breaking news
Enumeration
-
3.38 కోట్ల నుంచి 2.64 కోట్లకు
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో కేంద్ర ఎన్నికల సంఘం చేపట్టిన ఓటర్ల జాబితా ప్రత్యేక విస్తృత సవరణ (సర్)–2026 ప్రక్రియలో కీలక ఘట్టం ముగిసింది. కార్యక్రమంలో భాగంగా ఓటర్లు తమ ఎన్యూమరేషన్ ఫారాలను పూరించి తిరిగి బూత్ స్థాయి అధికారుల (బీఎల్ఓ)కు అప్పగించడానికి నిర్దేశించిన గడువు సోమవారం ఆర్ధరాత్రి 12 గంటలతో ముగిసింది. గడువులోగా రాష్ట్రంలో ఎన్యూమరేషన్ ఫారాలు దాఖలు చేసిన మొత్తం ఓటర్ల సంఖ్యపై మంగళవారం స్పష్టత రానుందని రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి (సీఈఓ) కార్యాలయ వర్గాలు తెలిపాయి. రాష్ట్రంలో మొత్తం 3,38,26448 మంది ఓటర్లుండగా, సోమవారం సాయంత్రం 6 గంటల సమయానికి 2,64,73,616 మంది (78.26శాతం) ఓటర్లు ఎన్యూమరేషన్ ఫారాలను సమర్పించడంతో వాటి డిజిటలైజేషన్ సైతం పూర్తి చేశారు. అప్పటికి మరో 5,737 మంది ఓటర్ల ఫారాలను డిజిటలైజేషన్ చేయాల్సి ఉంది. 11,33,692 మంది (3.35శాతం) మంది ఓటర్లు మాత్రమే ఆన్లైన్లో ఫారాలు సమర్పించగా, మిగిలిన వారు పూరించిన ఫారాలు అందజేశారు. మిగిలిన వారిలో 73,47,095 మంది (21.72శాతం) ఓటర్ల నుంచి ఎన్యూమరేషన్ ఫారాలను సేకరించడం సాధ్యం కాదని నిర్థారించారు. ఈ ఓటర్లందరూ గైర్హాజరులో ఉండటం/చిరునామా మారడం/డూప్లికేట్ ఓటు/ మరణించారనే (ఏఎస్‌డీడీ) కారణాలతో వీరి నుంచి పూరించిన ఫారాలు స్వీకరించడం సాధ్యం కాదని తేల్చారు. గడువులోగా ఫారాలు ఇవ్వని ఓటర్ల పేర్లను ఈ నెల 17న ప్రకటించే ముసాయిదా ఓటర్ల జాబితా నుంచి తొలగించనున్నారు. ముసాయిదా జాబితాలో 73 లక్షల మంది (21శాతం)కి పైగా ఓటర్ల పేర్లను తొలగించడం ఖాయమని అంచనా. రాష్ట్రంలో ప్రస్తుతం 3.38 కోట్ల మంది ఓటర్లుండగా, ముసాయిదా జాబితాలో సంఖ్య 2.64 కోట్లకు తగ్గనుంది. కచ్చితమైన తుది గణాంకాలపై మంగళవారం స్పష్టత రానుంది. తేడాలుంటే నోటీసులు ఈ నెల 17న ముసాయిదా జాబితా ప్రచురించాక అక్టోబర్ 15 వరకు వివరాల్లో తేడాలు కలిగిన ఓటర్లకు ఎలక్ట్రోరల్ రిజిస్ట్రేషన్ అధికారులు(ఈఆర్వోలు) నోటీసులు జారీ చేసి విచారణకు పిలవనున్నారు. రాష్ట్రంలో ఇప్పటివరకు 60,69,065 మంది (17.94శాతం) ఓటర్ల వివరాల్లో తేడాలున్నట్టు ఎన్నికల సంఘం సాఫ్ట్వేర్ గుర్తించింది. వీరందరికీ నోటీసులు జారీ చేసి వివరణ కోరే అవకాశం ఉంది. విచారణకు హాజరై ఎన్నికల సంఘం నిర్దేశించిన 11 రకాల పత్రాల్లో ఏదో ఒక పత్రాన్ని రుజువుగా చూపించాలి. ఓటర్ల సంఖ్యాపరంగా చూస్తే అత్యధికంగా హైదరాబాద్ జిల్లాలో 6,71,592 మంది, రంగారెడ్డి జిల్లాలో 5,59,923 మంది, నిజామాబాద్ జిల్లాలో 3,95,215 మంది, సంగారెడ్డి జిల్లాలో 3,47,575 మంది, మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లాలో 3,92,300 మంది ఓటర్ల వివరాల్లో తేడాలున్నాయి. శాతాల వారీగా చూస్తే అత్యధికంగా అదిలాబాద్ జిల్లాలో 28.49శాతం, వనపర్తి జిల్లాలో 27.83శాతం, నిజామాబాద్ జిల్లాలో 27.25శాతం, మహబూబ్‌నగర్ జిల్లాలో 26.83శాతం, నారాయణసేట జిల్లాలో 26.44శాతం, నిర్మల్ జిల్లాలో 26.03 శాతం మంది ఓటర్ల వివరాల్లో తేడాలున్నాయి. ముసాయిదాలో పేరు రాకుంటే మళ్లీ కొత్తగా ఓటరుగా నమోదు కావడానికి ఫారం–6 దరఖాస్తును ఈ నెల 17 నుంచి వచ్చే నెల 16 లోగా సమర్పించాల్సి ఉంటుంది. -
సర్.. నేడే ఆఖరు
సాక్షి, హైదరాబాద్: ఓటర్ల జాబితా ప్రత్యేక విస్తృత సవరణ (సర్)–2026 కార్యక్రమంలో భాగంగా మీ ఎన్యూమరేషన్ ఫారాన్ని పూరించి మీ ప్రాంత బూత్ స్థాయి అధికారి (బీఎల్ఓ)కి ఇంకా సమర్పించలేదా? అయితే త్వరపడండి. పూరించిన ఎన్యూమరేషన్ ఫారాలను బీఎల్ఓలకు సమర్పించడానికి గడువు నేటితోనే ముగియనుంది. ఫారం ఇవ్వకుంటే ఈ నెల 17న ప్రచురించనున్న సర్ ముసాయిదా ఓటర్ల జాబితాలో మీ పేరును తొలగించనున్నారు. ఒకవేళ ముసాయిదా జాబితాలో పేరు తొలగిస్తే మళ్లీ కొత్తగా ఓటరుగా నమోదు కావడానికి ఫారం–6 దరఖాస్తు చేసుకోక తప్పదు. దీనికితోడు సర్–2002 ఓటర్ల జాబితాలో ఉన్న మీ ఓటు లేదా మీ బంధువుల ఓట్ల వివరాలను స్వీయధ్రువీకరణ ఫారంలో నింపి ఇవ్వాల్సి ఉంటుంది. సర్ షెడ్యూల్ ప్రకారం ఆగస్టు 17 నుంచి సెప్టెంబర్ మధ్య కాలంలో కొత్త ఓటర్ల నమోదుకు దరఖాస్తుతోపాటు ముసాయిదా జాబితాపై అభ్యంతరాలను స్వీకరిస్తారు. ఈ వ్యవధిలో ఫారం–6 దరఖాస్తు చేసుకున్న వారికి ఎలక్ట్రోరల్ రిజిస్ట్రేషన్ అధికారి(ఈఆర్వో) నోటీసులు జారీ చేసి విచారణకు పిలుస్తారు. విచారణకు హాజరై కేంద్ర ఎన్నికల సంఘం (ఈసీ) నిర్దేశించిన 12 రకాల ధ్రువీకరణ పత్రాల్లో ఏదో ఒక పత్రాన్ని పుట్టిన తేదీ, నివాస చిరునామాగా చూపించాల్సి ఉంటుంది. ఇన్ని ఇబ్బందులను తప్పించుకోవాలంటే నేడు (సోమవారం) మీ ఎన్యూమరేషన్ ఫారాన్ని పూరించి మీ ప్రాంత బీఎల్ఓకు అప్పగించాలి. భవిష్యత్తులో సర్–2026 ఓటర్ల జాబితా పౌరులకు కీలక ఆధారంగా మారనుంది. అక్టోబర్ 19న ప్రచురించే తుది ఓటర్ల జాబితాలో పేరు రాకుంటే భవిష్యత్తులో చిక్కులు ఎదురయ్యే అవకాశ ఉంది. ఆదివారం 19వేల ఫారాలే దరఖాస్తు రాష్ట్రంలో మొత్తం 3,38,26,448 మంది ఓటర్లుండగా, ఆదివారం సాయంత్రం 6 గంటల సమయానికి 2,64,30,494 మంది (78.14 శాతం) ఓటర్లు తమ ఎన్యూమరేషన్ ఫారాలను సమర్పించారు. ఆదివారం 19,376 మంది మాత్రమే ఫారాలు సమర్పించారు. చివరి రోజు సోమవారం రాత్రి 12 గంటల వరకు ఫారాలు తీసుకోవాలని బీఎల్ఓలకు ఆదేశించినట్లు జీహెచ్ఎంసీ అధికారి ఒకరు తెలిపారు. ఆ తర్వాత ఫారాలు సమర్పించడానికి గడువు ముగియనుంది. ఎన్యూమరేషన్ ఫారాలు తీసుకున్న వారిలో ఇంకా 4,88,532 మంది ఓటర్లు వాటిని పూరించి బీఎల్ఓలకు సమర్పించాల్సి ఉంది. ఫారాలు తీసుకోని వారిని సైతం పరిగణలోకి తీసుకుంటే మొత్తం 73,95,954 మంది (21.86 శాతం) ఓటర్లు ఇంకా ఎన్యూమరేషన్ ఫారాలు సమర్పించలేదు. వరుస సెలవులతో ఇబ్బందులు రెండో శనివారం, ఆదివారం, సోమవారం (బోనాలు) వరుసగా మూడు రోజులు సెలవులు రావడంతో కొన్ని ప్రాంతాల్లో బీఎల్ఓలు తమ విధులకు డుమ్మాకొట్టారని రాజకీయ పార్టీల నేతలు ఆరోపించారు. బోనాలు, రంగం సందర్భంగా 9, 10వ తేదీల్లో ఎన్యూమరేషన్ ఫారాలు తీసుకోబోమని బీఎల్ఓలు చెప్పినట్టు తమకు అనేక ఫిర్యాదులు అందాయని ఎంఐఎం అధినేత, ఎంపీ అసదుద్దీన్ ఒవైసీ ఆదివారం ‘ఎక్స్’లో ఆరోపించారు. ‘సర్’ షెడ్యూల్ ప్రకారం 10వ తేదీ వరకు ఫారాలు స్వీకరణ జరిగేలా చర్యలు తీసుకోవాలని కేంద్ర ఎన్నికల సంఘానికి విజ్ఞప్తి చేశారు. -
ఓటర్ల లిస్ట్‌లో నా పేరు ఉందో లేదో!
హైదరాబాద్: ఓ కోతి కమ్యూనిటీ హాలుకు వచ్చి తన కు ఓటు హక్కు ఉందో లేదో అన్న ట్లు ఎన్యుమరేషన్ ఫారాలను పరిశీలించింది. ఆ తరువాత స్థానిక నాయకుడు జగదీష్ బిస్కెట్లు ఇవ్వగా కాసేపు అతని ఒళ్లోనే నిద్రించింది. వెటర్నరీ అధికారులకు సమాచారం అందించడంతో వారు అక్కడకు చేరుకుని కోతిని తీసుకెళ్లారు. ఆలి్వన్‌కాలనీ సర్కిల్ పరిధిలోని ఎల్లమ్మబండ కమ్యూనిటీ హాలు వద్ద బుధవారం ఈ సంఘటన జరిగింది. -
43,62,387 ఓట్లు గల్లంతు ‘సర్’
సాక్షి, అమరావతి: మరో 4 రోజుల్లో రాష్ట్రంలో ప్రత్యేక సమగ్ర ఓటర్ల జాబితా సవరణ (సర్) ఇంటింటి సర్వే ముగియనుంది. ఇప్పటికే అన్ని జిల్లాల్లో 100% ఓట్లను డిజిటలైజ్డ్ చేసినట్లు అధికారులు చెబుతుండగా రాష్ట్రవ్యాప్తంగా 43,62,387 మంది ఓటర్ల వివరాలు తెలియడంలేదు. సోమవారం సాయంత్రం నాటికి 4,16,27,694 మంది ఓటర్లలో 10.48% మంది (43.62 లక్షలు) ఎన్యూమరేషన్ ఫారాలు తిరిగి వచ్చే అవకాశం లేని జాబితాలో ఉన్నట్లు రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి వివేక్ యాదవ్ తెలిపారు. జూలై 14తో సర్ ఇంటింటి సర్వే ముగియాల్సి ఉండగా కలెక్టర్లు, రాజకీయ పార్టీల విజ్ఞప్తి మేరకు గడువును జూలై 24 వరకు పొడిగించడం తెలిసిందే. జూలై 14 నాటికి వివరాలు తెలియని ఓటర్ల సంఖ్య 39,81,399 కాగా ఇప్పుడు మరో 3,80,988 లక్షలు పెరిగి 43,62,387కు చేరుకోవడం గమనార్హం. గడువు పెరిగిన తర్వాత మరింత మంది ఓటర్ల నుంచి ఫారాలు అందకపోగా తొలగించే ఓటర్ల సంఖ్య పెరగడంపై రాజకీయ పార్టీలు అనుమానాలు వ్యక్తం చేస్తున్నాయి. సోమవారం సాయంత్రానికి అధికారిక గణాంకాల ప్రకారం మొత్తం ఓటర్లలో 3.57 శాతం ఓటర్లు అంటే 14,87,008 మందిని మృతులుగా గుర్తించారు. మరో 13,68,337 మంది శాశ్వతంగా వలస వెళ్లిపోగా మరో 8,19,252 మంది ఓటర్ల వివరాలు పూర్తిగా తెలియడం లేదు.తిరుపతిలో భారీగా తొలగనున్న ఓటర్లురాష్ట్రవ్యాప్తంగా తిరుపతి, నెల్లూరు జిల్లాలో భారీగా ఓట్లు తగ్గనుండగా అత్యల్పంగా తగ్గే వాటిలో పశ్చిమ గోదావరి, ఏలూరు జిల్లాలు ఉన్నాయి. రాష్ట్రవ్యాప్తంగా సగటున తెలియని ఓటర్ల శాతం 10.48గా ఉంటే తిరుపతి జిల్లాలో ఏకంగా 16.38 శాతం, నెల్లూరు జిల్లాలో 14.97 శాతంగా ఉంది. 2024 ఓటర్ల జాబితా ప్రకారం తిరుపతి జిల్లాలో 17,69,438 మంది ఓటర్లు ఉంటే అందులో 2,89748 మంది ఓటర్ల వివరాలు అన్ కలెక్టబుల్ జాబితాలో ఉన్నాయి. నెల్లూరు జిల్లాలో 19,74,240 మంది ఓటర్లు ఉంటే అందులో 2.95 లక్షల మంది ఓటర్ల వివరాలు తెలియడం లేదు. పశ్చిమ గోదావరి జిల్లాలో 14,75,036 ఓట్లు ఉండగా అందులో అతి తక్కువగా 4.89 శాతం అంటే 72,315 మంది ఓటర్ల వివరాలు మాత్రమే తెలియడం లేదు. అందులో 41,061 మంది మృతులు ఉన్నారు. ఏలూరు జిల్లాలో 16,44,193 మంది ఓటర్లు ఉంటే 5.86 శాతం మంది 96,268 మంది ఓటర్ల వివరాలు తెలియాల్సి ఉంది. -
13.34 లక్షల పేర్లు ఔట్?
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో కొనసాగుతున్న ఓటరు జాబితా ప్రత్యేక విస్తృత సవరణ (సర్) ప్రక్రియలో 13.34 లక్షలకు పైగా ఎన్యూమరేషన్ ఫారాలు ‘అన్‌కలెక్టబుల్’(సేకరించలేనివి)గా అధికారులు భావిస్తున్నారు. రాష్ట్రంలోని మొత్తం ఓటర్లలో ఇవి 3.95 శాతం. మృతులు, శాశ్వతంగా ఇతర ప్రాంతాలకు వెళ్లిపోయిన వారు, డూప్లికేట్ నమోదులు, గుర్తించలేని ఓటర్లు వీరిలో ఉన్నారని అధికార వర్గాలు పేర్కొన్నాయి. అధికారిక లెక్కల ప్రకారం మొత్తం 13,34,831 మంది ఓటర్లు ఈ అన్ కలెక్టబుల్ (బీఎల్ఓలు పంపిణీ చేసిన తర్వాత తిరిగి సేకరించలేని పత్రాలు) జాబితాలో ఉండగా.. వీరిలో 4,64,212 మంది (1.37 శాతం) మృతి చెందారు. అలాగే 6,39,553 మంది (1.89 శాతం)ని శాశ్వతంగా ఇతర ప్రాంతాలకు వెళ్లినవారు, చిరునామా మారిన వారు లేదా అందుబాటులో లేనివారిగా గుర్తించారు. మరో 1,73,115 మంది (0.51 శాతం) డూప్లికేట్ నమోదుల కింద ఉండగా, 53,324 మంది (0.16 శాతం) ఓటర్ల ఆచూకీ లభించలేదు. వీరుకాక మరో 4,677 మంది (0.01 శాతం) ‘ఇతరులు’విభాగంలో ఉన్నారు. ముసాయిదా జాబితాలో ఉండరు! ఎన్నికల విభాగం అధికారులు తెలిపిన వివరాల ప్రకారం, బూత్ స్థాయి అధికారి (బీఎల్ఓ) విచారణలో ఓటరు మరణించినట్లు తేలితే మృతుల కేటగిరీలో నమోదు చేస్తున్నారు. శాశ్వతంగా వేరే ప్రాంతానికి వెళ్లిపోయినట్లు స్థానిక విచారణలో తేలితే ‘పరి్మనెంట్‌గా షిఫ్ట్’అయినవారుగా గుర్తిస్తున్నారు. ఒకే వ్యక్తి రెండుచోట్ల ఓటరుగా నమోదై ఉంటే, సదరు ఓటరు ఎంపిక చేసుకున్న చోట జాబితాలో ఉంచి, రెండో దాన్ని ‘డూప్లికేట్’గా పేర్కొంటున్నారు. ఫారాలు తీసుకోవడానికి నిరాకరించిన వారు లేదా తిరిగి సమర్పించబోమని చెబుతున్న వారి పేర్లను ‘ఇతరులు’కేటగిరీలో చేర్చుతున్నారు. ఈ కేటగిరీల్లో ఉన్న ఓటర్ల పేర్లను ఆగస్టు 10న విడుదల చేయనున్న ముసాయిదా ఓటరు జాబితా నుంచి తొలగించే అవకాశం ఉందని అధికారులు తెలిపారు. అయితే ప్రస్తుతం కొనసాగుతున్న ధ్రువీకరణ ప్రక్రియలో అర్హత నిరూపించుకునే వారి పేర్లను తొలగించబోరని వివరించారు. అర్హులెవరూ తప్పిపోకుండా.. పెండింగ్‌లో ఉన్న ఎన్యూమరేషన్ ఫారాల సేకరణ, క్షేత్రస్థాయి పరిశీలన పూర్తిచేయడానికి ఎన్నికల సంఘం ఆగస్టు 3 వరకు గడువును పొడిగించడం తెలిసిందే. ఈ సదుపాయాన్ని వినియోగించుకుని అందుబాటులో లేని ఓటర్లను గుర్తించి, అర్హులైన వారెవరూ జాబితా నుంచి తప్పిపోకుండా చర్యలు చేపడుతున్నట్లు అధికారులు తెలిపారు. ఈ నేపథ్యంలో ప్రస్తుత గణాంకాల్లో హెచ్చుతగ్గులకు అవకాశముంది. ఇప్పటివరకు రాష్ట్రంలోని మొత్తం 3,38,26,448 మంది ఓటర్లకు సంబంధించిన ఎన్యూమరేషన్ ఫారాల పంపిణీ పూర్తయినట్లు అధికారులు తెలిపారు. అందులో 2,25,25,055 (మొత్తం ఫారాల్లో దాదాపు 66.59 శాతం) ఫారాల డిజిటలైజేషన్ పూర్తయిందని పేర్కొన్నారు. ఇంకా భారీగానే తొలగింపు? అధికార వర్గాల సమాచారం మేరకు వివరాలిలా ఉండగా.. తొలగించే ఓటర్ల సంఖ్య ఇంకా భారీగా ఉంటుందనే ప్రచారం జరుగుతోంది. అందులోనూ నగరవాసులే సింహభాగం ఉంటారని అంటున్నారు. అందుకు కారణం నగరంతో పాటు ఇతర ప్రాంతాల్లోనూ కొందరికి ఓట్లుండటం.. ఇక్కడ ఉంటున్నప్పటికీ, సొంత జిల్లాలో ఓటరుగా నమోదుకు ప్రాధాన్యతనిస్తుండటం తదితరాలు ఇందుకు కారణాలుగా చెబుతున్నారు. కాగా ముసాయిదా జాబితా తర్వాత ఎన్ని ఓట్లు తగ్గుతాయో స్పష్టం కానుంది. -
ఇదేమి.. 'సర్'దర్ద్!
