ చేశారు. బుధవారం గాం«దీభవన్‌లో మంత్రులు కొండా సురేఖ, పొన్నం ప్రభాకర్లతో కలసి ఆయన విలేకరులతో ఇష్టాగోష్టిగా మాట్లాడుతూ.. గత పదేళ్లలో బీఆర్ఎస్ నేతలు యథేచ్ఛగా కబ్జాలు చేశారని, అందుకే హైడ్రా అనగానే భయాందోళనలకు గురవుతున్నారని వ్యా ఖ్యానించారు. చెట్లు, లిక్కర్, ఇరిగేషన్ పేరు మీద దోచుకుని రా ష్ట్రాన్ని లూటీ చేశారని, ఇప్పుడు ఆ సొమ్ముతో సోషల్‌మీడియాలో ఇష్టమొచ్చినట్టు మాట్లాడిస్తున్నారని ధ్వజమెత్తారు. మూసీ చుట్టూ ఉన్న ఒక్క ఇల్లును కూడా ఇప్పటివరకు తొలగించలేదని, ఒకవేళ తొలగించాల్సి వచ్చినా చట్టబద్ధంగా నష్టపరిహారాన్ని ప్రభుత్వం చెల్లిస్తుందని చెప్పారు. అసలు మూసీ సుందరీకరణ ప్రాజెక్టుకు, హైడ్రాకు సంబంధం లేని, డీపీఆర్ తయారు కాకుండానే మూసీ అభివృద్ధికి ఎంత ఖర్చవుతుందో ఎలా చెప్తామని ప్రశ్నించారు. మూసీ సుందరీకరణకు సమయం పడుతుందని ఆయన పేర్కొన్నారు. మంత్రి కొండా సురేఖ గురించి అసభ్యంగా ట్రోల్ చేసిన విషయంలో బావకు ఉన్న సోయి బావమరిదికి లేదని, అందుకే కేటీఆర్ ట్రోల్స్‌ని ఖండించలేదని అభిప్రాయపడ్డారు. బీఆర్ఎస్కు చెందిన ఎమ్మెల్యేలు తమతో టచ్‌లో ఉన్నారని మహేశ్‌గౌడ్ ఈ సందర్భంగా చెప్పారు.మహిళా కమిషన్ సుమోటోగా తీసుకుంది: మంత్రి సురేఖ బీఆర్ఎస్లో రాజకీయంగా మహిళలను ఎదగనివ్వరని మంత్రి కొండా సురేఖ అన్నారు. అందుకే బొడిగె శోభ, రేఖానాయక్‌తో పాటు తనకు కూడా మంత్రి పదవి ఇవ్వలేదన్నారు. కుటుంబ పాలన నడవాలి కాబట్టే తమకు పదవులు ఇవ్వలేదని చెప్పారు. తనపై సోషల్‌మీడియాలో చేసిన కామెంట్లను మహిళా కమిషన్ సుమోటోగా తీసుకుందని చెప్పారు. తాము బీఆర్ఎస్ లాగా సోషల్‌మీడియాను దురి్వనియోగం చేయబోమన్నారు. మూసీ చుట్టూ ఉన్న ఇళ్లను కూల్చకముందే బీఆర్ఎస్ నేతలు ప్రజలను రెచ్చగొడుతున్నారని ఆరోపించిన సురేఖ.. బతుకమ్మ పండుగకు ఏమివ్వాలన్న దానిపై ఇంకా రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకోలేదని చెప్పారు. -
చౌకబారు రాజకీయం!
సాక్షి, హైదరాబాద్: కాంగ్రెస్, బీఆర్ఎస్ మధ్య.. మంత్రి కొండా సురేఖ, మాజీ మంత్రి కేటీఆర్‌ల మధ్య రాజకీయ వివాదం ‘చౌకబారు’ మలుపు తీసుకుంది. సినీనటి సమంత విడాకులు, రకుల్ ప్రీత్‌సింగ్ పెళ్లి, డ్రగ్స్, ఫోన్ ట్యాపింగ్ వ్యవహారాలను లేవనెత్తుతూ కేటీఆర్‌పై మంత్రి కొండా సురేఖ చేసిన అనుచిత వ్యాఖ్యలు తీవ్ర దుమారం రేపాయి. బాధ్యతగల మంత్రి హోదాలో ఉన్న ఆమె.. నైతికతను పట్టించుకోకుండా అక్కినేని నాగార్జున కుటుంబంపై ఆక్షేపణీయ వ్యాఖ్యలు చేయడం, దానికి కేటీఆర్ బాధ్యుడంటూ ఆరోపణలు చేయడంతో కలకలం మొదలైంది. రాజకీయ నేతలు, సినీ ప్రముఖులు కొండా సురేఖ వ్యాఖ్యలను తీవ్రంగా తప్పుపడుతున్నారు. రాజకీయపరమైన వివాదాల్లోకి సంబంధం లేని ఓ కుటుంబ అంతర్గత వ్యవహారాన్ని లాగడం, ఉచితానుచితాలను పట్టించుకోకుండా ఇష్టం వచ్చిన ఆరోపణలు చేయడం సరికాదని మండిపడుతున్నారు. తెలంగాణలో మహిళలంతా సంబురంగా జరుపుకొనే బతుకమ్మ పండుగ వేళ.. మహిళలపై అనుచిత వ్యాఖ్యలు, మహిళలే ఆక్షేపణీయ విమర్శలు చేయడం చర్చనీయాంశంగా మారింది. అసలేమైందంటే...! ఈ మొత్తం వివాదం వెనుక ఇటీవల మంత్రి కొండా సురేఖ మెదక్ పర్యటన సందర్భంగా జరిగిన ఘటన, దానిపై బీఆర్ఎస్ పేరిట సోషల్ మీడియాలో జరిగిన ట్రోలింగ్‌తో బీజం పడింది. అక్కడ జరిగిన కల్యాణలక్ష్మి, షాదీ ముబారక్ చెక్కుల పంపిణీ కార్యక్రమంలో మెదక్ ఎంపీ రఘునందన్‌రావు ఒక నూలు దండను మంత్రి సురేఖ మెడలో వేశారు. కొందరు ఈ ఫోటోను పెట్టి అసభ్య భావంతో ట్రోలింగ్ చేశారు. దీనిపై కొండా సురేఖ ఆవేదన వ్యక్తం చేశారు. సురేఖపై ట్రోలింగ్‌కు నిరసనగా కొందరు కాంగ్రెస్ కార్యకర్తలు, చేనేత కార్మీకులు తెలంగాణ భవన్ వద్ద ఆందోళన వ్యక్తం చేశారు. బుధవారం మీడియాతో కేటీఆర్ చిట్‌చాట్ చేస్తూ కొండా సురేఖను విమర్శించారు. తనను ట్రోల్ చేశారంటూ సురేఖ దొంగ ఏడుపులు ఏడుస్తున్నారని వ్యాఖ్యానించారు. అనంతరం కొండా సురేఖ తీవ్రంగా స్పందిస్తూ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. అక్కినేని కుటుంబాన్ని ప్రస్తావిస్తూ.. గాంధీ జయంతి సందర్భంగా మహాత్ముడికి నివాళులర్పించిన అనంతరం బాపూఘాట్ వద్ద, గాం«దీభవన్‌లో మీడియాతో మాట్లాడుతూ కేటీఆర్‌పై విరుచుకుపడ్డారు. తన వ్యక్తిత్వాన్ని హత్య చేయాలని బీఆర్ఎస్ నేతలు చూస్తున్నారని.. అలాంటప్పుడు తాను దొంగ ఏడుపులు ఎందుకు ఏడుస్తానని ప్రశ్నించారు. సినీ నటి సమంత, నాగార్జున కుమారుడు నాగచైతన్య విడిపోవడానికి కేటీఆరే కారణమని.. ఆయన చాలా మంది హీరోయిన్లను బెదిరించి లొంగదీసుకునే ప్రయత్నం చేశారని వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. ‘‘నాగచైతన్య, సమంత విడిపోవడానికి కారణం కేటీఆరే. చాలా మంది హీరోయిన్లు సినిమా ఫీల్డ్ నుంచి తప్పుకుని త్వరగా పెళ్లిళ్లు చేసుకోవడానికి కారణం కూడా కేటీఆరే. ఆయన డ్రగ్స్‌కు అలవాటు పడి, వాళ్లకూ డ్రగ్స్ అలవాటు చేశారు. వాళ్ల జీవితాలతో ఆడుకునేలా బ్లాక్మెయిల్ చేసి ఇబ్బందులు పెట్టారు. వాళ్లను డ్రగ్స్ కేసులో ఇరికించి ఆయన తప్పుకున్నారు. వాళ్ల ఫోన్లు ట్యాప్ చేసి, రహస్యంగా మాట్లాడుకున్న విషయాలను రికార్డు చేసి వాళ్లకు వినిపించేవారు. ఆ రికార్డులను అడ్డుపెట్టుకుని బెదిరించేవారు’’ అని కొండా సురేఖ ఆరోపించారు. నిజానికి పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్‌గా కేటీఆర్ తనను ట్రోల్ చేసిన వారిపై చర్యలు తీసుకోవాలని, కానీ అలా ఎందుకు చేయలేదని ప్రశ్నించారు. హైదరాబాద్ మేయర్ గద్వాల విజయలక్ష్మి గురించి, మంత్రి సీతక్క గురించి కూడా గతంలో ఇలాంటి పోస్టులే పెట్టారని.. ఇప్పుడు తనపై పెడుతున్నారని మండిపడ్డారు. తనపై ట్రోలింగ్ చేసినవారు, వారి వెనుక ఉండి నడిపిస్తున్న వారిపై కేసులు పెడుతున్నామని చెప్పారు. కాంగ్రెస్ వర్సెస్ బీఆర్ఎస్.. కొండా సురేఖపై ట్రోలింగ్, ఆమె చేసిన వ్యాఖ్యల వ్యవహారం బీఆర్ఎస్, కాంగ్రెస్ నేతల మధ్య మాటల మంటలు రేపుతోంది. మెదక్ ఘటనపై సోషల్ మీడియాలో బీఆర్ఎస్ అనుయాయులు చేసిన ట్రోల్స్‌పై కొండా సురేఖ, ఇతర కాంగ్రెస్ నేతలు తీవ్రంగా మండిపడ్డారు. దీనిపై కేటీఆర్ స్పందిస్తూ.. తప్పుడు వ్యాఖ్యలు చేస్తున్న మంత్రుల నోర్లు ఫినాయిల్‌తో కడుక్కోవాలని వ్యాఖ్యానించారు. మరో మంత్రి సీతక్క తిరిగి కేటీఆర్ నోరే యాసిడ్‌తో కడుక్కోవాలని విమర్శించారు. కొండా సురేఖతో పెట్టుకోవడం అంత సులువు కాదని, కేటీఆర్ రెచ్చగొట్టి మరీ ఆమెతో తన్నించుకుంటున్నారని మాజీ ఎమ్మెల్యే టి.జగ్గారెడ్డి వ్యాఖ్యానించారు. కేటీఆర్ మహిళా మంత్రుల పట్ల అనుచితంగా ప్రవర్తిస్తున్నారంటూ మహిళా కాంగ్రెస్ రాష్ట్ర అధ్యక్షురాలు సునీతారావు విమర్శలు గుప్పించారు. మరోవైపు కేటీఆర్‌ను ఉద్దేశించి మంత్రి సురేఖ చేసిన వ్యాఖ్యలపై.. బీఆర్ఎస్ మహిళా నేతలు తీవ్రంగా మండిపడ్డారు. కొండా సురేఖ నోటి దురుసు గురించి అందరికీ తెలుసని, ఇంకోసారి మాట్లాడితే కోర్టుకు ఈడుస్తామంటూ మాజీ మంత్రి సత్యవతి రాథోడ్, మాజీ ఎంపీ మాలోతు కవిత, నేత తుల ఉమ హెచ్చరించారు. మహిళా మంత్రులను శిఖండులుగా పెట్టుకుని సీఎం రేవంత్‌రెడ్డి డైవర్షన్ రాజకీయాలు చేస్తున్నారని విమర్శించారు. కొండా సురేఖ వ్యాఖ్యలు అసంబద్ధం మంత్రి కొండా సురేఖ వ్యాఖ్యలను తీవ్రంగా ఖండిస్తున్నాను. రాజకీయాలకు దూరంగా ఉండే సినీ ప్రముఖుల జీవితాలను మీ ప్రత్యర్ధులపై విమర్శల కోసం వాడుకోకండి. దయచేసి సాటి మనుషుల వ్యక్తిగత విషయాలను గౌరవించండి. బాధ్యత కలిగిన పదవిలో ఉన్న మహిళగా మీరు చేసిన వ్యాఖ్యలు, మా కుటుంబం పట్ల చేసిన ఆరోపణలు పూర్తిగా అసంబద్ధం, అబద్ధం. తక్షణమే మీ వ్యాఖ్యలను వెనక్కి తీసుకోవాల్సిందిగా కోరుతున్నాను. – ‘ఎక్స్’లో సినీ నటుడు నాగార్జున ఏంటీ సిగ్గులేని రాజకీయాలు: ప్రకాశ్‌రాజ్ ‘ఏంటీ సిగ్గులేని రాజకీయాలు.. సినిమాల్లో నటించే ఆడవాళ్లంటే చిన్నచూపా? జస్ట్ ఆస్కింగ్’ – ‘ఎక్స్’లో సినీ నటుడు ప్రకాశ్‌రాజ్ నా విడాకులకు, రాజకీయ కుట్రకు సంబంధం లేదు విడాకులు నా వ్యక్తిగత విషయం. సినీ పరిశ్రమలో ఓ మహిళ ఉండటానికి, బయటికి వచ్చి నిలబడి పోరాడటానికి చాలా ధైర్యం, బలం కావాలి కొండా సురేఖ. దయచేసి చిన్నచూపు చూడకండి. ఒక మంత్రిగా మీ మాటలకు విలువ ఉందని మీరు గ్రహించారని ఆశిస్తున్నాను. వ్యక్తిగత విషయాలపై మాట్లాడేప్పుడు బాధ్యతగా, గౌరవంగా ఉండాలని నేను మిమ్మల్ని వేడుకుంటున్నాను. నా విడాకులు పరస్పర అంగీకారం, సామరస్యపూర్వకంగా జరిగాయి. ఎటువంటి రాజకీయ కుట్రకు ప్రమేయం లేదు. దయచేసి నా పేరును రాజకీయ పోరాటాలకు దూరంగా ఉంచండి. నేను ఎప్పుడూ రాజకీయాలకు అతీతంగా ఉంటాను. అలానే ఉండాలని కోరుకుంటున్నాను. – ‘ఇన్‌స్టా’లో నటి సమంత పోస్ట్ సీఎం రేవంత్ స్పందించాలి.. అక్కినేని కుటుంబంపై తెలంగాణ మహిళా మంత్రి చేసిన కామెంట్స్ చూసి షాక్ తిన్నాను. ఆమె వ్యాఖ్యలను తీవ్రంగా ఖండిస్తున్నాను. నేను ఎంతగానో గౌరవించే సీఎం రేవంత్‌రెడ్డి ఈ అంశాన్ని తీవ్రంగా పరిగణించాలి. బాధ్యతారహిత, కించపరిచే వ్యాఖ్యలు చేసిన కొండా సురేఖతో క్షమాపణ చెప్పించాలి. సినీ రంగం మొత్తం ఈ వ్యాఖ్యలను తీవ్రంగా ఖండించాలి. – సినీ రచయిత కోన వెంకట్ కొండా సురేఖ వ్యాఖ్యలు అసంబద్ధం. తక్షణమే ఆ వ్యాఖ్యలను వెనక్కి తీసుకోవాల్సిందిగా కోరుతున్నాను. ‘ఎక్స్’లో నాగార్జున -
మీ హెడ్‌లైన్స్ కోసం మా జీవితాలే దొరికాయా?: నాగచైతన్య
తన విడాకుల గురించి తెలంగాణ మంత్రి కొండా సురేఖ చేసిన అనుచిత వ్యాఖ్యలపై టాలీవుడ్ హీరో నాగచైతన్య స్పందించాడు. జీవితంలో అత్యంత బాధాకరమై, దురదృష్టకరమైన నిర్ణయాల్లో విడాకులు ఒకటి. ఎంతగానో ఆలోచించిన తర్వాతే నేను, నా మాజీ భాగస్వామి విడిపోవాలని నిర్ణయించుకున్నాం. ఇది శాంతియుతంగా తీసుకున్న నిర్ణయం.మౌనంగా ఉన్నా..అయితే మా విడాకుల గురించి ఇప్పటివరకు నానారకాలుగా ప్రచారం చేశారు. నా మాజీ భాగస్వామితో పాటు నా కుటుంబంపై ఉన్న గౌరవంతో ఇంతకాలం మౌనంగానే ఉన్నాను. కానీ ఈ రోజు మంత్రి కొండా సురేఖగారు అబద్ధపు ప్రచారానికి పూనుకున్నారు. ఆమోదయోగ్యం కాని వ్యాఖ్యలు చేశారు. మీడియా హెడ్‌లైన్స్ కోసం సెలబ్రిటీల వ్యక్తిగత జీవితాలను ఉపయోగించుకోవడం సిగ్గుచేటు అని ఓ నోట్ విడుదల చేశాడు.చదవండి: మీ స్వార్థం కోసం సమంత పేరు వాడతారా? చిన్మయి ఫైర్మంత్రి అనుచిత వ్యాఖ్యలుఇకపోతే బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ వల్లే చైసామ్ విడిపోయారని కొండా సురేఖ మాట్లాడారు. ఇందులో నాగార్జున హస్తం కూడా ఉందంటూ అతడి కుటుంబంపై హీనమైన వ్యాఖ్యలు చేశారు. ఈ క్రమంలోనే అక్కినేని కుటుంబంతో పాటు సమంత సైతం ఆమె వ్యాఖ్యలను సోషల్ మీడియా వేదికగా తీవ్రంగా ఖండిస్తున్నారు.చదవండి: కొండా సురేఖ వ్యాఖ్యలపై స్పందించిన సమంత.. బాధ్యతగా మెదులుకోండి.. -
క్షమాపణలు చెప్పకుంటే.. కొండా సురేఖకు కేటీఆర్ హెచ్చరిక
హైదరాబాద్, సాక్షి: తెలంగాణ మంత్రి కొండా సురేఖ తనపై చేసిన ఆరోపణలను బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఖండించారు. ఈ మేరకు ఆమెకు లీగల్ నోటీసులు పంపించారు. ఫోన్ ట్యాపింగ్, ఇతర అంశాలపై మంత్రి సురేఖ చేసిన వ్యాఖ్యలు అసత్యాలు. నా గౌరవానికి భంగం కలిగించాలనే లక్ష్యంతో అడ్డగోలుగా మాట్లాడారు. కొండా సురేఖ మంత్రి హోదాను దుర్వినియోగం చేశారు. ..ఎలాంటి సాక్ష్యాలు లేకుండా ఆమె అసత్యాలు చెప్పారు. ఆ వ్యాఖ్యలు ప్రజలు నిజమని భావించే ప్రమాదం ఉంది. గతంలోనూ ఆమె అడ్డగోలుగా మాట్లాడారు. వీటిపై ఏప్రిల్‌లోనే నోటీసులు పంపించాను. మంత్రి సురేఖ క్షమాపణలు చెప్పకుంటే పరువు నష్టం దావా వేస్తా. దావాతో పాటు క్రిమినల్ కేసులు వేస్తా’’ అని కేటీఆర్ పేర్కొన్నారు.ఇదీ చదవండి: సురేఖా.. నోరు జాగ్రత్త!కొండా సురేఖ ఏమన్నారంటే..మెదక్ పర్యటనలో ఎంపీ రఘునందన్ కొండా సురేఖ మెడలో వేసిన దండపై.. సోషల్ మీడియాలో ట్రోలింగ్ జరిగింది. దానిపై ఆమె తీవ్ర ఆవేదన చెందారు. ఇది బీఆర్ఎస్ పనేనని ఆరోపిస్తూ కంటతడి పెట్టారు కూడా. అయితే బుధవారం మరోసారి ఈ అంశంపై విలేకరులతో మాట్లాడుతూ.. కేటీఆర్ స్పందించలేదంటూనే తీవ్ర విమర్శలు చేశారు. కేటీఆర్ తీరుతో తెలుగు సినీ పరిశ్రమలో కొంతమంది ఇబ్బంది పడ్డారని అన్నారు. కొందరు హీరోయిన్లు త్వరగా పెళ్లి చేసుకుని సినిమా ఫీల్డ్ నుంచి తప్పుకోవడానికి కారణం కూడా కేటీఆర్ అని ఆరోపించారు. అంతేకాదు, అక్కినేని కుటుంబంలో అలజడికి కూడ కేటీఆర్ కారణమంటూ సంచలన ఆరోపణలు చేశారామె. ఇప్పటికే మంత్రి కొండా సురేఖ ఆరోపణలను అక్కినేని నాగార్జున, అమలతో పాటు సమంత ఖండించారు. ప్రకాశ్ రాజ్, హేమ, చిన్మయి లాంటి సినీ ప్రముఖులు ఆమె వ్యాఖ్యల్ని తీవ్రంగా తప్పుబట్టారు. మరోవైపు.. బీఆర్ఎస్ ఈ వ్యవహారంలో కొండా సురేఖపై మండిపడుతూ క్షమాపణలు డిమాండ్ చేస్తోంది.ఇదీ చదవండి: కొండా ఆరోపణలపై స్పందించిన సమంత -
రాహుల్ గాంధీ.. మీ నాయకులను అదుపులో పెట్టుకోండి: అమల
నాగచైతన్య- సమంత విడాకులకు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కారణమంటూ మంత్రి కొండా సురేఖ చేసిన వ్యాఖ్యలపై ఆగ్రహావేశాలు వ్యక్తమవుతున్నాయి. సెలబ్రిటీల విడాకులకు రాజకీయాలను అంటగట్టడంపై సర్వత్రా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఇప్పటికే నాగార్జున, సమంత, నాగచైతన్య.. కొండా సురేఖ వ్యాఖ్యలపై సీరియస్‌గా స్పందించారు.ఇది సిగ్గుచేటుతాజాగా నాగార్జున సతీమణి అమల అక్కినేని సోషల్ మీడియా వేదికగా కాంగ్రెస్ వైఖరిని ప్రశ్నించింది. ఒక మహిళా మంత్రి రాక్షసిగా మారి అమాయక పౌరులను రాజకీయ యుద్ధం కోసం వాడటం చూసి షాకయ్యాను. మేడమ్.. సిగ్గు లేకుండా నా భర్త గురించి తప్పుడు ప్రచారం చేస్తున్నారు కదా.. అది జనాలు నమ్ముతారని భావిస్తున్నారా? మీ ప్రవర్తన నిజంగా సిగ్గుచేటు.అదుపులో పెట్టుకోండినాయకులే నేరస్తుల్లా ప్రవర్తిస్తే మన దేశం ఏమైపోతుంది? మిస్టర్ రాహుల్ గాంధీజీ, మీ నాయకులను అదుపులో పెట్టుకోండి.. నా కుటుంబంపై విషపూరిత కామెంట్లు చేసిన మీ మంత్రితో క్షమాపణలు చెప్పించండి. ఇటువంటివారి నుంచి దేశపౌరులను రక్షించండి అని అమల ట్వీట్ చేసింది. Shocked to hear a woman minister turn into a demon, conjuring evil fictions allegations, preying on decent citizens as fuel for a political war.Madam Minister, do you rely and believe people with no decency to feed you utterly scandalous stories about my husband without an iota…— Amala Akkineni (@amalaakkineni1) October 2, 2024చదవండి: మీ స్వార్థం కోసం సమంత పేరు వాడతారా? చిన్మయి ఫైర్ -
నా విడాకులకు రాజకీయాలతో సంబంధం లేదు: సమంత
బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ వల్లే నాగచైతన్య, సమంత విడాకులు తీసుకున్నారంటూ మంత్రి కొండా సురేఖ చేసిన అనుచిత వ్యాఖ్యలపై హీరోయిన్ సమంత స్పందించింది. 'మహిళల్ని వస్తువుగా చూసే ఈ గ్లామర్ ప్రపంచంలో పని చేసేందుకు, నిలబడి పోరాడేందుకు ఎంతో శక్తి, ధైర్యం అవసరం. కొండా సురేఖగారు.. దయచేసి నా ప్రయాణాన్ని చిన్నచూపు చూడొద్దు. అది నా వ్యక్తిగత విషయంఒక మంత్రిగా మీ మాటలకు ఎంతో గౌరవం ఉంటుంది. దయచేసి ఇతరుల వ్యక్తిగత విషయాలు మాట్లాడేటప్పుడు బాధ్యతగా, గౌరవప్రదంగా వ్యవహరించాలని వేడుకుంటున్నాను. విడాకుల విషయానికి వస్తే అది నా వ్యక్తిగత విషయం. దాని గురించి ఏదేదో ఊహించడం ఆపండి. అందులో కుట్ర లేదుమేము పరస్పర అంగీకారంతో విడాకులు తీసుకున్నాం. ఇందులో ఎటువంటి రాజకీయ కుట్ర లేదు. నేను రాజకీయాలకు అతీతంగా ఉంటాను. కాబట్టి దయచేసి నా పేరును రాజకీయాలకు దూరంగా ఉంచుతారని ఆశిస్తున్నాను' అని సమంత ఇన్స్టాగ్రామ్ స్టోరీలో రాసుకొచ్చింది.చదవండి: మంత్రి కొండా సురేఖ వ్యాఖ్యలపై నాగార్జున ఫైర్ -
చైసామ్ విడిపోయి నేటికి మూడేళ్లు.. ఇంతలా వాడుకుంటారా?
టాలీవుడ్ సెలబ్రిటీ జంట సమంత- నాగచైతన్య విడాకులు తీసుకుని సరిగ్గా నేటికి మూడేళ్లవుతోంది. 2021 అక్టోబర్ 2న పరస్పర అంగీకారంతో విడిపోతున్నట్లుగా సోషల్ మీడియాలో ప్రకటించారు. అప్పటినుంచి వీరి విడాకుల గురించి ఏదో ఒక చర్చ జరుగుతూనే ఉంది. ఇదిలా ఉంటే ఈ మధ్యే నాగచైతన్యకు.. హీరోయిన్ శోభిత ధూళిపాళతో ఎంగేజ్మెంట్ కూడా జరిగింది. అటు సమంత.. తన వర్క్ లైఫ్‌లో మునిగిపోయింది.దారుణ వ్యాఖ్యలుఇలాంటి సమయంలో మంత్రి కొండా సురేఖ.. సామ్-చైలపై అనుచిత వ్యాఖ్యలు చేశారు. వీరు విడిపోవడానికి బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కారణమని ఆరోపించారు. అక్కినేని కుటుంబ ప్రతిష్టను దిగజార్చేలా అనుచిత కామెంట్లు చేశారు. దీంతో నాగ్ సోషల్ మీడియా వేదికగా మండిపడ్డాడు. మీ రాజకీయాల కోసం సినీప్రముఖుల జీవితాలను వాడుకోవద్దని హెచ్చరించాడు. ఇంతకు దిగజారుతారా?తాజాగా సామ్ స్నేహితురాలు, సింగర్ చిన్మయి ఎక్స్ వేదికగా స్పందించింది. 'మీ ఎజెండా కోసం, మైలేజ్ కోసం, వ్యూస్ కోసం, డబ్బు కోసం సమంత పేరును ఇంత భయంకరంగా వాడుకుంటారా? అందరి దృష్టి మీవైపు మళ్లడం కోసం సమంతను అస్త్రంలా ఉపయోగిస్తున్నారని అర్థమవుతోంది. కానీ మీ అందరికంటే తనెప్పుడూ అగ్రస్థానంలోనే ఉంటుంది. తనను కనీసం కలలో కూడా టచ్ చేయలేరు. ఈ నవరాత్రికి మీ పాపాలను కడిగేసుకోండి' అని ట్వీట్ చేసింది. pic.twitter.com/o2nFKDIE26— chaitanya akkineni (@chay_akkineni) October 2, 2021 I have been unfortunately watching the truly horrifying manner in which multiple individuals, Telugu youtube channels, media persons have been using Samantha’s name for their own mileage, agenda and to make money from click baits and views.End of the day all it proves is that…— Chinmayi Sripaada (@Chinmayi) October 2, 2024 చదవండి: మంత్రి కొండా సురేఖ వ్యాఖ్యలపై నాగార్జున ఫైర్ -
కేటీఆర్ తన నైజం చాటుకున్నాడు: మంత్రి సీతక్క
సాక్షి, హైదరాబాద్: తెలంగాణలో మహిళా మంత్రులను పదేపదే కించపరుస్తూ కేటీఆర్ తన దొర దురహంకారాన్ని కేటీఆర్ చాటుకుంటున్నాడు అంటూ మంత్రి సీతక్క ఆగ్రహం వ్యక్తం చేశారు. పండుగ పూట మహిళ పట్ల కేటీఆర్ చీప్ కామెంట్స్ చేస్తారా? అంటూ మండిపడ్డారు.మంత్రి సీతక్క బుధవారం మీడియాతో మాట్లాడుతూ..‘తెలంగాణ ఆడబిడ్డల పండుగ బతుకమ్మ మొదటి రోజే మహిళా మంత్రులను కించపరిచి కేటీఆర్ తన నైజం చాటుకున్నాడు. ఎంగిలిపూల బతుకమ్మ రోజే కేటీఆర్ గలీజ్ మాటలు వినాల్సి రావటం మన దురదృష్టం. మా నోళ్లను ఫినాయిల్‌తో కడగాలని మాట్లాడిన కుసంస్కారి కేటీఆర్. పండగల పూట మహిళ పట్ల చీప్ కామెంట్ చేసే కేటీఆర్ నోటినే యాసిడ్‌తో కడగాలి. పండగల పూట మహిళలు, మహిళా మంత్రులను కించపరచడం కేటీఆర్‌కు ఫ్యాషన్ అయింది.రాఖీ పండగ రోజు బస్సుల్లో మహిళలు బ్రేక్ డాన్స్‌లు చేసుకోవచ్చు అన్నాడు. బతుకమ్మ మొదటి రోజు చిట్ చాట్ పేరుతో మా గురించి చాలా చులకనగా మాట్లాడారు. అదే విషయం మీడియా ముఖంగా చెప్పి ఉంటే మహిళలే మీకు బుద్ధి చెప్పేవారు. మహిళా మంత్రులను పదే పదే కించపరుస్తూ తన దొర దురంకారాన్ని కేటీఆర్ చాటుకుంటున్నాడు. చాటుమాటుగా నాలుగు గోడల మధ్య మాట్లాడటం కాదు.. ధైర్యముంటే బహిరంగంగా మాట్లాడాలి.నేనెప్పుడూ వ్యక్తిగతంగా ఎవరిని దూషించలేదు. దూషణలకు, బూతులకు బ్రాండ్ అంబాసిడరే మీరు. నేను మిమ్మల్ని వ్యక్తిగతంగా దూషించినట్లు ఆధారాలు చూపిస్తావా?. రాజకీయాల్లో మేము ఉండకూడదన్న లక్ష్యంతోనే బీఆర్ఎస్ సోషల్ మీడియా ద్వారా మాపై పదే పదే అభ్యంతరకర కామెంట్స్ చేయిస్తున్నారు. కనీసం సొంత సోషల్ మీడియాను కట్టడి చేయాలన్న సభ్యత కేటీఆర్‌కు లేదు. నువ్వు ఇలానే రెచ్చిపోతే రేపు మీ కుటుంబ సభ్యులు తలదించుకోవాల్సి వస్తుంది’ అంటూ ఘాటు విమర్శలు చేశారు. ఇది కూడా చదవండి: వాళ్లు ఆడబిడ్డలు కాదా.. మంత్రి కొండా సురేఖకు సబిత కౌంటర్ -
మంత్రి కొండా సురేఖ వ్యాఖ్యలపై నాగార్జున ఫైర్, చై ఏమన్నాడంటే?
