ఐపీఎల్‌ నుంచి స్వదేశానికి... | Will Jacks And Joss Buttler Who Left For England After Ipl T20 | Sakshi
Sakshi News home page

ఐపీఎల్‌ నుంచి స్వదేశానికి...

May 14 2024 2:22 PM | Updated on May 14 2024 3:24 PM

Will Jacks And Joss Buttler Who Left For England After Ipl T20

ఇంగ్లండ్‌కు పయనమైన బట్లర్, జాక్స్‌

న్యూఢిల్లీ: ఐపీఎల్‌లో లీగ్‌ దశ మ్యాచ్‌లు ముగింపు దశకు చేరగా... ఆయా జట్లకు కీలకమైన ఇంగ్లండ్‌ ఆటగాళ్లు తిరుగుపయనమయ్యారు. జోస్‌ బట్లర్‌ (రాజస్తాన్‌), లివింగ్‌స్టోన్‌ (పంజాబ్‌ కింగ్స్‌), విల్‌ జాక్స్, రీస్‌ టాప్లీ (బెంగళూరు)లు ఇంగ్లండ్‌కు బయలుదేరారు. వచ్చే నెల 2 నుంచి అమెరికా, వెస్టిండీస్‌లలో జరిగే టి20 ప్రపంచకప్‌కు తుది సన్నాహంగా సొంతగడ్డపై ఇంగ్లండ్‌ జట్టు పాకిస్తాన్‌తో టి20 సిరీస్‌ ఆడనుంది.

మే 22 నుంచి ఇరు జట్ల మధ్య నాలుగు టి20ల సిరీస్‌ జరుగుతుంది. 22, 25, 28, 30 తేదీల్లో మ్యాచ్‌లు జరుగుతాయి. కాగా... ఈ ఐపీఎల్‌ సీజన్‌లో లివింగ్‌స్టోన్‌ ఆకట్టుకోలేకపోయాడు. బట్లర్‌ రాజ స్టాన్‌ స్టార్‌ ఓపెనర్‌. ఈ సీజన్‌లో ఒంటిచేత్తో కొన్ని మ్యాచ్‌ల్ని గెలిపించాడు. బెంగళూరుకు ప్రాతినిధ్యం వహిస్తున్న జాక్స్, టాప్లీలలో జాక్స్‌ది కీలకపాత్ర. బెంగళూరు వరుస విజయాల్లో భాగమైన అతను లేకపోవడం జట్టుకు లోటే! చివరి లీగ్‌ మ్యాచ్‌లో బెంగళూరు... చెన్నైతో ఈ నెల 18న తలపడుతుంది.

ఇవి చదవండి: మళ్లీ హెడ్కోచ్గా రవిశాస్త్రి?.. కొట్టిపారేయలేం!

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement