నామినేషన్ దాఖలు చేసిన కంగనా రనౌత్ | Kangana Ranaut Files Nomination | Sakshi
Sakshi News home page

నామినేషన్ దాఖలు చేసిన కంగనా రనౌత్

May 14 2024 12:53 PM | Updated on May 14 2024 1:29 PM

Kangana Ranaut Files Nomination

ప్రముఖ సినీ నటి, బీజేపీ అభ్యర్థి 'కంగనా రనౌత్' మండి లోక్‌సభ నియోజకవర్గం నుంచి పోటీ చేయడానికి మంగళవారం నామినేషన్ దాఖలు చేశారు. అంతకంటే ముందు మీడియాతో మాట్లాడుతూ.. మండి ప్రజలకు నాపైన ఉన్న ప్రేమే ఇంత దూరం తీసుకువచ్చిందని కంగనా పేరొన్నారు.

మన దేశంలో మహిళలు ప్రతి రంగంలోనూ ముందుకు సాగుతున్నారు. అయితే మండి ప్రాంతంలో ఇప్పటికి కూడా భ్రూణహత్య ఎక్కువగానే ఉన్నాయి. కొన్ని సంవత్సరాల క్రితం మండికి చెందిన మహిళలు విద్య, రాజకీయాల్లో మాత్రమే కాకుండా.. ఆర్మీలో ఉన్నారని కంగనా పేర్కొన్నారు.

తన నామినేషన్ దాఖలు చేసిన తర్వాత కంగనా రనౌత్ మాట్లాడుతూ.. ఈ రోజు నేను మండి లోక్‌సభ స్థానం నుంచి నామినేషన్ దాఖలు చేసాను. మండి నుంచి పోటీ చేసే అవకాశం నాకు లభించడం గర్వించదగ్గ విషయం. బాలీవుడ్‌లో విజయం సాధించి, రాజకీయ రంగంలో కూడా విజయం సాధిస్తానని ఆశిస్తున్నానని ధీమా వ్యక్తం చేశారు.

Advertisement
 
Advertisement
Advertisement