తన కుటుంబ సభ్యులపై తెలంగాణ మంత్రి కొండా సురేఖ చేసిన ఆరోపణలను ప్రముఖ హీరో నాగార్జున తీవ్రంగా ఖండించాడు. తక్షణమే తన వాఖ్యలను వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేశాడు. ఈ మేరకు ఆయన ఎక్స్‌లో ట్వీట్ చేశాడు. ‘గౌరవనీయ మంత్రివర్యులు శ్రీమతి కొండా సురేఖ గారి వ్యాఖ్యలని తీవ్రంగా ఖండిస్తున్నాను. రాజకీయాలకు దూరంగా ఉండే సినీ ప్రముఖుల జీవితాలని, మీ ప్రత్యర్ధులని విమర్శించేందుకు వాడుకోకండి. దయచేసి సాటి మనుషుల వ్యక్తిగత విషయాలని గౌరవించండి. బాధ్యత గలిగిన పదవి లో ఉన్న మహిళగా మీరు చేసిన వ్యాఖ్యలు, మా కుటుంబం పట్ల మీరు చేసిన ఆరోపణలు పూర్తిగా అసంబద్ధం, అబద్ధం. తక్షణమే మీ వ్యాఖ్యలను వెనక్కి తీసుకోవలిసిందిగా కోరుతున్నాను’ అని నాగార్జున ట్వీట్ చేశాడు. ఈ ట్వీట్‌ను నాగచైతన్య రీట్వీట్ చేశాడు.(చదవండి: ఆడవాళ్ళంటే చిన్న చూపా?.. కొండా సురేఖకు ప్రకాశ్ రాజ్ కౌంటర్)కాగా, తాజాగా మంత్రి కొండా సురేఖ మీడియాతో మాట్లాడుతూ.. సమంత, నాగ చైతన్య విడిపోవడానికి బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆరే కారణమని ఆరోపించారు. ‘‘మహిళలంటే కేటీఆర్‌కు చిన్నచూపు. ఆయన తీరుతో సినీ పరిశ్రమలో కొంతమంది ఇబ్బంది పడ్డారు. హీరోయిన్స్ కి కేటీఆర్ డ్రగ్స్ అలవాటు చేశారు. కొందరు హీరోయిన్లు సినిమా ఫీల్డ్ నుంచి తప్పుకొంటే.. మరికొందరు త్వరగా పెళ్లి చేసుకున్నారు’’ అని సంచలన ఆరోపణలు చేశారు.మంత్రి కొండా సురేఖ చేసిన వ్యాఖ్యలు ప్రస్తుతం టాలీవుడ్లో హాట్ టాపిక్‌గా మారాయి. ఆమె వ్యాఖ్యలపై సీనియర్ నటుడు ప్రకాష్ రాజ్ సైతం అసహనం వ్యక్త చేశారు. ‘‘సినిమాల్లో నటించే ఆడవాళ్ళంటే చిన్న చూపా..?’ అని ఎక్స్ వేదికగా ప్రశ్నించారు.(చదవండి: కేటీఆర్‌పై కొండా సురేఖ సంచలన ఆరోపణలు)గౌరవనీయ మంత్రివర్యులు శ్రీమతి కొండా సురేఖ గారి వ్యాఖ్యలని తీవ్రంగా ఖండిస్తున్నాను. రాజకీయాలకు దూరంగా ఉండే సినీ ప్రముఖుల జీవితాలని, మీ ప్రత్యర్ధులని విమర్శించేందుకు వాడుకోకండి. దయచేసి సాటి మనుషుల వ్యక్తిగత విషయాలని గౌరవించండి. బాధ్యత గలిగిన పదవి లో ఉన్న మహిళగా మీరు చేసిన…— Nagarjuna Akkineni (@iamnagarjuna) October 2, 2024 -
ఆడవాళ్ళంటే చిన్న చూపా?.. కొండా సురేఖకు ప్రకాశ్ రాజ్ కౌంటర్
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ మంత్రి కొండా సురేఖపై ప్రముఖ నటుడు ప్రకాశ్ రాజ్ ఆగ్రహం వ్యక్తం చేశారు. కొండా సురేఖ చేసిన వ్యాఖ్యలపై ట్విట్టర్ వేదికగా స్పందించిన ప్రకాశ్ రాజ్.. ఏంటీ సిగ్గులేని రాజకీయాలు.. సినిమాల్లో నటించే ఆడవాళ్ళంటే చిన్న చూపా?.. జస్ట్ ఆస్కింగ్ అంటూ కామెంట్స్ చేశారు. ఈ సందర్భంగా మంత్రి కొండా సురేఖ.. సినీ నటులు గురించి చేసిన వ్యాఖ్యలకు సంబంధించిన వీడియోను షేర్ చేశారు. ఏంటీ సిగ్గులేని రాజకీయాలు… సినిమాల్లో నటించే ఆడవాళ్ళంటే చిన్న చూప ?.. #justasking https://t.co/MsqIhDpbXa— Prakash Raj (@prakashraaj) October 2, 2024అంతకుముందు కేటీఆర్‌పై మంత్రి కొండా సురేఖ సంచలన ఆరోపణలు చేశారు. సినీ పరిశ్రమలో చాలా మంది విడాకులకు కేటీఆరే కారణం. ఎంతో మంది జీవితాలతో ఆడుకున్నారు. నాగచైతన్య సమంత విడాకులకు కేటీఆరే కారణం. ఎన్ కన్వెన్షన్ విషయంలోనే ఇది జరిగింది. అలాగే.. మరో హీరోయిన్ రకుల్ త్వరగా వివాహం చేసుకోవడానికి కూడా కేటీఆర్ వైఖరే కారణం. విచారణలో కేటీఆర్ గురించి షాకింగ్ విషయాలు తెలిశాయి. మహిళలంటే కేటీఆర్‌కు చిన్నచూపు. హీరోయిన్స్ కి కేటీఆర్ డ్రగ్స్ అలవాటు చేశారు. దుబాయ్ నుండి సోషల్ మీడియాను అపరేట్ చేయమని కేటీఆర్ కొందర్ని పురమాయించాడు. అక్కడి నుంచి బీఆర్ఎస్ సోషల్ మీడియా నడుస్తోంది. అక్కడి నుంచే నాపై పోస్టులు పెడుతున్నారు. మొన్న ఇద్దరిని, ఈరోజు ఇద్దరిని కేటీఆర్ దుబాయికి పంపించాడు అని ఆరోపించారు. ఇది కూడా చదవండి: ‘అక్కా..దొంగ ఏడుపులు ఎందుకు?’.. మంత్రులపై కేటీఆర్ సెటైర్లు -
కేటీఆర్‌పై కొండా సురేఖ సంచలన ఆరోపణలు
సాక్షి,హైదరాబాద్: బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కల్వకుంట్ల తారకరామారావుపై తెలంగాణ మంత్రి కొండా సురేఖ సంచలన ఆరోపణలకు దిగారు. ప్రముఖ హీరోహీరోయిన్లు నాగచైతన్య, సమంతలు విడిపోవడానికి కేటీఆరే కారణమని అన్నారామె. తనపై తాజాగా కేటీఆర్ చేసిన వ్యాఖ్యల మీద కొండా సురేఖ మీడియాతో మాట్లాడుతూ.. కేటీఆర్ అన్నట్లు దొంగ ఏడుపులు మాకు అవసరం లేదు. సినీ పరిశ్రమలో చాలా మంది విడాకులకు కేటీఆరే కారణం. ఎంతో మంది జీవితాలతో ఆడుకున్నారు. నాగచైతన్య సమంత విడాకులకు కేటీఆరే కారణం. ఎన్ కన్వెన్షన్ విషయంలోనే ఇది జరిగింది. అలాగే.. మరో హీరోయిన్ రకుల్ త్వరగా వివాహం చేసుకోవడానికి కూడా కేటీఆర్ వైఖరే కారణం. ఇదీ చదవండి: అక్కా దొంగ ఏడుపులు ఎందుకు: కేటీఆర్ విచారణలో కేటీఆర్ గురించి షాకింగ్ విషయాలు తెలిశాయి. మహిళలంటే కేటీఆర్‌కు చిన్నచూపు. ఆయన తీరుతో సినీ పరిశ్రమలో కొంతమంది ఇబ్బంది పడ్డారు. హీరోయిన్స్ కి కేటీఆర్ డ్రగ్స్ అలవాటు చేశారు. కొందరు హీరోయిన్లు సినిమా ఫీల్డ్ నుంచి తప్పుకొంటే.. మరికొందరు త్వరగా పెళ్లి చేసుకున్నారు. .. దుబాయ్ నుండి సోషల్ మీడియా ను అపరేట్ చేయమని కేటీఆర్ కొందర్ని పురమాయించాడు. అక్కడి నుంచి బీఆర్ఎస్ సోషల్ మీడియా నడుస్తోంది. అక్కడి నుంచే నాపై పోస్టులు పెడుతున్నారు. మొన్న ఇద్దరిని, ఈరోజు ఇద్దరిని కేటీఆర్ దుబాయికి పంపించాడు’’ అని సురేఖ ఆరోపించారు. ఇక తనపై సోషల్ మీడియాలో జరిగిన ట్రోలింగ్ మీద మాజీ మంత్రి హరీశ్‌రావు మనసున్న మనిషిలా స్పందించారని, కేటీఆర్ మాత్రం స్పందించకపోగా.. సిగ్గు లేకుండా మాట్లాడుతున్నారని కొండా సురేఖ ఫైర్ అయ్యారు. -
కొండా సురేఖపై ట్రోలింగ్.. రఘునందన్ సీరియస్
మెదక్, సాక్షి: రాజకీయాల్లో వ్యక్తిత్వ హననం ఏమాత్రం మంచిది కాదని.. బీఆర్ఎస్ పార్టీకి మహిళల మీద గౌరవం లేకుండా పోయిందని మండిపడ్డారు మెదక్ బీజేపీ ఎంపీ రఘునందన్ రావు. తెలంగాణ మంత్రి కొండా సురేఖపై సోషల్ మీడియాలో నడిచిన ట్రోలింగ్ వ్యవహారంపై రఘునందన్ మీడియాతో మాట్లాడారు.‘‘బీఆర్ఎస్కు మొదటి నుంచి మహిళల మీద గౌరవం లేదు. అందుకే.. తెలంగాణ తొలి కేబినెట్ లో మహిళలకు చోటు ఇవ్వలేదు. తల్లీ, అక్కాచెల్లి మధ్య ఉండే సంబంధం గురించి సోషల్ మీడియాలో సంస్కారహీనంగా పోస్టులు పెడుతున్నారు. ఒక అక్కకు తమ్ముడిగా ఆమెను అడిగి మరీ నూలు పోగు దండ వేశా. ఇంతకు ముందు ప్రధాని మోదీ వచ్చినప్పుడు కూడా ఇలాగే నూలు పోగు దండను వేశా. .. మెదక్ జిల్లా ఇన్ ఛార్జి మంత్రిగా సురేఖ అక్క వస్తే చేనేత సమస్యలు ఆమె దృష్టికి తీసుకెళ్లేలా నూలు పోగు దండ అడిగి వేశా. బీఆర్ఎస్ ఎమ్మెల్యే వచ్చి నాకు శాలువా కూడా కప్పారు. కానీ, ఆ పార్టీకి చెందిన వాళ్లు ఇంత సంస్కారహీనంగా.. సభ్యత లేకుండా మాట్లాడతారని అనుకోలేదు... అసలు బీఆర్ఎస్కు సోషల్ మీడియా మీద నియంత్రణ లేదా?. పోస్టు పెట్టిన అకౌంట్లో డీపీ హరీష్ రావు ఫోటో, కేసీఆర్ ఫోటోలు ఉన్నాయి. కేటీఆర్, హరీష్ రావులు ఈ వ్యవహారంపై స్పందించి క్షమాపణలు చెప్పాలి. తమ సోషల్ మీడియా విభాగాలను కంట్రోల్ చేసుకోవాలి. పోస్టులు పెట్టిన వారు మీ వాళ్ళు అయితే తీసుకొచ్చి పోలీసులకి అప్పగించండి. మీకు సంబంధం లేని, మీరు జీతం ఇవ్వని వ్యక్తులు అయితే తీవ్రంగా పరిగణించండి. హరీష్ రావు ఫోటోలు వాడుకుంటున్నారు కదా.. అలాగైనా పోలీసు కంప్లయింట్ ఇవ్వండి... నా వల్ల మా అక్కకు(కొండా సురేఖ) కలిగిన అసౌకర్యానికి చింతిస్తూ విచారం వ్యక్తం చేస్తున్నా. ఒక అక్కకు జరిగిన అవమానానికి తమ్ముడిగా తీవ్ర విచారం వ్యక్తం చేస్తున్నాను. అక్కకు మద్దతుగా ఒక వకీలుగా పోస్టులు పెట్టిన వారిని కోర్టుకు ఈడుస్తా’’ అని రఘునందన్ హెచ్చరించారు. -
కొండా సురేఖా ట్రోలింగ్ వ్యవహారంపై స్పందించిన హరీష్‌రావు
హైదరాబాద్: తెలంగాణ మంత్రి కొండా సురేఖపై సోషల్ మీడియాలో నడిచిన ట్రోలింగ్ వ్యవహారంపై బీఆర్ఎస్ సీనియర్ నేత, ఎమ్మెల్యే హరీష్‌రావు స్పందించారు. మహిళలను గౌరవించడం అందరి బాధ్యత అని చెబుతూ.. ఆమెకు కలిగిన అసౌకర్యానికి చింతిస్తున్నట్లు ఆయన తెలిపారు.‘‘మహిళల పట్ల అగౌరవంగా ప్రవర్తించడాన్ని ఎవరూ సహించబోరు. బీఆర్ఎస్ అయినా.. వ్యక్తిగతంగా నేనైనా ఇలాంటివి ఉపేక్షించం. సోషల్ మీడియా వేదికగా జరిగే వికృత చేష్టలను ఖండిస్తున్నా. సోషల్ మీడియాలో బాధ్యతగా వ్యవహరించాలని అందర్నీ కోరుతున్నా’’ అని ఎక్స్ వేదికగా హరీశ్‌రావు పేర్కొన్నారు.మహిళలను గౌరవించడం మనందరి బాధ్యత. వారి పట్ల అగౌరవంగా ప్రవర్తించడాన్ని ఏ ఒక్కరూ సహించరు. ఈ విషయంలో బీఆర్ఎస్ పార్టీ అయినా, వ్యక్తిగతంగా నేనైనా ఉపేక్షించబోము. మీకు @IKondaSurekha గారికి కలిగిన అసౌకర్యానికి మీతో పాటు నేనూ చింతిస్తున్నాను. సోషల్ మీడియా వేదికగా జరిగే ఇలాంటి వికృత…— Harish Rao Thanneeru (@BRSHarish) September 30, 2024ఇదీ చదవండి: కొండా సురేఖ కంటతడి.. సీతక్క వార్నింగ్ -
నన్ను మానసికంగా వేధిస్తున్నారు.. కొండా సురేఖ కంటతడి
హైదరాబాద్, సాక్షి: మెదక్ పర్యటనలో మంత్రి కొండా సురేఖకు ఎదురైన అనుభవాన్ని సోషల్ మీడియాలో కొందరు ట్రోల్ చేస్తున్నారు. అయితే ఈ దండ వ్యవహారంపై నడుస్తున్న ట్రోలింగ్‌పై ఎంపీ రఘునందన్‌రావు తనకు క్షమాపణలు చెప్పారని కొండా రేఖ అన్నారు. అంతేకాదు.. సోషల్ మీడియాలో తనను ట్రోల్ చేస్తోంది బీఆర్ఎస్సేనని ఆమె మండిపడ్డారు. సహచర మంత్రి కొండా సురేఖ మెడలో ఎంపీ నూలు దండ వేస్తే దాన్ని వక్రీకరించి దారుణంగా ప్రచారం చేస్తున్నారు.‘‘ఇంచార్జీ మినిస్టర్‌గా మెదక్ పర్యటనకు వెళ్లా. అక్కడి ఎంపీ రఘునందన్ చేనేత సమస్యలు నాకు చెప్పి.. గౌరవంగా చేనేత మాల నా మెడలో వేశారు. చేనేత మాల చేసేప్పుడు దాన్ని పరీక్షగా చూశాను. చేనేత వృత్తుల వారికి సంబంధించిన గౌరవప్రదమైన నూలు అది. కానీ, కొంతమంది పోగై నన్ను ట్రోల్ చేస్తున్నారు.అయినా కూడా చెప్పుకోలేని విధంగా ట్రోల్ చేస్తున్నారు. నాకు నిద్ర, తిండి లేకుండా చేస్తున్నారు. మానసికంగా నన్ను వేధిస్తున్నారు. నాకు మద్దతుగా కొందరు బీఆర్ఎస్ ఆఫీసుకు వెళ్తే వాళ్ళని కొట్టారు. అధికారం కోల్పోయి పిచ్చిపట్టి దుర్మార్గమైన ప్రచారాలు చేస్తున్నారు. డబ్బులు ఇచ్చి మరీ సోషల్ మీడియాలో ట్రోల్ చేయిస్తున్నారు. బీఆర్ఎస్ నేతల ఇళ్లలో ఆడవాళ్లపై ట్రోల్ చేస్తే ఎలా ఉంటుంది?. చేనేత కార్మికుల ఓట్లతో గెలిచి పద్మశాలి బిడ్డను ఇంత అవమానపరుస్తారా? అంటూ కేటీఆర్‌ను ఉద్దేశించి తీవ్ర వ్యాఖ్యలే చేశారామె.రెండోసారి అధికారంలోకి వచ్చాక బీఆర్ఎస్లో భారీ మార్పులు వచ్చాయి. నాకు మంత్రి పదవి ఇవ్వాల్సి వస్తుందనే కేసీఆర్ మహిళకు మంత్రిపదవి ఇవ్వలేదు. బీఆర్ఎస్ నాయకులు డబ్బు మదంతో పిచ్చిగా ప్రవర్తిస్తున్నారు. ఎస్సీ, ఎస్టీ, బీసీ వర్గాలకు సంబంధించిన మహిళలపై ఇలాంటి ట్రోలింగ్ చేస్తున్నారు.