IPL 2024: ప్లే ఆఫ్స్‌ ఛాన్స్‌లు ఎవరికి ఎక్కువగా ఉన్నాయంటే.. | IPL 2024 playoffs: Six teams Fight for three spots | Sakshi
Sakshi News home page

మూడు బెర్తుల కోసం ఆరు జట్లు! ప్లే ఆఫ్స్‌ ఛాన్స్‌లు ఎవరికి ఎక్కువగా ఉన్నాయంటే..

May 14 2024 10:24 AM | Updated on May 14 2024 12:59 PM

IPL 2024 playoffs: Six teams Fight for three spots

ఈ దఫా ఐపీఎల్‌ సీజన్ మస్త్‌ మజాను పంచబోతోంది. ఫేవరెట్‌గా బరిలో దిగిన ముంబై ఇండియన్స్‌ రేసు నుంచి నిష్క్రమించింది. ఆ వెంటనే పంజాబ్‌ కింగ్స్‌ జట్టు​ కూడా అవుట్‌ అయ్యింది. తాజాగా.. గుజరాత్‌ టైటాన్స్‌ కథ కూడా ముగిసింది. ఇంకోవైపు ప్లేఆఫ్స్‌కు కోల్‌కతా నైట్‌రైడర్స్‌ అర్హత సాధించింది. ఇక మిగిలిన మూడు బెర్తుల కోసం ఆరు జట్లు పోటీపడనున్నాయి.

రాజస్థాన్‌ 12 మ్యాచ్‌లు ఆడి 8 విజయాలు సాధించింది. ఆ జట్టు తొలి 9 మ్యాచ్‌ల్లోనే 8 నెగ్గింది. కానీ తర్వాత వరుసగా మూడు ఓటములు చవిచూసింది. అయినప్పటికీ రాజస్థాన్‌ ప్లేఆఫ్స్‌ బెర్తుకు ఢోకా లేనట్లే. చివరి 2 మ్యాచ్‌ల్లో ఒక్కటి గెలిచినా.. ఆ జట్టుకు బెర్తు ఖాయమవుతుంది. రెండూ గెలిస్తే అగ్రస్థానం ఆ జట్టు సొంతమవుతుంది. పంజాబ్, కోల్‌కతాలతో తన చివరి రెండు మ్యాచ్‌ల్లో ఓడినా రాయల్స్‌ ముందంజ వేస్తుంది. కాకపోతే ఆ మ్యాచ్‌ల్లో చిత్తుగా ఓడిపోకూడదు. తక్కువ తేడాతో ఓడితే ఇప్పుడున్న 16 పాయింట్లతోనే ప్లేఆఫ్స్‌ బెర్తును సొంతం చేసుకుంటుంది.
ఆడినవి: 12
పాయింట్లు: 16
నెట్‌రన్‌రేట్‌: 0.349
మిగిలిన మ్యాచ్‌లు: పంజాబ్‌ కింగ్స్‌, కోల్‌కతా నైట్‌ రైడర్స్‌

రాజస్థాన్‌ తర్వాత మెరుగైన అవకాశాలున్నది సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌కే. ఆ జట్టు 12 మ్యాచ్‌ల్లో 7 విజయాలు సాధించింది. మిగతా రెండు మ్యాచ్‌ల్లో (గుజరాత్, పంజాబ్‌) గెలిస్తే నేరుగా ప్లేఆఫ్స్‌ చేరుతుంది. నెట్‌రన్‌రేట్‌ బాగుంది (+0.406) కాబట్టి ఒకటి నెగ్గినా ముందంజ వేయొచ్చు. రెండు మ్యాచ్‌లూ ఓడితే మాత్రం ఇతర మ్యాచ్‌ల ఫలితాల మీద ఆధారపడాల్సి ఉంటుంది.
ఆడినవి:12
పాయింట్లు: 14
నెట్‌ రన్‌రేట్‌: 0.406
మిగిలిన మ్యాచ్‌లు: గుజరాత్‌ టైటాన్స్‌, పంజాబ్‌ కింగ్స్‌


లక్నో, ఢిల్లీ చెరో 6 విజయాలు సాధించాయి. కానీ, ఆ రెండు జట్లూ నెట్‌ రన్‌రేట్‌లో మైనస్‌ పాయింట్లతో బాగా వెనుకబడ్డాయి. 

ఢిల్లీకి ఇంకా ఒకే ఒక్క మ్యాచ్‌ మిగిలే ఉంది. అదీ లక్నోతో. నెట్‌ రన్‌ రేట్‌ ఢిల్లీకి తక్కువగా ఉంది. కాబట్టి 14 పాయింట్లు వచ్చినా ఫ్లే ఆఫ్స్‌కు అర్హత సాధించడం కష్టం. ఒకవేళ సన్‌రైజర్స్‌ భారీ తేడాతో తన రెండు మ్యాచ్‌లలో ఓడితే, సీఎస్కే ఆర్సీబీపై భారీ విజయం సాధిస్తే.. లక్నో ఓడిపోయి రన్‌రేట్‌తో ఢిల్లీ కంటే దిగువన ఉంటే గనుక.. అప్పుడు ఢిల్లీకి ప్లే ఆఫ్స్‌ అవకాశం ఉండొచ్చు. ఇదంతా కష్టమే కాబట్టి ఢిల్లీకి అవకాశాలు తక్కువే అని చెప్పాలి. 
ఆడినవి:13
పాయింట్లు:12
నెట్‌రన్‌రేట్‌:-0.482
మిగిలిన మ్యాచ్‌: లక్నో

లక్నో.. ఢిల్లీ, ముంబై ఇండియన్స్‌తో తలపడాల్సి ఉంది. ఎల్‌ఎస్‌జీ నెట్‌రన్‌రేట్‌ (0.769) ఇప్పటికే చాలా తక్కువగా ఉంది. కాబట్టి ఏడో విజయం సాధించినా ముందంజ వేయడం కష్టమే.
ఆడినవి:12
పాయింట్లు:12
నెట్‌ రన్‌రేట్‌: -0.769
మిగిలిన మ్యాచ్‌లు: ఢిల్లీ, ముంబై ఇండియన్స్‌

   
బెంగళూరు.. ఐదు మ్యాచ్‌లలో గెలిచి అనూహ్యంగా రేసులోకి వచ్చింది. నెట్‌రన్‌రేట్‌ (+0.387) మెరుగ్గా ఉండడం ఆర్సీబీకి కలిసొచ్చే అంశం. హైదరాబాద్, ఢిల్లీ, లక్నో జట్లలో ఒక్కటే ముందంజ వేసి, రెండు జట్లు నిష్క్రమిస్తే.. అప్పుడు చెన్నైబెంగళూరు మ్యాచ్‌ నాకౌట్‌గా మారుతుంది. ఆర్సీబీ మొదట బ్యాటింగ్‌ చేస్తే 18 పరుగుల తేడాతో, రెండోసారి ఆడితే 18.1 ఓవర్లలో లక్ష్యాన్ని ఛేదిస్తే.. చెన్నైని వెనక్కి నెట్టి ప్లేఆఫ్స్‌ చేరుతుంది.
ఆడినవి:13
పాయింట్లు: 12
నెట్‌రన్‌రేట్‌: 0.387
మిగిలిన మ్యాచ్‌: సీఎస్కే


13 మ్యాచ్‌ల్లో 7 నెగ్గిన చెన్నై.. తన చివరి మ్యాచ్‌లో బెంగళూరును ఓడిస్తే ముందంజ వేసినట్లే. ఆ జట్టు నెట్‌ రన్‌రేట్‌ (+0.528) చాలా మెరుగ్గా ఉంది కాబట్టి వేరే ఇతర మ్యాచ్‌ల ఫలితాలతో సంబంధం లేకుండా ప్లేఆఫ్స్‌ బెర్తు సొంతం కావచ్చు.
ఆడినవి:13
పాయింట్లు:14
నెట్‌రన్‌రేట్‌: 0.528
మిగిలిన మ్యాచ్‌: ఆర్సీబీ

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement