మాజీ భర్త గే అన్న సుచిత్ర.. స్పందించిన నటుడు | Sakshi
Sakshi News home page

'నేను స్వలింగసంపర్కుడినా?' సుచిత్ర ఆరోపణలపై స్పందించిన మాజీ భర్త

Published Tue, May 14 2024 5:48 PM

Actor Karthik Kumar Reacts on Ex Wife Suchitra Claim That He is Gay

నటుడు, స్టాండప్‌ కమెడియన్‌ కార్తీక్‌ కుమార్‌.. గే అంటూ అతడి మాజీ భార్య, సింగర్‌ సుచిత్ర తీవ్ర ఆరోపణలు చేసింది. పెళ్లయిన 11 ఏళ్లకు అతడి నిజ స్వరూపం తెలిసిందని, అప్పటిదాకా తను గే అని బయటకు చెప్పడానికి కూడా ఇష్టపడలేదని పేర్కొంది. అమృత అతడిని పెళ్లి చేసుకుని తప్పు చేసిందని తీవ్ర విమర్శలు గుప్పించింది. తాజాగా ఆమె వ్యాఖ్యలపై నటుడు కార్తీక్‌ సోషల్‌ మీడియా వేదికగా స్పందించాడు.

నేనేమీ సిగ్గుపడను
'నేను స్వలింగసంపర్కుడినా? ఒకవేళ అదే అయ్యుంటే మాత్రం బయటకు చెప్పడానికి నేనేమీ సిగ్గుపడేవాడిని కాదు. అది ఏదైనా సరే గర్వంగా చెప్పుకునేవాడిని. అంతేకానీ ముడుచుకుపోను. నా నగరంలో దర్జాగా ర్యాలీ చేసేవాడిని.. అన్నిరకాల వాళ్లు అందులో పాల్గొని వారు అండగా నిలబడేవాళ్లు. ఎవరూ దేనికీ తలదించుకోవాల్సిన అవసరం లేదు. గర్వంగా బతకండి' అంటూ ఓ వీడియో షేర్‌ చేశాడు.

గొడవలు ఆగవా?
ఇది చూసిన జనాలు అతడు ఎంతో శాంతంగా బదులివ్వడాన్ని మెచ్చుకుంటున్నారు. ఏళ్ల తరబడి మీరు కొట్టుకుంటూనే ఉన్నారు.. మీ గొడవలకు అంతనేదే లేదా? అని మరికొందరు ప్రశ్నిస్తున్నారు. మీరు మీ మాజీ భార్య గురించి ఎంతో మంచి మాటలు చెప్తే ఆమె మాత్రం ఇలా లేనిపోని మాటలనేసి అవమానిస్తుంటే చూడటానికి మాకే బాధగా ఉంది అని కామెంట్లు చేస్తున్నారు.

 

 

చదవండి: సుచీలీక్స్‌ సంచలనం.. పెళ్లి తర్వాత ధనుష్‌- ఐశ్వర్య వేరేవాళ్లతో డేటింగ్‌.. ఆమె కంటే..

Advertisement
 
Advertisement
 
Advertisement