
తల్లిని కౌగిలించుకొని కూతురు ఏడ్చింది. ఆ తల్లి కూతురిని ఓదారుస్తున్న వీడియో వైరల్ అయింది. దశాబ్దకాలంగా డిమెన్షియాతో బాధ పడుతోంది తల్లి. తన ముందు మరో వ్యక్తి ఉన్నట్లుగానే భావిస్తుంది తప్ప తన కూతురుకు సంబంధించిన విలువైన జ్ఞాపకాలేవీ ఆ తల్లిలో లేవు. అయినప్పటికీ సహజాతమైన తల్లి ప్రేమతో... ఏడుస్తున్న కూతురిని ఓదార్చుతుంది. ఇది ఏ దేశంలో వీడియో అయితేనేం?
అందరూ కనెక్ట్ అయ్యి కన్నీళ్లు తెచ్చుకునే వీడియోగా మారింది.
‘దే నెవర్ ఫర్గెట్ లవ్’ క్యాప్షన్‌తో ఇన్‌స్టాగ్రామ్‌లో ΄ోస్ట్ చేసిన ఈ వీడియో క్లిప్ వైరల్‌గా మారింది. కామెంట్ సెక్షన్ కన్నీళ్లతో తడిసి΄ోయింది. ఈ వైరల్ వీడియో క్లిప్ నేపథ్యంలో ప్రపంచవ్యాప్తంగా ఎంతోమంది కూతుళ్లు, కుమారులు అనారోగ్యం బారిన పడిన తమ తల్లిని గుర్తు తెచ్చుకుంటూ బాధపడ్డారు.
‘నీ పేరు గుర్తుకు రావడం లేదు అని అమ్మ అన్నప్పుడు ఎంతో బాధగా అనిపించింది’ అని ఒక కుమారుడు అలై్జమర్స్ బారిన పడిన తన తల్లి గురించి బాధపడ్డాడు. ఇది చూసి ఒక యూజర్ – ‘తల్లిప్రేమ అనేది జ్ఞాపకం కాదు. అది శాశ్వతం’ అని కామెంట్ పెట్టాడు.