Sakshi: Telugu Breaking News | Latest Telugu News | తెలుగు వార్తలు | Online Telugu News Today
Sakshi News home page

Top Stories

Advertisement

ప్రధాన వార్తలు

AP Home Minister Taneti Vanitha Speaks With DGP In Phone
AP: డీజీపీకి హోంమంత్రి తానేటి వనిత ఫోన్ 

విజయవాడ: ఆంధ్రప్రదేశ్ డీజీపీ హరీష్ గుప్తాతో రాష్ట్ర హోంమంత్రి తానేటి వనిత ఫోన్‌లో మాట్లాడారు. ఎన్నికల సందర్భంగా పలు చోట్ల తలెత్తిన హింసాత్మక ఘటనలను ఆమె డిజిపి దృష్టికి తీసుకొచ్చారు. చంద్రగిరి, గురజాల తాడిపత్రి గోపాలపురం తదితర నియోజకవర్గాల్లో టిడిపి నాయకులు, కార్యకర్తలు చేసిన హింసకాండ అంశాలపై డీజీపీతో ఆమె మాట్లాడారు.ఎమ్మెల్యేలపై దాడులు చేస్తుంటే స్థానిక పోలీసులు నిర్లిప్తంగా వ్యవహరిస్తున్నారని డీజీపీ దృష్టికి తీసుకెళ్లారు. టిడిపికి ఓటు వేయలేదు అన్న కారణాలతో మహిళలు, బీసీ, ఎస్సీ, ఎస్టీలపై టీడీపీ నాయకులు దాడులు చేస్తున్నారన్నారు. టీడీపీ నాయకుల దాడులను స్థానిక పోలీసుల దృష్టికి తీసుకొచ్చినా స్థానిక పోలీసులు పట్టీ పట్టనట్లు వ్యవహరిస్తున్నట్లు డీజీపీకి తెలిపారు.దాడులకు పాల్పడ్డ నాయకులను, కార్యకర్తలను చట్టం ప్రకారం వెంటనే అరెస్టు చేయాలని ఆమె కోరారు. పోలీసులు ఎలాంటి చర్యలు తీసుకున్నారో కచ్చితంగా తెలియజేయాలని డీజీపీని కోరారు. రాష్ట్రంలో ఎలక్షన్ కమిషన్ నియమించిన భద్రతా వ్యవహారాల పరిశీలకుడు ఏకపక్షంగా వ్యవహరిస్తున్నారని సమాచారం ఉన్నట్లు హోం మంత్రి తెలిపారు.

KSR Comment On AP Elections After Poling
వైఎస్సార్‌సీపీలో ఉన్నంత కాన్ఫిడెన్స్‌.. కూటమిలో లేదు!

