స్టార్‌ హీరో గొప్పమనసు.. రూ. కోటి చెక్‌ విరాళం! | Sakshi
Sakshi News home page

Dhanush: కోటి రూపాయలు విరాళమిచ్చిన ధనుశ్‌.. ఎందుకో తెలుసా?

Published Tue, May 14 2024 9:17 PM

Kollywood Star Hero Dhanush Help To One Crore Rupees

కోలీవుడ్‌ హీరో ధనుశ్‌ తన మంచి మనసును చాటుకున్నారు. సౌత్‌ ఇండియన్‌ ఆర్టిస్ట్స్‌ అసోసియేషన్‌ నూతన భవనానికి రూ. కోటి విరాళం అందించారు. దీనికి సంబంధించిన చెక్‌ను నటుడు నాజర్‌కు అందజేశారు. ఈ విషయాన్ని అసోసియేషన్‌ వెల్లడించింది.

కాగా.. ప్రస్తుతం నటుడు నాజర్‌ అధ్యక్షుడిగా, విశాల్ ప్రధాన కార్యదర్శిగా, కార్తి కోశాధికారిగా నడిగర్‌ సంఘంలో పని చేస్తున్నారు. ఇప్పటికే పలువురు ప్రముఖులు భవనం కోసం విరాళాలు అందచేశారు. కమల్‌ హాసన్‌, విజయ్‌లు గతంలోనే రూ.కోటి సాయమందించారు. ప్రస్తుతం నూతన భవన నిర్మాణ పనులు శరవేగంగా జరుగుతున్నాయి. ఈ ఏడాది చివరికి నిర్మాణం పూర్తి చేయనున్నారు. 

కాగా.. ధనుశ్ ప్రస్తుతం శేఖర్‌ కమ్ముల దర్శకత్వంలో నటిస్తున్నారు. అంతేకాకుండా  స్వీయ దర్శకత్వంలో రాయన్‌లో నటిస్తున్నారు. ఈ సినిమా జూన్‌లో ప్రేక్షకుల ముందుకు రానుంది. విభిన్నమైన యాక్షన్‌ థ్రిల్లర్‌గా ముస్తాబవుతున్న ఈ సినిమాకి ఏఆర్‌ రెహమాన్‌ సంగీతమందిస్తున్నారు.

Advertisement
Advertisement