సుశీల్‌ మోదీ మృతి: కాంగ్రెస్ నేతల సంతాపం | Sakshi
Sakshi News home page

సుశీల్‌ మోదీ మృతి: కాంగ్రెస్ నేతల సంతాపం

Published Tue, May 14 2024 11:37 AM

Congress Leaders Condole Sushil Modi Demise

పాట్నా: బీజేపీ సీనియర్‌ నేత సుశీల్‌ కుమార్‌ మోదీ మృతికి ప్రధాని నరేంద్ర మోదీ, బీజేపీ నేతలు సంతాపం తెలిపారు. వీరితో పాటు కాంగ్రెస్‌ అధ్యక్షుడు మల్లికార్జున్‌ ఖర్గే, ఆ ​​పార్టీ ప్రధాన కార్యదర్శి జైరాం రమేష్‌ కూడా సంతాపం తెలిపారు.

''బీహార్ మాజీ ఉప ముఖ్యమంత్రి, సీనియర్ నాయకుడు సుశీల్ మోదీ జీ మృతి పట్ల ఆయన కుటుంబ సభ్యులకు, మద్దతుదారులకు ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నాను. మన సిద్ధాంతాలు వేరు, కానీ ప్రజాస్వామ్యంలో దేశ ప్రయోజనాలే ప్రధానం. జీఎస్టీ కౌన్సిల్‌లో ఆయన గణనీయమైన కృషి చేశారు. భగవంతుడు ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని కోరుకుంటున్నాను'' అంటూ మల్లికార్జున్‌ ఖర్గే తన ఎక్స్ (ట్విటర్) ఖాతాలో ట్వీట్ చేశారు.

కాంగ్రెస్ పార్టీ ప్రధాన కార్యదర్శి జైరాం రమేష్‌ ట్వీట్ చేస్తూ.. ఈ రోజు తెల్లవారుజామున బీహార్ మాజీ డిప్యూటీ సీఎం, మాజీ రాజ్యసభ ఎంపీ సుశీల్ మోదీ మరణం గురించి చదివాను. అతను, నేను పూర్తిగా వ్యతిరేఖ రాజకీయాలకు చెందినవారము. ఐడియాలజీలు మాత్రం ఒకేలా దేఅభివృద్దే ప్రధానంగా ఉండేది. కేంద్రంలో కాంగ్రెస్ అధికారంలో ఉన్నప్పుడు కొంతకాలం బీహార్ ఆర్థిక మంత్రిగా ఉన్నారు. ఆ తరువాత రాజశేఖర్ రెడ్డి సీఎంగా ఉన్న సమయంలో ఆయన నాతో కొద్ది రోజులు గడిపారు. ముఖ్యంగా రాష్ట్ర ఆర్థిక వ్యవహారాలపై ఆయనకు చాలా అవగాహన ఉందని పేర్కొన్నారు.

Advertisement
Advertisement