ఆంధ్రప్రదేశ్ శాసనసభ ఎన్నికల ఘట్టం ముగియడంతో సర్వత్రా ఎవరు గెలుస్తారన్నదే చర్చగా సాగుతోంది. ఈ ఎన్నికలు ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ కేంద్రంగా జరిగిన ఎన్నికలు కావడంతో అంతా ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ఈ ఎన్నికలలో జగన్ విజయం సాధిస్తే అది దేశానికి ఒక మోడల్ అవుతుంది.జగన్ తీసుకువచ్చిన పలు వ్యవస్థలను దేశ వ్యాప్తంగా అమలు చేయడానికి వివిధ రాష్ట్రాలు ముందుకు వస్తాయి.జగన్‌ను ఒంటరిగా ఓడించలేమన్న నిశ్చితాభిప్రాయానికి వచ్చిన తెలుగుదేశం పార్టీ కాళ్లావేళ్ల పడి జనసేన, బీజేపీలతో పొత్తు పెట్టుకుంది. అయినా ఎంతవరకు ప్రయోజనం కలిగిందన్నది ప్రశ్నార్దకమే. మూడు పార్టీల కూటమి కావడంతో బలం పెరిగిందని,తెలుగుదేశం పార్టీ నౌ ఆర్ నెవర్ అన్న చందంగా పని చేసిందని, ఆ పార్టీకి జీవన్మరణ సమస్య కావడంతో ఈనాడు, ఆంధ్రజ్యోతి వంటి మీడియా సంస్థలు తమను తాము భ్రష్టు పట్టించుకుంటూ కూడా అబద్దాలు ప్రచారం చేశాయని, వాటన్నిటి పలితంగా గెలిచే అవకాశం లేకపోలేదన్నది ఆ పార్టీవారి భావనగా ఉంది.అయినా వైఎస్సార్‌సీపీలో కాన్ఫిడెన్స్ తెలుగుదేశం కూటమిలో కనిపించడం లేదన్నది సత్యం.. నిజంగానే టీడీపీ కూటమి గెలుస్తుందన్న నమ్మకం కలిగి ఉంటే ,ఈనాడు, ఆంధ్రజ్యోతిలు అదే తరహాలో కూటమి గెలుపు ఖాయం అన్న శీర్షిక బ్యానర్‌ ఇచ్చేవని, అలా చేయకపోవడం కూడా టీడీపీ ఓటమికి ఒక సంకేతం అన్న విశ్లేషణ వస్తోంది.నిజానికి ఈనాడుకు ఉన్న నెట్ వర్క్ రీత్యా, సోమవారం సాయంత్రానికి జనాభిప్రాయ సేకరణ పూర్తి చేసి వాస్తవ పరిస్థితిని ఇచ్చి ఉండవచ్చు. అలా చేయలేదంటే వారికి కూటమి విజయంపై సందేహం కలిగి ఉండవచ్చని కొందరు అంటున్నారు. ఒకవేళ మంగళవారం ఏమైనా ఇస్తారేమో తెలియదు. కాని కేవలం టీడీపీ వర్గాల ధీమా పేరుతోనే కథనాలు ఇచ్చారు. వైఎస్ జగన్ ప్రభుత్వ పనితీరుకు ఒక రిఫరెండంగా పరిగణించే ఈ ఎన్నికలలో మహిళలు ,వివిధ సంక్షేమ పధకాల లబ్దిదారులు పెద్ద ఎత్తున తరలిరావడంతో వైఎస్సార్‌సీపీ గెలుపు ఖాయమన్నది ఆయా వర్గాలలో వినిపిస్తున్నమాట.ఓవరాల్‌గా చూసినప్పుడు అత్యధికులు వైఎస్సార్‌సీపీ ప్రభుత్వం వస్తుందనే విశ్వసిస్తున్నారు. దీనికి కొన్ని కారణాలు బలీయంగా కనిపిస్తున్నాయి. అవేమిటో చూద్దాం. టీడీపీ కూటమిలో భాగస్వాములుగా ఉన్న బీజేపీ, జనసేనలు కలిసి 31 నియో.జకవర్గాలలో పోటీచేశాయి. వారికి ఉన్న బలాబలాల రీత్యా, టీడీపీ నుంచి వచ్చే ఓట్ల బదలాయింపు వంటి అంశాల కారణంగా ఈ రెండు పార్టీలు కలిసి ఐదు నుంచి పది సీట్లు మాత్రమే గెలవవచ్చన్నది ఒక అంచనా. ఈ లెక్కన వైఎస్సార్‌సీపీ ఇరవై సీట్లను సునాయాసంగా గెలుచుకునే అవకాశం ఉంది. రాయలసీమ ప్రాంతంలో వైఎస్సార్‌సీపీ తిరుగులేని ఆధిక్యత ఉంది.గత ఎన్నికలలో సైతం 52 సీట్లకు గాను నలభై తొమ్మిదింటిని వైఎస్సార్‌సీపీ గెలుచుకుంది. 2024 ఎన్నికలలో సైతం వైఎస్సార్‌సీపీ వేవ్ రాయలసీమ అంతటా ఉంది. అయినప్పటికీ కొన్ని సీట్లు తగ్గుతాయని అనుకున్నా, మినిమమ్ ముప్పై ఐదు నుంచి నలభై సీట్లు రావచ్చని అంతా అంగీకరిస్తున్నారు. అంటే ఇప్పటికి ఏభై సీట్లు వైఎస్సార్‌సీపీ గెలుచుకున్నట్లు లెక్క అవుతుంది. ఉత్తరాంధ్రలో వైఎస్సార్‌సీపీ బలం బాగా ఉంది.అక్కడ ఉన్న ముప్పై నాలుగు సీట్లలో కనీసం పదిహేడు నుంచి ఇరవై సీట్లు వైఎస్సార్‌సీపీ గెలుచుకోవచ్చు. అదే జరిగితే ఇక్కడికి డెబ్బై సీట్లు గెలిచినట్లు అవుతుంది. ఇక ఇరవై సీట్లు తెచ్చుకుంటే వైఎస్సార్‌సీపీ గెలిచినట్లే అవుతుంది.టీడీపీ పొత్తు పెట్టుకున్న కారణంగా ముస్లిం మైనార్టీలు కూటమికి దూరం అయ్యారు. వారు కనీసం నలభై నుంచి ఏభై నియోజకవర్గాలలో ప్రభావం చూపవచ్చు. ముస్లింలకు రిజర్వేషన్లు ఎత్తివేస్తామని బీజేపీ చేసిన ప్రకటన కూడా ముస్లింలలో ఆగ్రహానికి కారణం అయింది. ఈ నేపధ్యంలో రాయలసీమలో అధిక శాతం ఉన్న ముస్లింలు వైఎస్సార్‌సీపీవైపు మొగ్గు చూపుతున్నారు. కోస్తా ఆంధ్రలో సైతం అదే పరిస్తితి ఉంది. నెల్లూరు నుంచి తూర్పుగోదావరి జిల్లా వరకు ఉన్న ఆరు జిల్లాలలో నలభై సీట్లు రావడం కష్టం కాదు. అంటే ఈ లెక్కన కనీసం 110 సీట్లు వైఎస్సార్‌సీపీకి రావడం ,తిరిగి జగన్ ముఖ్యమంత్రి కావడం తధ్యం అనిపిస్తుంది. 2014లో ఉన్న కూటమి పరిస్థితులు ఇప్పుడు లేవు. అప్పుడు నరేంద్ర మోదీ హవా బాగా పనిచేసింది.అలాగే అప్పుడే పవన్ కళ్యాణ్ రాజకీయ పార్టీని పెట్టడం, కాపు వర్గాన్ని బాగా ఆకర్షించడం కారణంగా టీడీపీ అధికారంలోకి రాగలిగింది.ఇప్పుడు ఆ పరిస్థితి లేదు. ఈ మూడు పార్టీలు 2019 ఎన్నికల సమయంలో ఒకదానిని ఒకటి తిట్టుకున్నాయి. విమర్శించుకున్నాయి. బీజేపీతో పొత్తు కేవలం కేంద్ర ప్రభుత్వాన్ని తమ అవసరాలకు వాడుకోవడం, ఎన్నికల సంఘాన్ని ప్రభావితం చేయడం కోసమేనన్న సంగతి అందరికి అర్దం అయింది. ముఖ్యమంత్రి జగన్ ఇచ్చిన హామీలు దాదాపు నెరవేర్చడం , ఆయన ఒంటరిగా ధైర్యంగా ఎన్నికల గోదాలోకి దిగడం, ఒక సిస్టమాటిక్ గా సభలు నిర్వహించడం , ఆచరణ సాధ్యమైన హామీలనే ఇవ్వడం వంటి కారణాల వల్ల ప్రజలలో ఆయన పట్ల ఒక నమ్మకం కుదిరింది. ప్రత్యేకించి పేద, బలహీనవర్గాలలో అది బాగా ప్రస్పుటంగా కనిపించింది. సామాజికంగా కూడా జగన్ పలు ప్రయోగాలు చేసి బిసిలకు ఎక్కువ సీట్లు ఇవ్వగలిగారు.అది కూడా ప్లస్ పాయింట్ గా ఉంది. జగన్ ఎక్కువగా పాజిటివ్ ఓటుపై ఆధారపడితే విపక్ష కూటమి నెగిటివ్ ఓటుపైనే ఆధారపడింది. వారి మానిఫెస్టోని ఎవరూ విశ్వసించడం లేదు. తెలుగుదేశం కు ఓటు వేయాలని అనుకున్నవారు సైతం ఆ ఎన్నికల ప్రణాళిక అయ్యేది కాదని తెలిసినా, ఇతర కారణాల రీత్యానే ఓట్లు వేశారు.గతంలో జగన్ ఈ స్కీములను అమలు చేస్తుంటే శ్రీలంక అయిపోయిందని ప్రచారం చేసిన చంద్రబాబు తన మానిఫెస్టోలో అంతకు మించి రెండు,మూడు రెట్లు సంక్షేమ పధకాలు అమలు చేస్తామని అనడంతో జగన్ గ్రాఫ్ బాగా పెరిగింది. అబద్దాల ప్రచారాన్ని నమ్ముకుని టీడీపీ పనిచేసింది. లేని లాండ్ టైటిలింగ్ యాక్ట్ వల్ల భూములను జగన్ లాక్కుంటారంటూ తప్పుడు ప్రచారం చేశారు. అసెంబ్లీలో టీడీపీ మద్దతు ఇచ్చిన బిల్లునే మాటమార్చి వ్యతిరేకిస్తోందని చెప్పడంలో వైఎస్సార్‌సీపీ చాలా వరకు సఫలం అయింది.అది కూడా టీడీపీకి నష్టం చేసిందని చెప్పవచ్చు. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలు, రెడ్లు, అగ్రవర్ణాలలోని అధికశాతం పేదలు జగన్‌కు మద్దతు ఇస్తున్నారు. ఆ ప్రభావం పోలింగ్ పై స్పష్టంగా కనబడింది. ఈకాంబినేషన్ అలాగే కొనసాగితే జగన్ ను ఓడించడం అసాద్యం. 2019 లో ఇవే సామాజికవర్గాలు జగన్ కు భారీ ఎత్తున మద్దతు ఇచ్చాయి. అవి ఇప్పటికీ అలాగే కొనసాగుతుండడం జగన్‌కు కలిసి వచ్చే పాయింట్. తమ కోసం లక్షల మంది కార్లు వేసుకుని హైదరాబాద్ తదితర ప్రాంతాల నుంచి వచ్చారని టీడీపీ వాదిస్తోంది. కార్లలో వెళ్లినవారు పెత్తందార్లకు ప్రతినిధులుగా ఉంటే, బస్‌లు, ట్రైన్లలో వెళ్లినవారు పేద ప్రజలకు ప్రతినిదులగా చెప్పవచ్చు. ఆ రకంగా చూసుకున్నా, ఇలా వెళ్లినవారిలో వైఎస్సార్‌సీపీ సానుభూతి పరులే ఎక్కువగా కనిపిస్తారు. సామాజికవర్గాల సమీకరణ రీత్యా చూసినా, ప్రాంతాల వారీగా పరిశీలించినా, రాజకీయ కోణాలలో అద్యయనం చేసినా, ఏపీలో మళ్లీ వచ్చేది వైఎస్సార్‌సీపీ కూటమి ప్రభుత్వమేనన్న అభిప్రాయం కలుగుతుంది. పోటీ బాగా టైట్‌గా సాగితే వైఎస్సార్‌సీపీకి కనీసం 100 నుంచి 110 సీట్లు వస్తాయి.అది వేవ్‌గా మారితే వైఎస్సార్‌సీపీ గత ఎన్నికల మాదిరి 150 వరకు రావడం కష్టం కాదన్న అభిప్రాయం వ్యక్తం అవుతోంది.– కొమ్మినేని శ్రీనివాసరావు, సీనియర్‌ పాత్రికేయులు

