పాతాళంలో దాక్కున్నా మిమ్మల్ని వదలం.. అమిత్‌ షా హెచ్చరిక | Sakshi
Sakshi News home page

పాతాళంలో దాక్కున్నా వదలం.. అమిత్‌ షా హెచ్చరికలు

Published Fri, May 10 2024 8:51 PM

Amit Shah Accused West Bengal Chief Minister Mamata Banerjee

పాతాళంలో దాక్కున్నా సందేశ్‌ ఖాలీ దోషుల్ని వదలి పెట్టేది లేదని కేంద్ర హోంమంత్రి అమిత్‌ షా హెచ్చరించారు. పశ్చిమ బెంగాల్‌ నదియా జిల్లాలోని రణఘాట్ లోక్‌సభ స్థానంలోని మజ్డియాలో ఎన్నికల ర్యాలీని ఉద్దేశించి అమిత్‌ షా మాట్లాడారు.

సందేశ్‌ఖాలీ అంశంపై పశ్చిమ బెంగాల్ సీఎం మమతా బెనర్జీ ఎందుకు మౌనం వహిస్తున్నారని అమిత్ షా ప్రశ్నించారు. బీజేపీ అలా కాదు. ఒక్క దోషిని వదిలిపెట్టదు. వారిని తలక్రిందులుగా వేలాడదీస్తోందన్నారు.  

నార్త్ 24 పరగణాస్ జిల్లాలోని సందేశ్‌ఖాలీలో టీఎంసీ నేతలపై వస్తున్న ఆరోపణలపై అమిత్‌ షా మాట్లాడుతూ.. మమతా బెనర్జీ, మహిళా ముఖ్యమంత్రి అయినప్పటికీ, దోషులను రక్షించడానికి ప్రయత్నించడం సిగ్గుచేటు అని అన్నారు.

సందేశ్‌ఖాలీలో టీఎంసీ నేతలు వందలాది మంది అక్కాచెల్లెళ్లను మతం ఆధారంగా చిత్రహింసలకు గురిచేశారు . సందేశ్‌ఖలీ నేరస్థులను అరెస్టు చేసేందుకు మమతా దీదీ సిద్ధంగా లేరు. హైకోర్టు ఆదేశాల తర్వాత కూడా విచారణ జరగకపోవడంతో హైకోర్టు విచారణను సీబీఐకి  అప్పగించిందని తెలిపారు.  

సందేశ్‌ఖాలీలో అఘాయిత్యాలకు పాల్పడిన వారెవరైనా.. పాతాళంలో దాక్కున్నా.. కనిపెట్టి జైల్లో పెడతాం.. ఈ దోషులను బీజేపీ శిక్షిస్తుందని అమిత్‌ షా పునరుద్ఘాటించారు.  
 

Advertisement
 
Advertisement
 
Advertisement