సాక్షి, హైదరాబాద్: ఓటర్ల జాబితా ప్రత్యేక విస్తృత సవరణ (సర్)–2026 సామాన్యులకు పజిల్‌గా మారింది. రాష్ట్రంలో 99.46 శాతం ఎన్యూమరేషన్ ఫారాల పంపిణీ పూర్తయినట్లు రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి (సీఈఓ) సి.సుదర్శన్‌రెడ్డి కార్యాలయం ప్రకటించగా ఇంకా తమకు ఫారాలు అందలేదని చాలా మంది ఓటర్లు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. మరోవైపు ఫారాలు అందుకున్న ఓటర్లు వాటిని ఎలా నింపాలో తెలియక తికమక పడుతున్నారు. ఫారాలను నింపడంపై ఓటర్లకు అవగాహన కల్పించాల్సిన బూత్ స్థాయి అధికారులు (బీఎల్ఓ) యూట్యూబ్‌లో చూసి నింపుకోవాలని సెలవిస్తున్నారు. వెరసి ‘సర్’కార్యక్రమం ఓటర్లకు చుక్కలు చూపిస్తోంది. ఈ నేపథ్యంలో క్షేత్రస్థాయి పరిస్థితులపై ‘సాక్షి’ప్రత్యేక కథనం. కాగితాలపైనే 100% ఫారాల పంపిణీ! ఆదిలాబాద్, నిర్మల్, నిజామాబాద్, కామారెడ్డి, నాగర్‌కర్నూల్, వనపర్తి, జోగుళాంబ గద్వాల, నల్లగొండ, జనగామ జిల్లాల్లో ఏకంగా 100 శాతం ఓటర్లకు ఎన్యూమరేషన్ ఫారాల పంపిణీ పూర్తయినట్లు చెబుతున్నప్పటికీ ఆయా జిల్లాల్లో చాలా మంది ఓటర్లు తమకు ఇంకా ఫారాలు అందలేదని చెబుతున్నారు. ఇళ్లు మారిన ఓటర్లలో చాలా మంది పాత ఇళ్లకు చెందిన ప్రాంతాల్లోని బీఎల్ఓల వద్దకు వెళ్లి ఫారాలు తీసుకోవడానికి ఆసక్తి చూపట్లేదు. అలాగే కొన్ని కుటుంబాల్లో కొందరికే ఫారాలు అందాయి. ముఖ్యంగా హైదరాబాద్, మేడ్చల్–మల్కాజ్గిరి, రంగారెడ్డి, ఇతర పట్టణ ప్రాంత జిల్లాల్లో కొందరు బీఎల్ఓల వద్దే సగానికిపైగా ఫారాలు పంపిణీ కాకుండానే మిగిలిపోయాయి. పంపిణీ కాని ఫారాలను ఓటర్ల గైర్హాజరు, వలసలు, మరణించిన (అబ్సెంటీ, షిఫ్టెడ్, డెడ్/ఏఎస్డీ) ఓటర్లవని పేర్కొంటూ వాటిని సైతం లెక్కల్లో చూపడంతోనే సగటున 99 శాతానికిపైగా ఫారాల పంపిణీ పూర్తయినట్లు తెలుస్తోంది. అవగాహన లేక..వివరాలు లేక.. ఫారం నింపలేక... ఎన్యూమరేషన్ ఫారాలు అందుకున్న ఓటర్లు 2002 ‘సర్’ఓటర్ల జాబితాలో ఓటరు పేరు ఉంటే ఆ వివరాలను ఎడమ వైపు కాలమ్‌లో రాయాల్సి ఉండగా ముందు (ఎడమ) కాలమ్‌లో బంధువుగా పేర్కొన్న వ్యక్తి పేరు గత సర్ జాబితాలో ఉంటే ఆ వివరాలను కుడివైపు కాలమ్‌లో రాయాల్సి ఉంది. ఇందుకోసం 2002 జాబితాలో తమ పేరు, బంధువుల పేర్లను వెతకాల్సి ఉంటుంది. దీనిపై అవగాహన లేని ఓటర్లు ఈ కాలమ్స్‌లో ప్రస్తుత జాబితాలోని తమ వివరాలు రాస్తున్నారు. వాస్తవానికి 2002 జాబితాలో ఓటరు పేరు, బంధువు పేరు ఎలా ఉంటే అలా యథాతథంగా రాయాలి. 2002 జాబితాలో లేకుంటే ఖాళీగా వదిలేయాలి. అలాగే ఫారం మూడో విభాగంలో ఓటరు పుట్టిన తేదీ/ఆధార్(ఐచ్ఛికం)/మొబైల్ నంబర్/తండ్రి/తల్లి/భాగస్వామి వివరాలను రాయాల్సి ఉంది. 2002 జాబితా, ప్రస్తుత ఓటర్ల జాబితాల్లో దాదాపుగా అందరు ఓటర్ల పేర్లు, బంధువుల పేర్లు, వయసు, బంధుత్వం వివరాల్లో వ్యత్యాసాలున్నాయి. ఒక జాబితాతో పోలిస్తే మరో జాబితాలో కొందరి పేర్లు, బంధువుల పేర్లు పూర్తిగా మారిపోయాయి. బంధుత్వం వద్ద తండ్రికి బదులు భర్త అని, భర్తకి బదులు తండ్రి/భార్య అని తప్పుగా వచ్చింది. దీంతో మూడో విభాగంలో ప్రస్తుత ఓటర్ల జాబితా ప్రకారం వివరాలు రాయాలా లేక సరైన వివరాలు రాయాలా అనే అంశంపై ఓటర్లలో గందరగోళం నెలకొంది. దీంతో తప్పులు రాసి మళ్లీ సరిదిద్దే ప్రయత్నంలో చాలా మంది ఫారాన్ని గజిబిజి చేస్తున్నారు. పాతబస్తీలోని కొన్ని జిరాక్స్ సెంటర్ల నిర్వాహకులు ఒక్కో ఫారం నింపడానికి రూ. 100 చొప్పున వసూలు చేస్తున్నారు. రోజుల తరబడి వెతికినా దొరకని 2002 జాబితాలో ఓటు ఇళ్లు మారిన పట్టణ ప్రాంత ఓటర్లు 2002 జాబితాలో తమ పేర్లను వెతకడంలో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఈసీఐ పోర్టల్ (https://voters.eci.gov.in/searchIn SIR) లో 2002 జాబితాలో ఓటర్ల పేర్లు వెతకడానికి పీడీఎఫ్, సెర్చ్ విత్ ఓటర్స్ డిటైల్స్ అనే రెండు ఆప్షన్లు ఇచ్చారు. పాత నియోజకవర్గం పేరు, నాటి పోలింగ్ కేంద్రం నంబర్ తెలిసి ఉంటేనే పీడీఎఫ్ జాబితాలో నేరుగా వెతకడానికి వీలవుతోంది. ఈ వివరాలు తెలియకపోతే సెర్చ్ విత్ ఓటర్స్ డిటైల్స్ ఆప్షన్‌లోకి వెళ్లి ఓటరు పేరు, బంధువు పేరును కీవర్డ్స్‌గా ఇచ్చి సెర్చ్ చేయాలి. ఇలా సెర్చ్ చేస్తే తమ పేర్లు మినహా సారుప్యత కలిగిన ఇతర ఓటర్ల పేర్లు డిస్ప్లే అవుతున్నాయని ఓటర్లు పేర్కొంటున్నారు. సెర్చ్‌లో 200 మందికి మించి పేర్లు చూపకుండా సాఫ్ట్‌వేర్‌లో పరిమితులు విధించడంతో 2002 జాబితాలో పేర్లు వెతకడం చాలా మందికి అసాధ్యంగా మారింది. దీంతో ఆయా ఓటర్లు ఫారాలు నింపకుండా ఖాళీగా ఇచ్చేస్తున్నారు. ఫలితంగా వారంతా నోటీసులు అందుకోక తప్పని పరిస్థితి ఏర్పడింది. ఖాళీ ఫారం తిరిగిచ్చేశా.. నా పేరు 2002 ఓటర్ల జాబితాలో లేదు. తల్లిదండ్రులు చనిపోవడంతో వారి వివరాలు లేవు. ఫారం నింపాలని బీఎల్ఓను అడిగితే ఏదో ఒక ఆధారం కావాలని అన్నారు. తండాలో చదువుకున్న వారి వద్దకు వెళ్తే వివరాల్లేకుండా ఫారం నింపడం సాధ్యం కాదన్నారు. అందుకే మీకు నచ్చినట్టు నింపుకోండని బీఎల్ఓకు ఫారం ఇచ్చేశా. – మాలోతు బాలమ్మ, గార్ల మండలం మర్రిగూడెం పంచాయతీ తిర్లాపురం తండా, మహబూబాబాద్ జిల్లా నాకు ఫారం ఇవ్వలేదు నేను వెల్డర్‌గా పనిచేస్తూ కుటుంబాన్ని పోషించుకుంటున్నా. ఇంట్లో నలుగురం ఉన్నాం. ముగ్గురికే ఫారాలు ఇచ్చారు. నాది ఇవ్వలేదు. రోజూ అధికారులను అడిగినా దొరకట్లేదు అంటున్నారు. దీంతో వారిని అడగడం మానేశా. – తిరునగిరి మహేశ్, వీవర్స్ కాలనీ, జనగామ (100% పంపిణీ పూర్తైన జిల్లా) ఫారాలు ఎలా నింపాలో తెల్వట్లే... మా ఇంట్లోని నలుగురు ఓటర్లకు బీఎల్వో ఫారాలను ఇచ్చారు. కానీ మాకు చదువురాకపోవడంతో ఎలా నింపాలో తెలియలేదు. హైదరాబాద్‌లో ఉన్న కొడుకు, కోడలి సూచనతో తెలిసిన వారిని అడిగాం. వారు సైతం తెలియదనడంతో ఫారాలను ఇంట్లోనే పెట్టుకున్నాం. 2002లో ఓటు ఉందా లేదా అనేది ఎలా తెలుసుకోవాలో తెలియట్లేదు. –వాంకుడోత్ దేవోజి, భూక్యారాం తండా, మహబూబాబాద్ జిల్లా -
ఫారాలెక్కడ ‘సర్’
ఓటు వివరాలు కావాలంటే టీడీపీ బీఎల్ఏను కలవాలని మా బీఎల్వో చెబుతున్నాడు. మా ఇంటికి ఇంత వరకు బీఎల్వోనే రాలేదు. ఎన్యూమరేషన్ ఫామ్ కూడా టీడీపీ బీఎల్ఏ దగ్గరే తీసుకున్నా. ఎలా పూర్తిచేయాలో తెలియక ఎన్యూమరేషన్ ఫారం తిరిగి ఇవ్వలేదు. ఓటర్ల జాబితాలన్నీ తెలుగుదేశం పార్టీ నాయకుల దగ్గరే ఉన్నాయి. – ఎ.కృష్ణ, బొల్లవరం, కల్లూరు మండలం, కర్నూలుసాక్షి ప్రతినిధి, శ్రీకాకుళం/సాక్షి నెట్వర్క్: రాష్ట్రంలో ఓటర్ల ప్రత్యేక సమగ్ర సవరణ (సర్) ప్రక్రియ అస్తవ్యస్తంగా సాగుతోంది. ‘మాకు ఎన్యూమరేషన్ ఫారాలు ఇంకా అందలేదు మహాప్రబో అని ఓటర్లు గగ్గోలు పెడుతుంటే.. అధికారులు మాత్రం అంకెల్లో వందశాతాలు చూపిస్తూ సంబరపడుతున్నారు. ఫారాల పంపిణీ మొదలు డిజిటలైజేషన్ వరకు అంతా అధికార పార్టీ నేతల కనుసన్నల్లో జరుగుతున్నాయి. చాలామంది బీఎల్వోలు టీడీపీ నాయకులకు ఈ ఫారాలు ఇచ్చి చేతులు దులుపుకుంటున్నారు. టీడీపీ నాయకుల ఇళ్లు, టీడీపీ కార్యాలయాలే బీఎల్వోల కార్యక్షేత్రాలుగా మారిపోయాయి. ప్రతిపక్ష పార్టీల సానుభూతిపరులైన ఓటర్లలో ఎవరికి ఫారాలు ఇవ్వాలి? ఎవరిని మినహాయించాలనేది టీడీపీ నాయకులే బీఎల్వోలకు నిర్దేశిస్తున్నారు. ఎందుకంటే చాలాచోట్ల వైఎస్సార్సీపీ సానుభూతిపరులకు ఇంకా ఎన్యూమరేషన్ ఫారాలే అందలేదు. ఫారాలు ఇప్పించాలంటూ ఎమ్మార్వో కార్యాలయాల వద్ద ఆందోళనలు జరుగుతున్నాయి. నిజమైన ఓటర్లకు ఓట్లు లేకుండా చేయాలన్న కుట్రతో పాటు పనిలో పనిగా దొంగఓట్లు చేర్పించే దుర్మార్గానికి కూడా అక్కడక్కడా పసుపు చొక్కా నాయకులు పూనుకుంటున్నారు. ఓటర్లకు రెండు ఫారాలు ఇచ్చి పూర్తి చేసిన ఫారం తీసుకుని ఎక్నాలెడ్జ్మెంట్ ఫారం వారికే తిరిగి ఇవ్వాలన్న పద్ధతిని బీఎల్వోలు ఎక్కడా పాటించడం లేదు. నిరక్షరాస్యులైన ఓటర్లకు వివరాలు నింపడంలో సాయపడాల్సిన బీఎల్ఓలు చాలామంది ఆ పనిని గాలికి వదిలేశారు. దాంతో చాలాచోట్ల ఓటర్లు చాలా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. గడువు సమీపిస్తున్నా ఇంకా ఫారాలు అందలేదు.. అందిన ఫారాల డిజిటలైజేషన్ సగం కూడా జరగలేదు.. ఈ నేపథ్యంలో సర్ గడువు పొడిగించాలని, అవకతవకలన్నీ సరిచేయాలని ఓటర్లు, ప్రతిపక్ష పార్టీలు, ప్రజాస్వామికవాదులు విజ్ఞప్తి చేస్తున్నారు. ప్రస్తుతం రాష్ట్రంలోని పలు జిల్లాల్లో సర్ జరుగుతున్న తీరిలా ఉంది... దొంగ ఓట్లు చేర్చే కుట్ర శ్రీపొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లాలో టీడీపీ నేతల కనుసన్నల్లో బీఎల్వోలు పనిచేస్తున్నారనే ఆరోపణలు సర్వత్రా వినిపిస్తున్నాయి. దొంగ ఓట్ల నమోదులో పచ్చ నేతలకు వీరు సహకరిస్తున్నారు. ఉదయగిరి నియోజకవర్గంలోని జలదంకి మండలం కమ్మవారిపాళెం పంచాయతీ మజరా విజయనగరంలో ఎక్కువ మంది వలస వెళ్లారు. దీంతో ఇక్కడ కేవలం 15 ఓట్లు మాత్రమే ఉన్నాయి. ఇందులో నలుగురు మృతి చెందడంతో ఈ సంఖ్య 11కు చేరింది. అయితే టీడీపీ నేతలతో స్థానిక బీఎల్వో కుమ్మక్కై అక్కడ 76 ఓట్లున్నట్లుగా చూపుతున్నారు. దొంగఓట్లు చేర్చే కుట్ర జరుగుతుండటంతో వైఎస్సార్సీపీ నేతలు అడ్డుకున్నారు. నెల్లూరు నగర నియోజకవర్గంలో కార్పొరేషన్ ఉద్యోగులను అధికార పార్టీ నేతల కార్యాలయంలోనే కూర్చోబెట్టి ఓటర్ల చేర్పులు చేయిస్తుండటంపై ఆందోళన వ్యక్తమవుతోంది. టీడీపీ నాయకుడి ఇల్లే బీఎల్వో కార్యాలయం కర్నూలు జిల్లాలో బీఎల్వోలు ఇంటింటికీ తిరిగి ఎన్యూమరేషన్ ఫారాలు అందించడం లేదు. ఎక్కడో ఒకచోట కూర్చుంటున్నారు. వారిని వెతికి పట్టుకోవడానికి ఓటర్లు నానా తిప్పలు పడుతున్నారు. ఆదోనిలో టీడీపీ నాయకుడి ఇల్లే బీఎల్వో కార్యాలయం. ఎవరైనా సరే అక్కడికి వెళ్లి ఎన్యూమరేషన్ ఫారం తెచ్చుకోవలసిందే. కర్నూలులోనూ తెలుగుదేశం పార్టీ కార్యాలయంలోనే బీఎల్వోలు కూర్చుంటున్నారు. జిల్లాలో వలస వెళ్లిన కూలీల ఫారాలన్నీ అందుబాటులో లేకుండా చేశారు. ఓటరు జాబితా నుంచి వారిని తొలగించడానికి సర్వం సిద్ధం చేశారు. ‘సర్’ ప్రక్రియలో పసుపు యానిమేటర్లు అనంతపురం జిల్లాలో ఎన్యూమరేషన్ ఫారాల డిజిటలైజేషన్ ప్రక్రియ నత్తనడకన సాగుతోంది. ఉరవకొండ నియోజకవర్గంలో జరుగుతున్న ఎన్యూమరేషన్ ఫారాల పంపిణీలో, డిజిటలైజేషన్ ప్రక్రియలో వెలుగు యానిమేటర్లు కనిపిస్తున్నారు. అధికార పార్టీ ప్రయోజనాలకు అనుగుణంగా పనిచేస్తున్న ఓ అధికారి ఆదేశాలతోనే యానిమేటర్లు ఈ పనిలోకి వచ్చారని అంటున్నారు. ప్రస్తుతం వెలుగు యానిమేటర్లందరూ అధికార పార్టీకి చెందిన వారేనన్న విషయం తెలిసిందే. ఇక ఈ ప్రక్రియ సజావుగా జరుగుతుందా.. పూర్తి చేసిన ఎన్యూమరేషన్ ఫారాల డిజిటలైజేషన్ జరుగుతుందా లేక ప్రతిపక్షాలకు చెందిన ఫారాలు గల్లంతవుతాయా అన్నా అనుమానాలున్నాయి. ఎన్యూమరేషన్ జిరాక్స్‌లు ఎందుకు ‘తమ్ముడూ’? కళ్యాణదుర్గంలోని 70, 71 పోలింగ్ కేంద్రాల వద్ద ఓ టీడీపీ కార్యకర్త ఓటర్ల నుంచి ఎన్యూమరేషన్ ఫారాల జిరాక్స్‌లు తీసుకుంటూ వైఎస్సార్సీపీ కార్యకర్తలకు పట్టుబడ్డాడు. తాను బీఎల్‌వోనని, గతంలో ఇక్కడి బీఎల్వో సరిగా పనిచేయకపోవడంతో తనను నియమించారని చెప్పి తప్పించుకోబోయాడు. గట్టిగా నిలదీయడంతో ఓటర్ల నుంచి ఎన్యూమరేషన్ ఫారాలన్నీ తీసుకురావలసిందిగా స్థానిక టీడీపీ నేత డిష్ మురళి చెప్పాడని బయటపెట్టాడు. అంటే ఆ ఫారాలన్నీ పరిశీలించి ఏవేవి తీసేయాలో చెప్పేందుకు టీడీపీ నాయకులు పన్నిన కుట్రన్న మాట. బీఎల్వోలను పిలిపించేలోపు ఆ కార్యకర్త అక్కడి నుంచి పరారయ్యాడు. అతడు రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి పయ్యావుల కేశవ్ ప్రాతినిధ్యం వహిస్తున్న ఉరవకొండ నియోజకవర్గంలోని రాకెట్ల గ్రామానికి చెందినవాడని తెలిసింది. ఇంట్లో అందరికీ ఫారాలు ఇవ్వరా? శ్రీకాకుళం జిల్లాలో 98 శాతం ఎన్యూమరేషన్ ఫారాల పంపిణీ జరిగిపోయిందని అధికారులు చెబుతున్నారు. కానీ శ్రీకాకుళం నగరంలోని చాలా ఏరియాల్లోకి అసలు బీఎల్వోలు అడుగేపెట్టలేదు. జిల్లాలో చాలాచోట్ల ఎన్యూమరేషన్ ఫారాల పంపిణీ విషయంలో చాలా అవకతవకలు జరుగుతున్నాయి. ఒక ఇంటిలో ఐదుగురు ఓటర్లుంటే ముగ్గురికే ఫారాలు ఇచ్చారు. మిగిలిన ఇద్దరికీ మళ్లీ తెచ్చి ఇస్తామని చెప్పి మాయమయ్యారు. చాలాచోట్ల అక్నాలెడ్జ్మెంట్లా ఉంచాల్సిన ఫారాన్ని కూడా బీఎల్వోలు తీసుకెళ్లిపోతున్నారు. రెండు ఫారాలు వాళ్లే తీసుకుపోతే మనకు ఇక ఆధారమేమి ఉంటుందని కొందరు ఓటర్లు చర్చించుకుంటున్నారు. తిరుపతి నగరంలోని 36వ డివిజన్లో ఒక ఇంట్లో 8మంది ఓటర్లు ఉంటే ముగ్గురికి, చెన్నారెడ్డి కాలనీలో ముగ్గురు ఉంటే ఇద్దరికే ఫారాలు ఇచ్చి మిగిలిన వారిని వదిలేశారు. సర్వం గందరగోళం.. సర్.. డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ కోనసీమ జిల్లాలో సర్ ప్రక్రియ సర్వం గందరగోళంగా తయారయ్యింది. శని, ఆదివారాలలో బీఎల్వోలు బూత్‌లలో అందుబాటులో ఉంటారని అధికారులు ప్రకటించినా ఎక్కడా బీఎల్వోలు కనిపించలేదు. చాలా చోట్ల బూత్‌లకు తాళాలేసి ఉన్నాయి. తెరిచి ఉన్న బూత్‌లలో సిబ్బంది ఎవరూ లేరు. ⇒ తూర్పుగోదావరి జిల్లాలో సామాన్య ఓటర్లకు అవగాహన లేకపోవడంతో ఎన్యూమరేషన్ ఫారాల్లో వివరాలు నమోదు చేయలేకపోతున్నారు. ఉన్నతాధికారులు చెబుతున్నప్పటికీ క్షేత్రస్థాయిలో ఎన్యూమరేషన్ ఫారాలు నింపడంలో ఓటర్లకు బీఎల్వోలు సహకరించడం లేదు. రాజమండ్రి నగరంలో నేటికీ 25 శాతం కంటే తక్కువగా డిజిటలైజేషన్ జరిగింది. ⇒ వైఎస్సార్ కడప జిల్లాలో ఎన్యూమరేషన్ పత్రాలు పూరించడం తెలియక ఓటర్లు తికమక పడుతున్నారు. సర్వర్లు మొరాయించడం వంటి కారణాల వల్ల డిజిటైజేషన్ ప్రక్రియ ఈనెల 14వ తేది నాటికి పూర్తి కాదని, గడువు పొడిగించాలని పలువురు కోరుతున్నారు. ⇒ ఉమ్మడి విశాఖ జిల్లాలో బీఎల్వోలు అందుబాటులో లేకపోవడంతో ఓటర్లు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. శనివారం, ఆదివారం స్పెషల్ క్యాంపెయిన్ నిర్వహిస్తున్నట్టు కలెక్టర్ ప్రకటించినా క్షేత్రస్థాయిలో ఆ పరిస్థితులు కనిపించలేదు. విశాఖ తూర్పు, ఉత్తర, గాజువాక, చోడవరం, పాయకరావుపేట, అనకాపల్లి, నర్సీపట్నం, యలమంచిలి నియోజకవర్గాల్లో బీఎల్వోల కోసం ప్రజలు ఎదురు చూపులు చూడాల్సి వచ్చింది. అల్లూరి జిల్లాలోని అరకు, పాడేరు నియోజకవర్గాల్లోనూ ఎన్యూమరేషన్ ఫారాలు అందరికీ అందలేదు ⇒ చిత్తూరు నగరంలోని 32వార్డు సచివాలయంలో పనిచేసే బీఎల్వోలు, ఓటర్లపై దురుసుగా ప్రవర్తిస్తున్నారని పలువురు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.నంద్యాల విశ్వనగర్ టీడీపీ కార్యాలయంలో సర్ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్న బీఎల్వో, అధికారులు వైఎస్సార్సీపీ సానుభూతిపరులే టార్గెట్⇒ పల్నాడు జిల్లాలో ఎస్ఐఆర్ ప్రక్రియ పలు అనుమానాలకు తావిస్తోంది. చాలామంది వైఎస్సార్సీపీ సానుభూతిపరులకు ఎన్యూమరేషన్ ఫారాలు పంపిణీ చేయడం లేదు. నూజెండ్ల మండలం వి అప్పాపురం గ్రామంలో బూత్ నంబర్లు 286, 287 పరిధిలో 22 మంది వైఎస్సార్సీపీ సానుభూతిపరులకు ఎన్యూమరేషన్ ఫారాలు ఇవ్వలేదు. దీనిపై వైఎస్సార్సీపీ బీఎల్ఏలు నూజెండ్ల మండల ఎంఆర్ఓకు సమస్యను వివరిస్తూ వినతిపత్రం అందజేశారు. చాలాచోట్ల బీఎల్వోలు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారు. ఎన్యూమరేషన్ పత్రాలను అధికార పార్టీ నేతలకు అప్పగించి చేతులు దులుపుకుంటున్నారు. ఇళ్లకు వెళ్లకుండా స్థానిక రాజకీయ నాయకుల ఇళ్ల వద్ద కూర్చుని ఫారాలు పూర్తి చేస్తున్నారు. ⇒ బాపట్ల జిల్లాలోనూ చాలాచోట్ల వైఎస్సార్సీపీ సానుభూతిపరులకు ఎన్యూమరేషన్ ఫారాలు అందలేదు. మార్టూరులోని 21, 22, 23 వార్డులలో అధిక శాతం ముస్లిం ఓటర్లు ఉన్నారు. అందులో ప్రతిపక్ష వైఎస్సార్సీపీ సానుభూతిపరుల ఇళ్లను బీఎల్వోలు మినహాయించారు. కానీ ‘సాక్షి’లో కథనం రావడంతో బీఎల్వోలు హడావిడిగా శని, ఆదివారాల్లో ఎన్యూమరేషన్ ఫారాలను పంపిణీ చేశారు. అలాగే పర్చూరు, చీరాల నియోజకవర్గాలలోనూ వందలాదిమంది వైఎస్సార్సీపీ సానుభూతిపరులు తమకు ఫారాలు అందలేదని చెబుతున్నారు. వేమూరు నియోజకవర్గంలోనూ ఫారాల పంపిణీ అస్తవ్యస్తంగా మారింది. ఇంట్లో అందరికీ ఫారాలు ఇవ్వడం లేదు. కొంతమందికి ఇచ్చి మిగిలినవారికి మళ్లీ తెస్తామని బీఎల్వోలు చెబుతున్నారు. పరిస్థితి ఇలా ఉంటే కలెక్టర్ మాత్రం జిల్లాలో 100 శాతం ఎన్యూమరేషన్ ఫారాల పంపిణీ జరిగిపోయిందని చెబుతున్నారు.నంద్యాల 6వ వార్డులో టీడీపీ నాయకుడితో కలిసి ఓటర్ల జాబితాను పరిశీలిస్తున్న ఎన్నికల అధికారులు ⇒ ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లాలోని దెందులూరు మండలం శ్రీరామవరం 80వ బూత్‌లో వైఎస్సార్సీపీ సానుభూతి పరులకు ఎన్యూమరేషన్ ఫారాలు అందలేదు. దీంతో వారు దెందులూరులోని తహసీల్దార్ కార్యాలయం వద్ద నిరసన తెలిపారు. ఏలూరు రూరల్ మండలం గుడివాకలంక గ్రామంలో 800మంది వైఎస్సార్సీపీ సానుభూతి పరులకు ఎన్యూమరేషన్ ఫారాలు అందించలేదు. అధికారపార్టీ నాయకుల కనుసన్నల్లో బీఎల్వోలు పనిచేస్తుండటంపై ఫారాలు అందనివారు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ⇒ ఉమ్మడి చిత్తూరు జిల్లాలో ఎన్యూమరేషన్ ఫారాల పంపిణీ సరిగా జరగడం లేదు. చాలాచోట్ల అధికార టీడీపీ నేతలతో కుమ్మక్కై ఫారాలను వారి చేతికి అప్పగించి చేతులు దులుపుకుంటున్నారని ఆరోపణలు ఉన్నాయి. నగరి మున్సిపాలిటీ 10వ వార్డులో వైఎస్సార్సీపీ సానుభూతిపరుల ఓట్లను తొలగించాలని టీడీపీ నాయకులు తీవ్ర ఒత్తిడి చేస్తున్నారు. జీడీ నెల్లూరు పరిధిలోని గంగమాంబపురంలో ఫారాలన్నీ టీడీపీ నేతలకు బీఎల్వోలు అప్పగించగా, వారు తమకు అనుకూలమైన ఓటర్ల వివరాలను మాత్రమే ఆన్లైన్ చేస్తున్నారని పలువురు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ⇒ గుంటూరు జిల్లాలో గుంటూరు తూర్పు నియోజకవర్గ పరిధిలోని 1వ వార్డు 92 బూత్‌లో సల్మా భాను అనే బీఎల్వో 600కి పైగా ఎన్యూమరేషన్ ఫారాలను ఓటర్లకు ఇవ్వకుండా తన దగ్గరే ఉంచుకున్నారు. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నగర అధ్యక్షురాలు, తూర్పు నియోజకవర్గ సమన్వయకర్త షేక్ నూరి ఫాతిమా బూత్‌ల్లో పర్యటిస్తుండగా ఈ విషయం బయటపడింది. దీనిపై నిలదీస్తే ఆ బీఎల్వో దురుసుగా సమాధానం చెప్పారు. ఓట్ల తొలగింపుపై నూజండ్ల తహసీల్దార్ రమేష్‌కుమార్‌కు వినతిపత్రం అందిస్తున్న వైఎస్సార్సీపీ నేతలు ఫారాల కోసం ఆఫీసుల చుట్టూ తిరగలేకపోతున్నాం ఫారాలివ్వడానికి బీఎల్వోలు ఎవరూ ఇళ్లకు రావడం లేదు. సచివాలయాల చుట్టూ తిరగలేకపోతున్నాం. ఫోన్ చేస్తే సచివాలయానికో, మరో ప్రాంతానికో రమ్మని చెబుతారు. వెళ్లినా అక్కడ ఉండడం లేదు. రోజువారీ పనులు వదులుకుని ఆఫీసుల చుట్టూ తిరగటం మా వల్ల కావడం లేదు. మేం ఎన్నిసార్లు అధికారుల చుట్టూ తిరగాలో అర్థం కావడం లేదు. ఇప్పటికైనా మా ప్రాంతానికి వచ్చి ఫారాలు అందజేయాలని కోరుతున్నాం. – బాబు, పాలసముద్రం మండలం, చిత్తూరు జిల్లావృద్ధులు, దివ్యాంగులు ఇబ్బందిపడుతున్నారు సర్ ప్రక్రియలో బీఎల్వోలు ఇంటింటికీ వెళ్లి ఎన్యూమరేషన్ ఫారం పంపిణీ, స్వీకరణ చేయాలి. అయితే మా పంచాయతీలో బీఎల్వోలు ఇళ్లకు రావడం లేదు. సచివాలయానికి రావాలని ఓటర్లకు చెబుతున్నారు. దీంతో సచివాలయానికి వెళ్లలేక, వ్యయప్రయాసలకోర్చి అక్కడవరకూ వెళ్లినా అక్కడ ఎదురు చూడలేక చాలామంది వృద్ధులు, దివ్యాంగులు ఇబ్బంది పడుతున్నారు. – జమాల్, మాజీ సర్పంచ్, సింగవరం పంచాయతీ, అనంతపురం జిల్లాఐదుసార్లు ఓటు వేశాను.. ఇప్పుడు ఓటు లేదంటున్నారు మేం కనిగిరి బీసీ కాలనీలో ఉంటున్నాం. మా ఇంట్లో 9 మంది ఓటర్లం ఉన్నాం. మా స్వగ్రామం మార్కాపురం మండలం మేకలవారిపల్లి గ్రామం. నేను సుమారు 35 ఏళ్ల క్రితం కనిగిరికి వచ్చాను. కనిగిరి నియోజకవర్గంలో ఇప్పటికి ఐదుసార్లు ఓటు వేశాం. భారత ఎన్నికల సంఘం ఇచ్చిన ఓటరు గుర్తింపు కార్డును రెండుసార్లు పొందాను. అన్ని ఆధారాలతో ఎన్యూమరేషన్ ఫారం తీసుకుని వెళ్లి బీఎల్వో ఆంజనేయులును కలిశాను. 2002 జాబితాలో నీ పేరు కనిపించడం లేదు. మీ నాన్న, మీ బంధువుల ఆధారాలు తీసుకుని రా.. లేదంటే.. నీ ఓటు ఫారంను రిజక్ట్ చేస్తాను అని బీఎల్వో చెప్తున్నాడు. మీ నాన్న ఓటు వివరాలు, బూత్ నంబర్ కని్పంచలేదని బీఎల్వో దబాయిస్తున్నాడు. ఎన్నికల అధికారులు నాకు న్యాయం చేయాలి. – చల్లా ఏడుకొండలు, కనిగిరి, మార్కాపురం జిల్లాఓటరు లిస్టులో పేరు లేదంటున్నారు నాకు ఎన్యూమరేషన్ ఫారాలు ఇచ్చారు. కానీ ఇçప్పుడు బీఎల్వో ఓటరు లిస్టులో నా పేరు లేదంటున్నారు. ఎన్నో ఏళ్లుగా వేస్తున్న ఓటు లేదంటే ఎలా? ఫారం పూర్తిచేసి ఇచ్చినా డిజిటలైజేషన్ కాలేదు. పక్క గ్రామంలో కూడా ఓటరు లిస్టులో పేరు కోసం వెతికించా. అక్కడా కనిపించలేదంటున్నారు. ఊరూరా తిరిగే ఓపిక లేదు. ఒంటరి వృద్ధురాలిని. నా ఓటు తీసేయడానికే లిస్టులో లేదంటున్నారా? అసలు నా ఓటు ఎక్కడుందో తెలుసుకోవడం ఎలా? – కురబ రమణమ్మ, చేనేతనగర్, కురబలకోట మండలం, అన్నమయ్య జిల్లాఫారం నింపడానికి బీఎల్వో సాయం చేయడం లేదు ఎన్యూమరేషన్ ఫారంలో వివరాలు ఎలా నింపాలో అర్థం కావడం లేదు. బీఎల్వోలు ఎవరూ సాయం చేయడం లేదు. తండ్రి పేరుతో పాటు తాత, నాన్నమ్మ, అమ్మమ్మ పేర్లు, ఇతర కుటుంబ సభ్యుల పేర్లు, వారి ఓటరు గుర్తింపు కార్డు నంబర్లు అడుగుతున్నారు. నేను పెద్దగా చదువుకోకపోవడంతో ఆ వివరాలు ఎలా నింపాలో అర్థంగాక నింపడం లేదు. 2002 ఓటరు జాబితా వివరాలు నింపాలంటే ఆ లిస్ట్ ఎక్కుడుందో తెలియడం లేదు. – భీమన వీరబాబు, క్వారీ మార్కెట్, బూత్ నంబర్ 30, రాజమహేంద్రవరం, తూర్పుగోదావరి జిల్లాఫారాలు ఇవ్వకుండా ఆన్లైన్ చేసేశామంటున్నారు సర్ కార్యక్రమంలో భాగంగా ప్రతి ఓటర్‌కు రెండు ఫారాలు ఇచ్చి వాటిని నింపిన తర్వాత ఒకటి ఓటర్ దగ్గర ఉంచి ఇంకొకటి బీఎల్వో తీసుకొని ఆన్లైన్ చేయాలి. అప్పుడే ఆ ఓటర్ ఎన్యూమరేషన్లో పాల్గొన్నట్లు అవుతుంది. రేపు ఓటు గల్లంతైతే ఓటరు అడగడానికి వీలు కలుగుతుంది. ఓటరు దగ్గర ఫారం లేకపోతే తన ఓటు గురించి అడిగే హక్కు ఎలా ఉంటుంది? మైలవరం నియోజకవర్గంలో చాలా బూత్‌లలో ఓటర్లకు ఫారాలు ఇవ్వకుండా వివరాలు తీసుకొని ఆన్లైన్ చేసేశామని చెబుతున్నారు. ఇది మంచి పద్ధతి కాదు. ఉన్నతాధికారులు స్పందించి ప్రతి ఓటరుకు ఫారాలు అందేలా చూడాలి. – వేములకొండ విష్ణు, జి.కొండూరు, ఎన్టీఆర్ జిల్లా -
ఊళ్లకు 'ఫారం' ఫీవర్!