20 cases On Man Behind Mumbai Billboard That Collapsed
ముంబై హోర్డింగ్ కుప్పకూలిన ఘటన,.. వెలుగులోకి కీలక విషయాలు

ముంబై: మహారాష్ట్ర రాజధాని ముంబయిలో హోర్డింగ్‌ కూలిన ఘటనలో కీలక విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. ‘ఇగో మీడియా ప్రైవేట్‌ లిమిటెడ్‌’ యాడ్‌ ఏజెన్సీ యజమాని భవేష్‌ భిండేపై హత్యకేసు నమోదైంది. అయితే అతనిపై పోలీసు కేసులు కొత్తేమి కాదు. ఓ అత్యాచార కేసుతో సహా దాదాపు 20 కేసుల్లో భవేష్‌ నిందితుడిగా ఉన్నారు. ప్రస్తుతం భిండే పరారీలో ఉన్నాడని, అతని ఫోన్‌ కూడా స్విచ్ఛాఫ్‌ వస్తుందని పోలీసులు పేర్కొన్నారు.అడ్వర్టైజింగ్ ఏజెన్సీ యజమాని 2009లో మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికలలో ములుండ్ నియోజకవర్గం నుంచి స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేశాడు. ఆయన సమర్పించిన అఫిడవిట్‌ ప్రకారం ముంబై మున్సిపల్ కార్పొరేషన్ చట్టం, నెగోషియబుల్ ఇన్‌స్ట్రుమెంట్ యాక్ట్(చెక్‌ బౌన్స్‌) కింద తనపై 23 కేసులు నమోదయ్యాయి. ఈ ఏడాది జనవరిలో అతనిపై ములుంద్ పోలీస్ స్టేషన్‌లో అత్యాచారం కేసు నమోదైంది. ఛార్జిషీట్ కూడా దాఖలు చేశారు పోలీసులు. అయితే ముందస్తు బెయిల్‌పై ప్రస్తుతం బయట ఉన్నాడు.రాష్ట్రంలో హోర్డింగ్‌లు,బ్యానర్‌లను ఏర్పాటు చేయడం కోసం గత కొన్నేళ్లుగా భిండే భారతీయ రైల్వేలు, ముంబై పౌర సంస్థ, బృహన్‌ముంబయి మున్సిపల్ కార్పొరేషన్ (BMC) నుంచి అనేక కాంట్రాక్టులను పొందినట్లు తెలుస్తోంది. అయితే చాలాసార్లు ఆయన నిబంధనలను ఉల్లఘించినట్లు సంబంధిత వర్గాలు వెల్లడించాయి. భిండేతోపాటు అతని కంపెనీలలోని అనేక మంది చెట్లకు విషం, చెట్ల నరికివేత కేసుల్లో నిందితులుగా ఉన్నారు.ముంబైలోని ఘాట్‌కోపర్‌లో సోమవారం అకాల వర్షం, ఈదురు గాలులతో ఓ భారీ బిల్‌ బోర్డ్‌ పక్కనే ఉ న్న పెట్రోల్‌ పంపుపై కుప్పకూలిన సంగతి తెలిసిందే. ఈ ఘటనలో మృతుల సంఖ్య 14కు చేరింది. మరో 74 మంది తీవ్రంగా గాయపడ్డారు. కూలిన హోర్డింగ్‌ కింద నుజ్జునుజ్జయిన కార్లలో ఇంకా కొంత మంది చిక్కుకొని ఉండొచ్చని, మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశాలు ఉన్నాయని అధికారులు చెబుతున్నారు.

