'ఆ రూలే ఐపీఎల్‌ను మార్చేసింది.. వారు పునరాలోచనలో ప‌డ్డారు' | Sakshi
Sakshi News home page

IPL 2024: 'ఆ రూలే ఐపీఎల్‌ను మార్చేసింది.. వారు పునరాలోచనలో ప‌డ్డారు'

Published Tue, May 14 2024 7:44 PM

Ravi Shastri Backs Impact Player Rule For Making Big Difference

ఐపీఎల్‌లో ఇంపాక్ట్ ప్లేయ‌ర్ రూల్‌పై  భిన్న‌భిప్రాయాలు వ్య‌క్త‌మ‌వుతున్న సంగ‌తి తెలిసిందే. కొంత‌మంది ఈ రూల్‌ను స‌మ‌ర్ధిస్తుంటే.. మ‌రి కొంతమంది త‌ప్పుబ‌డుతున్నారు. తాజాగా ఈ రూల్‌పై టీమిండియా మాజీ హెడ్‌కోచ్ ర‌విశాస్త్రి త‌న అభిప్రాయాల‌ను పంచుకున్నాడు.

ఇంపాక్ట్ ప్లేయ‌ర్ రూల్‌కు ర‌విశాస్త్రి మ‌ద్ద‌తుగా నిలిచాడు. ఈ రూల్ కార‌ణంగానే మ్యాచ్‌లు ఆఖ‌రి వ‌ర‌కు ఉత్కంఠ భ‌రితంగా సాగుతున్నాయ‌ని ర‌విశాస్త్రి తెలిపాడు. "నా వ‌ర‌కు అయితే ఇంపాక్ట్ ప్లేయ‌ర్ రూల్ చాలా బాగుంది. కాలంతో పాటు ఆట‌లో కూడా మార్పులు ఉండాలి.  

ఇతర క్రీడలలో క్ర‌మంగా మార్పులు జ‌రుగుతున్నాయి. ఈ రూల్ వ‌ల్ల మ్యాచ్‌లు చాలా క్లోజ్‌గా జ‌రుగుతున్నాయి. గ‌త సీజ‌న్‌లో కూడా చాలా మ్యాచ్‌లు ఉత్కంఠ భ‌రితంగా జ‌రిగాయి. ఇంపాక్ట్ రూల్ ఐపీఎల్‌లో విప్ల‌వాత్మ‌క‌మైన మార్పు తీసుకు వ‌చ్చింది.

ఎప్పుడైనా కొత్త రూల్స్ వ‌స్తే, ఆ రూల్స్‌ను వ్య‌తిరేకించే వ్యక్తులు కూడా ఉంటారు. కానీ 200, 190 స్కోర్ల‌ను కూడా ఛేజ్ చేస్తున్న వైనం చూసి.. వ్య‌తిరేకించిన వారే ఇంపాక్ట్ రూల్‌పై  పున‌రాలోచిన పున‌రాలోచిస్తున్నారని" అశ్విన్ యూట్యూబ్ ఛాన‌ల్‌కు ఇచ్చిన ఇంట‌ర్వ్యూలో శాస్త్రి పేర్కొన్నాడు.
 

Advertisement
Advertisement