సాక్షి ప్రతినిధి, సంగారెడ్డి: ఓటర్ల జాబితా ప్రత్యేక విస్తృత సవరణ (ఎస్ఐఆర్)లో భాగంగా పంపిణీ చేసిన ఎన్యూమరేషన్ ఫారాల పంపిణీ ఓ కొలిక్కి వస్తున్నప్పటికీ ఈ ఫారాలను నింపడం ఎలాగో తెలియక ఓటర్లు తికమక పడుతున్నారు. ఫారంలోని రెండు భాగాల్లో తమ వివరాలను ఎక్కడ నింపాలో చాలా మందికి తెలియడం లేదు. 2002 నాటి ఓటర్ల జాబితాలో పేరున్న వారు ఫారంలో ఎటువైపు వివరాలు నింపాలి.. 2002 జాబితాలో పేరు లేని వారు ఫారంలో వివరాలు ఎక్కడ నింపాలనే దానిపై గందరగోళం నెలకొనడంతో బీఎల్ఓలకు ఫోన్లు చేసి తెలుసుకుంటున్నారు. అలాగే కొన్నిచోట్ల వివిధ పార్టీల బీఎల్ఏల సహాయం తీసుకుంటున్నారు. ఓటర్ల జాబితాలో పేరున్నప్పటికీ కొన్ని చోట్ల వారు స్థానికంగా లేకపోవడం, ఫోన్ నంబర్, చిరునామా తెలియకపోవడంతో బీఎల్ఓలు అయోమయానికి గురవుతున్నారు. రాష్ట్రంలో మొత్తం 3.38 కోట్ల మంది ఓటర్లు ఉండగా శనివారం నాటికి 2.88 కోట్ల ఎన్యూమరేషన్ ఫారాలను పంపిణీ చేసినట్లు అధికార వర్గాలు తెలిపాయి. గ్రామీణ ఓటర్లు వ్యవసాయ పనుల్లో నిమగ్నం కావడంతో ఫారాల పంపిణీ పూర్తి కావడం లేదు. పట్టణ ప్రాంతాల్లో చిరునామాలు దొరక్క ఫారాల పంపిణీలో కొంత జాప్యం జరుగుతోంది. మరోవైపు బీఎల్ఓలకు ఇప్పటికే రెండుసార్లు శిక్షణ ఇచ్చిన ఎన్నికల సంఘం.. ఇప్పుడు ఓటర్లు పూర్తి చేసిన ఎన్యూమరేషన్ ఫారాలను బీఎల్ఓ యాప్‌లో స్కాన్ చేసి అప్లోడ్ చేయాల్సి ఉంది. ఈ ప్రక్రియను ఎలా నిర్వహించాలనే అంశంపై మరోసారి బీఎల్ఓలకు శిక్షణ ఇవ్వనున్నట్లు అధికారులు తెలిపారు. కొత్త కోడళ్లకు ‘సర్’ఇక్కట్లు.. కొత్తగా పెళ్లయి అత్తారింటికి వచ్చిన కొత్త కోడళ్లకు ఎన్యూమరేషన్ దరఖాస్తులు నింపడంలో ఇబ్బందులు ఎదురవుతున్నాయి. సంబంధిత మహిళ తండ్రి, తల్లి, తాత, నాయనమ్మలకు సంబంధించిన ఎపిక్ నంబర్‌ను ఫారంలో పొందుపరచడం తప్పనిసరిగా మారింది. దీంతో వారి పుట్టింటికి ఫోన్లు చేసి కనుక్కోవాల్సి వస్తోందని ఆ మహిళలు పేర్కొంటున్నారు. భర్త తరఫు వారి ఎపిక్ నంబర్లతో మ్యాపింగ్ జరిగేలా చూడాలని వారు కోరుతున్నారు. జిల్లాల్లో పరిస్థితి ఇలా.. – ఉత్తరాది రాష్ట్రాల వలస కార్మిక ఓటర్లు ఎక్కువగా ఉండే ఉమ్మడి మెదక్ జిల్లాలోని పటాన్చెరు, సంగారెడ్డి వంటి అసెంబ్లీ నియోజకవర్గాల్లో ఎన్యూమరేషన్ ఫారాల పంపిణీ తక్కువగా జరుగుతోంది. చాలా మంది అద్దెకు ఉన్న వారి ఆచూకీ కనుక్కోవడం ఇబ్బందిగా మారిందని బీఎల్ఓలు పేర్కొంటున్నారు. – ఉమ్మడి మహబూబ్‌నగర్ జిల్లాలో కర్ణాటక, మహారాష్ట్ర నుంచి వివాహం చేసుకొని వచ్చిన మహిళల పాత (2002) ఓటరు వివరాలు సేకరించడం కష్టంగా మారింది. ముంబై, హైదరాబాద్ తదితర నగరాలకు వలస వెళ్లిన ఓటర్ల నుంచి సమాచారం, పత్రాలు పొందడం ఇబ్బందిగా మారింది. – ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో మహారాష్ట్ర–తెలంగాణ రాష్ట్రాల పరిధిలో ఉన్న కెరమెరి మండలం పరందోలి, అంతాపూర్, బోలపటార్ వంటి 11 గ్రామాల్లోని ఓటర్లు రెండు రాష్ట్రాల అధికారులు ఇచ్చిన ఫారాలను తీసుకుంటున్నారు. ఒకే రాష్ట్రంలో ఓటు హక్కు మిగిలే అవకాశం ఉండటంతో ఇరు రాష్ట్రాల బీఎల్ఓలు పోటాపోటీగా ఎన్యూమరేషన్ ఫారాలను పంపిణీ చేస్తున్నారు. మంచిర్యాల జిల్లాలోని కోల్‌బెల్ట్‌లో రిటైర్డ్ కార్మికులు తమ సొంత గ్రామాలకు వెళ్లిపోయారు. దీంతో వారికి ఫారాల పంపిణీ ప్రశ్నార్థకంగా మారింది. – కరీంనగర్ జిల్లాలోని కరీంనగర్, హుజురాబాద్, చొప్పదండి, మానకొండూర్ నియోజకవర్గాల్లో ఫారాలను పూర్తి చేయడంలో నిరక్షరాస్యులకు సమస్య తలెత్తుతోంది. – ఉమ్మడి వరంగల్ జిల్లాలో భూపాలపల్లి పట్టణంలో ఓటర్ల చిరునామాలను బీఎల్వోలు గుర్తించలేకపోవడంతో ఆయా వార్డుల్లో పార్టీల నేతల సహకారంతో ఫారాలను పంపిణీ చేస్తున్నారు. సింగరేణి కార్మికుల్లో కొందరికి భూపాలపల్లితోపాటు వారి స్వగ్రామాల్లోనూ ఓట్లు ఉన్నాయి. భూపాలపల్లి ఓటు హక్కును తొలగించుకునేందుకు ఆసక్తి చూపుతున్నారు. దీంతో భూపాలపల్లి పట్టణంలో సుమారు 10 వేల వరకు ఓట్లు తగ్గే అవకాశం ఉంది. – భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో ఎన్యూమరేషన్ ఫారాల పంపిణీని చాలా వరకు రాజకీయ నేతలే చేపడుతున్నారు. బీఎల్ఓలు నామమాత్రంగా వ్యవహరిస్తున్నారు. – ఉమ్మడి నల్లగొండ జిల్లాలోని పలు పట్టణాల్లో బీఎల్ఓలు ఇంటింటికీ వెళ్లకుండా తాము ఉన్న చోటకే వచ్చి ఫారాలను తీసుకెళ్లాలని చెబుతున్నారు. అధికారుల కోసం ఎదురు చూస్తున్నాం నాలుగు రోజుల క్రితం అధికారులు వచ్చి ఫారం ఇచ్చి వెళ్లిపోయారు. మాకు చదువు రాదు. ఫారం ఎలా నింపాలో తెలియదు. మళ్లీ అధికారులు వస్తే వివరాలు చెబుదామని ఎదురుచూస్తున్నా. – అచ్చమ్మ, వెంకటాపురం(కె), ములుగు జిల్లాఫారం ఎలా నింపాలో చెప్పట్లేదు ఫారం నింపి ఇవ్వకపోతే ఓటు పోతుందంటున్నారు. ఎలా నింపాలో మాత్రం ఎవరూ చెప్పట్లేదు. ఫారం నింపేందుకు చదువుకున్న వాళ్ల చుట్టూ తిరిగా. కానీ వాళ్లకూ అర్థంకాకపోవడంతో చివరకు బీఎల్ఓల దగ్గరకే వెళ్లా. – కథలప్ప, మరికల్, నారాయణపేట జిల్లా -
ఓటు కోసం కోటి కష్టాలు! సరిగ్గా జరగడం లేదు ‘సర్’!
నేను కాశీబుగ్గ శ్రీనివాసనగర్‌లో ఉంటున్నా. ఇంత వరకు ఎవరూ ఎన్యూమరేషన్ పత్రం ఇవ్వలేదు. మా వీధికి వచ్చిన వారిని అడిగితే ఇక్కడ కాదని అంటున్నారు. మా సొంతూరు అంబుసోలి వెళ్తే అక్కడ ఏమీ తెలియదంటున్నారు. మా ఇంటిలో 3 ఓట్లు ఉన్నాయి. ఎవరికీ ఫారాలు ఇవ్వలేదు. – కోనేటి కుమారి, శ్రీనివాసనగర్, కాశీబుగ్గ సాక్షి, అమరావతి: ఎన్నికల సంఘం చేపట్టిన ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ (స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ – సర్) కార్యక్రమానికి ఇక మిగిలింది పదిరోజులే.. ఓటును కాపాడు కోవడం కోసం ఓటర్లు పడుతున్న తిప్పలు అన్నీ ఇన్నీ కావు. చాలా మందికి ఎన్యూమరేషన్ ఫారాలే అందలేదు. తీసుకున్న వారు వాటిని ఎలా పూర్తి చేసి ఇవ్వాలో అర్థం కాక తలపట్టుకు కూర్చుంటున్నారు. సర్ కార్యక్రమంపై ఓటర్లకు సమగ్ర అవగాహన కలిగించకుండా, బీఎల్వోలకు పూర్తిస్థాయి శిక్షణ ఇవ్వకుండా చేపట్టిన ఈ కార్యక్రమంలో ఎవరి ఓట్లు మిగులుతాయో, ఎవరి ఓట్లు ఎగిరిపోతాయోనన్న ఆందోళనలో అందరూ ఉన్నారు. జూన్ 15న మొదలైన ‘సర్’ కార్యక్రమంలో ఓటర్ల ఎన్యూమరేషన్ ప్రక్రియ ఈ నెల 14వ తేదీతో ముగియనుంది. రాష్ట్రంలో 4,16,27,694 మంది ఓటర్లు ఉండగా.. శనివారం నాటికి 2,00,46,384 మంది ఓటర్ల ఎన్యూమరేషన్ వివరాలు డిజిటలైజ్ చేయడం పూర్తయిందని అధికారులు చెబుతున్నారు. ఇరవై రోజుల్లో సగం మాత్రమే పూర్తికావడంతో అధికారులు ఒత్తిడి పెంచుతున్నారు. బీఎల్వోలు సతమతమవుతున్నారు. ఓటర్లలో చాలామందికి ఈ ఫారాలు ఎలా పూర్తిచేయాలో తెలియడం లేదు. మీరే పూర్తిచేయండి అంటూ ఇచ్చేస్తున్నారని బీఎల్వోలు అంటున్నారు. వివరాలు లేకుండా ఇస్తున్న ఫారాలు సచివాలయాలలో గుట్టలుగా పేరుకుపోతున్నాయి. ఈ నేపథ్యంలో సర్ ప్రక్రియ ఎలా సాగుతుందో ‘సాక్షి’ పరిశీలించింది. ఫారాలు ఇవ్వకుండానే... అధికారుల ఒత్తిడి భరించలేక బీఎల్వోలు చాలా చోట్ల ఎన్యూమరేషన్ ఫారాలు ఇవ్వకుండానే ఇచ్చేసినట్లు రికార్డుల్లో చూపించినట్లు ‘సాక్షి’ పరిశీలనలో స్పష్టమయ్యింది. గత నాలుగు రోజుల నుంచి ఎన్నికల సంఘం ఎన్యూమరేషన్ ఫారాలు 100 శాతం ఇచ్చేసినట్లు ప్రతి రోజు విడుదల చేస్తున్న నివేదికల్లో వెల్లడిస్తోంది. కానీ క్షేత్ర స్థాయిలో చూస్తే ఇప్పటికీ చాలా మందికి ఫారాలు అందలేదని ఓటర్లు చెబుతున్నారు. చాలా మంది ఓటర్లు ఎక్కడున్నది తెలియకపోయినా పై అధికారుల ఒత్తిడితో ఇచ్చేసినట్లు రికార్డుల్లో చూపించినట్లు పలువురు బీఎల్వోలు తెలిపారు. ముందు రికార్డుల్లో ఇచ్చేసినట్లు చూపించండి ఆ తర్వాత డిజిటలైజేషన్ సమయంలో ఏం చేయాలో చెప్తామనడంతో 100 శాతం ఇచ్చేసినట్లు చూపించినట్లు బీఎల్వోలు చెబుతున్నారు. 2002 ఓటర్ల జాబితాతో మ్యాపింగ్ సమస్య.. సర్ ప్రక్రియలో ప్రధాన సమస్య 2002 ఓటర్ల జాబితాల్లో పేరు లేని ఓటర్లే. ఆ ఓటర్ల సమగ్ర సమాచారం సేకరించడం సమస్యగా మారింది. రాష్ట్రంలో ప్రతి పోలింగ్ బూత్‌లో ఉండే మొత్తం ఓటర్లలో కనీసం 20 శాతం మంది ఈ 24 ఏళ్ల కాలంలో పెళ్లిళ్ల కారణంగా అత్తారి ఊళ్లో ఓటు న మోదు చేసుకున్న వారు, మరో ఊరు వలస వచ్చిన వారి ఓట్లేనని అధికారులు పేర్కొంటున్నారు. ఇలాంటి వారు ఓటు వివరాలను వారు 2002 నివాసం ఉన్న ప్రాంత వివరాలతో మ్యాపింగ్ చేసేలా నిబంధనలు పెట్టడంతో లక్షలాది ఓటర్లు తమ ఓటును కాపాడుకోవడానికి తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. చదువుకున్న వాళ్లు సైతం ‘సర్’ నిబంధనలు తెలియక తికమక పడుతున్నారు. ఉద్యోగ రీత్యా వేరొక చోట నివాసం ఉండే వాళ్లు లేదా కొడుకులు, కూతుళ్ల వద్ద ఉంటున్న తల్లిదండ్రులు తాము తాత్కాలికంగా అక్కడ నివాసం ఉంటున్నా, సొంత ఊరిలో ఓటు కాపాడుకోవడానికి బంధువుల ద్వారా తమ వివరాలు నమోదు చేసుకుంటున్నారని బీఎల్వోలు పేర్కొంటున్నారు. అద్దంకి నియోజకవర్గం పాతమాగులూరు గ్రామానికి చెందిన చల్లా శేషమ్మ గుంటూరులో కొడుకు వద్ద నివాసం ఉంటూ, సర్ కార్యక్రమంలో ఊళ్లో ఉన్న తన ఓటు నిలుపుకునేందుకు శుక్రవారం పాతమాగులూరు వచ్చి తమ బీఎల్వోకు ఏమేమి వివరాలు ఇవ్వాలో అడిగి తెలుసుకుని మరీ తమ వివరాలు నమోదు చేసుకోవడం ‘సాక్షి ’ ప్రతినిధి కంట పడింది. ఫారాలు పక్కన పడేస్తున్నారు.. 2002 నాటి ఓటర్ల జాబితాలో పేరు లేకుండా తరువాత ఓటు హక్కు వచ్చిన వారు ఎన్యూమరేషన్ ఫారాల్లో తల్లిదండ్రుల పేర్లు, వివరాలు నమోదు చేయాల్సి ఉంటుంది. ఆ వివరాలు సరిగా లేవని, పేర్లలో తేడాలున్నాయని రకరకాల సాకులు చూపిస్తూ డిజిటైజేషన్ చేయడంలేదు. అలా చాలా ఎన్యూమరేషన్ ఫారాలను పక్కన పడేస్తున్నారు. వినుకొండ నియోజకవర్గం శావల్యాపురం మండలం పొట్లూరు గ్రామ పరిధిలోని 1042 ఓటర్లు ఉన్న 117 నెంబరు పోలింగ్ బూత్ పరిధిలో 53 మంది ఫారాల్లో వివరాలు సరిగా లేవంటూ పక్కన పడేశారు. అధికారపార్టీ బీఎల్ఏలను సంప్రదిస్తున్నాం.. అధికార పార్టీ నాయకులు చెప్పిన వాళ్లకే బీఎల్వోలు ఎన్యూమరేషన్ ఫారాలు ఇస్తున్నారని, కొంతమందికి ఫారాలు ఇవ్వకుండా సచివాలయాలకు వచ్చి సంప్రదించాలని చెబుతున్నారని చాలాచోట్ల ఆరోపణలు వినిపిస్తున్నాయి. అయితే కొందరు ఓటర్ల ఇళ్ల వివరాలు తెలియక తాము అధికారపార్టీ నియమించిన బీఎల్ఏలకు రోజూ ఫోన్లు చేస్తున్నమాట నిజమేనని చిలకలూరిపేట అసెంబ్లీ నియోజకవర్గ పరిధిలోని యడ్లపాడు మండలం బోయపాలెం గ్రామంలో ఓ బీఎల్వో పేర్కొన్నారు. ‘‘ఓటర్లకు పంచిన ఎన్యూమరేషన్ ఫారాలు తీసుకుందామని ఇళ్లకు వెళ్లితే చాలా ఇళ్లలో కుటుంబ సభ్యులు పనులకు పోయారని చెబుతున్నారు. ఉదయానే వెళ్లినా పనులకు పోతున్నాం, సాయంత్రం రమ్మంటున్నారు.’’ అని బీఎల్వోలు చెబుతున్నారు. ‘ఫారాలు మేమే పూర్తి చేయాల్సి రావడంతో సర్ కార్యక్రమం వేగంగా ముందుకు సాగడం లేదు’ అని చిలకలూరిపేట నియోజకవర్గం యడ్లపాడు మండలం తిమ్మాపురం గ్రామ పరిధిలోని బీఎల్వో వివరించారు. మొరాయిస్తున్న యాప్.. ఇవన్నీ ఓక ఎత్తయితే ఆన్లైన్ సాంకేతిక సమస్యలు ఉండనే ఉన్నాయి. సర్ కార్యక్రమంలో ఓటరు ఇచ్చే ఎన్యూమరేషన్ ఫారాల వివరాలు ఆన్లైన్లో నమోదు చేసే బీఎల్వోల మొబైల్ ఫోన్లో యాప్ రోజూ సాయంత్రం అయితే మొరాయిస్తోంది. కనీసం లాగిన్ అవడానికి వీలులేకుండా యాప్ ఓపెన్ కావడం లేదని బీఎల్వోలు అంటున్నారు. సాయంత్రం 4 గంటల నుంచి ఆరు గంటల మధ్య తరచూ ఈ సమస్య తలెత్తుతోందని, సమస్య తలెత్తినప్పుడు కనీసం 20 నిమిషాలు యాప్ పూర్తిగా పనిచేయకుండా ఆగిపోతుందని బీఎల్వోలు అంటున్నారు. ‘ఆధార్’ వివరాలు ఎందుకు అడుగుతున్నట్లు? ఎన్నికల సంఘం ‘సర్’ కార్యక్రమ నిబంధనల్లో ప్రతి ఓటరు తల్లిదండ్రుల వివరాలను మాత్రమే ఇవ్వాల్సి ఉంటుంది. ఆధార్ నెంబరు, పుట్టిన తేదీ తదితర వివరాలు తప్పనిసరికాదు. కానీ బీఎల్వోలు ప్రతి ఓటరు నుంచి ఆధార్ వివరాలు కూడా సేకరిస్తున్నారు. తమ ఎన్యూమరేషన్ ఫారాలలో ఆధార్ వివరాలు లేకుండా ఇస్తే తిరిగి ఆధార్ వివరాలు తీసుకురండి అంటూ బీఎల్వోలు ఒత్తిడి తెస్తున్నారని పలువురు ఓటర్లు చెబుతున్నారు. ప్రభుత్వ పెద్దల ఆదేశాల మేరకే అధికారులు ఆధార్ వివరాలు తప్పనిసరి అంటూ ఓటర్లను భయపెట్టి ఆ వివరాలు సేకరిస్తున్నారా అన్న అనుమానాలు రేకెత్తుతున్నాయి. సొంతంగా ఆన్లైన్లో ఎన్యూమరేషన్ వివరాలు నమోదు చేసుకోవడానికే ఆధార్ అవసరమవుతుంది. కానీ అలా ఆన్లైన్లో ఎన్యూమరేషన్ కావడం లేదని పలువురు చెబుతున్నారు. ఇంటి పేరు అసలు పేరు ముందు వెనకా తారుమారు కావడంతో ఆన్లైన్ కావడంలేదు. అలాగే ఆధార్‌తో ఫోన్ అనుసంధానం కాక, ఓటీపీ రాక ఆన్లైన్లో వివరాలు నమోదు కావడం లేదని అంటున్నారు.గడువు పొడిగింపు కోసం.. దాదాపు సగం మంది ఓటర్ల వివరాలు నమోదు ఇంకా జరగాల్సి ఉండడంతో కార్యక్రమం గడువు పొడిగించాలని బీఎల్వోలు డిమాండ్ చేస్తున్నారు. కొన్ని పోలింగ్ బూత్‌లలో 60 శాతం ప్రక్రియ పూర్తయినపటికీ... 25 శాతం కూడ పూర్తికాని బూత్‌లు ఒక్కో మండలంలో పదుల సంఖ్యలోనే ఉన్నట్టు తెలుస్తోంది. అద్దంకి నియోజకవర్గంలో శుక్రవారం నాటికి ఇంకా 25 శాతం ప్రక్రియ కూడ పూర్తి కాని పోలింగ్ బూత్‌లు 24 దాక ఉన్నట్టు అధికార వర్గాలు పేర్కొంటున్నాయి. ఈ కార్యక్రమాన్ని పొడిగించాల్సిందిగా జిల్లా కలెక్టరు ఆధ్వర్యంలో శుక్రవారం జరిగిన టెలికాన్ఫరెన్స్‌లో పలువురు అధికారులు కోరడం గమనార్హం. హడావుడిగా ఈ కార్యక్రమాన్ని ముగిస్తే లక్షలాది మంది ఓటును కోల్పోవాల్సి వస్తుందని వారు పేర్కొంటున్నారు. మమ అనిపించాలనే తొందర...‘సర్’ ప్రక్రియను పూర్తి చేయడానికి అధికారులు చేస్తున్న హడావిడి చూస్తుంటే తూతూమంత్రంలా మమ అనిపించేయాలన్నట్లే కనిపిస్తోందని పలువురు ఓటర్లు అభిప్రాయపడుతున్నారు. పై అధికారులు క్షేత్రస్థాయి సమస్యలతో సంబంధం లేకుండా ఏసీ గదుల్లో కూర్చొని కేవలం అక్కడ ఇంత శాతం అయ్యింది, వాళ్లు మొదటిస్థానంలో ఉన్నారు మీరు ఎందుకు వెనకున్నారని అడుగుతున్నారే కానీ వాస్తవ పరిస్థితులను పట్టించుకోవడం లేదని బీఎల్వోలు పేర్కొంటున్నారు. డిజిటలైజేషన్లో మేమంటే మేము ముందుండాలని జిల్లాలు పోటీ పడుతూ ఆయా కలెక్టర్లు కింది స్థాయి అధికారులపై ఒత్తిడి తీసుకువస్తున్నారని, తాము ఎదుర్కొంటున్న సమస్యల గురించి పట్టించుకోవడం లేదని వారంటున్నారు.పనులకు వెళ్లేటప్పుడు వస్తే ఎలా..? సవర కుడ్డబ గ్రామంలో సుమారు 56 పైచిలుకు ఓట్లు ఉన్నాయి. బీఎల్వో కనీసం సమాచారం ఇవ్వకుండా.. అందరూ పనులకు వెళ్లే సమయంలో గ్రామానికి వస్తే ఎలా. మేమే బాధ్యత తీసుకుని చదువుకున్న వారితో ఎన్యూమరేషన్ ఫారాలు నింపించాం. అయినా ఇప్పటికీ కొన్ని కుటుంబాలకు ఫారాలు ఇవ్వలేదు. – సవర వెంకటేశ్, సవర కుడ్డబ గ్రామం, శ్రీకాకుళం జిల్లావివరాలు నింపడానికి డబ్బులా? వివరాలు ఫారంలో నింపకపోతే ఓటు పోతుందని అధికారులు భయపెట్టారు. సచివాలయంలో వాళ్లు పెట్టిన ఓ వ్యక్తి తనవద్ద డబ్బులు వసూలు చేశాడు. నాకు చదువు రాదు. ఐదు దశాబ్దాలుగా ఓటు హక్కు వినియోగించుకుంటున్నా ఇపుడు నా ఓటును కాపాడుకోవడానికి డబ్బులివ్వాల్సి రావడం బాధనిపించింది. – వెంకటేశ్వరరావు, ఎనికేపాడు, కృష్ణా జిల్లా ఊళ్లో వివరాలు తెలియడం లేదు.. నాకు పెళ్లి అయినప్పటి నుంచి మా ఊళ్లోనే ఓటు ఉంది. ఓటరు ఐడీ కార్డు జీజీవీ 2596393. కానీ, మా అమ్మవాళ్ల వివరాలు కావాలంట. అమ్మానాన్న ఫొటోలు, ఆ జిల్లా, నియోజకవర్గం, మండలం, ఓటు వేసిన వార్డు నెంబరు ఇవ్వమంటున్నారు. మా అమ్మవాళ్లకి ఫోను చేసి అడిగితే వాళ్లు తెలియదంటున్నారు. ఎవరూ ఏమీ చెప్పడం లేదు. ఏమి చేయాలి మేం? – షేక్ సైదాబీ, పాతమాగులూరు, ప్రకాశం జిల్లా -