‘‘ఉన్నత వర్గం అనే బలుపు బీఆర్ఎస్కు ఉంది. ఎస్సీ, ఎస్టీ, బీసీ వర్గాలకు సంబంధించిన మహిళలపై ఇలాంటి ట్రోలింగ్ చేస్తున్నారు. పనులు కావాలంటే నా దగ్గరికి రండి అని గత పాలకులు ఇబ్బంది పెట్టారు. హరీష్ డీపీ పెట్టుకొని ట్రోల్ చేస్తున్నారు. కేటీఆర్ హరీశ్ భేషరతుగా క్షమాపణ చెప్పాలి. డిస్కో డాన్సులు నేర్పిందే మీ చెల్లి. అమెరికా సంస్కృతి తెచ్చి బతుకమ్మకు అంటించింది మీ చెల్లి. బతుకమ్మ సహజత్వాన్ని చెదగొట్టిందే మీ చెల్లి’’ అంటూ సురేఖ ఘాటైన వ్యాఖ్యలు చేశారు..ఈ విషయం తెలిసి.. రఘునందన్ ఫోన్ చేశారు. అక్కా.. క్షమించు కాళ్లు మొక్కుతా అన్నారు. రాజకీయ పార్టీలకతీతంగా నన్ను అక్కా అని.. నా భర్తను బావా అని పిలుస్తారు.అలాంటిది మానసిక వేదనతో మా కుటుంబాన్ని ఇబ్బంది పెడుతున్నారు.ఇకపై ట్రోలింగ్ చేస్తే ఊరుకునేది లేదు. ఏదో ఒకరోజు ప్రజలూ తిరగబడుతారు అని కొండా సురేఖ హెచ్చరించారు.ఇక.. సహచర మంత్రి కొండా సురేఖకు మరో మంత్రి సీతక్క బాసటగా నిలిచారు. కేటీఆర్ సహా బీఆర్ఎస్ శ్రేణుల్ని ఆమె హెచ్చరించారు. ‘‘బీఆర్ఎస్ కు మహిళలు అంటే చులకన, అందుకే ట్రోల్ చేస్తారు. ఆర్టీసీ బస్సుల్లో మహిళలు రికార్డ్ డాన్సులు చేసుకోండి అని వ్యాఖ్యానించిన దుర్మార్గులున్న పార్టీ బీఆర్ఎస్. నా సోదరమైన మంత్రితో మాట్లాడుతున్న సందర్భాన్ని కూడా మార్ఫింగ్ చేసి దుర్మార్గంగా వ్యవహరించారు.‘‘మహిళా మంత్రులను, మహిళా నేతలను వెంటపడి మరీ బీఆర్ఎస్ సోషల్ మీడియా వేధిస్తోంది. సీఎం కుటుంబాన్ని కూడా వదలడం లేదు. రాజకీయాల్లో, ప్రజా జీవితంలో క్రీయా శీలకంగా పనిచేసే వాళ్లను లక్క్ష్యంగా చేసుకుని బురద జల్లుతున్నారు. బీఆర్ఎస్ నేతల ఇళ్లలోనూ మహిళలు ఉన్నారు. వాళ్లేం చేశారో.. దేశం మొత్తానికి తెలుసు. అయినా సభ్యత కాదనే మేం నోళ్లు విప్పడం లేదు. మహిళలు రాజకీయాల్లో ఉండాలా? వద్దా? బీఆర్ఎస్ స్పష్టం చేయాలి.ఎన్నో కష్ట నష్టాలు అధిగమించి రాజకీయాల్లో ఎదిగిన మహిళా నేతలపై తప్పుడు ప్రచారాలా?. ఇది మీ ఫ్యూడల్ మెంటాలిటికి, పితృస్వామ్య భావజాలానికి నిదర్శనం. ఆడ కూతుర్లను అత్యంత అవమానకరంగా ట్రోల్ చేసి వారిని వేయ్యేండ్లు వెనక్కు నెడుతున్నారు. మల్లి దోరల రాజ్యం తెవాలన్న తలంపుతోనే సోషల్ మీడియా ద్వారా మహిళా నేతలపై దుష్ప్రచారం చేస్తున్నారు. మొన్న మేయర్ విజయ లక్ష్మీ, నిన్న నాపై,నేడు కొండా సురేఖపై తప్పుడు ప్రచారం చేస్తూ మహిళా నాయకత్వాన్ని వెనక్కు నెడుతోంది బీఆర్ఎస్. మహిళా నేతలపై ఈ రకంగా దుష్ప్రచారం చేస్తే మహిళలు రాజకీయాల్లోకి రాగలుగుతారా?. బీఆర్ఎస్ నేతలు దుర్మార్గపు ఆలోచనలు మానుకుని బుద్ది తెచ్చుకోండి.తక్షణమే క్షమాపణలు చెప్పి.. తమ సోషల్ మీడియా విభాగాలను కట్టడి చేయాలి అని సీతక్క హెచ్చరించారు. -
బీఆర్ఎస్ నేతలపై మంత్రి కొండా సురేఖ ఆగ్రహం
-
గుమ్మడికాయ దొంగ మాదిరే కేటీఆర్ తీరు
సాక్షి, హైదరాబాద్: గుమ్మడికాయ దొంగ ఎవరంటే భుజాలు తడుముకున్నట్లుగా మాజీ మంత్రి కేటీ రామారావు తీరుందని మంత్రి కొండా సురేఖ ఎద్దేవా చేశారు. గతంలో కేటీఆర్ అమెరికా పర్యటన ఎందుకు చేశారో చెప్పాలని డిమాండ్ చేశారు. బీఆర్ఎస్ పాలనలో పెట్టుబడులు అంటూ వివిధ కంపెనీలతో చేసుకున్న ఎంవోయూలన్నీ కూడా బోగస్సేనని ఆరోపించారు.శుక్రవారం ఆమె తన నివాసంలో మీడియాతో మాట్లాడుతూ... బీఆర్ఎస్ అధికారంలో ఉన్నప్పుడు అడ్డగో లుగా లక్షల కోట్లు దోచుకుందని, కాళేశ్వరం, మిషన్ కాకతీయ, దళితబంధు, మిషన్ భగీ రథ అన్నీ కుంభ కోణాలేనని ఆమె ఆరోపించారు. రాష్ట్రం బాగుపడాలనే లక్ష్యంతో ముఖ్య మంత్రి రేవంత్‌రెడ్డి విదేశీ పర్యటన సాగుతోందని చెప్పారు. బీఆర్ఎస్ నేతలు పనిగట్టుకుని రేవంత్ తమ్ముడిపై ఆరోపణలు చేస్తున్నారని మండిపడ్డారు. -
రేణు దేశాయ్‌కు సారె పెట్టి సత్కరించిన మంత్రి (ఫోటోలు)
-
మంత్రిని కలిసిన రేణు దేశాయ్.. ఎందుకంటే?
తెలంగాణ మంత్రి కొండా సురేఖను కలిసిన ప్రముఖ నటి రేణు దేశాయ్ కలిశారు. భగవద్గీత ఫౌండేషన్ ఫర్ వేదిక్ స్టడీస్ తరపున మంత్రిని కలిసినట్లు తెలుస్తోంది. ఆ సంస్థకు రేణు దేశాయ్ చీఫ్ అడ్వైజర్‌గా వ్యవహరిస్తున్నారు. ఇవాళ జూబ్లీహిల్స్‌లోని మంత్రి నివాసంలో మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా భగవద్గీత ఫౌండేషన్ ఫర్ వేదిక్ స్టడీస్ ఆధ్వర్యంలో నెలకొల్పనున్న గీత యూనివర్సిటీకి సంబంధించిన వివరాలను మంత్రికి రేణు దేశాయ్ సమర్పించారు.ఈ సందర్భంగా తమ ఇంటికి అతిథిగా వచ్చిన రేణుదేశాయ్‌ను మంత్రి సురేఖ నూతన వస్త్రాలు, పండ్లు, పసుపు కుంకుమలతో సత్కరించారు. మంత్రి సురేఖ కూతురు కొండా సుస్మిత పటేల్ ప్రత్యేకంగా తెప్పించిన గొలుసుని రేణు దేశాయ్‌కి మంత్రి అలంకరించారు. కొండా కుటుంబం తనను ఆదరించిన తీరు పట్ల రేణు దేశాయ్ ఎంతో ఆనందాన్ని వ్యక్తం చేశారు. -
ప్రోటోకాల్ పై మంత్రులు సీరియస్
-
పోడు భూముల పంపిణీపై నివేదిక ఇవ్వండి