 DC Keep Playoff Dreams Alive With 19-Run Win Over LSG
లక్నోపై ఢిల్లీ ఘన విజయం.. ప్లే ఆఫ్స్‌ ఆశలు సజీవం

ప్లే ఆఫ్ రేసులో నిలవాలంటే కచ్చితంగా గెలవాల్సిన మ్యాచ్ లో ఢిల్లీ క్యాపిటల్స్‌ సత్తాచాటింది. అరుణ్‌ జైట్లీ స్టేడియం వేదికగా లక్నో సూపర్‌ జెయింట్స్‌తో మ్యాచ్‌లో 19 పరుగుల తేడాతో ఢిల్లీ విజయం సాధించింది. దీంతో ఢిల్లీ తమ ప్లే ఆఫ్స్‌ ఆశలను సజీవంగా ఉంచుకుంది. అయితే ఢిల్లీ ప్లే ఆఫ్స్‌ భవితవ్యం ఇతర జట్ల గెలుపోటములుపై ఆధారపడి ఉంటుంది. ఇక ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్‌ చేసిన ఢిల్లీ క్యాపిటల్స్ నిర్ణీత 20 ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి 208 పరుగుల భారీ స్కోర్ సాధించింది.ఢిల్లీ బ్యాటర్లలో అభిషేక్ పోరెల్‌(58), ట్రిస్టన్ స్టబ్స్‌(57) అద్బుతమైన హాఫ్ సెంచరీలతో చెలరేగారు. వారిద్దరితో పాటు షాయ్ హోప్‌(38), కెప్టెన్ రిషబ్ పంత్‌(33) పరుగులతో రాణించారు. ఇక లక్నో బౌలర్లలో నవీన్ ఉల్ హక్ రెండు వికెట్లు పడగొట్టగా.. అర్షద్ ఖాన్‌, బిష్ణోయ్ తలా వికెట్ సాధించారు.చెలరేగిన ఇషాంత్‌..అనంతరం 209 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన లక్నో సూపర్‌ జెయింట్స్‌ నిర్ణీత 20 ఓవర్లలో 9 వికెట్లు కోల్పోయి 189 పరుగులకే పరిమితమైంది. లక్నో టెయిలాండర్‌ అర్షద్‌ ఖాన్‌ అద్బుతమైన పోరాట పటిమ కనబరిచనప్పటికి తన జట్టును గెలిపించలేకపోయాడు. 7వ స్ధానంలో బ్యాటింగ్‌లో వచ్చిన అర్షద్‌.. ఢిల్లీ బౌలర్లపై ఎదురుదాడికి దిగాడు. లక్ష్య చేధనలో 102 పరుగులకే 6 వికెట్లు కోల్పోయిన సమయంలో క్రీజులోకి వచ్చిన అర్షద్‌ ఖాన్‌.. గెలుపు అంచుల దాకా తీసుకువచ్చాడు. 33 బంతులు ఎదుర్కొన్న అర్షద్‌.. 3 ఫోర్లు, 5 సిక్స్‌లతో 58 పరుగులు చేశాడు. అతడితో పాటు నికోలస్‌ పూరన్‌(61) కూడా మెరుపు ఇన్నింగ్స్‌ ఆడాడు. వీరిద్దరూ మిగితా బ్యాటర్లంతా దారుణంగా విఫలమయ్యారు. ఇక ఢిల్లీ బౌలర్లలో ఇషాంత్‌ శర్మ మూడు వికెట్లు, ఖాలీల్‌ అహ్మద్‌, అక్షర్‌ పటేల్‌, స్టబ్స్‌, ముఖేష్‌ కుమార్, కుల్దీప్‌ యాదవ్‌‌ తలా వికెట్‌ సాధించారు.​

CM YS Jagan Tweet On AP Election Polling
ఏపీ పోలింగ్‌పై సీఎం జగన్‌ ట్వీట్‌

సాక్షి, తాడేపల్లి: ఆంధ్రప్రదేశ్‌ అసెంబ్లీ, లోక్‌సభ ఎన్నికల పోలింగ్‌ ఘట్టం ముగిసింది. రాష్ట్రంలోని 175 అసెంబ్లీ నియోజకవర్గాల పరిధిలో ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. కాగా ఏపీలో ఈసారి రికార్డు స్థాయిలో ఓటింగ్ నమోదైంది. గత ఎన్నికలతో పోలిస్తే ఈసారి అత్యధికంగా 80 శాతానికిపైగా పోలింగ్ నమోదైనట్లు తెలుస్తోంది.తాజాగా ఏపీలో నమోదైన పోలింగ్‌, ఓటర్లను ఉద్ధేశిస్తూ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌ రెడ్డి ట్వీట్‌ చేశారు. మండుటెండల్లోనూ తనకు ఓటువేసి ఆశీర్వదించేందుకు సునామీల తరలివచ్చిన ఓటర్లకు ధన్యవాదాలు తెలిపారు. వైఎస్సార్‌సీపీ గెలుపుకోసం చెమటోడ్చి శ్రమించిన కార్యకర్తలందరికీ హృదయపూర్వక కృతజ్ఞతలు తెలిపారు. ఇప్పటి వరకు సాగిన పాలన మరింత మెరుగ్గా కొనసాగుతుందని హామీ ఇచ్చారు.నిన్న జరిగిన ఎన్నికల్లో మండుటెండలు సైతం లెక్కచేయకుండా నాకు ఆశీస్సులు ఇవ్వడానికి సునామీలా తరలివచ్చిన నా అవ్వతాతలకు, నా అక్కచెల్లెమ్మలకు, నా అన్నదమ్ములకు, నా రైతన్నలకు, నా ఎస్సీ, నా ఎస్టీ, నా బీసీ, నా మైనారిటీలకు, నా యువతీయువకులందరికీ పేరుపేరునా శిరస్సు వంచి కృతజ్ఞతలు… pic.twitter.com/RQcsHZqWEO— YS Jagan Mohan Reddy (@ysjagan) May 14, 2024

Daily Horoscope: Rasi Phalalu 15-05-2024 In Telugu
Today Horoscope: ఈ రాశి వారికి ఆర్థిక పరిస్థితి కొంత నిరాశ కలిగిస్తుంది