ఎన్యూమరేషన్ ఫారం 'లక్ష్యానికి దూరం'
సాక్షి, హైదరాబాద్: కేంద్ర ఎన్నికల సంఘం చేపట్టిన ఓటర్ల జాబితా ప్రత్యేక విస్తృత సవరణ (సర్)–2026లో భాగంగా ఎన్యూమరేషన్ ఫారాల పంపిణీ హైదరాబాద్, రంగారెడ్డి, మేడ్చల్–మల్కాజ్గిరి జిల్లాల్లో నత్తనడకన సాగుతోంది. రాష్ట్రంలో 3.38 కోట్ల మంది ఓటర్లు ఉండగా బుధవారం రాత్రి నాటికి 2.38 కోట్ల మంది ఓటర్లకు ఎన్యూమరేషన్ ఫారాల పంపిణీ జరిగింది. ఇందులో అత్యల్పంగా రంగారెడ్డి జిల్లాలో 32 శాతం, మేడ్చల్–మల్కాజ్గిరి జిల్లాలో 37 శాతం, హైదరాబాద్ జిల్లాలో 42 శాతం మంది ఓటర్లకే ఎన్యూమరేషన్ ఫారాలు అందాయి. సర్–2026 షెడ్యూల్ ప్రకారం గత నెల 24న ఎన్యూమరేషన్ ఫారాల పంపిణీని ప్రారంభించగా వారం రోజుల్లోగా పూర్తి చేయాలని పెట్టుకున్న లక్ష్యం నెరవేరలేదు. మరో 2, 3 రోజుల్లో గ్రామీణ జిల్లాల్లో ఫారాల పంపిణీ పూర్తికావచ్చని అధికారులు అంచనా వేస్తుండగా హైదరాబాద్, రంగారెడ్డి, మేడ్చల్–మల్కాజ్గిరి జిల్లాల విషయంలో మాత్రం ఏమీ చెప్పలేకపోతున్నారు. ఈ మూడు జిల్లాల్లో గరిష్టంగా 70 శాతానికి ఎన్యూమరేషన్ ఫారాల పంపిణీ జరిగే అవకాశం లేదని అంచనా వేశారు. రాష్ట్రంలోని 33.75 శాతం ఓటర్లు ఈ మూడు జిల్లాల్లోనే ఉండగా ఎన్యూమరేషన్ ఫారాల పంపిణీలో తీవ్రంగా వెనుకబడటం ఆందోళన కలిగిస్తోంది. ఓటర్ల మ్యాపింగ్‌లో సైతం ఈ మూడు జిల్లాలు అట్టడుగు స్థానంలో ఉన్నాయి. ఫారాలను నింపి ఈ నెల 24లోగా స్థానిక బీఎల్ఓలకు అందించే ఓటర్ల పేర్లనే ఈ నెల 31న ముసాయిదా ఓటర్ల జాబితాలో ప్రచురించనున్నారు. కానీ ప్రస్తుత పరిస్థితి చూస్తే ఈ మూడు జిల్లాల్లోనే లక్షల సంఖ్యలో ఓట్లు గల్లంతు కావొచ్చనే ఆందోళన వ్యక్తమవుతోంది. నిలకడ లేని ఓటర్లు... వలసల్లో భాగంగా తరచూ అద్దె ఇళ్లు మారడం, ఉద్యోగాల మార్పు, విద్యార్థులు, ఐటీ ఉద్యోగుల వలసలు, ఒకే వ్యక్తికి రెండు చోట్ల ఓట్లు కలిగి ఉండటం, ఇళ్లకు తాళాలు వేసి ఉండటం వంటి కారణాలతో హైదరాబాద్, రంగారెడ్డి, మేడ్చల్–మల్కాజ్గిరి జిల్లాల్లో ఓటర్ల ఆచూకీని బీఎల్ఓలు కనిపెట్టలేకపోతున్నారని అధికారులు తెలిపారు. ఒకవేళ బీఎల్ఓలు మూడుసార్లు ఇంటికి వెళ్లినా తాళం వేసి ఉంటే ఆ ఇంట్లోని ఓటర్ల ఫారాలను తలుపు వద్దే పెట్టి రావాలని బీఎల్ఓలకు జీహెచ్ఎంసీ సూచించడం పరిస్థితి తీవ్రతకు అద్దంపడుతోంది. రెండు రోజుల్లో డిజిటలైజేషన్ మరో రెండు రోజుల్లో ఎన్యూమరేషన్ ఫారాల పంపిణీ ప్రక్రియను ముగించి ఆ వెంటనే డిజిటలైజేషన్ ప్రక్రియను ఈసీ ప్రారంభించనుంది. బూత్ స్థాయి అధికారులు (బీఎల్ఓ) మళ్లీ ఓటర్ల ఇళ్లకు వెళ్లి వారు నింపిన ఫారాలను వెనక్కి తీసుకుని తమ మొబైల్ ఫోన్లోని ఈసీ యాప్ ద్వారా స్కాన్ చేసి అప్లోడ్ చేయనున్నారు. స్కాన్ చేసిన ఫారాల్లోని సమాచారాన్ని ఎప్పటికప్పుడు డేటా ఎంట్రీ చేయనున్నారు. ఈ నేపథ్యంలో ఫారాలను ఎలా నింపాలో ఓటర్లకు బీఎల్ఓలు అవగాహన కల్పిస్తారని అధికారులు పదేపదే పేర్కొంటుండగా బీఎల్‌ఓలలో అధిక శాతం మందికి ఫారాలను ఎలా నింపాలో తెలియడం లేదు. దీంతో వారికి మరోసారి శిక్షణ ఇవ్వాలని జిల్లా కలెక్టర్లకు సీఈఓ కార్యాలయం ఆదేశించింది. భాగ్యనగరంలో ఇళ్లకు రాని బీఎల్ఓలు.. హైదరాబాద్‌లో ఇంకా చాలా మందికి ఎన్యూమరేషన్ ఫారాలు అందలేదు. బీఎల్ఓలే ఇళ్లకు వచ్చి ఫారాలు ఇస్తారని ఓటర్లు ఎదురుచూస్తున్నారు. అయితే కొందరు బీఎల్ఓలు మాత్రం తమ వద్దకు వచి్చన ఓటర్లకే ఫారాలు పంపిణీ చేస్తున్నారన్న ఆరోపణలు వస్తున్నాయి. అలాగే మరికొందరు బీఎల్ఓలు రాజకీయ పార్టీల కార్యాలయాలు, నేతల ఇళ్ల వద్ద మకాం వేసి ఫారాలు పంపిణీ చేస్తున్నారని ఆరోపిస్తూ కొందరు వ్యక్తులు సామాజిక మాధ్యమాల్లో వీడియోలు పోస్ట్ చేయడం గమనార్హం. -
మీ ఓటుండాలంటే!
రాష్ట్రంలో ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ (సర్) ద్వారా ఇంటింటి సర్వే మొదలై పది రోజులు దాటింది. ఇప్పటికే బూత్ లెవెల్ ఆఫీసర్లు (బీఎల్వోలు) ఇంటింటికి తిరిగి 60 శాతం మంది ఓటర్లకు ఎన్యూమరేషన్ ఫారాలు పంపిణీ చేయడం పూర్తైంది. ఇప్పుడే కీలక అంకం మొదలు కానుంది. తీసుకున్న ఎన్యూమరేషన్ ఫారాలను పూర్తి చేసి తిరిగి ఇస్తేనే మీ ఓటు హక్కు కొనసాగుతుంది. ఇంకా ఎన్యూమరేషన్ ఫారాలు తీసుకోని వారు తక్షణం పూర్తి చేసి ఇవ్వాల్సి ఉంటుంది. ప్రస్తుతం రాష్ట్రంలో ‘సర్’ ప్రక్రియ జరుగుతున్న నేపథ్యంలో మీ ఓటు హక్కును కాపాడుకోవాలంటే ఏం చేయాలో చూద్దాం.. ఇది చాలా ముఖ్యంప్రతి ఒక్కరూ 2002 ఓటరు జాబితా చెక్ చేసుకోవాలి.. » జాబితాలో మీ పేరు ఉందో లేదో అన్నది https://voters.eci.gov.in వెబ్సైట్లో “సెర్చ్ యువర్ నేమ్ ఇన్ లాస్ట్ ఎస్ఐఆర్’ అనే ఆప్షన్‌ను క్లిక్ చేసుకోవడం ద్వారా తెలుసుకోవచ్చు. » 2002 ఓటరు జాబితాలో మీ పేరు ఉంటే ఎటువంటి అదనపు వివరాలూ బీఎల్వోకి ఇవ్వాల్సిన అవసరం ఉండదు. » మీకిచ్చిన ఎన్యూమరేషన్ ఫారంలో “గత ఎస్ఐఆర్ ఓటర్ల జాబితాలో ఓటరు వివరాలు’’ అనే కాలంలో వివరాలు పూర్తి చేస్తే సరిపోతుంది. » ఓటరు పేరు, ఓటరు గుర్తింపు కార్డు (అందుబాటులో ఉంటే ఇవ్వాలి. తప్పనిసరి కాదు) » బంధువు పేరు (తండ్రి లేదా తల్లి), జిల్లా, రాష్ట్రం, నియోజకవర్గం, బూత్ నెంబర్ వివరాలు ఇస్తే సరిపోతుంది. ధ్రువీకరణ కోసం ఈ పత్రాలలో ఏదో ఒకటి దగ్గర ఉంచుకోండి.. 1. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఇచ్చే ఉద్యోగి గుర్తింపు కార్డు లేదా పెన్షన్ గుర్తింపు కార్డు 2. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు లేదా స్థానిక సంస్థలు, బ్యాంకులు, పోస్టాఫీసులు, ఎల్ఐసీ, పబ్లిక్ సెక్టార్ యూనిట్లు జారీ చేసిన గుర్తింపు కార్డులు లేదా ధ్రువీకరణ పత్రాలు3. జనన ధ్రువీకరణ పత్రం 4. పాస్‌పోర్టు 5. విశ్వవిద్యాలయాలు లేదా సంబంధిత బోర్డులు జారీ చేసిన విద్యార్హత కార్డులు 6. సంబంధిత రాష్ట్రాలు జారీ చేసిన శాశ్వత నివాస ధ్రువీకరణ పత్రం 7. అటవీ హక్కులకు చెందిన పత్రం 8. సంబంధిత శాఖలు జారీ చేసిన ఓబీసీ, ఎస్సీ, ఎస్టీ కుల ధ్రువీకరణ పత్రాలు 9. నేషనల్ రిజిస్టర్ ఆఫ్ సిటిజన్స్ 10. రాష్ట్ర, స్థానిక అథార్టీలు జారీ చేసిన ఫ్యామిలీ రిజిస్టర్ 11. ప్రభుత్వం జారీ చేసిన భూమి, గృహ కేటాయింపుల సర్టిఫికెట్ 12. ఆధార్ కోసం 9.9.2025న కమిషన్జారీ చేసిన ఆదేశాలు2002 ఓటరు జాబితాలో పేరు లేకపోతే..» ప్రస్తుతం 40 ఏళ్లలోపు వయసు ఉన్న వారు ఎవరికీ 2002 ఓటరు జాబితాలో పేరు ఉండే అవకాశం లేదు. కాబట్టి వీరంతా తమ ఓటు హక్కును కాపాడుకోవాలంటే.. మీ తండ్రి లేదా తల్లి 2002లో ఎక్కడ ఓటు కలిగి ఉన్నారనే విషయాన్ని నిర్ధారించాల్సి ఉంటుంది. » ఇందుకోసం మీకిచ్చిన ఎన్యూమరేషన్ ఫారం రెండో కాలమ్‌లో “గత ఎస్‌ఆఐర్‌లో ముందు కాలమ్‌లో పేర్కొన్న బంధువు వివరాలు’’ పూర్తి చేయాల్సి ఉంటుంది. » ఇక్కడ తండ్రి పేరు, తండ్రి ఓటరు కార్డు నెంబరు, బంధువు పేరు అన్న చోట తాత పేరు, అలాగే మీ తండ్రి ఓటు హక్కు కలిగి ఉన్న నియోజకవర్గం, బూత్ నెంబర్ వివరాలు ఇవ్వాల్సి ఉంటుంది. ఒక వేళ ఈ పత్రాలు లేని ఓటర్లు రాష్ట్ర ప్రభుత్వం వారికి జారీ చేసిన ఇతర ధ్రువీకరణ పత్రాలను సైతం ఆధారంగా సమర్పించవచ్చు. అయితే ఆ పత్రాలను స్వీకరించాలా? తిరస్కరించాలా? అనే విషయంలో పూర్తి విచక్షణాధికారాన్ని ఈఆర్వోలకు ఈసీ కల్పించింది. వారిదే తుది నిర్ణయం కానుంది.బీఎల్ఓ మీ వద్దకు రాకపోతే..» మొత్తం ప్రక్రియలో బూత్ లెవెల్ ఆఫీసర్ (బీఎల్వో)దే కీలక పాత్ర. » ఇప్పటివరకు బీఎల్వో మీ ఇంటికి రాకపోతే తక్షణం వారిని సంప్రదించండి. » మీ బీఎల్వో ఎవరు? అనేది సులభంగా తెలుసుకోవచ్చు. » voters.eci.gov.in లేదా ‘ఈసీఐనెట్’ యాప్‌లో ‘నో యువర్ బీఎల్వో’ లేదా ‘బుక్ ఏ కాల్ విత్ బీఎల్వో’ ఆప్షన్ వినియోగించుకోవడం ద్వారా మీ బీఎల్వో పేరు, ఫోన్ నెంబరు లాంటి వివరాలు పొందవచ్చు. » ముఖ్యంగా పొరుగు రాష్ట్రాల్లో ఉన్నవారు, 2024 ఓటరు జాబితాలోని చిరునామా నుంచి ఇల్లు మారినవారు బీఎల్వోను సంప్రదించడం ద్వారా ఓటు హక్కును కాపాడుకోవచ్చు. ఒక ఫారం మీ దగ్గరే.. » ప్రతీ బీఎల్వో మీ ఫొటో వివరాలు ముద్రించిన రెండు ఎన్యూమరేషన్ ఫారాలు ఇస్తారు. » ఇందులో ఒక ఫారం మీ దగ్గర ఉంచుకొని ఇంకొకటి మీ బీఎల్వోకి ఇవ్వాలి. » ఎన్యూమరేషన్ ఫారం మీద మీ తాజా ఫొటో అంటించి ఫారం పూర్తి చేసి సంతకం చేసి ఇవ్వాలి. »ఒకవేళ మీ తరుఫున ఎవరైనా ఈ ఫారాలు అందచేస్తే ఆ ఓటరు మీకు ఏమవుతారు? అనే వివరాలను కూడా పేర్కొనాల్సి ఉంటుంది. » అలాగే ఎటువంటి తప్పుడు సమాచారాన్ని ఇవ్వడం లేదని, తప్పుడు సమాచారం ఇస్తే ఎలాంటి శిక్ష విధిస్తారనే వివరాలు మీకు తెలుసని ధ్రువీకరిస్తూ డిక్లరేషన్ కూడా ఇవ్వాలి. ఈ వివరాలు ఇవ్వండి » ఎన్యూమరేషన్ ఫారంలో ఈ వివరాలు అందరూ సమర్పించాలి. » ఓటరు పుట్టిన తేదీ, ఆధార్ కార్డు నెంబరు (ఇది ఐచ్ఛికం), మొబైల్ నెంబర్, తండ్రి పేరు, తండ్రి లేదా సంరక్షకుడి ఓటరు గుర్తింపు కార్డు నెంబరు (అందుబాటులో ఉంటే), తల్లి పేరు, తల్లి ఓటరుకార్డు (అందుబాటులో ఉంటే), జీవిత భాగస్వామి (వర్తిస్తేనే) పేరు, జీవిత భాగస్వామి ఓటరు కార్డు నెంబరు (అందుబాటులో ఉంటేనే) ఇవ్వాల్సి ఉంటుంది. ఆన్లైన్లో కూడా ఇవ్వొచ్చు.. » వేరే ప్రాంతాల్లో నివసించే వారు కూడా సొంతంగా ఆన్లైన్ ద్వారా ఎన్యూమరేషన్ ఫారాన్ని సమర్పించే వీలుంది. » ఇందుకోసం ‘ఈసీఐనెట్’ యాప్‌లో ప్రత్యేకంగా సౌకర్యాన్ని అందుబాటులోకి తెచ్చారు. » ‘ఈ – సైన్’ ద్వారా ఫారంను ఆన్లైన్లో సమర్పించేందుకు మొబైల్ నంబర్ తప్పనిసరిగా ఓటర్ గుర్తింపు కార్డుతో అనుసంధానించి ఉండాలి. » గుర్తింపు కార్డుపై ఉన్న ఓటరు పేరు స్పెల్లింగ్, ఓటరు ఆధార్ కార్డుతో కచ్చితంగా సరిపోవాలి. » ఏదైనా వ్యత్యాసం ఉంటే డిజిటల్ ఈ – సైన్ విఫలం అవుతుంది. » అలాంటప్పుడు ఓటర్ తన బూత్ లెవల్ ఆఫీసర్ ద్వారా ఫిజికల్‌గా ఫారం సమర్పించాల్సి ఉంటుంది. ముసాయిదా జాబితా సరి చూసుకోవడం తప్పనిసరి.. » ఇంటింటి సర్వే పూర్తయిన తర్వాత జూలై 21న ముసాయిదా ఓటర్ల జాబితాను ప్రకటిస్తారు. » ప్రతీ బీఎల్వో దగ్గర అది అందుబాటులో ఉంటుంది. లేకపోతే http://www. ceoandhra.ap.gov.in/ నుంచి డౌన్లోడ్ చేసి కూడా చూసుకోవచ్చు. » ముసాయిదా జాబితాలో మీ ఓటు ఉందో లేదో ప్రతీ ఒక్కరు విధిగా సరి చూసుకోవాలి. ఇదే అత్యంత కీలకం. » ఒకవేళ ఆ జాబితాలో మీ పేరు లేకపోతే వెంటనే అభ్యంతరం వ్యక్తం చేయాలి. కేవలం ఆగస్టు 20 వరకు మాత్రమే అభ్యంతరాలను స్వీకరిస్తారు. » సెప్టెంబర్ 18లోగా అభ్యంతరాలను పరిష్కరించి సెప్టెంబర్ 22న తుది ఓటర్ల జాబితా విడుదల చేస్తారు. » అభ్యంతరాలను తెలిపేందుకు మూడు రకాల ఫారాలు అందుబాటులో ఉంటాయి. జూలై 1లోగా 18 ఏళ్లు నిండి ఇంకా ఓటరుగా నమోదు కాకపోతే ఫారం 6 ద్వారా కొత్త ఓటరుగా నమోదు చేసుకోవచ్చు. » చనిపోయిన లేదా వలస వెళ్లిన వారి ఓట్లు తొలగించడానికి ఫారం 7 వాడాలి. » జాబితాలో ఓటు లేకున్నా లేకపోతే వేరే చోటకి ఓటు బదలాయించాలన్నా, తప్పులున్నా ఫారం 8 ఉపయోగించాలి. నోటీసులు ఎవరికి ఇస్తారు?» ముసాయిదా ఓటర్ల జాబితాలో పేరు వచ్చినప్పటికీ, 2002 ఓటర్ల జాబితాతో మ్యాపింగ్‌లో పాక్షిక తేడాలను గుర్తించిన ఓటర్లతో పాటు 2002 ఓటర్ల జాబితాతో తమతో పాటు తమ బంధువుల పేర్లు లేని ఓటర్లకు ఈఆర్వోలు నోటీసులు ఇస్తారు. » నిర్దేశిత తేదీకి విచారణకు హాజరై వీరు ఎన్నికల సంఘం నిర్దేశించిన 12 రకాల పత్రాల్లో ఏదో ఒక పత్రాన్ని తమ/తమ తల్లిందండ్రుల పుట్టిన తేదీ/పుట్టిన ప్రాంతం ధ్రువీకరణగా ఇవ్వాల్సి ఉంటుంది. నోటీసు ఇస్తే రుజువు చేసుకోవాల్సిందే..» నోటీసు అందుకున్న ఓటర్లు తమ/తల్లిదండ్రుల పుట్టిన తేదీ/పుట్టిన ప్రాంతాన్ని రుజువు చేయడానికి ఈసీ నిర్దేశించిన 12 రకాల ధ్రువీకరణ పత్రాల్లో ఏదో ఒకదానిని రుజువుగా ఈఆర్వోలు/ఏఈఆర్వోల వద్ద విచారణకు హాజరై సమర్పించాల్సి ఉంటుంది. » 1987 జూలై 1కి ముందు పుట్టిన ఓటర్లు తమ పుట్టిన తేదీ/ పుట్టిన ప్రాంతం ధ్రువీకరణ పత్రం సమర్పిస్తే సరిపోతుంది. » 1987 జూలై 1 నుంచి 2004 డిసెంబర్ 2 మధ్య పుట్టిన ఓటర్లు తమతో పాటు తమ తల్లి లేదా తండ్రికి సంబంధించిన పుట్టిన తేదీ/పుట్టిన ప్రాంతం ధ్రువీకరణ పత్రాలను సమర్పించాల్సి ఉంటుంది. 2002 డిసెంబర్ 2 తర్వాత పుట్టిన ఓటర్లు తమతో పాటు తమ తల్లిదండ్రులిద్దరి పుట్టిన తేదీ/ పుట్టిన ప్రాంతం ధ్రువీకరణ పత్రాలను సమర్పించాల్సి ఉంటుంది. అజాగ్రత్తగా ఉంటే ఓటు హుళక్కే..» ఎన్యూమరేషన్ ఫారం అందుకున్నప్పటి నుంచి తుది జాబితా ప్రచురించే సెప్టెంబర్ 22 వరకు అప్రమత్తంగా ఉండాల్సిందే. » ప్రస్తుతం రాష్ట్రంలో 4,16,27,694 మంది ఓటర్లు ఉండగా డూప్లికేట్, మరణించిన, వలస వెళ్లిన వారి ఓట్లు పెద్ద ఎత్తున ఉన్నట్లు ప్రచారం జరుగుతోంది. ఆ పేరుతో నిజమైన ఓట్లను తొలగించే ప్రమాదం పొంచి ఉంది. » ప్రస్తుతం చేపట్టిన సర్వే ద్వారా మరణించిన వారి పేర్లను, వలస వెళ్లి ఆచూకీ తెలియని వారి పేర్లను ఓటర్ల జాబితా నుంచి తొలగిస్తారు. » ఒకటి కంటే ఎక్కువ చోట్ల ఓటర్లుగా నమోదైన వారు ఎక్కడ కోరుకుంటే అక్కడ ఓటు హక్కు ఉంచి మిగిలిన చోట్ల తొలగిస్తారు. ఎన్యూమరేషన్ ఫారాలు ఇవ్వని వారు తమ ఓటు హక్కును కోల్పోతారు. 2002 ఓటర్ల జాబితాలో లేని వారు నిర్దేశించిన 12 ధ్రువీకరణ పత్రాల్లో ఏదో ఒకటి సమర్పించకుంటే వారు కూడా ఓటు హక్కు కోల్పోతారు. -
ఎన్యూమరేషన్లో 'సర్'దర్ద్!
