మిలిండా గేట్స్ అనూహ్య నిర్ణయం | Sakshi
Sakshi News home page

మిలిండా గేట్స్ అనూహ్య నిర్ణయం

Published Tue, May 14 2024 8:20 AM

Melinda Gates To Resign From Gates Foundation Tweet Viral

ప్రపంచంలోనే అత్యంత ప్రసిద్ధి చెందిన బిల్ & మిలిండా గేట్స్ ఫౌండేషన్‌ గురించి అందరికి తెలుసు. ఈ ఫౌండేషన్‌కు కో-చైర్‌పర్సన్‌గా బాధ్యతలు నిర్వహించిన మిలిండా (Melinda Gates) ఎట్టకేలకు తన పదవి రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించారు.

ఫౌండేషన్‌లో నా చివరి రోజు జూన్ 7 అంటూ తన ఎక్స్ (ట్విటర్) ఖాతాలో పోస్ట్ చేశారు. ఈ నిర్ణయాన్ని చాలా తేలిగ్గా తీసుకోలేదు. బిల్, నేను కలిసి ప్రారంభించిన ఈ ఫౌండేషన్‌ ద్వారా ప్రపంచవ్యాప్తంగా అసమానతలను పరిష్కరించడానికి అసాధారణ కృషి చేసాము. దీనికి నేను ఎంతగానో గర్వపడుతున్నాను. ఈ ఫౌండేషన్‌ను సమర్థుడైన సీఈఓ మార్క్ సుజ్మాన్, ఎగ్జిక్యూటివ్ లీడర్‌షిప్ టీమ్.. సమర్థవంతంగా ముందుకు తీసుకెళ్తారని భావిస్తున్నానని మిలిండా పేర్కొన్నారు.

దాతృత్వం తదుపరి అధ్యాయంలోకి వెళ్లడానికి నాకు సరైన సమయం వచ్చింది, అందుకే రాజీనామా చేస్తున్న అంటూ మిలిండా వివరించారు. మైక్రోసాఫ్ట్ కో-ఫౌండర్ బిల్ గేట్స్ నుంచి విడాకులు తీసుకున్న మూడు సంవత్సరాలకు మిలిండా ఈ నిర్ణయం తీసుకున్నారు.

మిలిండా ఫ్రెంచ్ గేట్స్ రాజీనామా తరువాత.. ఆమె దాతృత్వ ప్రయోజనాల కోసం 12.5 బిలియన్ల డాలర్లను అందుకుంటారు. రాబోయే రోజుల్లో ఏం జరుగుతుందనే విషయాలను కూడా ఎప్పటికప్పుడు తెలియజేస్తాను అని మిలిండా పేర్కొన్నారు.

మిలిండా గేట్స్ ప్రపంచ నాయకత్వం, పనిని ఎప్పటికప్పుడు పూర్తి చేసే బాధ్యత మమ్మల్ని ఎంతగానో ఆకర్శించాయి. ఈమె రాజీనామా నాకు కష్టమైన వార్త. నేను కూడా.. మిలిండాను ఆరాధించే వారిలో ఒకరిని. ఆమెతో కలిసి పనిచేయడం వల్ల ఎంతో నేర్చుకున్నాను అని సీఈఓ మార్క్ సుజ్మాన్ అన్నారు.

Advertisement
Advertisement