పదో తరగతి స్టేట్ టాపర్లను సన్మానించిన డీకే శివకుమార్ | Sakshi
Sakshi News home page

పదో తరగతి స్టేట్ టాపర్లను సన్మానించిన డీకే శివకుమార్

Published Tue, May 14 2024 2:14 PM

Karnataka Deputy CM DK Shivakumar Felicitates Ankitha And Navneet

బెంగళూరు: పదో తరగతిలో 625 మార్కులకు 625 మార్కులు సాధించిన 'అంకిత'ను నటుడు రిషబ్ శెట్టితో పాటు.. కర్ణాటక ఉప ముఖ్యమంత్రి డీకే శివ కుమార్ కూడా ప్రశంసించారు. స్టేట్ టాపర్‌గా నిలిచిన రైతు బిడ్డకు పలువురు ప్రముఖులు శుభాకాంక్షలు తెలిపారు.

10వ తరగతి పరీక్షలో 625/625 మార్కులు సాధించిన బాగల్‌కోట్‌కు చెందిన అంకితను మంగళవారం కర్ణాటక డిప్యూటీ సీఎం డీకే శివకుమార్ సన్మానించారు. అంతే కాకుండా ఆ విద్యార్ధి ప్రతిభకు మెచ్చి ప్రోత్సాహక బహుమతిగా రూ.5 లక్షలు ప్రదానం చేశారు.

అంకితను మాత్రమే కాకుండా మండ్య విద్యార్థి నవనీత్‌ను కూడా డీకే శివకుమార్ సత్కరించి.. ప్రోత్సాహక బహుమతిగా రూ.2 లక్షలు అందించారు. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

Advertisement
Advertisement