శ్రీ క్రోధి నామ సంవత్సరం, ఉత్తరాయణం, వసంత ఋతువు, వైశాఖ మాసం, తిథి: శు.సప్తమి ఉ.5.56 వరకు, తదుపరి అష్టమి, నక్షత్రం: ఆశ్లేష సా.4.58 వరకు, తదుపరి మఖ, వర్జ్యం: లేదు, దుర్ముహూర్తం: ఉ.11.31 నుండి 12.19 వరకు, అమృతఘడియలు: ప.3.12 నుండి 4.55 వరకు; రాహుకాలం: ప.12.00 నుండి 1.30 వరకు, యమగండం: ఉ.7.30 నుండి 9.00 వరకు, సూర్యోదయం: 5.32, సూర్యాస్తమయం: 6.19. మేషం: వ్యవహారాలలో స్వల్ప అవాంతరాలు. ధనవ్యయం. కుటుంబసభ్యులతో వివాదాలు. ఆరోగ్యభంగం. శ్రమాధిక్యం. వృత్తి, వ్యాపారాలలో చికాకులు.వృషభం: నూతన ఉద్యోగయోగం. కీలక నిర్ణయాలు. వ్యవహారాలలో పురోగతి. సంఘంలో గౌరవం. విలువైన వస్తువులు సేకరిస్తారు. వృత్తి, వ్యాపారాలు సజావుగా సాగుతాయి.మిథునం: ఆర్థిక పరిస్థితి కొంత నిరాశ కలిగిస్తుంది. ఆరోగ్యభంగం. శ్రమాధిక్యం. పనుల్లో జాప్యం. వృత్తి, వ్యాపారాలలో మార్పులు. ఆలయదర్శనాలు.కర్కాటకం: వృత్తి, వ్యాపారాలు సంతృప్తికరంగా ఉంటాయి. ఆకస్మిక ధనలాభం. విలువైన వస్తువులు సేకరిస్తారు. విద్యార్థులకు అనుకూల ఫలితాలు. వాహనయోగం.సింహం: చేపట్టిన కార్యక్రమాలు మందగిస్తాయి. వ్యయప్రయాసలు. మిత్రులతో స్వల్ప వివాదాలు. ఆరోగ్యభంగం. వృత్తి, వ్యాపారాలలో ఒత్తిడులు. ఆలయాలు సందర్శిస్తారు.కన్య: ఆకస్మిక ధనలాభం. పనులు సజావుగా సాగుతాయి. బం«ధువుల కలయిక. విందువినోదాలు. ఇంటర్వ్యూలు అందుతాయి. వృత్తి, వ్యాపారాలు సాఫీగా సాగుతాయి..తుల: కొత్త పనులు ప్రారంభం. శుభవార్తలు. దైవదర్శనాలు. విందువినోదాలు. ఆర్థిక వ్యవహారాలు సంతృప్తికరంగా ఉంటాయి. వృత్తి, వ్యాపారాలలో పురోగతి సాధిస్తారు.వృశ్చికం: ఆధ్యాత్మిక చింతన. వ్యవహారాలు మందగిస్తాయి. ధనవ్యయం. కుటుంబసభ్యులతో స్వల్ప వివాదాలు. ఆరోగ్యభంగం. వృత్తి, వ్యాపారాలలో గందరగోళం.ధనుస్సు: .బంధువులతో స్వల్ప వివాదాలు. ధనవ్యయం. ఆరోగ్య సమస్యలు. కుటుంబంలో ఒత్తిడులు. ఆధ్యాత్మిక చింతన. వృత్తి, వ్యాపారాలు మందగిస్తాయి.మకరం: కొత్త పనులకు శ్రీకారం. శుభవార్తలు. ఆర్థికాభివృద్ధి. కీలక నిర్ణయాలు. కుటుంబసభ్యులతో వివాదాల పరిష్కారం. దైవదర్శనాలు. వృత్తి, వ్యాపారాలలో కొత్త ఆశలు.కుంభం: పనులు విజయవంతంగా పూర్తి చేస్తారు. ఆకస్మిక ధనలాభం. నూతన ఉద్యోగయోగం. విద్యార్థులకు అనుకూల ఫలితాలు. వృత్తి, వ్యాపారాలు ఆశాజనకం.మీనం: పనులు వాయిదా. శ్రమ పెరుగుతుంది. సన్నిహితులతో మాటపట్టింపులు. ఆరోగ్యభంగం. వృత్తి, వ్యాపారాలు మందగిస్తాయి. ఖర్చులు పెరుగుతాయి.

