ఆసీస్‌, పాక్ కాదు.. ఆ రెండు జట్లు మధ్యే వరల్డ్‌కప్ ఫైనల్‌ | Sakshi
Sakshi News home page

T20 WC: ఆసీస్‌, పాక్ కాదు.. ఆ రెండు జట్లు మధ్యే వరల్డ్‌కప్ ఫైనల్‌

Published Tue, May 14 2024 5:17 PM

T20 World Cup 2024: Brian Lara predicts his semi-finalists

క్రికెట్ అభిమానులు ఎంతో ఆతృతగా ఎదురుచూస్తున్న టీ20 వరల్డ్‌కప్‌-2024కు మరో రెండు వారాల్లో తెరలేవనుంది. అమెరికా, వెస్టిండీస్‌ల వేదికగా జూన్ 1 నుంచి ఈ పొట్టి వరల్డ్‌కప్‌ షురూ కానుంది. ఇప్పటికే ఈ మెగా ఈవెంట్‌లో పాల్గోనే అన్ని జట్లు దాదాపుగా తమ వివరాలను వెల్లడించాయి. 

ఈ నేపథ్యంలో ఈ మెగా టోర్నీలో సెమీ ఫైనల్స్‌కు చేరే జట్లను  వెస్టిండీస్ క్రికెట్ దిగ్గజం బ్రియాన్ లారా అంచనా వేశాడు. వెస్టిండీస్‌, భారత్‌, అఫ్గానిస్తాన్‌,  ఇంగ్లండ్ సెమీఫైనల్స్‌కు చేరుతాయని లారా తెలిపాడు. అంతేకాకుండా. జూన్ 29న తుది పోరులో వెస్టిండీస్‌, భారత జట్లు తలపడతాయని  లారా జోస్యం చెప్పాడు.

వెస్టిండీస్ ఒక అద్బుత‌మైన జ‌ట్టు. జ‌ట్టులో చాలా మంది స్టార్ ఆట‌గాళ్లు ఉన్నారు. జ‌ట్టులో ప్ర‌తీ ఒక్క‌రికి త‌మ‌దైన రోజున ఒంటి చేత్తో మ్యాచ్‌ను గెలిపించే స‌త్తా ఉంది. మ‌రోవైపు భార‌త వ‌ర‌ల్డ్‌క‌ప్ జ‌ట్టుపై భిన్న‌భిప్రాయాలు వ్య‌క్త‌మ‌వుతున్న‌ప్ప‌ట‌కి.. టాప్‌-4లో మాత్రం క‌చ్చితంగా ఉంటుంది.

టీ20 వ‌ర‌ల్డ్‌క‌ప్ ఫైన‌ల్లో భార‌త్‌-విండీస్ జ‌ట్లు త‌ల‌ప‌డితే నేను చూడాల‌న‌కుంటున్నాను. ఈ రెండు టీమ్స్‌ ఫైన‌ల్లో త‌ల ప‌డి అత్యుత్త‌మ జ‌ట్టు ఛాంపియ‌న్స్‌గా నిల‌వాలి. అదేవిధంగా భార‌త్‌, విండీస్ పాటు అఫ్గానిస్తాన్‌, ఇంగ్లండ్ కూడా సెమీఫైన‌ల్స్‌కు చేరే అవ‌కాశ‌ముంద‌ని లారా క్రికెట్ పాకిస్తాన్‌కు ఇచ్చిన ఇంట‌ర్వ్యూలో లారా పేర్కొన్నాడు.

కాగా ఈ పొట్టి వ‌ర‌ల్డ్‌క‌ప్‌లో భార‌త జ‌ట్టు కంటే విండీస్‌కే ఘ‌నమైన ట్రాక్ రికార్డు ఉంది. విండీస్ రెండు సార్లు ఛాంపియ‌న్స్‌గా నిలిచింది. వెస్టిండీస్ 2012 ,2016లో టైటిల్‌ను గెలుచుకుంది. మ‌రోవైపు 2007లో జ‌రిగిన టీ20 వ‌ర‌ల్డ్‌క‌ప్ తొలి ఎడిష‌న్ టైటిల్‌ను టీమిండియా సొంతం చేసుకుంది.

 

Advertisement
 
Advertisement