కేఎల్ రాహుల్ మాస్ట‌ర్ ప్లాన్‌.. మెక్ గ‌ర్క్ సిల్వ‌ర్ డ‌క్‌! వీడియో | Sakshi
Sakshi News home page

కేఎల్ రాహుల్ మాస్ట‌ర్ ప్లాన్‌.. మెక్ గ‌ర్క్ సిల్వ‌ర్ డ‌క్‌! వీడియో

Published Tue, May 14 2024 8:30 PM

KL Rahul Master Plan To Get Fraser-McGurk For A Silver Duck

ఐపీఎల్‌-2024లో ఢిల్లీ క్యాపిట‌ల్స్ యువ సంచ‌ల‌నం జేక్ ఫ్రేజర్-మెక్‌గుర్క్ తొలిసారి నిరాశ‌ప‌రిచాడు. అరుణ్ జైట్లీ స్టేడియం వేదిక‌గా ల‌క్నో సూప‌ర్ జెయింట్స్‌తో మ్యాచ్‌లో మెక్‌గుర్క్ ఖాతా తెర‌వ‌కుండానే ఔటయ్యాడు. 

రెండు బంతులు ఎదుర్కొన్న జేక్‌ ఫ్రేజర్‌.. డైమండ్‌ డక్‌గా వెనుదిరిగాడు. లక్నో కెప్టెన్‌ కేఎల్‌ రాహుల్‌ మాస్టర్‌ ప్లాన్‌తో మెక్‌గుర్క్‌ను ఆదిలోనే పెవిలియన్‌కు పంపాడు. 

ఢిల్లీ ఇన్నింగ్స్‌ తొలి ఓవర్‌ వేసిన ఆర్షద్‌ ఖాన్‌ రెండో బంతిని లెంగ్త్‌ డెలివరీగా సంధించాడు. ఈ క్రమంలో జేక్ ఫ్రేజర్-మెక్‌గుర్క్ లాంగ్‌-ఆన్‌ దిశగా భారీ షాట్‌ ఆడాడు. 

అయితే మెక్‌గుర్క్ లాంగ్‌-ఆన్‌ దిశగా ఆడుతాడని ముందు గానే పసిగట్టిన రాహుల్‌.. లాంగ్‌ ఆన్‌ ఫీల్డర్‌లో సెట్‌ చేశాడు. ఈ క్రమంలో లాంగ్‌ ఆన్‌లో ఉన్న నవీన్‌ ఉల్‌-హాక్‌ ఈజీ క్యాచ్‌ను అందుకున్నాడు.

ఇది చూసిన రాహుల్‌ వెంటనే నేను చెప్పా కదా అన్నట్లు నవ్వుతూ రియాక్షన్‌ ఇచ్చాడు. ఇందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్‌ మీడియాలో వైరలవుతోంది. కాగా మెక్‌గర్క్‌ అద్భుతమైన ఫామ్‌లో ఉన్నాడు. ఈ ఏడాది సీజ‌న్‌లో 8 మ్యాచ్‌లు ఆడిన  మెక్ గుర్క్‌.. 330 ప‌రుగులు చేశాడు.
 

Advertisement
 
Advertisement