Mural painter Sneha Chakraborty on her journey as an NFT artist
ప్రాణమున్నగోడలు

బయటి గోడలు ఎలా ఉంటే ఏంటి అనుకుంటారు చాలామంది.అరె.. ఇలా ఉంటే ఎంత బాగుంటుంది అనేలా చేస్తుంది స్నేహ చక్రవర్తి. ఎత్తుగా ఉండే గోడలపై భారీ మ్యూరల్స్‌ గీయడం సవాలు.మహిళా ఆర్టిస్ట్‌గా ఆ సవాలును ఎదుర్కొంది స్నేహ.దేశంలో గొప్ప కుడ్య చిత్రకారిణిగా ఉన్నఆమె జీవన విశేషాలు.కూర్గ్‌ కాఫీ తోటల్లో పనిచేసే కార్మికులు, కొచ్చిలో చేపలు పట్టే బెస్తవారు, బెంగళూరులో ఇడ్లీ హోటల్‌ నడిపే ముసలామె, తమిళనాడులో తిరిగే జడలు గట్టిన సాధువులు, కష్టజీవులు, శ్రామిక మహిళలు... వీరిని భారీ బొమ్మలుగా ఎప్పుడైనా గోడల మీద చూశామా? స్నేహ చక్రవర్తి ‘మ్యూరల్స్‌’ (కుడ్య చిత్రాలు– గోడ బొమ్మలు) చూస్తే వీరే కనపడతారు. ‘దేశంలో ఎవరూ గమనించని జీవన ΄ోరాట యోధులు వీరంతా. వీళ్లను బొమ్మల్లో చూపడమే నా లక్ష్యం’ అంటుంది స్నేహ చక్రవర్తి. గత సంవత్సరం ఆమె ‘ట్రావెల్‌ అండ్‌ పెయింట్‌ ఇండియా’ పేరుతో భారత దేశ యాత్ర చేసింది. కూర్గ్‌తో మొదలెట్టి హిమాచల్‌ ప్రదేశ్‌ వరకూ అనేక రాష్ట్రాల్లో తిరుగుతూ గోడల మీద భారీ చిత్రాలు గీసింది. వాటిలో ప్రధాన అంశం సామాన్యులు, సామాన్య జీవనం... దానిలోని సౌందర్యం. ‘దేశమంటే వీళ్లే’ అంటుంది స్నేహ.సొంత ఊరు ఢిల్లీఢిల్లీలో పుట్టి పెరిగిన స్నేహ అక్కడ చదువు పూర్తి చేసింది. ఆమె తండ్రి ఇంజినీర్, తల్లి గృహిణి. ‘నాకు ఏడేళ్ల వయసున్నప్పుడు చేతుల మీద మెహందీ వేసే ఒక మహిళ వచ్చింది. ఆమె వేసిన డిజైన్లు నన్ను ఆకర్షించాయి. ఆమె మా పక్కింటికి వెళితే అక్కడకు కూడా వెళ్లి ఆమె మెహందీ వేయడం చూశాను. మరుసటి రోజే అమ్మను అడిగి మెహందీ తెచ్చి ట్రై చేశాను. నాకు మెహందీ వేయడం వచ్చేసింది. ఎనిమిదేళ్లకు మా ఏరియాలో గిరాకీ ఉన్న మెహందీ ఆర్టిస్ట్‌ను అయ్యాను. అయితే కళ అన్నం పెట్టదు అనే భావనతో ఏదైనా పని చేయమని నన్ను మా తల్లిదండ్రులు కోరారు. వారి కోసమని ఒక ఎయిర్‌లైన్స్‌ సంస్థలో ఇంటీరియర్‌ డిజైనర్‌గా చేశారు. కాని ఇలా ఒకరి కింద పని చేయడం నాకు నచ్చలేదు. నా మనసు అక్కడ లేదు. నేను రంగుల కోసం పుట్టాను. రంగుల్లో మునుగుతాను. నా బొమ్మలు అందరూ చూడాలి. అంటే నేను మ్యూరలిస్ట్‌గా, స్ట్రీట్‌ ఆర్టిస్ట్‌గా పేరు గడించాలి. ఆ విషయం ఇంట్లో చెప్పి 2018 నుంచి మ్యూరలిస్ట్‌గా మారాను’ అని తెలిపింది స్నేహ చక్రవర్తి.జటిలమైన చిత్రకళకాన్వాస్‌ మీద బొమ్మ గీయడం వేరు... ఒక పెద్ద గోడను కాన్వాస్‌గా చేసుకోవడం వేరు. కాగితం మీద వేసుకున్న బొమ్మను పదింతలు ఇరవై యింతలు పెంచి గోడ మీద గీస్తారు. దొంతీలు కట్టుకుని గోడ మీద బొమ్మ వేస్తే మళ్లీ కిందకు దిగి దూరం నుంచి చూసుకుంటూ బొమ్మను అంచనా కడుతూ గీయాలి. సాధారణంగా మగవారు ఈ ఆర్ట్‌లో ప్రావీణ్యం సం΄ాదిస్తారు. మ్యూరలిస్ట్‌లుగా ఉన్న మహిళలు తక్కువ. వారిలో స్నేహ చక్రవర్తి పేరు పొందింది. పూణె, ముంబై స్లమ్స్‌లో ఆమె గీసిన బొమ్మలు ఆ మురికివాడలకు జీవం, ప్రాణం ΄ోశాయి. ‘అందమైన బొమ్మ ఉన్న గోడ దగ్గర ఎవరూ చెత్త వేయడానికి ఇష్టపడరు. ఉమ్మివేయరు’ అని చెప్పింది స్నేహ. స్త్రీలు– సందేశాలు‘నా మ్యూరల్స్‌తో స్త్రీల సాధికారతను చూపిస్తుంటాను. స్వేచ్ఛాభావనను చూపుతుంటాను. సరైన సందేశాలు కూడా ఇస్తుంటాను. ఒకసారి ఒక పెద్ద స్త్రీ బొమ్మ గీచి ఫర్‌ సేల్‌ ఫర్‌ సేల్‌ అని చాలాసార్లు ఆ స్త్రీ బొమ్మ చుట్టూ రాశాను. ΄ోర్నోగ్రఫీ వల్ల స్త్రీ దేహం అమ్మకానికి సులువుగా దొరుకుతుందన్న భావన పురుషులలో ఉంటుంది. అలాంటి భావజాలం ఎంత దుర్మార్గమైనదో తెలిసొచ్చేలా ఆ బొమ్మ గీశాను. దానికి మంచి స్పందన వచ్చింది. గోడలు లేని ప్రపంచం లేదు. అందుకే నేను ప్రపంచమంతా తిరిగి బొమ్మలు వేస్తాను. నా బొమ్మ ప్రతి దేశం గోడ మీద మన ప్రజలను, సంస్కృతిని చూ΄ాలన్నదే నా కోరిక’ అని తెలిపింది స్నేహ.

inance minister nirmala sitharaman warns retail investors of fo risks urges stricter regulations
ఎఫ్‌అండ్‌వోతో జర జాగ్రత్త

ముంబై: రిస్క్ లతో కూడుకున్న ఫ్యూచర్స్‌ అండ్‌ ఆప్షన్స్‌ (ఎఫ్‌అండ్‌వో) ట్రేడింగ్‌లో రిటైల్‌ ఇన్వెస్టర్లు కూడా పెద్ద ఎత్తున పాల్గొంటున్న నేపథ్యంలో దీనిపై తగిన విధంగా పర్యవేక్షణ ఉండాలని కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌ అభిప్రాయపడ్డారు. లేని పక్షంలో భవిష్యత్తులో మార్కెట్లతో పాటు ఇన్వెస్టర్ల సెంటిమెంటు, కుటుంబాల పొదుపునకు సవాళ్లు తలెత్తగలవని ఆమె హెచ్చరించారు.ఈ నేపథ్యంలో ఆ నిధులకు రక్షణ కల్పించడం తమ లక్ష్యమని బీఎస్‌ఈ నిర్వహించిన వికసిత్‌ భారత్‌ 2047 కార్యక్రమంలో పాల్గొన్న సందర్భంగా మంత్రి చెప్పారు. ఎఫ్‌అండ్‌వోలో ట్రేడింగ్‌ కారణంగా ప్రతి పది మంది రిటైల్‌ ఇన్వెస్టర్లలో తొమ్మిది మంది రిటైల్‌ ఇన్వెస్టర్లు నష్టపోతున్నారన్న సెబీ అధ్యయనం నేపథ్యంలో మంత్రి వ్యాఖ్యలు ప్రాధాన్యం సంతరించుకున్నాయి.

Retired Indian Army officer killed in attack on UN vehicle in Gaza Rafah
రఫాలో ఇజ్రాయెల్‌ సైన్యం దాడి..భారత మాజీ సైనికాధికారి మృతి

