పెళ్లికి రెడీ అయిన హాట్ బ్యూటీ.. అంతకు ముందే 'ఎగ్ ఫ్రీజింగ్' | Esha Gupta Comments On Egg Freezing | Sakshi
Sakshi News home page

Esha Gupta: త్వరలో ప్రియుడిని పెళ్లాడబోతున్న నటి ఈషా గుప్తా

May 13 2024 1:41 PM | Updated on May 13 2024 1:41 PM

 Esha Gupta Comments On Egg Freezing

మరో హాట్ బ్యూటీ పెళ్లికి రెడీ అయింది. త్వరలో శుభకార్యం ఉండనుందనే హింట్ ఇచ్చేసింది. దీని గురించి పక్కనబెడితే ఈ మధ్య కాలంలో ట్రెండ్ అవుతున్న 'ఎగ్ ఫ్రీజింగ్' గురించి మాట్లాడింది. తను వీటిని ఎప్పుడో చేసేశానని షాకింగ్ కామెంట్స్ చేసింది. ఇప్పుడు ఇవి కాస్త సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఇంతకీ ఎవరా బ్యూటీ? పెళ్లెప్పుడు?

2012లో 'జన్నత్ 2' అనే హిందీ సినిమాతో ఈషా గుప్తా ఇండస్ట్రీలో అడుగుపెట్టింది. రాజ్ త్రీడీ, హమ్ షకల్స్, రుస్తుమ్, టోటల్ ధమాల్ తదితర సినిమాలతో గుర్తింపు తెచ్చుకుంది. ప్రస్తుతం ఈమె చేతిలో హేరీ ఫేరీ 4, దేశీ మ్యాజిక్ అండ్ మర్డర్ 4 మూవీస్ ఉన్నాయి. యాక్టింగ్ గురించి పక్కనబెడితే హాట్ హాట్ పోజులతో ఎప్పటికప్పుడు నెటిజన్లని అలరించే ఈ బ్యూటీ.. ఏడేళ్ల క్రితమే ఎగ్ ఫ్రీజింగ్ చేసిన విషయాన్ని ఇప్పుడు బయటపెట్టింది. ఎగ్ ఫ్రీజింగ్ అంటే.. ఆరోగ్యకర అండాల్ని  వైద్య పద్ధితిలో భద్రపరచడం.

(ఇదీ చదవండి: ఈ వారం ఓటీటీల్లోకి ఏకంగా 22 సినిమాలు.. ఆ నాలుగు మాత్రం స్పెషల్)

esha gupta marriage

ఈ మధ్య టాలీవుడ్ హీరోయిన్ మెహ్రీన్ ఇలా చేసింది. మృణాల్ ఠాకుర్ కూడా ఎగ్ ఫ్రీజింగ్ చేసుకుంటానని చెప్పింది. అయితే ఈషా గుప్తా మాత్రం 2017లోనే ఇలా చేసినట్లు చెప్పుకొచ్చింది. ఒకవేళ తాను నటి కాకపోయింటే ఈపాటికే ముగ్గురు పిల్లలకు తల్లిని అయ్యేదని, పిల్లలంటే తనకు అంత ఇష్టమని ఈషా చెప్పింది. అందుకే హెల్తీగా ఉన్నప్పుడే తన అండాల్ని భద్రపరుచుకున్నానని క్లారిటీ ఇచ్చింది.

ఇకపోతే గతే ఐదేళ్ల నుంచి మాన్యువల్ కంపోస్ అనే యువ పారిశ్రామిక వేత్తతో రిలేషన్‌లో ఉన్న ఈషా గుప్తా.. త్వరలో తన పెళ్లి జరగొచ్చని హింట్ ఇచ్చేసింది. ఇతడు పరిచయం కాకముందే తాను ఎగ్ ఫ్రీజింగ్ చేసేసుకున్నానని చెప్పుకొచ్చింది.

(ఇదీ చదవండి: యాంకర్ శ్రీముఖికి త్వరలో పెళ్లి? రివీల్ చేసిన 'జబర్దస్త్' కమెడియన్)

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement