కట్టె కాలే వరకు పిఠాపురంలోనే ఉంటా: వంగా గీత భావోద్వేగం | AP Assembly Elections 2024: Vanga Geetha Speech Highlights In Pithapuram Public Meeting, Details Inside | Sakshi
Sakshi News home page

కట్టె కాలే వరకు పిఠాపురంలోనే ఉంటా: వంగా గీత భావోద్వేగం

Published Sat, May 11 2024 4:34 PM

vanga geetha speech in pithapuram public meeting

పిఠాపురం : ప్రత్యర్ధులు నన్ను అవమానిస్తున్నారు.. అవహేళన చేస్తున్నరని వైఎస్సార్‌సీపీ అభ్యర్థి వంగా గీత అన్నారు. పిఠాపురం ఎన్నికల ప్రచార సభలో ఆమె మాట్లాడారు. ‘ కొంగు చాచి అడుగుతున్నాను.. నాకు ఒక్క అవకాశం ఇవ్వండి. నా బిడ్డ సాక్షిగా పిఠాపురం అభివృద్ధి చేస్తాను. మళ్లీ జన్మలో పిఠాపురంలో పుడతాను. కట్టె కాలే వరకు పిఠాపురంలోనే ఉంటా. నేను పిఠాపురం వదిలి వెళ్లను. నా అంతిమయాత్ర పిఠాపురంలోనే జరగాలి. మళ్లీ జన్మలో పిఠాపురంలోనే పుడతా. నాకు ఒక్క అవకాశం ఇవ్వండి. నా బిడ్డ సాక్షిగా పిఠాపురాన్ని అభివృద్ధి చేసి చూపిస్తా’ అని ఆమె భావోద్వేగానికి గురయ్యారు. 

మరోవైపు పవన్‌ కల్యాణ్‌ తనపై చేసిన వ్యాఖ్యలకు తనదైన శైలిలో కౌంటరిచ్చారు వంగా గీత. ‘వంగా గీతాను నిలదీయండి అని పవన్ అంటున్నాడు. పిఠాపురంలో పాలిటెక్నిక్ కాలేజ్ తెచ్చినందుకు నన్ను అడగాలా? కాకినాడలో  100 పడకల ఈఎస్ఐ ఆసుపత్రి తెచ్చినందుకా? కరోనా సమయంలో ప్రజల్లో ఉన్నది నేను. నాకు అనారోగ్యం వస్తే.. అవమానించేలా మాట్లాడారు. నాటకాలు ఆడాల్సిన అవసరం రాలేదు. 

.. జ్వరం వస్తే హైదరాబాదు పారిపోలేదు. ఆడవాళ్ళ అనారోగ్యాన్ని అవమానిస్తారా?. వర్మ వాఖ్యలపై కంటతడి పెట్టుకున్నారు. ను పిఠాపురంలో పుట్టలేదని వర్మ అంటున్నాడు.వర్మ మాత్రం పిఠాపురంలో పుట్టాడా?’ అని వంగా గీతా మండిపడ్డారు.


 

Advertisement
Advertisement