సాక్షి, హైదరాబాద్: ప్రభుత్వ మార్గదర్శకాలకు అనుగుణంగా ఏళ్ళుగా పోడు సాగు చేసుకుంటున్న రైతు కుటుంబాల విషయంలో ఎలాంటి ఇబ్బంది లేదని అటవీ, దేవాదాయ శాఖల మంత్రి కొండా సురేఖ భరోసానిచ్చారు. అయితే చట్టాలకు విరుద్ధంగా కొత్తగా పోడు భూములను ఆ«దీనంలోకి తీసుకున్నట్లయితే కఠినచర్యలు చేపట్టాల్సి వస్తుందని హెచ్చరించారు. బీఆర్ఎస్ హయాంలో అనర్హులకు పోడు భూముల కేటాయింపు జరిగిన విషయం తమ దృష్టికి వచి్చన నేపథ్యంలో గత ప్రభుత్వ హయాంలో జరిగిన పోడు భూముల పంపిణీపై నివేదికను సమరి్పంచాలని అటవీశాఖ ఉన్నతాధికారులను మంత్రి సురేఖ ఆదేశించారు.నిజామాబాద్ జిల్లా మోపాల్ మండలం కాల్పోల్ గ్రామంలో ఎఫ్ఆర్ఓ, సెక్షన్ ఆఫీసర్, బీట్ ఆఫీసర్లపై గిరిజనులు చేసిన దాడిని మంత్రి ప్రస్తావించారు. పోడు సాగుచేసుకుంటున్న రైతు కుటుంబాలు అటవీశాఖ అధికారులకు ఎలాంటి హానీ తలపెట్టవద్దని, దాడులకు దిగితే చర్యలు తప్పవని స్పష్టం చేశారు. శనివారం సచివాలయంలో మంత్రి కొండా సురేఖ ఆధ్వర్యంలో పోడు భూముల సమస్యలపై సమీక్షా సమావేశం జరిగింది. ఈ సమావేశంలో పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి సీతక్క పాల్గొన్నారు. పోడు సమస్యకు పరిష్కారం వెదకాలని సీతక్క పలుమార్లు చెప్పగా, అదే విషయాన్ని మంత్రి కొండా సురేఖ ప్రస్తావిస్తూ ఏళ్ళుగా కొనసాగుతున్న పోడు భూముల చిక్కు సమస్యకు పరిష్కారం కనుగొనేందుకు ఈ సమావేశాన్ని ప్రాథమిక సమావేశంగా భావిస్తున్నామని వ్యాఖ్యానించారు.ఛత్తీస్‌గఢ్ నుంచి వలసలను నివారించండి ఛత్తీసగఢ్ నుంచి రాష్ట్రంలోకి వస్తున్న గిరిజనులు అటవీ భూములను ఆక్రమించుకుంటున్న విషయాన్ని అధికారులు మంత్రులకు వివరించారు. దీనికి మంత్రులు స్పందిస్తూ, ‘‘పక్క రాష్ట్రాల నుంచి గిరిజనులు మన ప్రాంతానికి వస్తే ఇక్కడ ప్రజల ప్రయోజనాలు దెబ్బతింటాయి. భవిష్యత్‌లో ఇలాంటి వలసలు కొనసాగకుండా కేంద్ర ప్రభుత్వాన్ని సంప్రదించి కచి్చతమైన మార్గదర్శకాలను రూపొందించాలి. ఈ ప్రాంత ప్రజల ప్రయోజనాలు దెబ్బతినకుండా చూడాలి’’అని అధికారులను ఆదేశించారు.అభివృద్ధి పనులు కొనసాగించండి: సీతక్క అటవీ ప్రాంతాల్లో కొత్తగా వెలుస్తున్న గ్రామాల్లో అభివృద్ధి పనులకు అటవీశాఖ అభ్యంతరాలు వ్యక్తం చేసినా, ఏళ్ళుగా కొనసాగుతున్న గ్రామాల్లో అభివృద్ధి పనులను కొనసాగించేలా అధికారులకు ఆదేశాలివ్వాలని మంత్రి కొండా సురేఖను మంత్రి సీతక్క కోరారు. కేంద్ర ప్రభుత్వం రాష్ట్రంలో చేపడుతున్న అభివృద్ధి పనులు, పథకాల అమలులో అటవీశాఖ మార్గదర్శకాలు ప్రతిబంధకాలుగా మారుతున్న నేపథ్యంలో... ఈ దిశగా కేంద్రంతో సంప్రదింపులు జరిపి పోడు భూముల సమస్యపై పరిష్కారాన్ని రాబట్టేలా చర్యలు చేపట్టాలని కోరారు.అటవీ భూములను కాపాడుకుంటూనే, పోడు రైతులకు ప్రయోజనం కలిగేలా పోడు భూముల్లో ఉద్యానవన శాఖ మొక్కల పెంపకం వంటి కార్యక్రమాలు చేపట్టి వారికి ప్రయోజనాలను కలిగించాలని ఆమె కోరారు. ఫారెస్ట్ డెవలప్ మెంట్ కార్పొరేషన్ ద్వారా పలు రకాల మొక్కలను పెంచడం, పామాయిల్ చెట్ల సాగు వంటి చర్యల ద్వారా పోడు రైతులకు ప్రయోజనాలను కలిగించవచ్చని సురేఖ అధికారులకు సూచించారు. -
సురేఖ-సీతక్క లొల్లిపై క్లారిటీ
హైదరాబాద్, సాక్షి: ఇద్దరూ ఉమ్మడి వరంగల్‌కు చెందిన మహిళా నేతలు. పైగా మంత్రులు. కానీ, ఒకరంటే ఒకరికి పడడం లేదు. కనిపిస్తే కనీసం పలకరించుకోవడం లేదు సరికదా.. కలిసి పని చేయడం లేదు కూడా. మేడారం జాతర, లోక్‌సభ ఎన్నికల్లో ఈ ఇద్దరి మధ్య విబేధాలు పబ్లిక్‌గా బయటపడ్డాయి.. అంటూ తాజాగా ఓ కథనం వెలువడింది. అయితే దీనిపై ఈ మంత్రులిద్దరూ స్పందించారు. ఉమ్మడి వరంగల్ జిల్లాలో అటవీ, దేవాదాయ శాఖ మంత్రి కొండా సురేఖ, పంచాయతీరాజ్ శాఖ మంత్రి సీతక్క మధ్య ఆధిపత్య పోరు కొనసాగుతోందట. రాజకీయాలు, పాలనా విషయాల్లో ఇద్దరి మధ్య విభేదాలు రోజురోజుకూ ముదురుతున్నాయట. పైచేయి సాధించేందుకు ఇద్దరూ పోటాపోటీ వ్యూహాలను అమలు చేస్తున్నారట. గతంలో మేడారం జాతర సమయంలో వీరి మధ్య మొదలైన పంచాయితీ కాంగ్రెస్ లోక్‌సభ ఎన్నికల ఇన్చార్జి మార్పు విషయంలో తీవ్రస్థాయికి చేరిందట.. అంటూ ఓ మీడియా సంస్థ కథనం ఇచ్చింది. అయితే దీనిపై ఇద్దరూ మండిపడ్డారు.తమ మధ్య విబేధాలు అనే వార్తలను సంయుక్తంగా ఈ ఇద్దరు మంత్రులు ఖండించారు. పరస్పర అవగాహనతో కలిసి మేం ముందుకు సాగుతున్నామని, మహిళా మంత్రుల మధ్య విభేదాలంటూ వచ్చిన వార్తలు అవాస్తవమని స్పందించారు. పైగా ఆ కథనాలు మహిళా గౌరవాన్ని కించపరిచే విధంగా ఉన్నాయని మండిపడ్డారు. సీఎం రేవంత్ రెడ్డి నేతృత్వంలో ఉమ్మడి వరంగల్ జిల్లా ప్రగతికి, రాష్ట్రాభివృద్ధికి కలిసికట్టుగా పనిచేస్తున్నాం. ప్రజాస్వామ్యానికి నాలుగో స్తంభమైన మీడియా బాధ్యతాయుతంగా, జవాబుదారీతనంతో వ్యవహరించాలి అని మంత్రులిద్దరూ హితవు పలికారు. -
కేటీఆర్‌పై వ్యాఖ్యలు.. మంత్రి కొండా సురేఖకు ఈసీ వార్నింగ్..
సాక్షి, హైదరాబాద్: మంత్రి కొండా సురేఖపై కేంద్ర ఎన్నికల సంఘం ఆగ్రహం వ్యక్తం చేసింది. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడింట్ కేటీఆర్‌పై ఇటీవల చేసిన అనుచిత వ్యాఖ్యల నేపథ్యంలో ఆమెను ఈసీ హెచ్చరించింది. ఎన్నికల వేళ జాగ్రత్తగా మాట్లాడాలని సూచించింది. ఆరోపణలు చేసే సమయంలో బాద్యతగా వ్యవహరించాలని, స్టార్ క్యాంపెయినర్‌గా, మంత్రిగా మరింత బాధ్యతగా ఉండాలని హితవు పలికింది.కాగా ఈనెల ఒకటవ తేదీన వరంగల్‌లో జరిగిన ఎన్నికల ప్రచారంలో కేటీఆర్‌పై మంత్రి కొండా సురేఖ విమర్శలు గుప్పించారు. ఫోన్ టాపింగ్ వ్యవహారంలో కేసీఆర్, కేటీఆర్‌పై తీవ్ర ఆరోపణలు చేశారు. ఫోన్ ట్యాపింగ్‌తో ఎంతోమంది హీరోయిన్లను బ్లాక్ మెయిల్ చేశారని, అధికారులను బదిలీ చేశారని, అనేకమందిని ఉద్యోగాలు కోల్పోయి జైలుకు వెళ్లేలా చేశారన్నారని ఆరోపించారు. ఈ వ్యాఖ్యలపై బీఆర్ఎస్ అభ్యంతరం వ్యక్తం చేస్తూ ఎన్నికల సంఘం దృష్టికి తీసుకెళ్లింది. బీఆర్ఎస్ నేత దాసోజు శ్రవణ్ ఈసీకి ఫిర్యాదు చేసిన క్రమంలో నేడు మంత్రి వ్యాఖ్యలను తప్పుబట్టింది ఎన్నికల సంఘం.చదవండి: చూస్తూ ఊరుకోం.. యుద్ధం చేస్తాం: కేసీఆర్ -
మేడారంలో సమ్మక్క– సారలమ్మల వద్ద భక్తుల కోలాహలం (ఫొటోలు)