సాక్షి, హైదరాబాద్: ఓటర్ల జాబితా ప్రత్యేక విస్తృత సవరణ (సర్) – 2026 కార్యక్రమంలో భాగంగా ఈ నెల 25 నుంచి ఓటర్లకు ఎన్యూమరేషన్ ఫారాలను పంపిణీ చేయాల్సి ఉండగా, వాటి ప్రచురణ విషయంలో తీవ్ర గందరగోళం నెలకొంది. రాష్ట్రంలోని 119 శాసనసభ నియోజకవర్గాల పరిధిలో మొత్తం 3,38,26,448 మంది ఓటర్లుండగా, ప్రతి ఓటరుకు సంబంధించిన పాక్షిక సమా చారంతో ఒక జత ఎన్యూమరేషన్ ఫారాల ప్రచురణను ఈ నెల 15 నుంచే ప్రారంభించాల్సి ఉంది. హైదరాబాద్‌లో దక్కనీ ఉర్దూ తోపాటు హిందీ, గుజరాతీ, రాజస్తానీ, మరాఠీ, బెంగాళీ, కన్నడ, తమిళం వంటి భాషలు మాట్లాడే ఓటర్లు లక్షల సంఖ్యలో ఉన్నా రు. రాష్ట్రంలోని ఓటర్లందరికీ పంపిణీ చేసే ఎన్యూమరేషన్ ఫారా లను ఏకరూపంగా కేవలం తెలుగులోనే ముద్రించాలని ఎన్నికల సంఘం (ఈసీ) ఆదేశించడంతో తెలుగు రాని ఓటర్లు ఇక్కట్లకు గురికానున్నట్టు రాజకీయ పార్టీలు తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి. ఎంఐఎం అధినేత, ఎంపీ అసదుద్దీన్ ఒవైసీతోపాటు ఇతర పార్టీల నేతలు ఇటీవల రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి (సీఈఓ)ని కలిసి జంట నగరాల ఓటర్ల ఎన్యూమరేషన్ ఫారాలను తెలుగుతోపాటు ఆంగ్ల భాషలో సైతం ప్రచురించాలని కోరారు. దీనిపై ఈసీ నిర్ణయం కోసం ఎదురుచూస్తున్నట్టు సీఈఓ కార్యాలయ వర్గాలు తెలిపాయి. వారం గడిచినా, ఈసీ నుంచి స్పందన రాలేదు. దీంతో బుధవారం సైతం వివిధ పార్టీల ప్రతినిధులు జీహెచ్ఎంసీ కమిషనర్ ఆర్వీ కర్ణన్‌కు కలిసి ఆంగ్లంలోనూ ఫారాలను ప్రచురించాలని విజ్ఞప్తి చేశారు. జిల్లా కలెక్టర్లందరికీ స్థానిక ఓటర్ల వివరాలతో ప్రచురణకు అవసరమైన డేటాను పంపించగా, తెలుగులో మాత్రమే ప్రస్తుతం ఎన్యూమరేషన్ ఫారాలను ప్రచురిస్తున్నామని అధికా రులు తెలిపారు. ఈసీ నుంచి అనుమతి వస్తే అవసరమైన చోట పంపిణీ చేసేందుకు ఆంగ్లంలో సైతం ముద్రిస్తామని ఓ అధికారి తెలిపారు.సరైన సమాచారం భర్తీ కీలకంఎన్యూమరేషన్ ఫారంలో ఓటరు పేరు, ఎపిక్ నంబర్, సీరి యల్ నంబర్, పార్ట్ నంబర్, అసెంబ్లీ/పార్లమెంట్ నియోజక వర్గ పేరుతోపాటు పాత ఫొటోను ముద్రి స్తారు. మిగిలిన వివరాలను ఓటరు పూరించాలి. సర్–2002 ఓటర్ల జాబితా ప్రకారం..ఓటరుతోపాటు అతడి బంధువు పేరు, ఎపిక్ నంబ ర్, బంధుత్వం, జిల్లా, రాష్ట్రం, అసెంబ్లీ నియోజకవర్గం నంబ ర్, పార్ట్ నంబర్, సీరియల్ నంబర్ వంటి వివరాలతోపాటు ఓటరు పుట్టిన తేదీ, ఆధార్ నంబర్ (ఐచ్ఛికం), మొబైల్ నంబర్, తండ్రి/సంరక్షకుడి పేరు, ఎపిక్ నంబర్, తల్లి పేరు, తల్లి ఎపిక్ నంబర్, జీవిత భాగ స్వామి పేరు, ఎపిక్ నంబర్ వంటి వివరాలను ఓటరు భర్తీ చేయా ల్సి ఉంటుంది. బీఎల్ఓలు వివరించినా ఎన్యూమరేషన్ ఫారంలోని భాష అర్థం కాక తప్పుడు సమాచారాన్ని భర్తీ చేస్తే, ఓటర్ల మ్యాపింగ్ సాఫ్ట్వేర్ తేడాలను గుర్తించి అనుమానిత ఓటర్ల జా బితాలో చేర్చే ప్రమాదం ఉంటుంది. జూలై 31న ముసాయిదా ఓటర్ల జాబితాను ప్రచురిస్తారు. అయితే, ఎన్యూమరేషన్ ఫారా న్ని తప్పుడు సమాచారంతో భర్తీ చేసిన వారిని గుర్తించి జూలై 31 నుంచి సెప్టెంబర్ 28 మధ్య స్థానిక ఎలక్టోరల్ రిజిస్ట్రేషన్ అధికారులు నోటీ సులు జారీ చేసి వివరణ కోరనున్నారు. విచారణకు హాజరై ఈసీ నిర్దేశించిన 13 రకాల ధ్రువీకరణ పత్రాలను రుజువుగా సమర్పించాల్సి ఉంటుంది. ఈప్ర క్రియ లో ఎక్క డ తేడా వచ్చినా అక్టోబర్ 1న ప్రచురించే సర్– 2026 తుది ఓటర్ల జాబితాలో పేరు గల్లంతయ్యే ప్రమాదముంది. -
సెల్ఫ్ ఎన్యుమరేషన్ @ 5.14 లక్షల మంది
సాక్షి, హైదరాబాద్: జనగణన ప్రక్రియలో భాగంగా చేపట్టిన సెల్ఫ్ ఎన్యుమరేషన్‌కు రాష్ట్రంలో మంచి స్పందన లభించిందని డైరెక్టరేట్ ఆఫ్ సెన్సెస్ విభాగం సంచాలకులు భారతి హోలికేరీ స్పష్టం చేశారు. తొలిరోజు సాంకేతిక కారణాలతో కాస్త ఇబ్బందులు ఎదురైనా, ఆ తర్వాత ఈ ప్రక్రియ సులభతరంగా జరిగిందన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా 5.14 లక్షల మంది సెల్ఫ్ ఎన్యుమరేషన్ చేసుకున్నట్టు ఆమె వెల్లడించారు. ఏప్రిల్ 26 నుంచి మే 10వ తేదీ వరకు సెల్ఫ్ ఎన్యుమరేషన్ జరిగిందని, మే 11 నుంచి హౌస్ లిస్టింగ్ ఆపరేషన్ (హెచ్ఎల్ఓ) ప్రక్రియ ప్రారంభమైందన్నారు. హౌస్ లిస్టింగ్ బ్లాక్ (హెచ్ఎల్బీ) మ్యాపింగ్ ప్రక్రియపై చార్జ్ ఆఫీసర్లు, సూపర్వైజర్లు, ఎన్యుమరేటర్లకు అవగాహన కల్పించినట్టు వెల్లడించారు. దీంతో రాష్ట్రంలో హెచ్ఎల్ఓ ఆపరేషన్ ప్రక్రియ జీహెచ్ఎంసీ, ఇతర ప్రధాన మున్సిపల్ కార్పొరేషన్లలోని కొన్నిచోట్ల ఆలస్యమైందన్నారు. రాష్ట్రంలో 79,200 హెచ్ఎల్బీలున్నాయని... తొలుత 75 వేల హెచ్ఎల్బీలుంటాయని అంచనా వేశామని, కానీ జనాభా పెరుగుదలతో ఈ సంఖ్య పెరిగిందని చెప్పారు. ప్రస్తుతం రాష్ట్రంలో జరుగుతున్న హెచ్ఎల్ఓ ప్రక్రియకు సంబంధించిన వివరాలు ‘సాక్షి’కి వివరించారు. పూర్తి వివరాలు ఆమె మాటల్లోనే... రెండు రోజుల్లో మ్యాపింగ్ పూర్తి... .సెన్సెస్ తొలివిడతలో భాగంగా హెచ్ఎల్ఓ ప్రక్రియలో హౌస్ లిస్టింగ్ బ్లాక్ మ్యాపింగ్ కీలకం. ముందుగా మ్యాపింగ్ చేస్తేనే... ఆ తర్వాత డోర్ టు డోర్ సర్వే సులభతరమవుతుంది. ఈ నెల 11వ తేదీన ఈ ప్రక్రియ ప్రారంభమైంది. గ్రామీణ ప్రాంతాల్లో మ్యాపింగ్ కాగా, జీహెచ్ఎంసీ, మున్సిపల్ కార్పొరేషన్ల పరిధిలో బ్లాక్‌ల ఎంపిక కాస్త ఆలస్యమైంది. దాదాపు 6 వేల బ్లాక్‌లు మినహాయిస్తే, ఇతర ప్రాంతమంతా దాదాపు పూర్తయింది. అక్కడ నంబరింగ్తోపాటు ఆన్లైన్ ఎంట్రీ కూడా ప్రారంభమైంది. అవగాహనే కీలకం... ప్రభుత్వాలు చేపట్టే సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలకు జనగణన వివరాలే కీలకం. ఇంటింటికి వెళ్లినప్పుడు ఎన్యుమరేటర్లు కూడా అవగాహన కల్పించి వారి నుంచి సమగ్ర వివరాలు సేకరిస్తున్నారు. జీహెచ్ఎంసీలోని కొన్ని ప్రాంతాలు మినహాయిస్తే అంతటా ఈ ప్రక్రియ సాఫీగా సాగుతోంది. ఈ వివరాలు అత్యంత గోప్యంగా ఉంచుతాం. వ్యక్తిగత వివరాలు రాష్ట్ర ప్రభుత్వాలకు కూడా అందవు. సరైన వివరాలు ఇవ్వాలి. జనగణనకు వివరాలు సమర్పిస్తే సంక్షేమ పథకాల్లో ఇబ్బందులు కలుగుతాయనేది అపోహ మాత్రమే. బదిలీల నుంచి మినహాయింపు... రాష్ట్ర ప్రభుత్వ శాఖల్లో ఉద్యోగుల బదిలీలకు ప్రభుత్వం అవకాశం కల్పించింది. కానీ సెన్సెస్ విధుల్లో ఉన్న ఉద్యోగులకు మాత్రం బదిలీల నుంచి మినహాయింపు ఇవ్వాలని సూచించాం. ఈ అంశంపై కొన్ని ఫిర్యాదులు కూడా వస్తున్నాయి. నిర్ణీత గడువు ముగియడంతో తప్పనిసరి బదిలీల కేటగిరీల్లోని ఉద్యోగులకు మినహాయింపు ఇవ్వొద్దని వినతులు అందుతున్నాయి. ఈ అంశంపై ప్రభుత్వం నిర్ణయం తీసుకుంటుంది. ఎన్యుమరేటర్లకు భద్రత... కొన్ని ప్రాంతాల్లో ఇళ్లలోకి వెళ్లేందుకు ఎన్యుమరేటర్లు ఇబ్బంది పడుతున్నారు. ఫామ్‌హౌస్‌లు కూడా జనగణనలో భాగమే. వాటిల్లోకి వెళ్లేటప్పుడు ఎన్యుమరేటర్తోపాటు స్థానిక పంచాయతీ లేదా మున్సిపల్ సిబ్బందిని తోడుగా పంపిస్తున్నాం. ఇందుకు సంబంధించి ముందస్తుగా స్థానిక సంస్థల అధికారులకు సమాచారం ఇవ్వాలి. కొందరు సిబ్బంది సెన్సెస్ విధుల్లో రిపోర్టు చేయలేదనే సమాచారం ఉంది. రిజర్వ్‌లో ఉన్నా, తప్పకుండా విధుల్లో చేరాలి. లేకుంటే వారిపై సెన్సెస్ యాక్టు ప్రకారం కఠిన చర్యలు తీసుకుంటాం. -
‘ఎన్యూమరేషన్’ ఇస్తేనే ఓటు!
సాక్షి, హైదరాబాద్: ఓటర్ల జాబితా విస్తృత సవరణ (స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్/సర్)–2026 కార్యక్రమంలో భాగంగా ఎన్యూమరేషన్ ఫారాన్ని బూత్ లెవల్ అధికారుల(బీఎల్ఓ)కు ఇవ్వని ఓటర్ల పేర్లను ముసాయిదా జాబితాలో తొలగిస్తారని రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి (సీఈఓ) సి.సుదర్శన్‌రెడ్డి చెప్పారు. బీఎల్ఓలు ఇంటింటికీ తిరిగి ప్రతి ఓటరుకు 2 ప్రతుల ఎన్యూమరేషన్ ఫారాన్ని అందజేస్తారని తెలిపారు. ఇళ్లకు తాళం వేసి ఉంటే బీఎల్ఓలు కనీస పర్యాయాలు ఆ ఇళ్లకు వెళ్లి ఎన్యూమరేషన్ ఫారం ఇస్తారని స్పష్టం చేశారు. ఓటర్లకు సంబంధించిన పాక్షిక సమాచారంతో ఈ ఫారాలను ముందే ముద్రిస్తారన్నారు. మిగిలిన సమాచారాన్ని ఓటర్లు పూరించి ఒక ఫారం ప్రతిని తిరిగి బీఎల్ఓలకు జూలై 24లోగా అందజేయాల్సి ఉంటుందని చెప్పారు. ఈ దశలో ఎలాంటి ధ్రువీకరణ పత్రాలు సమర్పించాల్సిన అవసరం ఉండదన్నారు. కేంద్ర ఎన్నికల సంఘం వెబ్సైట్ (https://voters.eci.gov. in) ద్వారా కూడా ఎన్యూమరేషన్ ఫారాన్ని భర్తీ చేసి సమర్పించవచ్చని తెలిపారు. త్వరలో రాష్ట్రంలో ప్రారంభం కానున్న ‘సర్–2026’ కార్యక్రమంపై శనివారం తన కార్యాలయంలో ఆయన విలేకరులతో మాట్లాడారు. ముసాయిదాలో ఈ ఓటర్ల తొలగింపు ‘అందుబాటులో లేని/ వలసవెళ్లిన/చనిపోయిన(అబ్సెంటీ, షిఫ్టెడ్, డెడ్) ఓటర్లను ముసాయిదా జాబితాలో తొలగిస్తారు. ఆయా కారణాలతో ఎన్యూమరేషన్ ఫారం ఇవ్వలేకపోయిన ఓటర్ల జాబితాలను స్థానిక పోలింగ్ బూత్ వద్ద ప్రదర్శిస్తారు. ప్రస్తుతం రాష్ట్రంలో 1,68,18,902 పురుష, 1,71,02,883 మహిళా, 2,879 ట్రాన్స్‌జెండర్ ఓటర్లు కలిపి మొత్తం 3,39,24,664 మంది ఓటర్లున్నారు. వీరిలో 2,18,39,741 మంది (64.38శాతం) ఓటర్లను సర్–2002 జాబితా మేరకు మ్యాపింగ్ పూర్తి చేశాం. ముసాయిదాలో ఉన్నా మ్యాపింగ్ కాకపోతే కష్టమే ముసాయిదా ఓటర్ల జాబితాలో స్థానం పొందినప్పటికీ సర్–2002 జాబితాతో మ్యాపింగ్ కాలేకపోయినా, ఒక వేళ మ్యాపింగ్ జరిగినప్పటికీ పేర్లు, ఇతర వివరాల్లో వ్యత్యాసాలు ఉన్నా.. వారిని జూలై 31 –సెప్టెంబర్ 28 మధ్య కాలంలో నోటీసులిచ్చి విచారణకు పిలుస్తారు. ఇలా నోటీసులు అందుకునే ఓటర్ల జాబితాలను ఓటర్ రిజిస్ట్రేషన్ ఆఫీసర్ (ఈఆర్వో)లు ప్రచురిస్తారు. ఈసీ నిర్దేశించిన 12 రకాల ధ్రువీకరణ పత్రాల్లో ఏదో ఒక పత్రాన్ని తమ పుట్టిన తేదీ/పుట్టిన ప్రాంతం రుజువుగా విచారణ సమయంలో సమర్పించాల్సి ఉంటుంది. ఆధార్‌కార్డును ఓటరు గుర్తింపు నిర్థారణకు అనుమతిస్తారు..’అని సీఈఓ వివరించారు. వివరాల్లో వ్యత్యాసాలుంటే ఎదురయ్యే పరిస్థితులపై సీఈఓ ఒక ఉదాహరణ తెలిపారు. సర్–2002 ఓటర్ల జాబితాలో తన తండ్రి పేరు ‘నారాయణ’గా ఉండగా, ప్రస్తుత జాబితాలో ‘సి.నారాయణ’గా ఉండడంతో తాను సైతం విచారణకు హాజరై ‘మా నాన్న నారాయణే’అని రుజువులు ఇవ్వాల్సి ఉందని చెప్పారు. ముసాయిదా జాబితాపై అభ్యంతరాలు/దరఖాస్తులను జూలై 31–ఆగస్టు 30 మధ్య స్వీకరించి పరిష్కరిస్తామని తెలిపారు. జూలై 31–సెప్టెంబర్ 28 మధ్య నోటీసుల జారీ/విచారణ ప్రక్రియ పూర్తి చేస్తామన్నారు. అక్టోబర్ 1న తుది ఓటర్ల జాబితాను ప్రకటిస్తామన్నారు. పుట్టిన తేదీ/ప్రాంతం రుజువు చేసుకోవాల్సిందే.. నోటీసు అందుకున్న ఓటర్లు తమ/తల్లిదండ్రుల పుట్టిన తేదీ/పుట్టిన ప్రాంతాన్ని రుజువు చేయడానికి ఈసీ నిర్దేశించిన 12 రకాల ధ్రువీకరణ పత్రాల్లో ఏదో ఒకదానిని రుజువుగా ఈఆర్వోలు/ఏఈఆర్వోల వద్ద విచారణకు హాజరై సమర్పించాల్సి ఉంటుంది. – 1987 జూలై 1కి ముందు పుట్టిన ఓటర్లు తమ పుట్టిన తేదీ/పుట్టిన ప్రాంతం ధ్రువీకరణ పత్రం సమర్పిస్తే సరిపోతుంది. – 1987 జూలై 1 నుంచి 2004 డిసెంబర్ 2 మధ్య పుట్టిన ఓటర్లు తమతో పాటు తమ తల్లి లేదా తండ్రికి సంబంధించిన పుట్టిన తేదీ/పుట్టిన ప్రాంతం ధ్రువీకరణ పత్రాలను సమర్పించాల్సి ఉంటుంది. – 2002 డిసెంబర్ 2 తర్వాత పుట్టిన ఓటర్లు తమతో పాటు తమ తల్లిదండ్రులిద్దరి పుట్టిన తేదీ/పుట్టిన ప్రాంతం ధ్రువీకరణ పత్రాలను సమర్పించాల్సి ఉంటుంది. ఆధారంగా ఎన్నికల సంఘం నిర్దేశించిన పత్రాలు – కేంద్ర/రాష్ట్ర ప్రభుత్వం/ ప్రభుత్వ రంగ సంస్థలో ఉద్యోగి లేదా పెన్షనర్‌కు జారీ చేసిన గుర్తింపు కార్డు లేదా పెన్షన్ పేమెంట్ ఆర్డర్ – 01.07.1987కు ముందు ప్రభుత్వం/స్థానిక సంస్థలు/బ్యాంకులు/పోస్ట్ ఆఫీస్/ఎల్ఐసీ/ ప్రభుత్వ రంగ సంస్థల ద్వారా జారీ చేసిన గుర్తింపు పత్రాలు – జనన ధ్రువీకరణ పత్రం – పాస్‌పోర్ట్ – గుర్తింపు పొందిన బోర్డులు/విశ్వవిద్యాలయాలు జారీ చేసిన విద్యా సర్టిఫికెట్లు – శాశ్వత నివాస సరి్టఫికెట్ – అడవి హక్కుల సర్టిఫికెట్ – ఓబీసీ/ఎస్సీ/ఎస్టీ లేదా ఇతర కుల ధ్రువీకరణ పత్రం – జాతీయ పౌరుల రిజిస్టర్ (అందుబాటులో ఉన్న చోట్ల) – రాష్ట్ర/స్థానిక సంస్థలు తయారు చేసిన కుటుంబ రిజిస్టర్ – ప్రభుత్వం జారీ చేసిన భూమి/ఇంటి కేటాయింపు పత్రం – ఆధార్ కార్డు (09.09.2025 నాటి ఈసీ సూచనలు వర్తిస్తాయి) -
పంట ‘కోత’లు!
అర ఎకరా పొలంలో వరి సాగు చేశా. ఈసారి పంట బాగా పండడంతో సంతోషపడ్డాం. ఇంతలో తుపాను వచ్చి పంట మొత్తాన్ని తుడిచిపెట్టేసింది. పొలాన్ని చూస్తే ఏడుపొస్తోంది. వైఎస్సార్సీపీ ప్రభుత్వ హయాంలో పంట నష్టపోతే రూ.18 వేల వరకు పరిహారం అందింది. చంద్రబాబు ప్రభుత్వం ఇన్సూరెన్స్ ప్రీమియం కట్టలేదంట. పరిహారం వస్తుందో, లేదో తెలియట్లేదు. వైఎస్ జగన్ సకాలంలో విత్తనాలు, ఎరువులు, రైతు భరోసా ఇచ్చి ఆదుకుంటే.. ఈ ప్రభుత్వం రైతుల్ని అసలు పట్టించుకోవడం లేదు. – డి.గురుమూర్తి, గిరిజన రైతు, కొత్తవలస, అల్లూరి సీతారామరాజు జిల్లాపరిహారం ఇస్తారో.. లేదో!పక్కాగా ఈ–క్రాప్ నమోదు చేస్తే వైపరీత్యాల వేళ పంట నష్టపరిహారం, బీమా సాయం రైతులు ఎక్కడ అడుగుతారోననే భయంతోనే..! ఉద్దేశపూర్వకంగానే ఈ–క్రాప్‌ను నిర్వీర్యం చేస్తున్న కూటమి ప్రభుత్వంఈ చిత్రంలో కనిపిస్తున్న రైతు పేరు బసిరెడ్డి జగన్మోహన్రెడ్డి. ప్రకాశం జిల్లా పొదిలి మండలం కంభాలపాడు స్వగ్రామం. దాదాపు రూ.10 లక్షలు అప్పు తెచ్చి సొంత పొలం 30 ఎకరాలు, కౌలుకు మరో 30 ఎకరాలు సాగు చేశాడు. పొగాకు 15 ఎకరాలు, కంది 30 ఎకరాలు, బొబ్బర్లు 12 ఎకరాలు, వరి 3 ఎకరాల్లో సాగు చేశాడు. వారం రోజులుగా కురిసిన వర్షాలకు పొలంలో నీరు నిలిచి ఆశలు నీటి పాలయ్యాయి. పెట్టుబడులు కూడా దక్కని పరిస్థితులు నెలకొన్నాయి. వైఎస్సార్ సీపీ హయాంలో పంట నష్ట పరిహారం కింద ఆ కుటుంబానికి దాదాపు రూ.7 లక్షలు అందాయి. కూటమి ప్రభుత్వం వచ్చాక రైతులే ప్రీమియం చెల్లించాలని చెప్పడంతో సమయానికి డబ్బులు లేక పంటల బీమా చేయలేదు. ఈ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయానికి రైతు పూర్తిగా నష్టపోయారు. సాక్షి, అమరావతి: ఈ–క్రాప్ నమోదులో టీడీపీ కూటమి సర్కారు నిర్లక్ష్యం అన్నదాతల పాలిట పెను శాపంగా మారింది. ఈ–క్రాప్ పక్కాగా, పారదర్శకంగా నమోదు చేస్తే వైపరీత్యాల వేళ పంట నష్టపరిహారం, పంటల బీమా సాయం ఇవ్వాలని రైతులు ఎక్కడ నిలదీస్తారోననే భయంతో ఏకంగా ఈ ప్రక్రియనే నిర్వీర్యం చేస్తోంది. గత ప్రభుత్వ హయాంలో ఐదేళ్లపాటు అత్యంత పారదర్శకంగా, ప్రతిష్టాత్మకంగా నిర్వహించిన ఈ–క్రాప్ నమోదు ప్రక్రియను చంద్రబాబు సర్కారు మొక్కుబడి తంతుగా, తూతూ మంత్రంగా మార్చింది. అధికారంలోకి వచ్చింది మొదలు వైఎస్ జగన్ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అమలు చేసిన ఈ–క్రాప్‌ను నీరుగార్చడమే లక్ష్యంగా సాగుతున్న కూటమి ప్రభుత్వం అన్నదాతల జీవితాలతో చెలగాటమాడుతోంది. ఈ పంట నమోదు పారదర్శకంగా చేపట్టకపోవడం వల్ల పంట నష్టపరిహారం, బీమా సాయం అందే పరిస్థితి లేకుండా పోయిందని, పంట ఉత్పత్తులను అమ్ముకునే దారి కానరావడం లేదని మోంథా తుపానుతో పంటలు దెబ్బతిన్న రైతులు ఆక్రోశిస్తున్నారు. మరోవైపు పంట నష్టం అంచనాల కోసం చేపట్టిన ఎన్యుమరేషన్ ప్రక్రియ కూడా అస్తవ్యస్తంగా తయారైంది. టీడీపీ నేతల సిఫార్సులతో.. వారి ఇళ్ల వద్దే జాబితాలు తయారు చేస్తూ నష్టపోయిన రైతుల నోట్లో సర్కారు మట్టి కొడుతోంది! ఈ–క్రాప్ నిర్వీర్యం.. వైఎస్సార్సీపీ హయాంలో ఏపీలో పారదర్శకంగా అమలు చేసిన ఈ–క్రాప్ స్ఫూర్తితో కేంద్ర ప్రభుత్వం జాతీయ స్థాయిలో డిజిటల్ క్రాప్ సర్వేకు శ్రీకారం చుట్టింది. పొరుగు రాష్ట్రాలు ఈ సర్వేను ప్రతిష్టాత్మకంగా తీసుకొని అత్యంత పారదర్శకంగా అమలు చేస్తుండగా ఏపీలో మాత్రం మొక్కుబడి తంతుగా తయారైంది. సరిగ్గా ఖరీఫ్–25 సీజన్ ప్రారంభమయ్యే సమయంలోనే సచివాలయాల పునర్ వ్యవïÜ్థకరణతోపాటు రేషనలైజేషన్ పేరిట రైతు సేవా కేంద్రాల సిబ్బందిని అడ్డగోలుగా బదిలీలు చేయడం ఈ–క్రాప్ నమోదుపై తీవ్రంగా ప్రభావం చూపింది. బదిలీలపై వచ్చిన సిబ్బంది ఆయా ప్రాంతాలకు కొత్తవారు కావడంతో సర్వే నంబర్లను గుర్తించడంలో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. కొత్తగా వచ్చిన అధికారులకు సైతం అవగాహన లేక కింది స్థాయి సిబ్బందికి లక్ష్యాలను నిర్దేశించి ఇబ్బందులకు గురి చేయడం మినహా రైతులకు మేలు జరిగేలా పారదర్శకంగా ఈ–పంట నమోదు చేయాలన్న ఆలోచన లేకుండా పోయింది. డిజిటల్ క్రాప్ సర్వే నిబంధనల ప్రకారం ప్రతి ల్యాండ్ పార్సిల్లో వివరాలను విధిగా నమోదు చేయాలి. సీజన్ ముగిసి నెల రోజులైంది. కానీ ఇప్పటి వరకు 60శాతానికి మించి ల్యాండ్ పార్సిల్స్‌లో వివరాలు నమోదు చేయలేని దుస్థితి నెలకొంది. రాష్ట్రంలో 2.94 కోట్ల ల్యాండ్ పార్శిల్స్ ఉండగా.. 2 కోట్ల ల్యాండ్ పార్సిల్స్‌ను నమోదు చేసినట్టు అధికారులు కాకి లెక్కలు చెబుతున్నారు. మరోవైపు రైతుల వేలిముద్రలతోపాటు ఈ–పంట నమోదును ధ్రువీకరిస్తూ ఆర్ఎస్కే, రెవెన్యూ అధికారులు వేలిముద్రలు వేసే ప్రక్రియను పూర్తిగా అటకెక్కించేశారు. ర్యాండమ్‌గా ఉన్నతాధికారుల క్షేత్రస్థాయి పరిశీలనను మొక్కుబడి తంతుగా మార్చేశారు. ఇక కౌలు రైతులు సాగు చేస్తున్న పంట వివరాలు ఈ–క్రాప్‌లో నమోదు కావడం లేదు. సీసీఆర్సీ కార్డుల జారీ మొక్కుబడిగా సాగుతోంది. రెవెన్యూ అధికారులు ధ్రువీకరిస్తే చాలు రైతులు పండించిన పంట వివరాలు నమోదు చేస్తామని నమ్మబలికారు. కానీ ఎక్కడా ఆ దాఖలాలు కానరావడం లేదు. దీనికి ఏకైక కారణం.. ఈ–క్రాప్ పక్కాగా నమోదు చేస్తే విపత్తు వేళ రైతులకు పంట నష్ట పరిహారం, బీమా సాయం ఎక్కడ ఇవ్వాల్సి వస్తుందోననే భయమేననే విమర్శలు వ్యక్తమవుతున్నాయి. రూ.595 కోట్ల ఇన్పుట్ సబ్సిడీకి ఎగనామం..! ఈ–క్రాప్ నమోదులో నిబంధనలకు పాతరేశారు. ఈ–క్రాప్ నమోదు సక్రమంగా జరగని కారణంగానే గతేడాది ధాన్యంతో పాటు వివిధ పంటలను రైతులు కొనుగోలు కేంద్రాల్లో మద్దతు ధరకు అమ్ముకోలేకపోయారు. ఈ–క్రాప్ నమోదు అస్తవ్యస్తంగా ఉండడం వల్లే మద్దతు ధర లేక తీవ్రంగా నష్టపోయిన మామిడి, పొగాకు, మిర్చి రైతులతోపాటు టమాటా, ఉల్లి రైతులను గుర్తించడంలో అధికారులు నానా పాట్లు పడ్డారు. గడిచిన ఏడాదిన్నరలో అకాల వర్షాలు, తుపానులు, కరువు ప్రభావానికి గురైన 5.50 లక్షల మంది రైతులకు రూ.595 కోట్ల మేర ఇన్పుట్ సబ్సిడీని టీడీపీ కూటమి ప్రభుత్వం ఎగ్గొట్టింది. ఇలా పరిహారం ఎగ్గొట్టేందుకే ఉద్దేశపూర్వకంగానే ఈ–క్రాప్‌ను నిర్వీర్యం చేస్తోందని రైతులు, రైతు సంఘాలు మండిపడుతున్నాయి. ధాన్యం కొనబోమంటూ.. గ్రామాల్లో టాంటాంచరిత్రలో ఎన్నడూ లేని విధంగా ఎన్యుమరేషన్ జాబితాలో పేర్లు ఉన్న వారి నుంచి ధాన్యం సహా ఇతర పంట ఉత్పత్తులను కొనుగోలు చేయబోమని గ్రామాల్లో టాంటాం వేస్తుండడం బాధిత రైతులను కలవరపాటుకు గురి చేస్తోంది. పచ్చనేతల కనుసన్నల్లోనే గ్రామ స్థాయిలో జాబితాలు సిద్ధమవుతున్నాయి. అర్హులైన వారికి పరిహారం దక్కకుండా చేయడం, నష్ట తీవ్రత తగ్గించి ఆర్థిక భారం తగ్గించుకోవడం లక్ష్యంగా ప్రభుత్వం ఈ కుట్రలకు తెర తీసిందనే విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ఉదాహరణకు వైఎస్సార్ కడప జిల్లా సి.కె.దిన్నె మండలం కోలుములపల్లి తదితర గ్రామాల్లో తుపాను, దానికంటే ముందు కురిసిన అధిక వర్షాలతో దెబ్బతిన్న చామంతి పూల తోటలను ఏ అధికారీ పరిశీలించలేదు. ఇదే జిల్లాలో పోరుమామిళ్ల, బద్వేలు రూరల్, కాజీపేట, మైదుకూరు, బి.మఠం మండలాల్లో జరిగిన పంట నష్టాన్ని పరిశీలించిన పాపాన పోలేదు. కనీసం ప్రాథమిక అంచనాలు గానీ, తుది జాబితాలను గానీ ఆర్ఎస్కేల్లో ప్రదర్శించడం, అభ్యంతరాలు స్వీకరిస్తున్న దాఖలాలు లేవు. వాస్తవాలు ఇలా ఉంటే గతంలో ఎన్నడూ లేని విధంగా పంట నష్టం నమోదు, సామాజిక తనిఖీలు, విజ్ఞప్తుల స్వీకరణ, పరిష్కారం, ఉన్నతాధికారుల సూపర్ చెకింగ్, పునఃపరిశీలన అంతా సమాంతరంగా జరిగిపోతోందంటూ ప్రభుత్వం ప్రచారం చేసుకోవడం విస్మయం కలిగిస్తోంది. దేశానికే ఆదర్శంగా ‘ఈ–క్రాప్’.. ఎల్రక్టానిక్ క్రాపింగ్ (ఈ–క్రాప్).. వైఎస్సార్సీపీ ప్రభుత్వ హయాంలో ప్రవేశపెట్టిన ఓ వినూత్న ప్రయోగం. వాస్తవ సాగుదారులకు రక్షణ కవచం. వ్యవసాయ రంగంలో వైఎస్ జగన్ ప్రభుత్వం తెచ్చిన విప్లవాత్మక మార్పు అది. ఏ గ్రామంలో.. ఏ సర్వే నంబర్ పరిధిలో.. ఎంత విస్తీర్ణంలో.. ఏ పంటను ఎవరు సాగు చేస్తున్నారో ఒక్క క్లిక్‌తో తెలుసు కోవడమే కాదు.. ఈ–క్రాప్ ప్రామాణికంగా అర్హులైన వాస్తవ సాగుదారులకు పంట రుణాలు, ఉచిత పంటల బీమా, ఇన్పుట్ సబ్సిడీ (పంట నష్టపరిహారం), సున్నా వడ్డీ రాయితీ లాంటి సంక్షేమ ఫలాలు అందించేవారు. రబీ 2019 సీజన్లో శ్రీకారం చుట్టిన ఈ–క్రాప్ నమోదు సాంకేతికత అనతి కాలంలోనే జాతీయ, అంతర్జాతీయ ప్రశంసలందుకుంది. 2023లో ప్రతిష్టాత్మక స్కోచ్ సిల్వర్ అవార్డు కూడా వరించింది. నేషనల్ ఇన్ఫర్మేటిక్ సెంటర్ (ఎన్ఐసీ) సౌజన్యంతో ప్రత్యేకంగా డిజైన్ చేసిన యాప్ ద్వారా వెబ్‌ల్యాండ్, సీసీఆర్సీ (పంట సాగు హక్కు పత్రం) డేటా ఆధారంగా జాయింట్ అజమాయిషీ కింద వ్యవసాయ, ఉద్యాన, రెవెన్యూ సహాయకులు పంట వివరాలు నమోదు చేసేవారు. సీజన్ వారీగా ఏ సర్వే నంబర్లో ఏయే రకాల పంటలు ఏయే వ్యవసాయ పద్ధతుల్లో సాగు చేస్తున్నారో ఆర్బీకేల ద్వారా వాస్తవ సాగుదారుల వివరాలు నమోదు చేసేవారు. 15–30 రోజుల్లోపు క్షేత్ర స్థాయి పరిశీలనలో జియో కో ఆర్డినేట్స్, జియో ఫెన్సింగ్‌తో సహా పంటల ఫొటోలు అప్లోడ్ చేసి, రైతుల వేలిముద్రలు(ఈకేవైసీ–మీ పంట తెలుసుకోండి) తీసుకుని మొబైల్ నంబర్‌కు డిజిటల్ రసీదు పంపేవారు. గ్రామ, మండల, జిల్లా స్థాయి అధికారుల పరిశీలన తర్వాత రైతులకు భౌతిక రసీదు కూడా అందించేవారు. ఈ భౌతిక రసీదులోనే ఉచిత పంటల బీమా పధకం వర్తించే నోటిఫై చేసిన పంటలకు (స్టార్) గుర్తుతో ప్రత్యేకంగా తెలియచేయడమే కాదు.. మీ పంటకు బీమా కవరేజ్ ఉందని, మీ తరఫున ప్రీమియం పూర్తిగా ప్రభుత్వమే చెల్లిస్తుందని తెలియజేశారు. ఇలా ఏటా 1.65 కోట్ల ఎకరాల చొప్పున ఐదేళ్లలో 8.24 కోట్ల ఎకరాల్లో సాగైన పంటల వివరాలను నమోదు చేశారు. ఈ–క్రాప్ ప్రామాణికంగా 2019–24 మధ్య 75.82 లక్షల మందికి రూ.1,373కోట్ల సబ్సిడీతో 45.16 లక్షల టన్నుల విత్తనాలు అందించారు. 15 లక్షల మందికి రూ.14 కోట్ల విలువైన 1.36 లక్షల లీటర్ల పురుగుల మందులు సరఫరా చేశారు. 176.36 లక్షల టన్నుల ఎరువులు పంపిణీ చేయగా, 5.13 కోట్ల మందికి రూ.8.37 లక్షల కోట్ల పంట రుణాలను అందించారు. మరోవైపు వైఎస్సార్ రైతు భరోసా కింద 53.58 లక్షల రైతు కుటుంబాలకు రూ.34,288 కోట్ల పెట్టుబడి సాయం అందించి సాగుకు భరోసా కల్పించారు. వైఎస్సార్ ఉచిత పంటల బీమా పథకం కింద 54.58 లక్షల మందికి రూ.7,802.05 కోట్లు, ఇన్పుట్ సబ్సిడీ రూపంలో 30.85 లక్షల మందికి రూ.3,411 కోట్లు, వైఎస్సార్ సున్నా వడ్డీ పంట రుణాల పథకం కింద 84.67 లక్షల మందికి రూ.2,051 కోట్ల రాయితీని గత ప్రభుత్వం అందచేసింది.సేద తీరుతున్న ప్రభుత్వ పెద్దలుపుట్టెడు కష్టాల్లో ఉన్న రైతులను ఆదుకోవాల్సిన ప్రభుత్వ పెద్దలు షికార్లు చేస్తున్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబు లండన్ పర్యటనకు వెళ్తే.. మంత్రి లోకేశ్ క్రికెట్ మ్యాచ్‌లు చూస్తూ చిల్ అవుతున్నారు. మరోవైపు ఫొటోలకు ఫోజులిచ్చిన డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ రైతులను పట్టించుకోకుండా హైదరాబాద్ వెళ్లిపోవడంపై రైతు సంఘాలు మండిపడుతున్నాయి.ఇప్పుడు పరిహారం ఎవరిస్తారు గత ప్రభుత్వంలో అధికారులే దగ్గరుండి బీమా చేయించేవారు. ఈ ప్రభుత్వం సొంతంగా బీమా చేయించుకోవాలని చెప్పడంతో రెండుసార్లు రైతు సేవా కేంద్రాలకు వెళ్లా. సర్వర్ పని చేయడం లేదని చెప్పారు. తరువాత సమయం అయిపోయిందన్నారు. ఐదు ఎకరాల్లో స్వర్ణరకం సాగు చేశా. పంట మొత్తం పోయింది. పరిహారం ఎవరిస్తారు? కౌలుదారులకు ఆత్మహత్యలే శరణ్యం! – గున్నం రామకృష్ణ, కొత్తూరు, రామచంద్రపురం రూరల్, డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ కోనసీమ జిల్లా కౌలు రైతుకు పరిహారం ఇవ్వాలి కౌలుకు ఏడు ఎకరాలు తీసుకున్నా. తొలుత నీరందక దెబ్బతిన్నా. ఇప్పుడిప్పుడే కోలుకుంటుంటే తుపాను పంటను దెబ్బతీసింది. ఎకరానికి రూ.25 వేలకు పైగా వెచ్చించా. నాలాంటి కౌలు రైతుల పరిస్థితి అగమ్యగోచరంగా మారింది. కౌలు రైతులను కూడా గుర్తించి నష్టపరిహారం అందించాలి. – నాగరాజు, కౌలు రైతు, పెడన, కృష్ణా జిల్లాదిక్కుతోచడం లేదు రూ.ఐదు లక్షల వరకూ వెచ్చించి 15 ఎకరాల్లో మొక్కజొన్న సాగు చేశాం. పంట తొలగించే రోజు మొదలైన వాన తుపానుగా మారి పదిరోజుల పాటు కొనసాగింది. టార్పాలిన్ కప్పి భద్రపరిచినప్పటికీ మొక్కజొన్నలు మొత్తం మొలకలు వచ్చాయి. కష్టపడి పండించిన పంట కళ్లముందే పాడైపోవడంతో దిక్కుతోచడం లేదు. ప్రభుత్వమే మమ్మల్ని ఆదుకోవాలి. – మధు, కదిరిపల్లి, గుంతకల్లు మండలం, అనంతపురం జిల్లాప్రభుత్వ నిర్ణయం చాలా అన్యాయం ఇన్పుట్ సబ్సిడీకి నమోదు చేసుకున్న రైతుల నుంచి పంటలను ప్రభుత్వం కొనుగోలు చేయకూడదన్న నిర్ణయం చాలా అన్యాయం. పంటలు నష్టపోయారు కాబట్టే ఇన్పుట్ సబ్సిడీ పొందుతున్నారు. ప్రభుత్వం తన నిర్ణయాన్ని ఉపసంహరించుకొని రైతుల నుంచి ఎటువంటి షరతులు లేకుండా కొనుగోలు చేయాలి.. – పోతిరెడ్డి భాస్కర్, రైతు సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి, వైఎస్సార్ కడప జిల్లా జగన్ హయాంలో రైతులకు మేలు మొక్క జొన్న కోత కోసి ఆరబోశాం. క్వింటా రూ.2,200 పలకాల్సింది రూ.1,600కు అడుగుతున్నారు. ఇన్పుట్ సబ్సిడీ గురించి అవగాహన కల్పించేవారు ఎవరూ లేరు. గత ప్రభుత్వం స్వయంగా ఇన్సూరెన్స్ చెల్లించడంతో ప్రకృతి వైపరీత్యాల సమయంలో రైతులకు మేలు చేకూరేది. – గుత్తి ఏసన్న, రైతు, కల్వటాల, కొలిమిగుండ్ల మండలం, నంద్యాల జిల్లాఈ ప్రభుత్వంలో బీమా గురించి చేప్పేవారే లేరు నాకు ఎకరా పొలం ఉంది. వరి, మిరప పండిస్తా. గత ప్రభుత్వంలో ఈ–క్రాప్ నమోదు చేసి ప్రీమియం కూడా చెల్లించడంతో రూ.26 వేలు బీమా నగదు వచ్చింది. ఇప్పుడు ఇన్సూరెన్స్ గురించి చెప్పేవారే కరువయ్యారు. ప్రభుత్వం ఎటువంటి భరోసా కల్పించకపోవడంతో ఆర్థికంగా నష్టపోవాల్సిన పరిస్థితి నెలకొంది. – వేణు, రైతు, బంగారుపాళెం, చిత్తూరు జిల్లాఅస్తవ్యస్తంగా ఎన్యుమరేషన్...మోంథా తుపాను వల్ల నష్టపోయిన పంటలను, రైతులను గుర్తించేందుకు చేపట్టిన ఎన్యుమరేషన్ ప్రక్రియ అస్తవ్యస్తంగా తయారైంది. గత నెల 31వ తేదీ సాయంత్రంలోగా తుది జాబితాలు తయారు చేయాలని ఆదేశిస్తూ 30వ తేదీన సర్క్యులర్ ఇవ్వడమే ఇందుకు నిదర్శనం. అంటే 24 గంటలు కూడా గడువు ఇవ్వకుండా తుది జాబితాలు రూపొందించాలని ఆదేశించటాన్ని బట్టి ఎన్యుమరేషన్లో పారదర్శకత ఏ మేరకు ఉందో వెల్లడవుతోంది. వాస్తవంగా 15 లక్షల ఎకరాల్లో పంటలు దెబ్బ తినగా.. ప్రభుత్వం నష్ట తీవ్రతను తగ్గించేందుకు తొలుత 4.40 లక్షల ఎకరాల్లో పంటలు ముంపునకు గురైనట్లు ప్రకటించింది. ఆ తర్వాత దాన్ని 3.45 లక్షల ఎకరాలేనని బుకాయించింది. చివరకు తుది అంచనాల రూపకల్పనలో 3.70 లక్షల ఎకరాలుగా చూపించే ప్రయత్నం చేస్తోంది. అది కూడా క్షేత్ర స్థాయిలో పరిశీలన జరపకుండా, టీడీపీ నేతలు సిఫార్సు చేసిన పేర్లతోనే జాబితాలను తయారు చేస్తున్నారు. ప్రభుత్వ పెద్దల నుంచి వస్తున్న మౌఖిక ఆదేశాలతో జాబితాలను కుదించేందుకు యంత్రాంగం రేయింబవళ్లు శ్రమిస్తోంది. ఎన్యుమరేషన్ పెంచొద్దంటూ క్షేత్రస్థాయి సిబ్బందిపై తీవ్ర ఒత్తిళ్లు వస్తున్నాయి. కర్నూలు, వైఎస్సార్ కడప, నంద్యాల జిల్లాల్లో తుపాను ప్రభావంతో కురిసిన వర్షాల వల్ల ఉల్లి పంటకు అపార నష్టం వాటిల్లింది. కానీ దెబ్బతిన్న ఉల్లి పంట వివరాలు నమోదు చేయడానికి వీల్లేదని మౌఖిక ఆదేశాలు జారీ చేయడం నివ్వెరపరుస్తోంది. అలా నమోదు చేసిన ఆర్ఎస్కే సిబ్బందిపై చర్యలకు సైతం సిద్ధపడుతుండడం సర్కారు తీరుకు అద్దం పడుతోంది. -
కుల గణనపై సీఎం రేవంత్ కీలక వ్యాఖ్యలు
సాక్షి, హైదరాబాద్: తెలంగాణలో ఇందిరమ్మ ప్రభుత్వం ఏర్పడుతుందని సామాజిక, ఆర్థిక, రాజకీయ కులగణన చేస్తామని రాహుల్ గాంధీ మాట ఇచ్చారని.. గాంధీ భవన్లో కుల గణనపై జరిగిన అవగాహన సమావేశంలో సీఎం రేవంత్‌రెడ్డి అన్నారు. సెప్టెంబర్ 17న తుక్కుగూడ సభలో సోనియాగాంధీ కూడా తెలంగాణ ప్రజలకు మాట ఇచ్చారని ఆయన గుర్తు చేశారు.పార్టీ ఎజెండాతోనే ప్రజల్లోకి వెళ్లాం.. పార్టీ విధానాన్ని అమలు చేయడమే మన ప్రభుత్వ విధానం. అందుకే కాంగ్రెస్ పార్టీ ఐడియాలజీతో సంబంధం ఉన్న నిరంజన్ను బీసీ కమిషన్ చైర్మన్‌గా నియమించుకున్నామని రేవంత్ అన్నారు. పని చేయాల్సిన బాధ్యత అధికారులపై ఉన్నా.. ప్రతీ క్షణం సమన్వయం చేసుకోవాల్సిన బాధ్యతకాంగ్రెస్ క్యాడర్, నేతలపై ఉంది. కుల గణనపై సమన్వయం చేసుకునేందుకు 33 జిల్లాలకు 33 మంది పరిశీలకులను నియమించాలని సూచిస్తున్నా. బాధ్యతగా పని చేయండి.. మీ కష్టానికి ఫలితం తప్పకుండా ఉంటుంది’’ అని రేవంత్ చెప్పారు.‘‘దేశానికి తెలంగాణ ఒక మోడల్‌గా మారాలి.. ఆ దిశగా ఈ కార్యక్రమాన్ని ముందుకు తీసుకెళ్లాలి. నవంబర్ 31లోగా కులగణన పూర్తి చేసి భవిష్యత్ యుద్ధానికి సిద్ధం కావాలి. తెలంగాణ నుంచే నరేంద్ర మోదీపై యుద్ధం ప్రకటించాలి. కులగణన ఎక్స్ రే మాత్రమే కాదు.. ఇది మెగా హెల్త్ చెకప్ లాంటిది. ప్రభుత్వ ఆదాయాన్ని సామాజిక న్యాయం ప్రకారం పంచడమే కాంగ్రెస్ విధానం. భవిష్యత్‌లో కేంద్ర ప్రభుత్వం చేపట్టే జనగణనలో మన మోడల్‌ను పరిగణనలోకి తీసుకునేలా మోడల్ డాక్యుమెంట్‌ను కేంద్రానికి పంపుతాం. ప్రతిపక్షాలు ఎన్ని అడ్డంకులు సృష్టించినా డీఎస్సీ పూర్తి చేసి ఉద్యోగ నియామక పత్రాలు అందించాం. రాజకీయ మనుగడ కోసం అడ్డంకులు సృష్టించినా 10 నెలల్లో 50వేల ఉద్యోగ నియామక పత్రాలు అందించాం.’’ అని రేవంత్ పేర్కొన్నారు.ఇదీ చదవండి: దీపావళి పండుగవేళ.. జీహెచ్ఎంసీ ఉద్యోగులకు శుభవార్తగ్రూప్ 1 విషయంలోనూ ప్రతిపక్షాలు రకరకాల అపోహలు సృష్ఠించి అడ్డుకోవాలని చూశాయి. జీవో ఇచ్చినపుడు, నోటిఫికేషన్ ఇచ్చినప్పుడు, ప్రిలిమ్స్ ఫలితాలు ఇచ్చినపుడు కోర్టుకు పోలేదు. కానీ మెయిన్స్ నిర్వహించే సందర్భంలో జీవో 29పై కోర్టుకు వెళ్లి అడ్డుకోవాలని చూశారు. సుప్రీంకోర్టు కూడా వారి పిటిషన్‌ను కొట్టేసింది. కొంతమంది అగ్రవర్ణాల కోసమే గ్రూప్ 1 నిర్వహిస్తున్నారని, బలహీన వర్గాలకు అన్యాయం చేస్తున్నారని ఒక వాదన తీసుకొచ్చారు. సెలక్ట్ అయిన 31,383 మందిలో 10 శాతం లోపు మాత్రమే అగ్రవర్ణాలు ఉన్నారు. 57.11 శాతం బీసీలు,15.38 శాతం ఎస్సీలు, 8.87 శాతం ఎస్టీలు, 8.84 ఈడబ్ల్యూఎస్ కోటాలో సెలక్ట్ అయ్యారు. స్పోర్ట్స్ కోటాలో 20 మంది సెలక్ట్ అయ్యారు.’’ అని రేవంత్ వివరించారు.పార్టీకి నష్టం చేకూర్చేలా ఎవరైనా ఇష్టానుసారంగా మాట్లాడితే పార్టీ సహించదు. రేవంత్‌రెడ్డి చట్టాన్ని అమలు చేస్తాడు తప్ప... వ్యక్తిగత ఎజెండాతో పనిచేయడు ప్రతిపక్షాల కుట్రలను ప్రతీ ఒక్కరు తిప్పికొట్టాలి’’ అని సీఎం రేవంత్‌రెడ్డి పిలుపునిచ్చారు. -