ఐక్యరాజ్యసమితి: ఇజ్రాయెల్, హమాస్‌ యుద్ధంలో భారతీయ మాజీ సైనికాధికారి కల్నల్‌ వైభవ్‌ అనిల్‌ కాలే(46) బలయ్యారు. గాజాలోని రఫా నగరంలో ఇజ్రాయెల్‌ సైన్యం దాడిలో అతడు ప్రయాణిస్తున్నవాహనం ధ్వంసమైంది. తీవ్రంగా గాయపడిన అనిల్‌ కాలే ప్రాణాలు కోల్పోయారు. ఈ ఘటనపై ఇజ్రాయెల్‌ విచారం వ్యక్తం చేసింది. తమ సైన్యం చేసిన దాడిపై ప్రత్యేక దర్యాప్తు జరిపిస్తామని ప్రకటించింది. అనిల్‌ కాలే ఢిల్లీ జవహర్‌లాల్‌ నెహ్రూ యూనివర్సిటీలో బి.ఎ. చదివాడు. ‘బిహేవియరల్‌ సైన్స్‌’, ‘ఇంటర్నేషనల్‌ హ్యుమానిటేరియల్‌ లా’లో డిగ్రీలు సాధించారు.ఐఐఎం–లక్నో, ఐఐఎం–ఇండోర్‌లో ఉన్నత విద్య అభ్యసించారు. 2004 ఏప్రిల్‌లో భారత సైన్యంలో చేరారు. 2009, 2010లోఐక్యరాజ్యసమితి ఆధ్వర్యంలో కంటింజెంట్‌ చీఫ్‌ సెక్యూరిటీ ఆఫీసర్‌గా సేవలందించారు. సైనికుడిగా జమ్మూకశీ్మర్‌లో పని చేశారు. 2022లో భారత సైన్యం నుంచి పదవీ విరమణ చేశారు. రెండు నెలల క్రితమే ఐక్యరాజ్యసమితి డిపార్టుమెంట్‌ ఆఫ్‌ సేఫ్టీ, సెక్యూరిటీ(డీఎస్‌ఎస్‌)లో సెక్యూరిటీ కో–ఆర్డినేషన్‌ ఆఫీసరుగా చేరారు.అనిల్‌ కాలే సోమవారం ఉదయం ఐక్యరాజ్యసమితి వాహనంలో మరో డీఎస్‌ఎస్‌ అధికారితో కలిసి రఫాలోని యూరోపియన్‌ హాస్పిటల్‌కు బయలుదేరగా ఇజ్రాయెల్‌ సైన్యం హఠాత్తుగా దాడి చేసింది. ఈ దాడిలో అనిల్‌ కాలే మృతిచెందగా, మరో అధికారి తీవ్రంగా గాయపడ్డారు. అతడు ఎవరన్నది ఇంకా గుర్తించలేదు. ఐరాస సెక్రెటరీ జనరల్‌ గుటేరస్‌ ది్రగ్బాంతి కల్నల్‌ అనిల్‌ కాలే మరణం పట్ల ఐక్యరాజ్యసమితి సెక్రెటరీ జనరల్‌ ఆంటోనియో గుటేరస్‌ ది్రగ్బాంతి వ్యక్తం చేశారు. ఆయన మరణం తనను తీవ్ర విషాదానికి గురిచేసిందని ఒక ప్రకటనలో పేర్కొన్నారు. అనిల్‌ కాలే మృతిపై పూర్తిస్థాయిలో దర్యాప్తు చేపట్టాలని ఇజ్రాయెల్‌ను డిమాండ్‌ చేశారు. అనిల్‌ కాలే కుటుంబ సభ్యులకు సానుభూతి ప్రకటించారు. గాజాలో విధి నిర్వహణలో ఉన్న ఐక్యరాజ్యసమితి సిబ్బందిపై ఇజ్రాయెల్‌ సైన్యం దాడులను గుటేరస్‌ ఖండించారు. గాజాలో వెంటనే కాల్పుల విరమణ పాటించాలని సూచించారు.బందీలను విడుదల చేయాలని హమాస్‌ మిలిటెంట్లకు హితవు పలికారు. కల్నల్‌ వైభవ్‌ అనిల్‌ కాలే మరణం పట్ల ఐక్యరాజ్యసమితిలోని భారత ప్రతినిధి బృందం దిగ్భ్రాంతి వ్యక్తం చేసింది. మంగళవారం సంతాపం ప్రకటించింది. గత ఏడాది అక్టోబర్‌ 7న ఇజ్రాయెల్, హమాస్‌ మధ్య పోరాటం మొదలైన తర్వాత గాజాలో ఇప్పటివరకు 190 మందికిపైగా ఐక్యరాజ్యసమితి సిబ్బంది మరణించారు. గాజాలో ఐక్యరాజ్యసమితి తరఫున పనిచేస్తూ విధి నిర్వహణలో మరణించిన తొలి విదేశీయుడు అనిల్‌ కాలే కావడం గమనార్హం. మహారాష్ట్రలోని నాగపూర్‌కు చెందిన అనిల్‌ కాలే కుటుంబం పుణేలో స్థిరపడింది.మృతదేహాన్ని ఇండియాకు రప్పించేందుకు ప్రయతి్నస్తున్నట్లు ఆయన కుటుంబ సభ్యుడు రిటైర్డ్‌ వింగ్‌ కమాండర్‌ ప్రశాంత్‌ కర్దే చెప్పారు. పుణేలో అంత్యక్రియలు నిర్వహిస్తామన్నారు. అనిల్‌ కాలేకు భార్య అమృత, కుమారుడు వేదాంత్, కుమార్తె రాధిక ఉన్నారు. ఆయన సోదరుడు విశాల్‌ కాలే ఇండియన్‌ ఎయిర్‌ ఫోర్స్‌లో గ్రూప్‌ కెపె్టన్‌గా పనిచేస్తున్నారు. సోదరుడి వరుసయ్యే కల్నల్‌ అమేయ్‌ కాలే భారత సైన్యంలో పనిచేస్తున్నారు.

Congress vs BJP vs BRS in Telangana
ఎవరి లెక్క వారిదే!

సాక్షి, హైదరాబాద్‌: రాష్ట్రంలో లోక్‌సభ ఎన్నికల ఫలితాలు ఎలా ఉంటాయన్నది ఉత్కంఠ రేపుతూనే ఉంది. ప్రధాన రాజకీయ పారీ్టలన్నీ ఎవరి అంచనాలు వారు వేసుకుంటుండటం, అన్ని పార్టీలూ తమకే ఎక్కువ సీట్లు వస్తాయని గట్టిగా వాదిస్తుండటంతో.. ఆసక్తి మరింత పెరుగుతోంది. సోమవారం జరిగిన పోలింగ్‌ సరళిని విశ్లేíÙంచుకున్నాక కూడా కాంగ్రెస్, బీజేపీ, బీఆర్‌ఎస్‌ మూడు పార్టీలు తమ అంచనాలను ఏమాత్రం తగ్గించుకోవడం లేదు. పైగా మరిన్ని స్థానాలు అదనంగా గెలిచినా ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదన్నట్టు ప్రకటనలు చేస్తున్నాయి. 2019 లోక్‌సభ ఎన్నికలతో పోలిస్తే.. ఈసారి పెరిగిన పోలింగ్‌ శాతాన్ని ఎవరికి వారే తమకు అనుకూలమని అంచనా వేసుకుంటుండటం గమనార్హం. అయితే అన్ని పారీ్టలు మహిళలు, గ్రామీణ, పట్టణ ఓటర్లు ఎలాంటి తీర్పు ఇచ్చారో అన్నది తేల్చుకునేందుకు ప్రయతి్నస్తున్నాయి. పెరిగినది పాజిటివ్‌ ఓటింగేనంటున్న కాంగ్రెస్‌.. ఐదు నెలల కిందటి అసెంబ్లీ ఎన్నికల్లో తమకు పాజిటివ్‌ ఓటింగ్‌ జరిగిందని.. ప్రస్తుతం పెరిగిన ఓటింగ్‌ శాతం కూడా ప్రభుత్వ అనుకూల ఓటేనని కాంగ్రెస్‌ వర్గాలు చెప్తున్నాయి. ఆరు గ్యారంటీల్లో ఐదింటిని అమలు చేశామని అంటున్నాయి. ప్రధానంగా మహిళలకు ఉపయోగపడే ఉచిత బస్సు, రూ.500కే సిలిండర్లుతోపాటు 200 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్, రూ.10 లక్షల వరకు ఆరోగ్యశ్రీ పెంపు, ఎన్నికలకు ముందే రైతుభరోసా నిధులు వెళ్లడం, రైతు రుణమాఫీపై సీఎం రేవంత్‌రెడ్డి ఒట్టు వేసి మరీ ప్రకటించడం వంటివి పాజిటివ్‌ టాక్‌ తెచ్చాయని.. అవి ఓట్ల రూపంలో కాంగ్రెస్‌కే దక్కాయని నేతలు అభిప్రాయపడుతున్నారు. అసెంబ్లీ ఎన్నికల కంటే.. లోక్‌సభ ఎన్నికల్లో తమకు ఓటింగ్‌ శాతం పెరుగుతుందన్న ధీమా వ్యక్తం చేస్తున్నారు. అసెంబ్లీ ఎన్నికల్లో పోటీనిచి్చన బీఆర్‌ఎస్‌.. లోక్‌సభ ఎన్నికల్లో పోటీలో లేకుండా పోయిందని చెప్తున్నారు. బీజేపీ అధికారంలోకి వస్తే రాజ్యాంగాన్ని మార్చి, రిజర్వేషన్లు రద్దు చేస్తుందన్న ప్రచారం బాగానే ప్రభావం చూపిందని అంటున్నారు. ఎట్టి పరిస్థితుల్లోనూ కాంగ్రెస్‌కు పన్నెండు నుంచి 13 సీట్లు లభిస్తాయని పేర్కొంటున్నారు. బాగా బలోపేతం అయ్యామంటున్న బీజేపీ.. లోక్‌సభ ఎన్నికలతో రాష్ట్రంలో మరింతగా బలోపేతం అయ్యామని, ప్రధాన రాజకీయ శక్తిగా ఎదిగామని బీజేపీ నేతలు చెప్తున్నారు. ప్రధాని మోదీపై అభిమానం, కేంద్రం గత పదేళ్లుగా అందించిన నీతివంతమైన పాలనకు తగిన ప్రతిఫలం తమకు లభిస్తుందన్న విశ్వాసం వ్యక్తం చేస్తున్నారు. బీజేపీ రాజ్యాంగాన్ని మారుస్తుందని, రిజర్వేషన్లు రద్దు చేస్తుందని రేవంత్‌రెడ్డి, ఇతర కాంగ్రెస్‌ నేతలు ఎంతగా ప్రచారం చేసినా ప్రజలు నమ్మలేదని అంటున్నారు.పదేళ్లుగా కేంద్రంలో అధికారంలో ఉన్న తాము రాజ్యాంగం జోలికి కానీ, రిజర్వేషన్ల జోలికి కాని వెళ్లని విషయాన్ని ప్రజలు అర్థం చేసుకున్నారని వివరిస్తున్నారు. ఈసారి రాష్ట్రంలో మోదీ మేనియా బాగా వర్కౌట్‌ అయిందన్న ధీమా వ్యక్తం చేస్తున్నారు. మోదీ, అమిత్‌ షా సహా జాతీయ నాయకులు విస్తృతంగా ప్రచారంలో పాల్గొనడం.. క్షేత్రస్థాయిలో పార్టీ నాయకులు, కార్యకర్తలు కష్టపడి పనిచేయడం కలసి వచి్చందని అంటున్నారు. ఈసారి రాష్ట్రంలో డబుల్‌ డిజిట్‌ ఎంపీ సీట్లు ఖాయమని ధీమాగా చెప్తున్నారు. పట్టణ ప్రాంతాల్లో ఓటింగ్‌కు బీజేపీకి అనుకూలంగా ఉందని.. అసెంబ్లీ ఎన్నికల్లోకు ఓటేయని వర్గాలు కూడా లోక్‌సభ ఎన్నికల్లో ముందుకు వచ్చి తమకు ఓటు వేశాయని అంటున్నారు. కేసీఆర్‌ బస్సుయాత్ర ఊపుతో.. లోక్‌సభ ఎన్నికల్లో త్రిముఖ పోటీ తమకు లాభిస్తుందని బీఆర్‌ఎస్‌ పార్టీ అంచనా వేస్తోంది. ఎన్నికల ప్రచారంలో భాగంగా కేసీఆర్‌ చేపట్టిన బస్సుయాత్రకు ప్రజల్లో విశేష స్పందన లభించిందని ఆ పార్టీ ముఖ్యులు చెప్తున్నారు. రాష్ట్రంలో కరెంటు కోతలు, సాగునీటి ఇబ్బందులు, జిల్లాల రద్దు వంటి అంశాలతోపాటు.. అసెంబ్లీ ఎన్నికల్లో ఇచ్చిన హామీల అమల్లో కాంగ్రెస్‌ వైఫల్యం ఆ పార్టీపై వ్యతిరేకతను పెంచిందని అంటున్నారు.ప్రజలు కేసీఆర్‌ ప్రభుత్వం ఉంటేనే బాగుండేదన్న అభిప్రాయానికి వచ్చారని, ఇది తమకు సానుకూలంగా మారిందని అంటున్నారు. రెండు జాతీయ పార్టీలకు నేరుగా తమతోనే పోటీ జరిగిందని చెప్తున్నారు. రాష్ట్రంలో బీఆర్‌ఎస్‌ స్థానం ఎక్కడికీ పోలేదని, కాంగ్రెస్, బీజేపీలకు ముచ్చెమటలు పట్టించామని పేర్కొంటున్నారు. ఆ రెండు పారీ్టలు పారాచూట్‌ లీడర్లకే ఎక్కువ టికెట్లు ఇవ్వడం కూడా.. కార్యకర్తలు, నేతల్లో అసంతృప్తిని రగిలించిందని అంటున్నారు.

Advertisement
Advertisement


Advertisement
Advertisement
Advertisement
Advertisement

న్యూస్ పాడ్‌కాస్ట్‌

ఫోటో స్టోరీస్

View all
Advertisement