వెస్ట్‌ లండన్‌ బాలాజీ ఆలయంలో ఘనంగా శ్రీ సీతారామ కల్యాణోత్సవం | Sakshi
Sakshi News home page

వెస్ట్‌ లండన్‌ బాలాజీ ఆలయంలో ఘనంగా శ్రీ సీతారామ కల్యాణోత్సవం

Published Sat, Apr 27 2024 1:32 PM

Sri Sitarama Kalyanostavam by balaji temple at west london

లండన్‌లోని శ్రీ వేంకటేశ్వర (బాలాజీ) స్వామి టెంపుల్‌ అండ్‌ కల్చరల్‌ సెంటర్‌(SVBTCC)లో సీతారాముల కల్యాణోత్సవం ఘనంగా జరిగింది. ఈ వేడుకను తిలకించేందుకు పెద్ద సంఖ్యలో తెలుగువారు తరలివచ్చారు. ఉదయం శుభకార్యాలతో ప్రారంభమైన ఈ ఉత్సవాలు మధ్యాహ్నం ఆశీర్వాదం, వందన సమర్పణతో ముగిశాయి. ఈసందర్భంగా సీతారాముల వారికి నిర్వహించిన పల్లకీసేవలో పిల్లలు, మహిళలు భక్తిశ్రద్ధలతో  పాల్గొన్నారు.

 

ఎస్వీబీటీసీసీ ట్రస్టీలు డాక్టర్‌ రాములు దాసోజు, భాస్కర్‌ నీల, కమలా కొచ్చెర్లకోట, ప్రవీణ్‌కుమార్‌ యాదవ్‌, సురేష్ గోపతి, సురేష్‌రెడ్డి గడ్డం, పావనిరెడ్డి, కేకే చివుకుల, కార్యవర్గ సభ్యులు విశ్వేశ్వర్‌, తుకారాం రెడ్డి, రాఘవేందర్‌, గౌతమ్‌ శాస్త్రి, రవి వాసా, గోపి కొల్లూరు, రవికుమార్‌, వంశీ వుల్చి, వంశీ బోగిరెడ్డి, గోవర్దన్‌ హృదయపూర్వక కృతజ్ఞతలు,సంతోషాన్ని వ్యక్తం చేశారు .

ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేసిన అందరికీ హృదయపూర్వక కృతజ్ఞతలు తెలిపారు. తమకు స్వచ్ఛంద సేవకులు, దాతలు ఎంతగానో సహకరించారని కొనియాడారు. బ్రాక్‌నెల్‌లో కొత్తగా ప్రారంభించిన శ్రీ వేంకటేశ్వరస్వామి ఆలయాన్ని భక్తులు దర్శించుకొని స్వామి వారి ఆశీస్సులు పొందాలని కోరారు. ఇందుకోసం www.svbtcc.orgలో అపాయింట్‌మెంట్‌ బుక్ చేసుకోవచ్చన్నారు. ఈ వేడుకల నిర్వహణలో ఎస్‌వీబీటీసీసీ సభ్యుల భక్తి,సేవానిరతనిఇ ప్రతిబింబించడమే కాకుండా వాలంటీర్ల అంకితభావం, నిబద్ధత కీలక పాత్రను పోషించాయని నిర్వాహకులు తెలిపారు.

Advertisement
 
Advertisement