విజయవాడలో వరద నష్టం అంచనాపై గందరగోళ పరిస్థితులు
-
సహాయక చర్యలపై ప్రజలు సంతృప్తి
సాక్షి, అమరావతి: వరద నష్టం ఎన్యూమరేషన్ పక్కాగా జరగాలని, నష్టపోయిన ప్రతి బాధితునికి ప్రభుత్వ సాయం అందేలా చూడాలని ముఖ్యమంత్రి చంద్రబాబు అధికారులను ఆదేశించారు. వరద నష్టం ఎన్యూమరేషన్, బాధితులకు పరిహారంపై సీఎం చంద్రబాబు శుక్రవారం సచివాలయంలో మంత్రులు, అధికారులతో సమీక్ష నిర్వహించారు. వరదల కారణంగా 2,13,456 ఇళ్లు నీట మునిగాయని, ఇప్పటి వరకు 84,505 ఇళ్లలో నష్టం అంచనా లెక్కలు పూర్తయ్యాయని అధికారులు వివరించారు. వేలాది ద్విచక్ర వాహనాలు, కార్లు, ఆటోలు పాడైపోయాయని, 2,14,698 హెక్టార్లలో పంటలు దెబ్బతిన్నాయని, ఎన్యూమరేషన్లో రీ వెరిఫికేషన్ చేసి ప్రతి బాధితుడికి జరిగిన నష్టాన్ని సేకరిస్తున్నామని తెలిపారు. ఈ సందర్భంగా సీఎం మాట్లాడుతూ సహాయక చర్యలపై ప్రజలు సంతృప్తితో ఉన్నారని, పరిహారం విషయంలో కూడా శాస్త్రీయంగా ఆలోచన చేసి జాబితా రూపొందించాలని సూచించారు. నష్టం అంచనాలు పూర్తి చేస్తే ఈ నెల 17వ తేదీన బాధితులకు సాయం అందజేద్దామని పేర్కొన్నారు. రుణాలు రీషెడ్యూల్ చేయండి: సీఎం వరద బాధితులకు వివిధ ఏజెన్సీలు అందించే సర్వీసులపై శుక్రవారం సాయంత్రం విజయవాడలోని ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ కార్యాలయంలో సీఎం చంద్రబాబు సమీక్ష నిర్వహించారు. వరద ప్రభావిత ప్రాంతాల్లో ఎంఎస్ఎంఈలు నడుపుతున్న వ్యాపారులు తీవ్రంగా దెబ్బతిన్నారని, వారి బ్యాంక్ రుణాలు రీ షెడ్యూల్ చేయాలని, ఈఎంఐల చెల్లింపునకు గడువు ఇవ్వాలని బ్యాంకర్లకు సూచించారు. ఢిల్లీ వెళ్లిన సీఎం చంద్రబాబు సీఎం చంద్రబాబు శుక్రవారం సాయంత్రం ఢిల్లీ వెళ్లారు. విజయవాడలోని కలెక్టర్ కార్యాలయంలో సమీక్ష అనంతరం ఆయన బయలుదేరి గన్నవరం ఎయిర్‌పోర్టుకు చేరుకుని అక్కడి నుంచి ఢిల్లీ వెళ్లారు. -
కులగణన కోసం 14న సత్యాగ్రహం
సాక్షి, హైదరాబాద్: దేశవ్యాప్తంగా వెంటనే కులగణన చేసి బీసీలకు న్యాయం చేయాలని మాజీ మంత్రి శ్రీనివాస్‌గౌడ్ డిమాండ్ చేశారు. ఈనెల 14న హైదరాబాద్ కేంద్ర విశ్వవిద్యాలయం ప్రధాన గేటు వద్ద ఓబీసీ సత్యాగ్రహ కార్యక్రమంలో రాష్ట్రవ్యాప్తంగా ఉన్న విద్యార్థులు పాల్గొనాలని పిలుపునిచ్చారు. గురువారం ఆల్ ఇండియా ఓబీసీ స్టూడెంట్స్ అసోసియేషన్ జాతీయ అధ్యక్షుడు జి.కిరణ్ కుమార్, జాతీయ కార్యదర్శి ఎన్.సాయికిరణ్, రాష్ట్ర అధ్యక్షుడు శివ ముదిరాజ్, అభినేష్»ొమ్మ ప్రవీణ్ కుమార్ తదితరులు శ్రీనివాస్‌గౌడ్‌ను కలిశారు. ఈ సందర్భంగా శ్రీనివాస్‌గౌడ్ మాట్లాడుతూ, దేశవ్యాప్తంగా కులగణన చేసి రిజర్వేషన్స్‌పై ఉన్న 50 శాతం సీలింగ్ ఎత్తివేయాలని, బీసీలకు జనాభా ప్రాతిపదికన రిజర్వేషన్లు ఇవ్వాలని, దేశవ్యాప్తంగా ఓబీసీ నేషనల్ ఫెలోషిప్లను 5 వేలకు పెంచాలని డిమాండ్ చేశారు. తెలంగాణ రాష్ట్రంలో కూడా హైకోర్టు చెప్పిన విధంగా మూడు నెలల్లో రేవంత్‌రెడ్డి ప్రభుత్వం అన్ని కులాల గణన చేయాలని కోరారు. -
స్థానిక ఎన్నికలు ఇప్పట్లో లేనట్టేనా?
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో స్థానిక సంస్థల ఎన్నికలు మరింత ఆలస్యమయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. గడువు ముగిసిన గ్రామపంచాయతీలు, మండల పరిషత్, జిల్లా ప్రజాపరిషత్‌లకు ఎన్నికలు నిర్వహించేందుకు ఎస్సీ, ఎస్టీ, బీసీ రిజర్వేషన్లు ఏ ప్రాతిపదికన నిర్ధారిస్తారన్న దానిపై ప్రభుత్వపరంగా ఇంకా ఎలాంటి నిర్ణయం వెలువడలేదు. రిజర్వేషన్ల ఖరారుకు కుల గణన ప్రాతిపదికగా తీసుకోవాలా.. పార్లమెంట్ ఎన్నికల సందర్భంగా సిద్ధం చేసిన తాజా ఓటర్ల జాబితాను లెక్కలోకి తీసుకోవాలా.. అన్న దానిపై రాష్ట్ర ప్రభుత్వం తేల్చుకోలేకపోతోంది. కాగా ఈ నెలతో బీసీ కమిషన్ కాలపరిమితి ముగియనుండగా.. ఎన్నికలు నిర్వహించాల్సిన రాష్ట్ర ఎన్నికల కమిషనర్ పదవీ కాలం వచ్చే నెలతో ముగియనుంది. కులగణనతో ఆలస్యం... కులగణన ద్వారా రాష్ట్రంలోని జిల్లాలు, మండలాలు, గ్రామాల స్థాయి వరకు ఎస్సీ, ఎస్టీ, బీసీల జనాభాపై లెక్కలు తీసి రిజర్వేషన్ల నిర్ధారణ అనేది సుదీర్ఘ కసరత్తుతో పాటు చాలా రోజులు పట్టనుంది. ఈ నేపథ్యంలో ఎన్నికల సంఘం నుంచి అసెంబ్లీ నియోజకవర్గాల వారీగా తాజా ఓటర్ల జాబితాలు తీసుకుని మండలాలు, గ్రామస్థాయిల్లో ఎస్సీ, ఎస్టీ, బీసీ జనాభాపై అంచనాకు వచ్చి స్థానిక స్థాయిలోనే రిజర్వేషన్ల ఖరారు అనేది ఇప్పుడు ప్రభుత్వం ఎదుట మార్గాంతరంగా ఉంది.ఈ ప్రక్రియను పంచాయతీరాజ్, ›గ్రామీణాభివృద్ధి శాఖ ద్వారా చేపడితే 2, 3 నెలల్లోగా ఓటర్ల జాబితాల ఆధారంగా రిజర్వేషన్లు నిర్థారించేందుకు అవకాశముందని అటు బీసీ కమిషన్, ఇటు అధికారవర్గాలు అంచనా వేస్తున్నాయి. ప్రస్తుతం గ్రామీణ స్థానిక సంస్థల్లో బీసీలకు గరిష్టంగా 21 శాతమే రిజర్వేషన్లు అందుతున్నాయి. అయితే ఈ రిజర్వేషన్లను వారి జనాభాకు అనుగుణంగా 42 శాతానికి పెంచుతామని, ఉప కులాల వారీగా కూడా రిజర్వేషన్లు ఇస్తామని కాంగ్రెస్ మేనిఫెస్టోలో హామీనిచి్చన విషయం తెలిసిందే. ఈ హామీ అమలుకు రాష్ట్ర బీసీ కమిష¯Œన్ ద్వారా చర్యలు చేపట్టాల్సి ఉంది.సుప్రీంకోర్టు గతంలోనే ‘ట్రిపుల్ టెస్ట్’పేరిట స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలు, ఇతర గ్రూపులకు రిజర్వేషన్లపై మార్గదర్శకాలు జారీ చేసింది. స్థానిక సంస్థల పరిధిలో ఆయా గ్రూపుల వెనుకబాటుతనంపై బీసీ కమిష¯న్ ద్వారా విచారణ జరపాలని, ఆయా చోట్ల (స్థానిక స్థాయిలో) ఎస్సీ, ఎస్టీ, బీసీలకు ఏయే నిష్పత్తిలో రిజర్వేషన్లు ఇవ్వాలో తేల్చాలని పేర్కొంది. మొత్తంగా రిజర్వేషన్లు 50 శాతానికి మించకుండా చూడాలని స్పష్టం చేయడంతో బీసీ కమిషన్ కసరత్తుకు ప్రాధాన్యత ఏర్పడింది. ప్రస్తుతమున్న పరిస్థితుల్లో కాంగ్రెస్ పార్టీ ఎన్నికల హామీ అమలు ఏ మేరకు సాధ్యమనే మీమాంస వ్యక్తమవుతోంది. సీఎం వచ్చాక స్పష్టత వస్తుందా? ఈ నెలాఖరుతో రాష్ట్ర బీసీ కమిష¯న్Œ చైర్మన్, సభ్యుల పదవీ కాలం పూర్తి కానుండగా, రాష్ట్ర ఎన్నికల కమిషనర్ పార్థసారథి పదవీకాలం సెపె్టంబర్లో ముగియనుంది. ఈ నేపథ్యంలో బీసీ కమిషన్ చైర్మన్, రాష్ట్ర ఎన్నికల కమిషనర్ పదవీకాలాన్ని మరో ఏడాది పాటు పొడిగిస్తే ఈ ఎన్నికలను సజావుగా సకాలంలో పూర్తి చేసే అవకాశం ఉంటుందన్న వాదనలు వినిపిస్తున్నాయి. కాగా, ఈ నెల 14 తర్వాత సీఎం రేవంత్‌రెడ్డి, సీఎస్ల ప్రతినిధి బృందం యూఎస్, దక్షిణ కొరియాల పర్యటన నుంచి తిరిగి వచ్చాక దీనిపై స్పష్టత వస్తుందన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. -
బీసీ కుల గణనకు కార్యాచరణ
నల్లగొండ/ నల్లగొండ రూరల్: బడుగు, బలహీనవర్గాలకు మేలు జరిగే విధంగా బీసీ కుల గణనకు అసెంబ్లీలో తీర్మానం చేసి జీవో కూడా విడుదల చేశామని, రాహుల్‌గాంధీ చెప్పినట్లుగా ఎవరి వాటా ఎంత.. ఎవరి సంఖ్య ఎంత అనే విధంగా కార్యాచరణ చేపట్టే ఆలోచన చేస్తున్నామని రాష్ట్ర బీసీ సంక్షేమ, రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ చెప్పారు. మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డితో కలిసి శనివారం నల్లగొండ పట్టణంలో సావిత్రిబాయి, జ్యోతిబాఫNలే విగ్రహాలను ఆవిష్కరించి అనంతరం జరిగిన కార్యక్రమంలో మాట్లాడారు. బీసీల సంక్షేమాన్ని గత ప్రభుత్వం పట్టించుకోలేదని మంత్రి ప్రభాకర్ విమర్శించారు. రాష్ట్ర రోడ్డు భవనాల శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి మాట్లాడుతూ.. ప్రతి నియోజకవర్గంలో 25 ఎకరాల్లో 80 కోట్లతో గురుకుల భవనాలు ప్రభుత్వం నిర్మిస్తుందన్నారు. తెలంగాణ ఇచ్చిన పార్టీగా కాంగ్రెస్ అభివృద్ధికి కట్టుబడి ఉందన్నారు. బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు జాజుల శ్రీనివాస్‌గౌడ్ మాట్లాడుతూ, మంత్రులు పొన్నం ప్రభాకర్, కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డిలు బీసీ జన గణనకు కృషి చేయాలని కోరారు. ఆర్టీసీలో ఉద్యోగాల భర్తీ ప్రక్రియను ప్రారంభించాం.. ఆర్టీసీలో 3,035 ఉద్యోగాల భర్తీ ప్రక్రియను ప్రారంభించినట్లు మంత్రి పొన్నం ప్రభాకర్ తెలిపారు. కార్మికుల సంక్షేమంలో భాగంగా 21 శాతం డీఏ ఇచ్చామని, రూ.280 కోట్ల బకాయిల్లో రూ.80 కోట్లు చెల్లించామని చెప్పారు. నల్లగొండ ఆర్టీసీ బస్టాండ్‌లో మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డితో కలిసి ‘రాజధాని’ఏసీ బస్, నాలుగు డీలక్స్, ఒక పల్లె వెలుగు బస్సులను జెండా ఊపి ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి పొన్నం మాట్లాడుతూ, అన్ని జిల్లాల నుంచి హైదరాబాద్‌కు ఏసీ బస్సులు నడుపుతామని అన్నారు. నల్లగొండ బస్టాండ్‌లో బస్సులను ప్రారంభించిన అనంతరం మంత్రులు బస్సులో కొద్దిదూరం ప్రయాణించారు. నల్లగొండలో 20 ఎకరాల్లో నూతన బస్టాండ్‌ను ఏర్పాటు చేయాలని కోమటిరెడ్డి విజ్ఞప్తి చేయగా.. త్వరలోనే బస్టాండ్ ఏర్పాటుకు చర్యలు తీసుకుంటామని పొన్నం హామీ ఇచ్చారు. -
సామాజిక విప్లవానికి నాంది కులగణన
గెలిచే అవకాశాలున్న పార్టీలో ఎన్నికల ముందు ఎక్కువ సీట్లు అడగడానికీ, గెలిచిన పార్టీలో ఎన్నికల తరువాత ఎక్కువ పదవులు కోరడానికీ రాజకీయ నాయకులు కులం కార్డును వాడడం సహజం. ఇలాంటి సందర్భాల్లో ప్రతీ కులం తన జనాభా సంఖ్యనూ, శాతాన్ని పెంచి చెపుతుంటుంది. ఈ శాతాల న్నింటినీ కూడితే సులువుగా 300 దాటు తుంది! ఎన్నికల సంవత్సరంలో కులగణన చర్చ మరింత వేడెక్కుతోంది. సమాజంలో విభిన్న సమూహాల మధ్య సంబంధాలను నిర్ణయించడంలో వేల సంవత్సరాలుగా కులం ప్రధాన పాత్ర పోషిస్తున్న దేశం మనది. ప్రతి కులానికి ప్రత్యేకమైన చరిత్ర, సంస్కృతి ఉంటుంది. మన దేశంలో 5 వేలకు మించి కులాలున్నాయని అంచనా. కులాలతోనే మన దేశంలో సామాజిక అంతస్తుల దొంతర ఏర్పడుతోంది. వీటిని అర్థం చేసుకోవడానికి కులగణన ఒక చారిత్రక అవసరంగా మారింది. సామా జిక విప్లవానికి కులగణన నాంది పలుకుతుంది. ఎస్సీ, ఎస్టీలకు రాజ్యాంగంలోనే విద్యా, ఉపాధి రిజర్వేషన్లు కల్పించారు. సామాజిక వివక్షకు గురవుతూ, విద్యారంగంలో అవకాశాలు కోల్పోతున్న సమూహాల కోసం ఉద్దీపన చర్యలు చేపట్టడంలో చాలా తాత్సారం జరిగింది. 1979 జనవరి 1న ప్రధాని మొరార్జీ దేశాయి ప్రభుత్వ ఉద్యోగాల్లో ఓబీసీలకు రిజర్వేషన్లు కల్పించడానికి ‘సోషల్లీ అండ్ ఎడ్యుకేషనల్లీ బ్యాక్ వర్డ్ క్లాసెస్ కమిషన్’ను నియమించారు. స్వల్ప కాలం బిహార్ ముఖ్యమంత్రిగా పనిచేసిన బిందేశ్వరీ ప్రసాద్ మండల్‌ను చైర్మన్‌గా నియమించడంతో దానికి ‘మండల్ కమిషన్’ అనే పేరు వచ్చింది. రెండేళ్ళ పరిశీలన తరువాత 1980 డిసెంబరు 31న అప్పటి ప్రధాని ఇందిరాగాంధీకి బీపీ మండల్ తన నివేదికను సమ ర్పిస్తూ ఓబీసీలకు 27 శాతం రిజర్వేషన్లు కల్పించాలని సిఫార్సు చేశారు. ఇక్కడ ఒక విచిత్రం వుంది. మండల్ కమిషన్ ఓబీసీలకు 27 శాతం రిజర్వేషన్ ఇమ్మందిగానీ, కులగణన నిర్వహించమనలేదు. బ్రిటిష్ కాలపు రికార్డుల ప్రకారం దేశంలో బీసీల జనాభా 54 శాతం ఉంటుందని అంచనా వేసి అందులో 50 శాతం అనగా 27 శాతం రిజర్వేషన్లు కల్పించాలని సిఫార్సు చేసింది. ఓబీసీ రిజర్వేషన్ల కేసు మీద అంతిమ తీర్పు రాకముందే 1990 ఆగస్టు 7న అప్పటి ప్రధాని వీపీ సింగ్ మండల్ కమిషన్ సిఫార్సుల్లో కొన్నింటిని అమలుపరచ బోతున్నట్టు ప్రకటించారు. అప్పటి రాజకీయ పరిస్థితుల్లో ఇది చాలా సాహసోపేతమైన నిర్ణయం. జనతాదళ్ నాయ కుడైన వీపీ సింగ్‌కు లోక్ సభలో మెజారిటీ లేదు. ఎన్టీ రామారావు నాయకత్వంలోని నేషనల్ ఫ్రంట్ అభ్యర్థిగా రంగంలో దిగి, బయటి నుండి బీజేపీ ఇచ్చిన మద్దతుతో ఆయన ‘మైనారిటీ ప్రభుత్వానికి’ ప్రధాని అయ్యారు. అప్పట్లో బీజేపీకి లోక్ సభలో 85 సీట్లున్నాయి. ఓబీసీలకు రిజర్వే షన్లు కల్పిస్తే తన ఓటు బ్యాంకు అయిన ఓసీలు పార్టీకి దూరం అయి పోతారని ఆ పార్టీ భయపడింది. అప్పటి బీజేపీ అధ్యక్షులు ఎల్కే అడ్వాణి 1990 సెప్టెంబరు 25న సోమనాథ్ నుండి అయోధ్య వరకు 35 రోజుల ‘రామ్ రథయాత్ర’ మొదలెట్టారు. దీనికి రెండు లక్ష్యాలు న్నాయి. మొదటిది; మండల్ కమిషన్ సిఫార్సుల అమలును అడ్డుకోవ డానికి ఏకంగా వీపీ సింగ్ ప్రభుత్వాన్ని పడగొట్టడం. రెండోది, ముస్లింల మీద ద్వేషాన్ని రెచ్చగొట్టి హిందూ ఓటు బ్యాంకును సమీకరించడం. ఈ రెండు లక్ష్యాల రథయాత్రను రాజకీయ విశ్లేషకులు ‘మండల్–కమండల్’ అని పిలిచేవారు. బీజేపీ తన మద్దతును ఉపసంహరించుకోవడంతో 1990 నవంబరు 7న వీపీ సింగ్ ప్రభుత్వం పడిపోయింది. రెండేళ్ల తరువాత 1992 నవంబరు 16న ‘ఇంద్ర సహానీ కేసు’లో సుప్రీం కోర్టు ఓబీసీలకు 27 శాతం రిజర్వేషన్లను ఆమోదిస్తూ తుది తీర్పు ఇచ్చింది. అయితే, మొత్తం రిజర్వేషన్లు 50 శాతానికి మించ రాదనీ, క్రీమీలేయర్ కుటుంబాలను రిజర్వేషన్ పరిధి నుండి తప్పించా లనీ కొత్తగా రెండు నిబంధనలు పెట్టింది. సుప్రీం కోర్టు తీర్పు వచ్చిన పక్షం రోజుల్లోనే కరసేవకులు బాబ్రీ మసీదును కూల్చి వేశారు. బ్రిటిష్ పాలకులు భారత దేశాన్ని పరిపాలించాలంటే ఇక్కడి సమాజ స్వభావాన్ని, ముఖ్యంగా కుల, మత స్వభావాలను క్షుణ్ణంగా అర్థం చేసుకోవాల్సిన అవసరముందని గుర్తించారు. 1881లో తొలి సారిగా జనగణన నిర్వహించారు. ఆ మరు సంవత్సరం అంటే 1882లో విలియం విల్సన్ హంటర్ నాయకత్వాన ఏర్పడిన కమిషన్ దేశంలో కులగణన నిర్వహించింది. అప్పటి నుండి ప్రతి పదేళ్ళకు ఒకసారి జనగణన కార్యక్రమం క్రమం తప్పకుండ సాగుతోంది. కానీ, కులగణన జరగలేదు. స్వతంత్ర భారత దేశంలో తొలిసారిగా కులగణన చేపట్టిన ఘనత బిహార్ ముఖ్యమంత్రి నితీష్ కుమార్‌కు దక్కుతుంది. దేశంలో అంతటి చొరవను చూపిన మరో ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి మాత్రమే. బిహార్‌లో 214 కులాలున్నట్టు తేలింది. అయితే, ఆంధ్రప్రదేశ్‌లో 7 వందలకు పైగా కులాలున్నట్టు అంచనా. ఆ లెక్కన ఏపీ కులగణన ప్రాజెక్టు బిహార్ కన్నా మూడు నాలుగు రెట్లు పెద్దది. రెండేళ్ళ క్రితం బిహార్ రాష్ట్ర అఖిలపక్షం ఢిల్లీ వెళ్ళి కులగణన చేపట్టాలని ప్రధాని నరేంద్ర మోదీ, హోంమంత్రి అమిత్‌షాలను కోరింది. దానికి వాళ్ళు అంగీకరించలేదు. కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి నిత్యానంద రాయ్ ఎస్సీ, ఎస్టీ మినహా మరెవ్వరికీ కులగణన నిర్వహించడం తమ విధానం కాదని 2021 జులై 20న పార్లమెంటులో ఒక విస్పష్ట ప్రకటన చేశారు. బీజేపీది ఒక విచిత్రమైన వ్యవహారం. ఒకవైపు, ఉచితాలు దేశఆర్థిక వ్యవస్థను దెబ్బతీస్తాయి అంటుంది; ఎన్నికల ప్రచారంలో తామర తంపరగా ఉచితాలను ప్రకటిస్తుంది. ఒకవైపు, కులం వంటి సంకుచిత భావాలకు తాము దూరం అంటుంది. ఎన్నికలకు ముందు కుల సమ్మేళ నాలు నిర్వహిస్తుంది. ఈ ఏడాది మొదట్లో కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా బీజేపీ నిర్వహించిన కుల సమ్మేళనాలను చూశాం. ఇప్పుడు ఐదు రాష్ట్రాల ఎన్నికల్లో మళ్ళీ అలాంటివే చూస్తున్నాం. ప్రధాని నరేంద్ర మోదీ హైదరాబాద్ లో ‘బీసీ సమ్మేళనం’లో పాల్గొన్నారు; నాలుగు రోజుల్లో మళ్ళీ వచ్చి ‘మాదిగ సమ్మేళనం’లో పాల్గొన్నారు. కానీ, విధాన పరంగా వారు కులగణనకు వ్యతిరేకం. నిజానికి సామాజిక న్యాయానికి కులగణన ఒక ప్రాతిపదిక అవుతుంది. సంక్షేమ పథకాలను అడగడానికి ప్రజలకూ, వాటిని రూపొందించడానికి ప్రభుత్వాలకూ అది ఆధారంగా మారుతుంది. ఇప్పుడు కుల గణన ‘ఇండియా కూటమి’కి కొత్త అస్త్రంగా మారింది. కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధి ప్రతి సభలోనూ ‘జిత్నీ ఆబాదీ; ఉత్నా హక్’, ‘జిస్కి జిత్ని భాగేదారీ; ఉస్కీ ఉత్నీ హిస్సేదారీ’ (ఎంత జనాభో అంత హక్కు) అంటున్నారు. ఏపీలో తలపెట్టనున్న కులగణన విజయవంతం కావడం రాజకీయంగా వైసీపీ కన్నా సమాజానికి మరింత మేలు చేస్తుంది. - డానీ వ్యాసకర్త సామాజిక విశ్లేషకులు -
ఏనుగుల లెక్క తేలుద్దాం.. ఈ నెల 17వ తేదీ నుంచి...
సాక్షి, అమరావతి: దక్షిణాది రాష్ట్రాల్లో ఏనుగుల లెక్క తేల్చేందుకు ఆయా రాష్ట్రాల అటవీ శాఖలు సిద్ధమయ్యాయి. ఈ నెల 17వ తేదీ నుంచి 3 రోజులపాటు ఏనుగుల గణన చేపట్టనున్నారు. మన రాష్ట్రంలోని కౌండిన్య ఏనుగుల అభయారణ్యం, శ్రీ వెంకటేశ్వర నేషనల్ పార్క్, శేషాచలం అటవీ ప్రాంతాల్లో లెక్కింపు చేపట్టనున్నారు. చిత్తూరు జిల్లా పలమనేరు అటవీ ప్రాంతంలో ఏనుగుల సంచారం ఎక్కువగా ఉంది. తమిళనాడు సరిహద్దుల నుంచి ఈ ప్రాంతంలోకి ఏనుగులు వస్తుండటంతో వాటి కోసం చాలాకాలం క్రితం కౌండిన్య అభయారణ్యాన్ని నెలకొల్పారు. శేషాచలం అడవులు, ఎస్వీ నేషనల్ పార్క్‌లోనూ ఏనుగులు ఉన్నాయి. ప్రస్తుతం ఈ ప్రాంతాల్లో సుమారు 175 ఏనుగులు ఉన్నట్టు అంచనా వేశారు. తాజా లెక్కింపు పూర్తయితే వాటి సంఖ్య పెరిగిందా.. తగ్గిందా అనేది తేలుతుంది. ఒకేసారి ఎందుకంటే..! ఏనుగులు నీటి లభ్యతను బట్టి ఒక ప్రాంతం నుంచి మరొక ప్రాంతానికి సంచరిస్తూ ఉంటాయి. ఈ క్రమంలోనే అవి ఒక రాష్ట్రం నుంచి మరొక రాష్ట్రంలోకి ప్రవేశించి అటూఇటూ తిరుగుతూ ఉంటాయి. దీంతో రాష్ట్రాల వారీగా లెక్కింపు చేపట్టినప్పుడు రెండుచోట్లా వాటిని లెక్కించడంతో ఇబ్బందులు ఎదురవుతున్నాయి. ఈ నేపథ్యంలోనే అటవీ సరిహద్దులు ఉన్న రాష్ట్రాల్లో ఒకేసారి లెక్కింపు జరపాలని నిర్ణయించారు. అందులో భాగంగానే దక్షిణ భారతదేశంలోని కర్ణాటక, కేరళ, ఏపీ, తమిళనాడు, గోవా, మహారాష్ట్రలోని కొంత ప్రాంతంలో ఒకేసారి ఈ నెల 17, 18, 19 తేదీల్లో లెక్కింపు జరపనున్నారు. లెక్క.. పక్కా..! ఇందుకోసం కర్ణాటక అటవీ శాఖ రూపొందించిన మోడల్‌ను అనుసరిస్తున్నారు. అక్కడ ఏనుగుల సంఖ్య వేలల్లో ఉండటంతో చాలా జాగ్రత్తగా నిర్వహించడానికి ఏర్పాట్లు చేస్తున్నారు. అదే విధానంలో మన రాష్ట్రంలో లెక్కింపు నిర్వహించడానికి అటవీ శాఖ సిద్ధమైంది. మొదటి రోజు 17వ తేదీన అటవీ ప్రాంతంలోని బ్లాకుల పరిధిలో బీట్ల వారీగా 5 చదరపు కిలోమీటర్ల పరిధిలో 15 కిలోమీటర్లు తిరిగి లెక్కింపు జరపనున్నారు. ఇందుకోసం బీట్ల వారీగా ఇద్దరు, ముగ్గురితో బృందాలు ఏర్పాటు చేశారు. రెండవ రోజు నిర్దేశించిన రెండు కిలోమీటర్ల ప్రాంతంలో తిరిగి ఏనుగుల గుంపులను బట్టి లెక్కింపు జరుపుతారు. మూడవరోజు చెరువులు, మైదానాల్లో నేరుగా ఏనుగుల గుంపుల వద్దకెళ్లి వాటి ఫొటోలు తీసి లెక్కిస్తారు. గుంపులో పెద్దవైన ఆడ, మగ ఏనుగులు.. ఆ తర్వాత పెద్దవైన మగ, ఆడ ఏనుగులు.. పిల్లలు, దంతాలు లేని ఏనుగులు (మఖనా), గుంపు నుంచి వేరుపడిన ఒంటరి ఏనుగులుగా వాటిని వర్గీకరించి లెక్కింపు చేపట్టనున్నారు. ప్రణాళికాబద్ధంగా లెక్కింపు దక్షిణాది రాష్ట్రాలతో కలిసి ఒకేసారి ఏనుగుల లెక్కింపును ప్రణాళికాబద్ధంగా చేపడుతున్నాం. ఇందుకోసం పక్కా ప్రణాళిక సిద్ధం చేశాం. మూడు విధాలుగా లెక్కింపు నిర్వహించడానికి సన్నాహాలు జరుగుతున్నాయి. – శాంతిప్రియ పాండే, ఏపీ సీసీఎఫ్ (వైల్డ్ లైఫ్), ఏపీ అటవీ శాఖ -
అకాల వర్షాలపై సీఎం జగన్ కీలక ఆదేశాలు
తాడేపల్లి: అకాల వర్షాలపై అధికారులకు సీఎం జగన్ కీలక ఆదేశాలు జారీ చేశారు. వానల వల్ల జరిగిన పంట నష్టంపై ఎన్యుమరేషన్ ప్రారంభించాలని సూచించారు. వారం రోజుల్లో దీనికి సంబంధించి నివేదికలు ఇవ్వాలని చెప్పారు. నివేదికల ఆధారంగా రైతులకు సహాయపడేందుకు తగిన విధంగా చర్యలు తీసుకోవాలని సీఎం జగన్ అధికారులకు స్పష్టం చేశారు. కాగా, ఉపరితల ఆవర్తనం, ద్రోణి ప్రభావంతో రాష్ట్రవ్యాప్తంగా భారీ వర్షాలు కురుస్తున్నాయి. అనేక ప్రాంతాల్లో పిడుగులు, వడగళ్లు హడలెత్తిస్తున్నాయి. దక్షిణ అంతర్గత కర్ణాటక నుంచి జార్ఖండ్ వరకు.. రాయలసీమ, తెలంగాణ, ఒడిశాల మీదుగా ఉత్తర ఛత్తీస్‌గఢ్ వరకు కొనసాగుతున్న ద్రోణి, ఉపరితల ఆవర్తనం ప్రభావంతో వర్షాలు కురుస్తున్నట్లు వాతావరణ శాఖ తెలిపింది. రాష్ట్రంలో ఆది, సోమవారాల్లో కూడా తేలికపాటి నుంచి ఓ మోస్తరు వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖాధికారులు తెలిపారు. ఆదివారం శ్రీకాకుళం, విజయనగరం, పార్వతీపురం మన్యం, అల్లూరి సీతారామరాజు, విశాఖపట్నం, అనకాపల్లి, కాకినాడ, కోనసీమ, తూర్పుగోదావరి, పశ్చిమగోదావరి, ఏలూరు, కృష్ణా జిల్లాల్లోని పలు ప్రాంతాల్లో పిడుగులతో కూడిన మోస్తరు నుంచి భారీ వర్షాలు పడే అవకాశముందని పేర్కొన్నారు. అలాగే, శ్రీకాకుళం, విజయనగరం, పార్వతీపురం మన్యం, అల్లూరి సీతారామరాజు, విశాఖపట్నం, అనకాపల్లి, కాకినాడ, కోనసీమ, తూర్పుగోదావరి, పశ్చిమగోదావరి, ఏలూరు, కృష్ణా, నెల్లూరు, తిరుపతి జిల్లాల్లో సోమవారం అక్కడక్కడా తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలుపడే అవకాశముందని తెలిపారు. చదవండి: భారీ వర్షాలు.. పిడుగులు -
ఆధార్ అదరహో..!
జిల్లాలో 94 శాతం మందికి ఆధార్ నంబర్లు పూర్తయిన ఆధార్-జనాభా అనుసంధానం ఎన్యుమరేషన్లో రాష్ట్ర స్థాయిలో ప్రథమం విజయనగరం కంటోన్మెంట్: జిల్లాలో 94 శాతం మందికి ఆధార్ ఉన్నట్లు జనగణన అధికారులు ధ్రుృవీకరించారు. కొద్దినెలల కిందట జిల్లాలో జనగణన-ఆధార్ అనుసంధానం కార్యక్రమం చేపట్టారు. జిల్లాలోని ఐదు మున్సిపాలిటీలు, 34 మండలాల్లో 5,680 నేషనల్ పాపులేషన్ రిజిస్టర్ బుక్ లెట్లతో జనాభా గణనను ఆధార్‌తో సరిపోల్చారు. ఇంటింటికీ తిరిగి సర్వే చేశారు. ఆధార్ అనుసంధానం చేస్తూ లేని వారి నుంచి ఆధార్ నంబర్లను తీసుకుని వివరాలు నమోదు చేశారు. గత ఏడాది అక్టోబర్ 23 నుంచి డిసెంబర్ 31 వరకూ ఈ గణన చేపట్టారు. ఈ వివరాలన్నింటినీ జాతీయ జనాభా గణన వెబ్సైట్లో పొందుపరిచారు. జనవరి 1 నుంచి ఫిబ్రవరి 28 వరకూ గణన అధికారులు వివరాలన్నింటినీ అప్లోడ్ చేశారు. మొత్తం 4,248 మంది ఎన్యూమరేటర్లు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. జిల్లాలో ఐదేళ్లలోపు వారిని మినహాయించి గణన చేపట్టారు. మొత్తం 22,26,475 మందిని ఆధార్‌తో సరిపోల్చారు. వీరిలో 94 శాతం మంది(20,94,106 మంది)కి ఆధార్ అనుసంధానం జరిగినట్టు గుర్తించారు. ఆధార్ లేకుండా కేవలం ఈఐడీ నెంబర్లతో 0.42 శాతం మంది ఉన్నారు. వీరికి ఆధార్ నంబర్లు ఇంకా రాలేదు. ఇటువంటి వారు జిల్లాలో 9,253 మంది ఉన్నారు. ఆధార్ లేకుండా 54,476 మంది ఉన్నట్టు జనాభా గణన ఎన్యుమరేటర్లు గుర్తించారు. వలసలు, ఇతర కారణాలతో 68,640 మంది అందుబాటులో లేకపోవడంతో ఆధార్‌ను అనుసంధానించలేకపోయారు. వీరికి జిల్లాలో ఆధార్ ఉందా లేక ఇతర ప్రాంతాల్లో ఉందానన్న విషయం తెలియలేదు. రాష్ట్రంలోనే జిల్లా ప్రథమం.. ఆధార్‌తో జనాభా గణనను అనుసంధానించే కార్యక్రమంలో జిల్లా ప్రథమ స్థానంలో నిలిచింది. మొత్తం 13 జిల్లాల్లోనూ గత ఏడాది అక్టోబర్ 23 నుంచి ఈ కార్యక్రమం ప్రారంభించారు. అయితే చాలా జిల్లాల్లో జనగణనకు సంబంధించిన సామగ్రి లేకపోవడంతో ఈ కార్యక్రమం ప్రారంభం కాలేదు. డిసెంబర్ 31 నాటికి ఆధార్ అనుసంధానం పూర్తయ్యే అవకాశం లేదని భావించిన ఉన్నతాధికారులు ఈ కార్యక్రమాన్ని మరికొద్ది నెలలు పొడిగించారు. విజయనగరం జిల్లాలో మాత్రం నిర్ణీత సమయానికే ఆధార్‌తో జనాభా గణను పూర్తి చే శారు. వివరాలను ఎన్పీఆర్ వెబ్సైట్లో కూడా పొందుపరిచారు. -
తీర గ్రామాల్లో ఎన్యుమరేషన్ చిచ్చు !
సాక్షి ప్రతినిధి, విజయనగరం : మత్స్యశాఖ చేపట్టిన ఎన్యుమరేషన్ గ్రామాల్లో చిచ్చు రేపుతోంది. హుద్‌హుద్ తుపాను ప్రభావిత ప్రాంతాల ఎన్యుమరేషన్లో అవకతవకలు చోటుచేసుకోవడంతో విభేదాలు పొడచూపుతున్నాయి. బోట్లే లేని వారి బోట్లు పోయాయని ఎలా చూపిస్తారని ఒక వర్గం వాదిస్తుంటే, మా పేర్లు చేర్చితే మీకేంటి నష్టమంటూ మరో వర్గం ప్రతివాదనకు దిగుతోంది. అనర్హులను జాబితాల్లో చేర్చడంతో మత్స్యశాఖ అధికారులపై ఆరోపణలు గుప్పుమంటున్నాయి. దీనికంతటికీ టీడీపీ నేతల ఒత్తిళ్లే కారణమని తెలుస్తోంది. హుద్‌హుద్ తుపాను బీభత్సానికి భోగాపురం, పూసపాటిరేగ మండలాల్లోని మత్స్యకార గ్రామాల్లో తీవ్ర నష్టం వాటిల్లింది. చాలా బోట్లు, వలలు కొట్టుకుపోవడమే కాకుండా మరికొన్ని బాగా దెబ్బతిన్నాయి. తుపాను తీరందాటిన అనంతరం ఎన్యుమరేషన్ చేపట్టగా 375 బోట్లు పూర్తిగా దెబ్బతిన్నట్టు అధికారులు గుర్తించారు. ఆ మేరకు బాధితుల జాబితా తయారు చేశారు. ఒక్కొక్క బోటుపై ఆధారపడ్డ ఐదుగురు కలాసీలకు, సదరు బోటు యాజమానికి చెరో రూ.10 వేలు చొప్పున పరిహారం అందిస్తామని ప్రభుత్వం ప్రకటించింది. ఇదే అవకాశంగా తీసుకుని అధికార పార్టీ నాయకులు జోక్యం చేసుకుని అధికారులపై ఒత్తిళ్లు చేసి నష్టం జరగని వారి పేర్లను జాబితాలో చేర్చారన్న ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. తమకు కావల్సిన వారందరికీ పరిహారం వచ్చేలా జాబితాలు తయారు చేయించారన్న విమర్శలున్నాయి. ఈ విషయమై గ్రామాల్లో గొడవలు జరుగుతున్నాయి. నష్టం జరిగిన వారి పేర్లతో పాటు ఎటువంటి నష్టం జరగని వారి పేర్లను జాబితాలో చేర్చడంపై గ్రామాల్లో అభిప్రాయబేధాలు ఏర్పడ్డాయి. గ్రామాల వారీగా తయారు చేసిన జాబితాలను చూసి కొంతమందైతే అవాక్కైపోతున్నారు. అసలు బోట్లే లేని వారిని ఎలా చూపించారంటూ ముక్కున వేలేసుకుంటున్నారు. నష్టం జరిగినవారికి, నష్టం జరగనివారికి తేడా ఏంటని?, ఇదేం పద్ధతి? అని ప్రశ్నిస్తున్నారు. ఒకవేళ అనర్హులను సైతం చేర్చాలనుకుంటే మిగతా వారిని కూడా కలపాలంటూ వాదనకు దిగుతున్నారు. ఒక్కొక్కరికీ ఒక్కో రూలా? అంటూ వాదులాడుకుంటున్నారు. మొత్తానికి గ్రామాల్లో ఇదొక చిచ్చులా తయారైంది. ఇదే విషయమై వైఎస్సార్సీపీ కేంద్ర పాలక మండలి సభ్యుడు పెనుమత్స సాంబశివరాజు నేతృత్వంలో మత్స్యకార సంఘ నాయకులు బర్రి చిన్నప్పన్న, ఎం.అప్పలకొండ, బర్రి రాయుడు తదితరులు సోమవారం మత్స్య శాఖ ఏడీ ఫణిప్రకాష్‌ను కలిసి నిలదీశారు. నష్టాల జాబితాలు తప్పుల తడకగా ఉన్నాయని, నష్టం జరగని వారి పేర్లును జాబితాల్లో చేర్చారని, టీడీపీ నాయకుల ఒత్తిళ్లకు తలొగ్గి జాబితాలు తయారు చేశారని బర్రి చిన్నప్పన్న, ఎం.అప్పలకొండ, బర్రి రాముడు తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. నిలదీస్తామనే ఉద్దేశంతోనే జన్మభూమి సమావేశాలకు మత్స్యశాఖ అధికారులు హాజరు కాలేదని, మత్స్యశాఖ కార్యాలయంలోనే ఈ అవకతవకలు జరిగాయని ఏడీ ఎదుటే ఆరోపించారు. ఎవరి మెప్పు కోసం ఇలా చేశారని ప్రశ్నించారు. ఈ సందర్భంగా అటు మత్స్య శాఖ ఏడీ ఫణిప్రకాష్, ఇటు మత్స్యకార సంఘం నాయకుల మధ్య తీవ్ర వాదోపవాదాలు జరిగాయి. ఇప్పటికైనా అధికారులు గ్రామాల్లోకి వచ్చి పరిశీలించి, విచారణ జరిపితే వాస్తవాలు బయటికొస్తాయని, అసలైన అర్హులకు న్యాయం జరుగుతుందని డిమాండ్ చేశారు. -
హుద్‌హుద్, తుపానుకు నెల
-
విలయానికి... నెల
* ఇంకా కళ్లముందే కనిపిస్తున్న బీభత్సం * సాగుతున్న ఎన్యుమరేషన్ * నష్టాల బేరీజులో అధికారులు * నేటికి రూ.2వేల కోట్లు దాటిన నష్టం సాక్షి ప్రతినిధి, విజయనగరం: సరిగ్గా ముప్పై రోజుల కిందట రాకాసి గాలి సుడులు తిరుగుతూ జి ల్లాను వణికించేసింది. నేటికి నెలనాళ్లవుతున్నా ఆ విలయం ఆనవాళ్లు ఇంకా మాయలేదు. అధికారు ల అంచనాలు కూడా ఇంకా సా...గుతూనే ఉ న్నా యి. ఇప్పటికే రూ.2వేల కోట్ల మేర నష్టం జరిగినట్టు తేలింది. ఇంకెంత తేలనుందో తెలి యని పరిస్థితి నెలకొంది. దీన్ని బట్టి విపత్తు ఏ స్థాయిలో ఉందో స్పష్టమవుతుంది. జిల్లా చరిత్రలో ఎన్నడూ లేని విధంగా నష్టం సంభవించింది. ఈ నష్టం అధికార వర్గాలను ఆశ్చర్యపరుస్తోంది. తుపాను గాయం నుంచి నెమ్మదిగా కోలుకుంటున్న జిల్లా ప్రజలకు అది మిగిల్చిన నష్టాన్ని చూసి బెంబెలెత్తిపోయే పరిస్థితి ఏర్పడింది. పునరుద్ధరణ పనులు ఇంకా సాగుతున్నాయి. పడిపోయిన చెట్లు, కూలి పోయిన ఇళ్లు ఎక్కడికక్కడ అలానే ఉన్నాయి. ఉద్యానవన తోటలైతే దిక్కుతోచని స్థితిలో ఉన్నా యి. తుపాను వెలిశాక నిత్యావసర సరుకులిచ్చి చేతులు దులుపుకున్న సర్కార్ పునరుద్ధరణ, పరి హారానికి సంబంధించి ఇంతవరకు పైసా కూడా విడుదల చేయలేదు. ఒకవైపు నష్టం అంచనాలకు అందని విధంగా ఉంది. అంతకంతకు పెరిగిపోతోంది. నెలరోజులగా ఎన్యుమరేషన్ చేస్తున్నా కొ లిక్కి రావడం లేదు. ఇదొక ప్రహసనంలా సాగిపోతోంది. ఇదెప్పటికి పూర్తవుతుందో? పునరుద్ధరణ జరిగేదెప్పుడో? పరిహారం వచ్చేదెప్పుడో? ప్రజ ల నష్టం తీరెదెప్పుడో తెలియని దుస్థితి నెల కొంది. ఇప్పటివరకైతే సుమారు రూ.2వేల కోట్ల నష్టం తేలింది. ఇంకా ఎంత పెరుగుతుందో చెప్పలేమని సాక్షాత్తు ఎన్యుమరేషన్ అధికారులు చెబుతున్నారు. దీన్నిబట్టి హుద్‌హుద్ బీభత్సం ఎంత మేర సాగిందో అర్థం చేసుకోవచ్చు. ఆ నష్టాల వివరాలివి. ఊవ్యవసాయ శాఖ పరిధిలోకి వచ్చే 5,923.5హెక్టార్లలో వివిధ పంటలు దెబ్బతినగా 83.38 కోట్లు మేర నష్టం సంభవించింది. * 42,348హెక్టార్లలో ఉద్యానవన పంటలు నాశనమవ్వగా 21.23కోట్ల మేర నష్టం వాటిల్లింది. * పట్టు పరిశ్రమకు 11.90లక్షల నష్టం జరిగింది. * 15,991ఇళ్లు దెబ్బతినగా 8.70కోట్లు నష్టం ఏర్పడింది. * 23.96కోట్ల విలువైన జీవాలు చనిపోయాయి. * 77.69కోట్ల మేర రాష్ట్ర ప్రభుత్వ ఆస్తులు ధ్వంసమయ్యాయి. * 11.44కోట్ల మేర కేంద్ర ప్రభుత్వ ఆస్తులు దెబ్బతిన్నాయి. * 22.01కోట్ల మేర ప్రైవేటు ఆస్తులకు నష్టం వాటిల్లింది. * ఆర్అండ్బీ రోడ్లు, ఇతరత్రా ఆస్తులకు 194.73కోట్ల నష్టం సంభవించింది. * పరిశ్రమలకు రూ.874కోట్లు నష్టం జరిగింది. * ఐటీడీఏ పరిధిలో రూ.3.69కోట్ల నష్టం ఏర్పడింది. * పంచాయతీరాజ్ రోడ్లు, ఇతరత్రా ఆస్తులకు 183కోట్ల నష్టం వాటిల్లింది. * పంచాయతీ, గ్రామీణాభివృద్ధి శాఖకు 23. 99కోట్ల నష్టాన్ని మిగిల్చింది. * మున్సిపాలిటీల పరిధిలో 279.33కోట్ల మేర నష్టం జరిగింది. * చిన్న నీటిపారుదల శాఖకు 40.32కోట్ల నష్టాన్ని తెచ్చిపెట్టింది. * గ్రామీణ రక్షిత మంచినీటి సరఫరా విభాగానికి 6.05కోట్ల నష్టాన్ని మిగిల్చింది. * మత్స్యశాఖ పరిధిలోకి వచ్చే వాటికి 28.37కోట్ల నష్టం ఏర్పడింది. * వైద్య ఆరోగ్య శాఖకు 29.62కోట్లు నష్టం జరిగింది. * ట్రాన్స్‌కోకు 41.48కోట్ల నష్టం సంభవించింది.


