కుమారునితో స్టార్‌ హీరోయిన్‌.. వీడియో పోస్ట్ చేసిన భర్త! | Sakshi
Sakshi News home page

Nayanthara: కుమారునితో నయనతార క్యూట్ వీడియో.. భర్త పోస్ట్ వైరల్!

Published Tue, May 14 2024 3:22 PM

Vignesh Shivan Shares A Video Of Nayanthara On Mother's Day

ప్రేమకు చిరునామా అమ్మ. మమతకు మారు పేరు అమ్మ. అమ్మ ఎవరికైనా అమ్మే. ఎంత ఉన్నత స్థాయిలో ఉన్నా కన్న పిల్లల లాలనలో తరించిపోయోది అమ్మ. నటి నయనతార ఇప్పుడు అలాంటి మాతృత్వ మధుర్యాన్నే ఆస్వాదిస్తున్నారు. హీరోయిన్‌గా అగ్రస్థానంలో రాణిస్తున్న నయనతార ఇటీవలే జవాన్‌ చిత్రంతో బాలీవుడ్‌లోకి ఎంట్రీ ఇచ్చారు.

కాగా, గత 2022లో దర్శకుడు విఘ్నేశ్‌ శివన్‌కు పెళ్లి చేసుకున్న విషయం తెలిసిందే. వీరి ఆరేళ్ల ప్రేమకు నిర్వచనం ఈ పెళ్లి. కాగా అదే ఏడాది అక్టోబర్‌ నెలలో నయనతార, విఘ్నేశ్‌ శివన్‌లు సరోగసీ విధానం ద్వారా ఇద్దరు కవల పిల్లలకు తల్లిదండ్రులయ్యారు. వీరికి ఉయిర్, ఉలగం అని పేర్లు పెట్టిన సంగతి తెలిసిందే. కాగా నయనతార, విఘ్నేశ్‌ శివన్‌లో తమ జీవితంలో రీల్‌ విషయం, రియల్‌ విషయం గానీ సామాజిక మాధ్యమాల ద్వారా పంచుకుంటారు.

తమ పెళ్లి వేడుకను మాత్రం ఒక ఓటీటీ సంస్థకు విక్రయించి వార్తల్లోకి ఎక్కారు. ఇక పుట్టిన రోజు గాని, ఇతర వేడుకలు గాని సామాజిక మాధ్యమాల ద్వారా తమ ఆనందాన్ని పంచుకుంటారు. అలాగే తమ పిల్లల అన్నప్రాసన వేడుక ఫొటోలను ఇటీవల సామాజిక మాధ్యమాల్లో పోస్ట్‌ చేసిన విషయం తెలిసిందే. తాజాగా ఆదివారం మాతృదినోత్సం సందర్భంగా నటి నయనతార తన చిన్నపిల్లగా మారిపోయారు.

వారి ముద్దు మురిపాల్లో మురిసిపోయారు. పిల్లలను భుజాలపై మోస్తూ పరవశించిపోయారు. పిల్లలను లాలించి, మురిపించి అమ్మతనాన్ని అనుభవించారు. వారి చేతులు పట్టుకుని బుడి బుడి అడుగులు వేయిస్తూ ఆనందంతో పరవశించిపోయారు. ఈ వీడియోను నయనతార భర్త, దర్శకుడు విఘ్నేశ్‌ శివన్‌ తన ఇన్‌స్ట్రాగామ్‌లో పోస్ట్‌ చేశారు. అందులో నయనతారను ఉద్ధేశించి విఘ్నేశ్‌శివన్‌ పేర్కొంటూ నువ్వే నా ప్రాణం, నా లోకం అని పేర్కొన్నారు. ఈ వీడియో చాలా క్యూట్‌గా ఉంది. అమ్మకు కన్నపిల్లల ముందు తన స్థాయి అస్సలు గుర్తుకురాదని ఈ వీడియోతో నయనతార మరోసారి నిరూపించారు. ఇది ఇప్పుడు సామాజిక మాధ్యమాల్లో వైరలవుతోంది. 

Advertisement
 
Advertisement
 
Advertisement