పోలింగ్‌ పూర్తయినా.. ఆగని టీడీపీ అరాచకాలు | AP Elections 2024: TDP Goons Attacks Continue After Polling - Updates | Sakshi
Sakshi News home page

పోలింగ్‌ పూర్తయినా.. ఆగని టీడీపీ అరాచకాలు

May 14 2024 1:07 PM | Updated on May 15 2024 12:50 PM

AP Elections 2024: TDP Goons Attacks Continue After Polling - Updates

పోలింగ్‌ పూర్తయినా.. టీడీపీ అరాచకాలు మాత్రం ఆగడం లేదు. రాష్ట్రంలోని పలుచోట్ల వైఎస్సార్‌సీపీ ఏజెంట్లు, కార్యకర్తలపై.. అలాగే వైఎస్సార్‌సీపీకి ఓటేశారనే కారణంతో కొందరు అమాయకులపైనా భౌతిక దాడులకు దిగుతున్నారు.

హైదరాబాద్‌, సాక్షి: ఏపీలో సార్వత్రిక ఎన్నికల పోలింగ్‌ పూర్తయినా.. టీడీపీ అరాచకాలు మాత్రం ఆగడం లేదు. రాష్ట్రంలోని పలుచోట్ల వైఎస్సార్‌సీపీ ఏజెంట్లు, కార్యకర్తలపై.. అలాగే వైఎస్సార్‌సీపీకి ఓటేశారనే కారణంతో కొందరు అమాయకులపైనా భౌతిక దాడులకు దిగుతున్నారు. మరీ ముఖ్యంగా గత 59 నెలలుగా ప్రశాంతంగా ఉన్న పల్నాడులో అలజడులు సృష్టించేందుకు శతవిధాల యత్నిస్తున్నారు.

»పల్నాడు జిల్లా కొత్తగణేషునిపాడులో ఉద్రికత్త నెలకొంది. వైఎస్సార్‌సీపీకి ఓటేసిన బీసీ మహిళల ఇళ్లపై టీడీపీ దాడులకు పూనుకుంది. బీసీ మహిళల ఇళ్లను టీడీపీ నేతలు కర్రలతో ధ్వంసం చేశారు.  ఆటోను ధ్వంసం చేసి బీభత్సం సృష్టించారు టీడీపీ గూండాలు.దీంతో బీసీ నేతలు రాత్రంతా గుడిలోనే తలదాచుకున్నారు.

»కొత్తగణేషునిపాడులో పోలీసులు భారీగా మోహరించారు. గాయపడిన గ్రమస్తులను అనిల్‌ కుమార్‌ యాదవ్‌, కాసు మహేష్‌ పరామర్శించారు. గ్రామాన్ని చుట్టుముట్టిన టీడీపీ కార్యకర్తలు.. బాధితులను పరామర్శిస్తుండగా కాసు మహేష్‌ రెడ్డి, అనిల్‌ కాన్వాయ్‌పై రాళ్లు, కర్రలతో దాడి చేశారు. పరిస్థితి అదుపుతప్పడంతో పోలీసులు గాల్లోకి కాల్పులు జరిపారు. కేంద్ర బలగాల సాయంతో కాన్వాయ్‌ తరలించారు. టీడీపీ గుండాల దాడులపై వైఎస్సార్‌సీపీ నేతల ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. బీసీ మహిళలపై దాడులు జరుగుతుంటే ఎస్పీ ఏం చేస్తున్నారని అనిల్‌ కుమార్‌ యాదవ్‌ ప్రశ్నించారు.
 

» పల్నాడు జిల్లా అచ్చంపేట మండలం వేల్పూరులో ఈ ఉదయం వైఎస్సార్‌సీపీ శ్రేణులను రెచ్చగొడుతూ టీడీపీ గుండాలు కవ్వింపు చర్యలకు దిగారు.  రాత్రి పోలింగ్‌ బూత్‌ వద్ద ఘర్షణ చోటు చేసుకోగా.. దానికి కొనసాగింపుగా ఇవాళ ఉదయం మళ్లీ టీడీపీ నేతలు గొడవకు దిగారు.

» గురజాల నియోజకవర్గం మాచవరం మండలం కొత్త గణేషని పాడులో అర్ధరాత్రి టీడీపీ నేతలు విధ్వంసానికి పాల్పడ్డారు. వైఎస్సార్‌సీపీకి ఓటు వేశారని బీసీల ఇళ్లపైన పడి దాడులు చేశారు. మూడు గంటల పాటు ఏకదాడిగా రాళ్లు విసురుతూ.. కర్రలతో ఇళ్లపై దాడికి దిగారు. మహిళలు, చిన్న పిల్లలు అని కూడా చూడకుండా దాడి చేయబోయారు. అయితే వాళ్ల దాడి నుంచి తప్పించుకుని స్థానికంగా ఉన్న గుడిలో వాళ్లంతా తలదాచుకున్నారు. ఈ ఉదయం మీడియాతో మహిళలు మాట్లాడుతూ.. తమ ఇల్లు ధ్వంసం చేశారంటూ ఆవేదన వ్యక్తం చేశారు.

ఇదీ చదవండి: మేం ఫిర్యాదు చేసినా పోలీసులు పట్టించుకోలేదు-మంత్రి అంబటి

» నంద్యాల జిల్లా పగిడ్యాల (మ) పడమర ప్రాతకోట గ్రామంలో వైఎస్సార్‌సీపీ కార్యకర్త చాకలి విజయ్ పై టీడీపీ వర్గీయులు రాళ్ల దాడికి పాల్పడ్డారు. ‘‘వైఎస్ఆర్సీపీ పార్టీకి నువ్వు కూడా ఓటు వేశావ్’’.. అంటూ దాడి చేశారు. ఈ దాడిలో ఆయన తలకు గాయం కావడంతో ఆస్పత్రికి తరలించారు.

» బాపట్ల జిల్లా సంతమాగులూరు మండలం మిన్నెకల్లు గ్రామంలో వైఎస్సార్‌సీపీ నాయకులపై టీడీపీ శ్రేణులు మూక దాడికి దిగాయి. వైఎస్సార్‌సీపీకి ఓటు ఎందుకు వేశారు? అంటూ తలలు పగలగొట్టారు టీడీపీ నేతలు. దాడిలో ముగ్గురు కార్యకర్తలు గాయపడ్డారు. గాయపడిన వాళ్లను నరసరావుపేట ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. మరోవైపు.. ఈ దాడుల్ని వైఎస్సార్‌సీపీ ఎమ్మెల్యే అభ్యర్థి పాణ్యం హనిమిరెడ్డి ఖండించారు.

» కోనసీమ జిల్లా ఆత్రేయపురంలో టీడీపీ గుండాలు రెచ్చిపోయారు. రావిచెట్టు సెంటర్‌లో వైఎస్సార్‌సీపీ శ్రేణులపై దాడికి తెగబడ్డారు. ఈ దాడిలో ఒకరికి గాయాలయ్యాయి.

» తిరుపతి జిల్లా చంద్రగిరి మండలంలో ఎల్లో గ్యాంగ్‌ అరాచకాలు. కూచువారిపల్లిలో పచ్చమూకల దాడిలో ఎనిమిది మందికి గాయాలయ్యాయి.  ఓ కారును తగలబెట్టారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement